Sunday 5 July 2015

మనది ఋషీ సంస్కృతి

మన దేశ సంస్కృతి ఋషీ సంస్కృతి. మన బాగు కోరి ఏర్పాటుచేసారు మన ఋషులు. ప్రతి ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించినవే మనకు కనిపిస్తాయి మన సంస్కృతి లో. మన జీవన విధానం వేదాలను అనుసరించే తయారు చేయబడింది.

వేదవ్యాస భగవానుడు లోకంలో అన్ని చోట్ల నుండి గొప్ప గొప్ప మహనీయులను, ఋషులని ఒక్క చోటికి చేర్చి అందరి అభిప్రాయం సేకరించి బ్రహ్మ సూత్రాలుగా అందించాడు. కాలకృత్యం తీర్చుకోవడం, వ్యాయామం చేయడం, ఇక పై దంతదావన-దంతాలు శుభ్రపరచుకోవడం, జిహ్వాలేకనం -నాలుక శుభ్రపరచుకోవడం, గండూషణం - నోరు పుక్కిలించడం, స్నానం ఆచరించడం, దైవారాధన, అల్పాహారం తీసుకోవడం ఇలామనం లేచిన సమయం మొదలుకొని తిరిగి రాత్రి విశ్రాంతి తీసుకొనేంత వరకు మనం చేయాల్సిన ప్రతి ఒక్కటీ ఎట్లా క్రమంగా చేయాలో తెలుపుతాయి.

మన శాస్త్రాలు అన్నీ మనల్ని తరింపజేసే విజ్ఞాన శాస్త్రాలే. వీటిని వేలు ఎత్తిచూపే అర్హత ఎవ్వరికీ లేదు. మనం ఈనాడు ఏముందీ ఇందులో అనే రీతిలో తయారు అయ్యాం. ఇవన్నీ మన ఆత్మ ఉజ్జీవనకోసం తయారు అయినవే. ఆత్మ ఉజ్జీవనం కావాలంటే శరీరం సక్రమంగా పనిచెయ్యాలి. దానికోసం మనం శరీరాన్ని ఎట్లా క్రమబద్దం చేసుకోవాలో, మన శారీరక ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో తెలుపుతాయి.

ఇక మన సంస్కృతిలో ఉన్న వివిద అంశాల్లో ఒక పద్దతి అంటూ ఏర్పాటు చేసారు. ఇవన్నీ మన బాగుకోసమే అని గుర్తించాలి. ఇది అనాదిగా వస్తున్నవి. మనం ఇష్టం వచ్చినట్లు మార్చే ప్రయత్నం చెయ్యడం సబబు కాదు.

No comments:

Post a Comment