తండ్రి, ఆత్మ, ఇతరులకు అపకారం కోరని మనస్తత్వం, ధన ప్రాదాన్యం ,కటువుగా కోపంగా మాట్లాడటం ,మిరియాలలో కారానికి రవి ,మిరియాలకు సంస్కృతంలో మరిచం అనే పేరుంది. మరిచం అంటే సూర్యుడు అని అర్థ్ధం. సూర్యభగవానుడికి ఉండే శక్తి, సూర్యకిరణాల్లోని వేడి మిరియాలకు ఉంటాయని దీని భావం. మిరియాలు జీర్ణవ్యవస్థ, రక్తప్రసరణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థల్లోని స్తబ్దతను తొలగించటమే కాకుండా శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది.ఇతరులపై ప్రభావం చూపి వారిపై అధికారాన్ని చూపిస్తారు.
మనుషులను పరిపాలించటం.ఆరోగ్యకరమైన ఉష్ణశక్తి,కంటి అనారోగ్యాలు,క్యారెట్ రవి గ్రహానికి చెందినది కావటం వలన క్యారెట్ తింటే కంటి సమస్యలు ఉండవు.గర్వం కలవాడు.పెద్ద మనిషిగా వ్యవహరించటం, శిరోవ్యాధి తులా లగ్నంలో రవి ఉన్న,ఇంకా బలహీన శత్రుక్షేత్రాలలో రవి ఉన్న శిరోవేదన కలుగుతుంది.రవి కోపం పైకి కనపడదు.దీర్ఘకాలిక కోపాన్ని కలిగి ఉంటారు.పొగిడితే క్షమించే గుణం.ప్రభుత్వ ఉద్యోగం,పిరికితనం,భయాన్ని లోపల దాచుకోవటం వలన హృదయ సంభందించిన రోగాలు వస్తుంటాయి.రాగి ,ఉదయాన్నే రాగి చెంబులో నీరు త్రాగటం ఆరోగ్యానికి మంచిది.
తూర్పు దిక్కును తెలియజేస్తుంది.సంపాదనాతత్వం కలిగి ఉండటం వలన కుటుంబ విషయాలను నిర్లక్ష్యం చేస్తారు. శక్తి, పితృచింత, ఆత్మాభిమానం, శివోపాసన, ధైర్యం, బుద్ధి, ఆరోగ్యం, పిత్తము, కార్యనిర్వహణాశక్తి, బుద్ధిబలం, అశ్రద్ధ కారణంగా దుర్వ్యయము, యజ్ఞము, దినబలము, సౌమ్యత, రాగి, దేవాలయము, గిరిగమనం, కీర్తి, అధికారం, ఎముక, స్వల్పకేశము, ప్రవర్తన, క్షత్రియ, పాషాణము, భూషణము,లోక వ్యవహార నైపుణ్యం కలిగి ఉంటారు.
లావునడుము, రక్తవర్ణము, రాజసము, రోషము, కారము, పొట్టి, తూర్పుదిశ, జ్ఞానోదయము, ప్రవాళము, రాజ్యము, స్వస్థల స్వాధికారలాభము, పరాక్రమమునకు ఘనత, జనవిరోధం, శతృభయం, యుద్ధం, ఉద్యోగం, వైద్యం, సౌఖ్యం, భార్యాబిడ్డల హాని, పితృభృత్యాది విరోధం, ఆత్మజ్ఞానం, వీపుపై భాగం, పక్కలు, హృదయము, స్త్రీల యందు ఎడమకన్ను, పురుషులయందు కుడికన్ను పై ప్రభావం, ఆరోగ్యము, ప్రాణధాతువులు, గౌరవమైన పదవులు, బిరుదులు, అభివృద్ధి, రాజకీయములు, పరిపాలనాధికారులు మొదలైనవి రవి కారకత్వములు.
No comments:
Post a Comment