Sunday 31 January 2016

యోగములు

కామయోగము
సప్తమము శుభ గ్రహము కలిగి, శుభులు చూచుచున్న ఆఇంటి అధిపతి
స్వ ఉచ్చ మిత్ర రాసులందున్ననూ కామయోగమేర్పడును,
ఈ యోగము పుట్టినవాడు, ధన వాహనములు సంపద గల భార్యగలిగి,
పర స్త్రీ వ్యామొహము లేక బందువులు లతో కలసిఉండి,
మంచిగుణము కలిగి తండ్రిని మించిన వానిగా గుర్తింపు పొందును.
అధిక ధనవంతుడగును.
ముసలయోగము.
ఈ యోగము చాలామందిలో కనిపించును.12 వ ఇంట శుభగ్రహమున్నానూ
శుభగ్రహము ఆ ఇంటిని చూచుచున్నానూ ద్వాదశాధిపతి తన స్వ ఉచ్చ మిత్ర
రాసులందున్న ఈ యోగము చెప్పవలెను. ఈ యోగమున పుట్టినవాడు,
కష్టపడి సంపాదించును. దీనునిగా కనిపించును, సంపదలు వచ్చుచూ పోవుచూ ఉండును.
భావములు గూడా స్థిరముగా ఉండవు, ఇది శుభయోగమే అయినను కొంచెము కష్టములు ఉన్నది కదా!

రుద్రాక్ష మాల

చాలా మంది జపం చేసేటప్పుడు చేతిలో ఒక మాలను ధరిస్తుంటారు. అయితే చాలా మంది రుద్రాక్ష మాలలనే ధరించి జపం చేస్తూ ఉండటం కనిపిస్తూ ఉంటుంది. తులసి పూసలతోనూ, స్ఫటికాలతోనూ చేసిన మాలలను కూడా పట్టుకొని జపం చేస్తారు. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది రుద్రాక్ష జపమాలేనని దేవీభాగవతం పదకొండో స్కందం వివరిస్తోంది. రుద్రాక్షలతో జపమాలను ఎలా తయారు చెయ్యాలి, జపానికి ముందు ఆ మాలను ఎలా శుభ్రం చేయాలి అనే విషయాలు దేవీభాగవతంలో విపులంగా ఉన్నాయి.
ప్రతి రుద్రాక్షలోనూ ముఖభాగం బ్రహ్మదేవుడు. బిందు భాగం (ముళ్ళు ఉన్న భాగం) రుద్రుడు, పృచ్ఛ భాగం శ్రీమహావిష్ణువు స్థానాలని పెద్దలు చెబుతారు. పంచముఖి రుద్రాక్షలు ఇరవై అయిదు తీసుకుని వాటితో చేసిన జపమాల ఎంతో శ్రేష్టమంటారు. ఈ రుద్రాక్షలు కంటకాలతో గరుకుగా ఉండాలి. ఎరుపు రంగులో కానీ, తెలుపు రంగులో కానీ లేదా ఆ రెండూ కలసిన మిశ్రమ వర్ణంలోకానీ ఉండొచ్చు. ముఖభాగం ముఖ భాగంతోనూ, పృచ్ఛభాగం పృచ్ఛభాగంతోనూ కలిసేలా రుద్రాక్షలను మాలగా గుచ్చాలి. ఆవుతోకను చుట్టినప్పుడు ఉండే రూపంలాగా నాగపాశముడి(బ్రహ్మముడి) ఉండాలి. ఇలాంటి రుద్రాక్షమాలను నాగపాశం అని పిలుస్తారు.
రుద్రాక్ష జపమాలతో జపం చేస్తే మంత్రసిద్ధి కలుగుతుందంటారు. ఇలాంటి జపమాలను జపానికి ముందు సుగంధ జలాలతో శుభ్రంగా కడగాలి. ఆ తరువాత ఆవుపాలు, ఆవుపేడ, ఆవునెయ్యి, ఆవుపెరుగు, ఆవు పంచతం తో తయారైన పంచ గవ్యాన్ని ఆమాలమీద చల్లాలి. ఆ తర్వాత మళ్ళీ పవిత్ర జలంతో స్నానం చేయించాలి. అప్పుడు జపించదలచుకున్న మంత్రాలను న్యాసం చేయాలి. శివాస్త్ర మంత్రం జపిస్తూ ప్రతి రుద్రాక్షను స్పృశించాలి. మూల మంత్రాన్ని న్యాసం చేసి ఆ తర్వాత మళ్ళీ పవిత్ర జలాలతో మాలను కడగాలి. అనంతరం పరిశుభ్రమైన పీఠం మీద ఉంచాలి. అప్పుడు పార్వతీ పరమేశ్వరులను ఆ మాలలోకి ఆవాహన చేయాలి. అలా చేసిన మాలను "ప్రతిష్ఠిత మాల" అని అంటారు. అది సర్వ వాంఛా ప్రదమన్నది నమ్మకం.
రుద్రాక్ష జపమాలతో ఏ దేవతా మంత్రానైన్నా జపించవచ్చు. ఈ పవిత్ర మాలను శిరసున గానీ, మెడలోకానీ, కర్ణాభరణంగా కానీ, ధరించ వచ్చంటారు. జపం కాగానే కళ్ళకద్దుకొని యధావిధిగా మాలను ధరించాలి. స్నాన, దాన, జప, హోమ, వైశ్వదేవ, సురార్చన, ప్రాయశ్చిత, శ్రాద్ధ, దీక్షా కాలాలలో రుద్రాక్ష మాలలను ధరిస్తే విశేష ఫలితం లభిస్తుందంటారు. ఒకరు ధరించిన రుద్రాక్షమాలను మరొకరు ధరించకూడదు. అలాగే శుచిగా లేని సమయాలలో కూడా రుద్రాక్షమాలలను ధరించకూడదని దేవీ భాగవతంలో స్పష్టంగా ఉన్నది.
రుద్రాక్ష విశిష్టతను చెబుతూ రుద్రాక్ష చెట్టు నుంచి వచ్చిన గాలి సోకితేనే గడ్డిపరకలు సైతం పుణ్యలోకాలకు చేరుతాయని పురాణాలు వివరిస్తున్నాయి. రుద్రాక్షను ధరించిన పశువులు కూడా రుద్రత్వం పొందుతాయని జాబాలశ్రుతి వివరిస్తోంది. ఈ కారణం చేతనే కాస్తంత సంప్రదాయం తెలిసిన వారు రుద్రాక్షను ధరిస్తుంటారు. ఋషులు, మునులు, యోగులు రుద్రాక్షను ధరించకుండా కనిపించరు. జపం మీద శ్రద్ధ పెరగటానికి కూడా రుద్రాక్ష ఓ కారణమని పరిశోధకులు చెబుతున్నారు. రుద్రాక్ష మాలతో జపం చేస్తే అనంత పుణ్యఫలం లభిస్తోందని, చేతులకు, వక్షస్థలానికి, మెడకు, చెవులకు, శిరస్సుకు రుద్రాక్షలను ధరించిన వాడు సాక్షాత్తు రుద్ర సమానుడని దేవీ భాగవతంలో నారదుడు వివరించాడు.
రుద్రాక్షను ధరించి మరణిస్తే కుక్క సైతం ముక్తిని పొందుతుందని ఇదే సందర్భంలో వివరించాడు నారదుడు. ఇరవై ఒక్క రుద్రాక్షలను సంపాదించి ధరించగలిగితే శివలోక ప్రాప్తి సిద్ధిస్తుందని దేవీ భాగవతంలోని కధాంశం పేర్కొంటోంది. ఇది పురాణ పరంగా రుద్రాక్షమాలల ధారణకు సంబంధించిన విశేషమైతే, ఆధునికులలో రుద్రాక్షధారణ రక్తపోటు లాంటివి నియంత్రించగలదని కొందరు పరిశోధకులు అంటున్నారు.

గోచారంలో రాహుగ్రహ సంచారం

జన్మ కుండలిలో రాహువు మరియు కేతువు వుండిన ఎడల వాటి ప్రభావము ఇవ్వకుండా ఏ గ్రహముతో వున్నదో ఆ గ్రహము యొక్క ప్రభావమును ఇచ్చును. రాహువు చంద్ర రాశి నుండి మూడవ బావము, ఆరవ బావము మరియు పదకొండవ బావములో శుభ ఫలములను ఇచ్చును కాని పంచమ, నవమ మరియు దశమ బావములో యది అన్య గ్రహములు వుండిన ఎడల రాహువు బలహీన లేదా గాయపడిన రాహువు యొక్క శుభఫలితములు లభించ జాలవు. జన్మ కాలీన చంద్ర రాశి నుండి ప్రత్యేక బావములో గోచార సమయములో రాహువు వేరు పలితములను ఇచ్చును.
రాహువు గోచారము ప్రధమ బావము:
జన్మ యొక్క సమయములో చంద్రుడు ఏ రాశిలో వుండునో ఆ రాశిలో రాహువు ప్రవేశించునప్పుడు వ్యక్తిని రోగములు మరియు వ్యాదులు ఆకట్టుకొనును. ఈ సమయములో వ్యక్తికి అనేక విధములైన శారీరక కష్టములను అనుభవించవలసి వుండును. వ్యక్తి ఆలోచనకు వ్యతిరేకముగా అన్ని జరుగును. అందువలన మానసికముగా సమస్యలు ఎదుర్కొన వలసి వుండును. శరీరము అలిసి నట్టుగా వుండి బద్దకముగా వుండును. అందువలన కార్య పరిణామములలో లోపము ఏర్పడును.
రాహువు గోచారము ద్వితీయ భావము:
ద్వితీయ భావములో రాహువు గోచరములో వుండిన ఎడల ధన హానిని కలిగించును. ఈ గోచరములో అనవసరముగా మీ ధనము ఖర్చు కాగలదు మరియు మీరు ఆర్ధిక సమస్యలను ఎదుర్కొన వలసి వుండును. మీ కుటుంబము మరియు సహ సంబందులలో ఈ రాశి కారణముగా కష్టములు కలుగును అందువలన మీకు సమస్యలు కూడా పెరుగును. రాహువు యొక్క ఈ గోచారము కుటుంబ ఆస్తుల మద్య వివాదములకు కారణము కాగలదు. తప్పు మార్గములో మిమ్ము మద్య పదార్ధములను బానిసగా మిమ్ము చేయగలవు. రాహువు యొక్క ఈ గోచారము మీకు మానసికముగా అశాంతిని కలిగించును.
రాహువు గోచారము తృతీయ భావము:
చంద్ర రాశి నుండి తృతీయ బావములో రాహువు శుభ ఫలదాయకముగా వుండును. ఈ భావములో రాహువు యొక్క గోచారము కారణముగా మీరు నీతి మరియు రాజనీతిలో మీ బుద్ధిని ఉపయోగించి మీ పనులను చేపట్టుటకు ప్రయత్నించెదరు. మీలో గుప్తరూపముగా పనిని చేపట్టే అలవాట్లు ఏర్పడును. మీరు మీ పని పూర్తిగా జరిగిన తరువాతే దానిని బయట చెప్పెదరు. రాహువు యొక్క ఈ గోచారము మీ సుఖ సంతోషములలో ప్రాభల్యమును ఇచ్చును.
రాహువు గోచారము చతుర్ధ బావము:
జన్మ రాశి నుండి చతుర్ధ బావములో రాహువు యొక్క గోచారము కలిగి వుండిన ఎడల ఇది వ్యక్తికి అనేక విధములైన సమస్యలను మరియు కష్టములను కలిగించును. రాహువు యొక్క ఈ గోచరము తల్లికి కష్టములను కలిగించును. జీవితములో అడుగడుగున వ్యక్తి కష్టములు మరియు బాధలతో సమస్య చెంది వుండును. అగౌరవము మరియు అవమానము యొక్క భయము కలిగి వుండును. కష్ట నష్టములు ఒకదాని వెనుక మరికటి వచ్చు చుండును. భూమి మరియు వాహన సంబందమైన విషయములలో సమస్యలను ఎదుర్కొన వలసి వుండును.
రాహువు గోచారము పంచమ బావము:
జ్యోతిష్య శాస్త్రమును బట్టి జన్మ రాశి నుండి పంచమ బావములో రాహువు యొక్క గోచారము వ్యక్తికి కష్టమును మరియు దు:ఖమును కలిగించును. వ్యక్తి యొక్క బుద్ది బ్రమించగలదు మరియు త్వరగా ధనవంతునిగా మారవలననే పగటి కలలు కంటూ వుంటాడు. దనవంతుడైయ్యే ప్రయత్నములో చేతులో వున్నది కూడా తరిగి పోవును దాని వలన ఆర్ధిక స్థితి మరింత బలహీనముగా మారును. ఈ బావములో రాహువు యొక్క గోచారము ఆరోగ్యముపై కూడా విపరీత ప్రభావమును చూపును. వ్యక్తి యొక్క ముఖము మరియు పళ్ళలో నెప్పి వలన సమస్యలను ఎదుర్కొనవలసి వుండును. ఈ సమయములో అనేక విధములైన సమస్యలను ఎదుర్కొన వలసి వుండును.
రాహువు గోచారము షష్టమ బావము:
జన్మ కుండలిలో చంద్ర రాశి నుండి షష్టమ బావములో రాహువు యొక్క గోచారము కలుగుతున్నప్పుడు వ్యక్తి రాహువు యొక్క గోచారము సామాన్యముగా హానిని కలిగించదు. ఆరోగ్య రీత్యా రాహువు యొక్క ప్రభావము కొంచెం విపరీతముగా వుండును. అందువలన బోజన పానీయములలో విపరీత శ్రద్ద వహించవలసి వుండును. ఉదర సంబందమైన సమస్యలు పీడించవచ్చును. ఆర్ధికముగా రాహువు యొక్క ఈ గోచారము శుభకారిగా వుండును. ఈ సమయములో వ్యక్తి ధనలాభము కలిగే అవకాశము వున్నది. వ్యక్తికి అకస్మికముగా ధనలాభము కలుగ వచ్చును.
రాహువు గోచారము సప్తమ బావము:
జన్మ రాశిలోని చంద్రుని నుండి సప్తమ బావములో రాహువు యొక్క గోచారము దాంపత్య జీవితమునకు కష్టకారిగా వుండును. ఈ రాహువు కారణముగా భార్యాభర్తల మద్య మధుర సంబందములలో లోపము ఏర్పడి దూరము పెరుగును. రాహువు యొక్క ఈ భావములో జీవిత భాగస్వామికి కష్టములను ఎదుర్కొన వలసి వుండును. ఈ సమయములో మీ స్వయ బుద్ది కూడా పనిచేయదు. అన్ని వైపుల నుండి మానసిక వొత్తిడి అధికముగా వుండును.
రాహువు గోచారము అష్టమ బావము:
జన్మ రాశిలోని చంద్రుని నుండి రాహువు అష్టమ బావములో వుండిన ఆశుభ ప్రభావమును ఇచ్చును. రాహువు ఈ గోచారములో శారీరక సమస్యలను ఇచ్చును. విభిన్న ప్రకారములైన రోగముల వలన మీరు బాదించబడగలరు. విశేష రూపముగా మూత్ర మార్గములో లేదా మల మార్గములో రోగము కలిగే అవకాశములు వుండును. ఆర్ధిక పరముగా కూడా అశుభ కారిగా చెప్పబడును. అనవసర ఖర్చులు ఏర్పడును మరియు ఆర్దిక నష్టము కలుగును.
రాహువు గోచారము నవమ బావము:
జన్మ రాశిలోని చంద్రుని నుండి రాహువు నవమబావములో గోచారము చేయుచున్నప్పుడు ఇది మీ పనులలో అవరోధములను కలిగించును. మీ ఆలోచనలు పూర్తి చేయుటలో రాహువు అడుగడుగున సమస్యలను కలిగించును. అనేక సమయములో మీ పని జరుగుతున్నదని సంతోషపడు సమయములో ఆపని జరుగకుండా నిలిచిపోవును. ధన విషయములో కూడా రాహువు యొక్క ఈ గోచారము విపరీత ప్రభావమును ఇచ్చును. ఇది మీకు అనవసర ఖర్చులను చేయించును. అందువలన మీకు ఆర్ధిక సమస్యలను ఎదుర్కొనవలసి వచ్చును.
రాహువు గోచారము దశమ బావము:
జన్మ కాలిక చంద్రుని నుండి రాహువు దశమ బావములో గోచారము చేయుచున్నప్పుడు ఇది వ్యక్తి యొక్క జీవితమును తలక్రిందులుగా చేయును. రాహువు యొక్క ఈ గోచారము స్థానాంతరమును కలిగించును. మీరు ఇల్లు విడిచి వేరో చోటుకు వెల్లవలసి వుండును లేదా ఉద్యోగములో బదిలీలు ఏర్పడును. ఈ గోచారములో మీకు కార్య పరివర్తనము కలుగును మీరు ఏపని చేయుచున్నారో దానిని విడిచి మరే ఇతర పనినైనా చేపట్టవచ్చును. ఈ గోచారములో ఆర్ధిక నష్టమును కూడా ఎదుర్కొనవలసి వచ్చును. అనవసర పరిశ్రమ కారణముగా వ్యక్తి అలసటకు గురి కాగలడు.
రాహువు గోచారము ఏకాదశ బావము:
జన్మ రాశి నుండి ఏకాదశ బావములో రాహువు గోచారములో వున్నప్పుడు ఇది శుభ ఫలితములను ఇచ్చును. రాహువు యొక్క అశుభ ప్రభావము ఈ భావములో కలుగదు. గోచారములో రాహువు వ్యక్తికి గౌరవ మర్యాదలను మరియు ప్రతిష్టలను ఇచ్చును. వ్యక్తి కొరకు ధన సంపాదనమునకు క్రొత్త మార్గములను చూపును మరియు పాత మార్గముల నుండి కూడా ధన లాభము లభించును. ఈ గోచారము ధనము యొక్క దృష్టి నుండి అనుకూల పరిణామములను ఇచ్చును. వ్యక్తికి వారి కార్యములలో సఫలత లభించగలదు.
రాహువు గోచారము ద్వాదశ బావము:
ద్వాదశ బావములో జన్మ కాలిక చంద్రుడు నుండి రాహువు యొక్క గోచారము వ్యక్తికి శారీరక భాదలను కలిగించును. రాహువు గోచారములో ద్వాదశ బావములో ప్రవేశించునప్పుడు వ్యక్తి పగటి కళలు కనుట ప్రారంబించును. ఈ గాలి మేడల వలన ఏ విధమైన ప్రయోజనము వుండదు. వ్యక్తి యొక్క కల్పన అలేగే వుండి పోవును. ఆర్ధికముగా సమస్యలను ఎదుర్కొనవలసి వుండును. ఈ గోచారములో అనవసర ఖర్చులు అధికముగా వుండును.

Saturday 30 January 2016

స్వామీ వివేకానంద

ఈ రోజు స్వామీ వివేకానంద జన్మదినం సందర్భం గా వివేకానందుని జీవిత విశేషాలు మీ ముందుకు...
1893లో స్వామి వివేకానంద షికాగోలో సంతకం చేసిన ఫొటో - ఇందులో స్వామి బెంగాలీ మరియు ఆంగ్ల భాషలలో ఇలా వ్రాశాడు - "ఒక అనంతమైన స్వచ్ఛమైన మరియు పవిత్రమైనది, ఆలోచనకి మరియు నాణ్యత ప్రమాణాల పరిధి దాటినదైనదానికి నేను నమస్కరిస్తున్నాను "
నరేంద్రనాథ్ దత్తా
జననం
12 జనవరి 1863
కలకత్తా,బెంగాలు ప్రిసిడెన్సీ, బ్రిటీషు పరిపాలనలోని భారతదేశం
(ఇప్పుడు కోల్కతా, పశ్చిమ బెంగాల్, భారత దేశం)
నిర్యాణము జూలై 4, 1902 (వయసు 39)
బేలూరు మఠం, బెంగాలు ప్రిసిడెన్సీ, బ్రిటీషు పరిపాలనలోని భారతదేశం
(ఇప్పుడు పశ్చిమ బెంగాల్, భారత దేశం)
జాతీయత భారతీయడు
స్థాపించిన సంస్థ బేలూరు మఠం, రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్
గురువు రామకృష్ణ
తత్వం వేదాంత
సాహిత్య రచనలు రాజయోగ, కర్మయోగ, భక్తియోగ మరియు జ్ఞానయోగ
ప్రముఖ శిష్యు(లు)డు స్వామి అశోకానంద, స్వామి విరాజానంద, స్వామి పరమానంద, ఆలసింగ పెరుమాల్, స్వామి అభయానంద, సోదరి నివేదిత,స్వామి సదానంద
ప్రభావితులైన వారు[చూపు]
ఉల్లేఖన "లేండి, మేల్కొనండి మరియు గమ్యం చేరేదాక ఆగవద్దు"
(మరిన్ని పలుకులువికీఖోట్ లో చూడండి)
స్వామీ వివేకానంద (జనవరి 12, 1863 - జూలై 4, 1902), (బెంగాలీలో 'షామీ బిబేకానందో') ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.
భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండుల లో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి అతనికి కలదు. గురువు గారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు.భారతదేశాన్ని ప్రేమించి,భారతదేశం మళ్ళి తన ప్రాచీన ఔన్నత్యాన్ని పోందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానందా. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే. తూర్పు దేశాల తత్త్వమును షికాగో లో జరిగిన ప్రపంచ మత జాతర (పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్)లో 1893 లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగోలోను, అమెరికాలోని ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు.
తిరిగి భారత దేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. ముప్పై తొమ్మిది ఏళ్ళ వయసు లోనే మరణించాడు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మ దినాన్ని "జాతీయ యువజన దినోత్సవం" గా1984 లో ప్రకటించింది.
బాల్యం
నరేంద్ర నాథుడు అదిలాబాద్లో ఒక ఉన్నత కుటుంబానికి చెందిన రక్షిత్ వివెకనందునికి చిన్నప్పటి నుంచే ప్రానా స్నెహిథుడు వారు ఈద్దరు కలసి రొజు ద్యన0 చేసేవారు. బాలుడిగా ఉన్నపుడు నరేంద్రుడు చాలా ఉల్లాసంగా, చిలిపిగా ఉండేవాడు. సన్యాసుల పట్ల యోగుల పట్ల అమితమైన ప్రేమను కనబరిచేవాడు. వారు ఏదడిగినా సరే లేదనకుండా ఇచ్చేసేవాడు. పుట్టగానే పువ్వు పరిమళిస్తిందన్నట్లుగా చిన్నప్పటీ నుంచే అతనికి నిస్వార్థ గుణం, మరియు ఔదార్య గుణాలు అలవడ్డాయి.
నరేంద్రుడు ఆటలలోనూ, చదువులో కూడా ముందుండేవాడు. ఏకసంథాగ్రాహి పాఠాన్ని ఒకసారి చదివితే మొత్తం గుర్తుంచుకునేవాడు. అతని జ్ఞాపకశక్తి అమోఘమైనది. 1880 వరకు మెట్రిక్యులేషన్ పరీక్ష మరియు ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణుడై కళాశాలలో చేరాడు. రోజు రోజుకూ అతని జ్ఞాన తృష్ణ అధికంకాసాగింది. దైవం గురించి తెలుసుకోవాలని పరమ ఆసక్తితో ఉండేవాడు. చరిత్ర మరియు సైన్సు తోపాటు పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని కూడా ఔపోసన పట్టాడు. అలా చదువులో ముందుకెళుతున్న కొద్దీ అతని మదిలో అనుమానాలు, సందేహాలు, అస్పష్టత ఎక్కువ కాసాగినాయి. అలా మూఢ నమ్మకాలన్నింటినీ విడిచిపెట్టినప్పటికీ సత్యాన్ని మాత్రం కనుగొనలేకపోయాడు.
నరేంద్రుడు తనకు వచ్చిన సందేహాలన్నీ అనేక పండితుల ముందు వెలిబుచ్చాడు. వారంతా వాదనలలో ఆరితేరిన వారు. కానీ వారి వాదనలేవీ నరేంద్రుడిని సంతృప్తిపరచలేకపోయాయి. వారు ఆలోచిస్తున్న మార్గం కూడా వివేకానందుడికి నచ్చలేదు. అందునా వారెవరికీ భగవంతునితో ప్రత్యక్ష అనుభవం లేదు.
రామకృష్ణ పరమహంసతో పరిచయం
కోసీపూర్ లో - 1886
రామకృష్ణ పరమహంస కాళికాదేవి ఆలయంలో పూజారి కాదు కానీ గొప్ప భక్తుడు. అతను భగవంతుని కనుగొనిఉన్నాడని జనాలు చెప్పుకుంటుండగా నరేంద్రుడు విన్నాడు. ఎవరైనా పండితులు ఆయన దగ్గరకు వెళితే వారు ఆయనకు శిష్యులు కావలసిందే. ఒకసారి నరేంద్రుడు తన మిత్రులతో కలిసి ఆయనను కలవడానికి దక్షిణేశ్వర్ వెళ్ళాడు. రామకృష్ణ పరమహంస తన శిష్యులతోపాటు కూర్చుని ఉన్నారు. భగవంతుని గురించిన సంభాషణలో మునిగిపోయి ఉన్నారు. నరేంద్రుడు తన స్నేహితులతోపాటు ఒక మూలన కూర్చుని వారి సంభాషణను ఆలకించసాగాడు. ఒక్కసారిగా రామకృష్ణ పరమహంస దృష్టి నరేంద్రుడి మీదకు మళ్ళింది. ఆయన మనసులో కొద్దిపాటి కల్లోలం మొదలైంది. ఆయన సంభ్రమానికి గురయ్యారు. ఏవేవో ఆలోచనలు ఆయనను చుట్టుముట్టాయి.పాతజ్ఞాపకాలేవో ఆయనను తట్టిలేపుతున్నట్లుగా ఉంది. కొద్ది సేపు అలాగే నిశ్చలంగా ఉన్నాడు. నరేంద్రుడు ఆకర్షణీయమైన రూపం, మెరుస్తున్న కళ్ళు ఆయనను ఆశ్చర్యానికి గురి చేశాయి. నువ్వు పాడగలవా? అని నరేంద్రుడిని ప్రశ్నించాడు. అప్పుడు నరేంద్రుడు తమ మృధు మధురమైన కంఠంతో రెండు బెంగాలీ పాటలు గానం చేశాడు. ఆయన ఆ పాటలు వినగానే అదోవిధమైన తాద్యాత్మత ("ట్రాన్స్") లోకి వెళ్ళిపోయాడు. కొద్ది సేపటి తరువాత నరేంద్రుడిని తన గదికి తీసుకువెళ్ళాడు. చిన్నగా నరేంద్రుడి భుజం మీద తట్టి, ఆయనతో ఇలా అన్నాడు. ఇంత ఆలస్యమైందేమి? ఇన్ని రోజులుగా నీ కోసం చూసి చూసి అలసి పోతున్నాను. నా అనుభావలన్నింటినీ ఒక సరైన వ్యక్తితో పంచుకోవాలనుకున్నాను. నీవు సామాన్యుడవు కావు. సాక్షాత్తు భువికి దిగివచ్చిన దైవ స్వరూపుడవు. నీ గురించి నేనెంతగా తపించానో తెలుసా? అంటూ కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు.
ఆయన ప్రవర్తన నరేంద్రుడికి వింతగా తోచింది. ఆయనకు పిచ్చేమే అనుకున్నాడు. నీవు మళ్ళీ తిరిగి వప్పుడు తప్పించుకుందామా అని చూస్తున్న నరేంద్రుడు అందుకు సరే అన్నాడు. ఆయన బోధన పూర్తయ్యాక మీరు భగవంతుని చూశారా? అని ప్రశ్నించాడు. అవును చూశాను నేను నిన్ను చూసిన విధంగానే, ఆయనతో మాట్లాడాను కూడా, అవసరమైతే నీకు కూడా చూపించగలను. కానీ భగవంతుని చూడాలని ఎవరు తపించిపోతున్నారు? అన్నాడాయన. ఇప్పటి దాకా ఎవరూ తాము భగవంతుని చూశామని చెప్పలేదు, కానీ ఈయన మాత్రం నేను భగవంతుని చూశానని చెప్తున్నాడు. ఎలా నమ్మడం?, ఇతను మతి తప్పి మాట్లాడుతుండవచ్చు. కానీ సరైన అవగాహన లేనిదే ఏ అభిప్రాయం ఏర్పరుచుకోకూడదు అని మనసులో అనుకున్నాడు నరేంద్రుడు.
ఒక నెల రోజులు గడిచాయి. నరేంద్రుడు ఒక్కడే దక్షిణేశ్వర్ కు వెళ్ళాడు. రామకృష్ణులవారు మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్నారు. నరేంద్రుని చూడగానే ఆయన చాలా సంతోషించారు. మంచం మీద కూర్చోమన్నారు. అలాగే ధ్యానంలోకి వెళ్ళి ఆయన కాలును నరేంద్రుడి ఒడిలో ఉంచారు.మరుక్షణం నరేంద్రుడికి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆయనకేదో అయిపోతున్నట్లుగా అనిపించసాగింది. నన్నేమి చేస్తున్నావు? నా తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నారు. నేను మళ్ళీ వారి దగ్గరకు వెళ్ళాలి. అని అరిచాడు. రామకృష్ణుల వారు చిరునవ్వు నవ్వుతూ ఈరోజుకిది చాలు అని చెప్పి తన కాలును వెనక్కి తీసేసుకున్నారు. నరేంద్రుడు మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. రోజులు గడిచేకొద్దీ ఒకరి పట్ల మరొకరు ఆకర్షితులయ్యారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు.
నరేంద్రుడి గొప్పతనాన్ని తెలుసుకోవడానికి రామకృష్ణులవారికి ఎంతో సమయం పట్టలేదు. కాళికా దేవి ఆయనకు మార్గనిర్దేశం కూడా చేస్తుంది. కానీ నరేంద్రుడు మాత్రం ఆయనను పరీక్షించేవరకూ గురువుగా నిర్ణయించుకోకూడదనుకున్నాడు. భగవంతుని గురించి తెలుసుకోవాలంటే స్త్రీలని, ధనాన్ని, వ్యామోహాన్ని విడనాడాలని చెప్పేవాడు. నరేంద్రుడు ఆయనకు ప్రియతమ శిష్యుడు. అలాగని నరేంద్రుడు చెప్పిన అన్ని విషయాలతో ఆయన ఏకీభవించేవాడు కాదు. విగ్రహారాధన చేసేవారిని నరేంద్రుడు బాగా విమర్శించేవాడు. అద్వైతాన్ని కూడా వ్యతిరేకించాడు. అలౌకిక అనుభవాల మీద అంతగా నమ్మకం లేదు. నేనే బ్రహ్మను నేనే శివుణ్ణి అనేలాంటి వాక్యాలేవీ అతనిని అంతగా ప్రభావితం చేసేవి కావు. కానీ ఎప్పటికప్పుడు రామకృష్ణులవారు నరేంద్రుని సరైన మార్గంలోకి తీసుకువచ్చేవాడు.
తండ్రి మరణం
నరేంద్రుడు నెమ్మదిగా ప్రాపంచిక సుఖాలపై వ్యామోహం తగ్గి సన్యాసం వైపు మొగ్గు చూపడం ప్రారంభించాడు. అది అతని తల్లిదండ్రులకు తెలియవచ్చింది. అప్పుడు అతను బియ్యే పరీక్షకు తయారవుతున్నాడు. 1884లో బియ్యే పాసయ్యాడు. అతని స్నేహితుడొకడు పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీలో నరేంద్రుడు పాట పాడుతుండగా తెలిసింది పిడుగు లాంటి వార్త. తండ్రి మరణించాడని. వెనువెంటనే ఆకుటుంబాన్ని పేదరికం ఆవరించింది. అప్పులిచ్చిన వాళ్ళు వేధించడం మొదలుపెట్టారు. కొద్దిమంది న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. నరేంద్రుడు ఉద్యోగం కోసం కాళ్ళరిగేలా తిరిగాడు. బట్టలు మాసిపోయి చిరిగిపోయాయి. రోజుకొకపూట భోజనం దొరకడం కూడా గగనమైపోతుంది. చాలారోజులు ఆయన పస్తులుండి తల్లికి, చెల్లెళ్ళకు, తమ్ముళ్ళకు తిండి పెట్టేవాడు. వారితో తను స్నేహితులతో కలిసి తిన్నట్లు అబద్ధం చెప్పేవాడు. కొన్నిసార్లు ఆకలితో కళ్ళు తిరిగి వీధిలో పడిపోయేవాడు. ఇంత దురదృష్టం తనను వెన్నాడుతున్నా ఎన్నడూ భగవంతుని మీద విశ్వాసం కోల్పోలేదు. నీవు కాళికా దేవికి మరియు సాటి ప్రజలకు సేవ చేయాల్సిన వాడివ, నీవు ధైర్యంగా ఉండాలి అంటూ రామకృష్ణుల వారు ఓదార్చేవారు.
తరువాత నరేంద్రుడు కొద్దిరోజులపాటు విద్యాసాగర్ పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాడు. ఇప్పుడు కుటుంబానికి కనీసం తినడానికి తిండైనా దొరుకుతున్నది. బోధకుడిగా పనిచేస్తూనే తన న్యాయ విద్యను కొనసాగించాడు. గురువుగారి ఆరోగ్యం క్షీణించింది. ఆయనకు గొంతు క్యాన్సర్ సోకింది. నరేంద్రుడు తన ఉద్యోగం, చదువు రెండు మానేసి గురు శుశ్రూషలో మునిగిపోయాడు. రామకృష్ణులవారికి మరణం సమీపిస్తోంది. చివరి రోజున ఆయన నరేంద్రుడిని పిలిచి అలా మృదువుగా తాకాడు. ఆయన ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ నరేంద్రుడికి ధారపోసి ఇలా అన్నాడు. నరేన్! నీవు ఇప్పుడు సర్వశక్తిమంతుడవు. వీళ్ళంతా నా బిడ్డలవంటి వారు. వీరిని చూసుకోవాల్సిన బాధ్యత నీదే అన్నాడు. నరేంద్రుడి హృదయం బాధతో నిండిపోయింది. గదిలోకి బయటకు వెళ్ళిపోయి చిన్నపిల్లవాడిలా దుఖించడం మొదలుపెట్టాడు. రామకృష్ణులవారు చనిపోయిన తరువాత ఆయన శిష్యులందరూ కలిసి బరనగూర్‌లోమి ఒక అద్దె ఇంట్లో నివాసం ప్రారంభించారు. ఆ ఇల్లు చాలా పాతది అయినప్పటికీ నగరం యొక్క రణగొణ ధ్వనులకు చాలా దూరంగా గంగానది ఒడ్డున ఉండేది. అక్కడినుండి రామకృష్ణుల వారి సమాధి చాలా దగ్గరగా ఉండేది. అక్కడే రామకృష్ణ మఠం స్థాపించడం జరిగింది. అక్కడున్న యువసన్యాసులకు రెండే లక్ష్యాలు ఉండేవి. ప్రజలకు సేవ చేయడం , ముక్తిని సాధించడం. కొద్ది మంది యువకులు తమ కుటుంబాల్ని వదిలిపెట్టి సన్యాసులు గా మారారు. నరేంద్రుడు కూడా సన్యాసిగా మారి ఆ మఠానికి నాయకుడయ్యాడు. ఆ యువ సన్యాసులు తిండి, బట్ట గురించి పెద్దగా ఆలోచించేవారు కాదు. ఉపవాసం ఉన్నపుడు కూడా తమ చదువును ధ్యానాన్ని నిర్లక్ష్యం చేసేవారు కాదు. నరేంద్రుడు వారికి సంస్కృతాన్ని బోధించేవాడు. అక్కడికి విచ్చేసే సందర్శకులకి గురువుగారి బోధనలను విడమరిచి చెప్పేవాడు.
వివేకానందుడిగా మార్పు
నరేంద్రుడు సన్యాసం స్వీకరించి వివేకానందుడిగా మారాడు. భారతదేశం అతని గృహమైంది. ఇక్కడి ప్రజలు అతని సోదర, సోదరీమణులయ్యారు. దురదృష్టవంతులైన తన సోదరుల కన్నీళ్ళు తుడవడం అతనికి ఎంతో ఆనందాన్ని కలిగించే పని. దేశమంతా పర్యటించాడు. తనకున్న ఆస్తి అంతా ఒక కాషాయ వస్త్రము, ఒక కమండలము, శిష్యగణం మాత్రమే. ఈ పర్యటనలో అతను ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించాడు. దారి మధ్యలో గుడిసెల్లోనూ, సత్రాలలోనూ నివసించేవాడు, కటిక నేలమీదనే నిద్రించేవాడు. అనేక మంది సాధువుల సాంగత్యంలో గడిపాడు. ఆధ్యాత్మిక చర్చలతో, పవిత్ర కార్యాల గురించిన చర్చలతో సమయం గడిపేవాడు. చాలా దూరం కాలినడకనే నడిచేవాడు. ఎవరైనా దయ తలిస్తే ఏదైనా వాహనంలో ఎక్కేవాడు. ఆళ్వార్ దగ్గర కొద్ది మంది ముస్లింలు కూడా ఆయనకు శిష్యులయారు. ఎవరైనా రైలు ప్రయాణానికి టిక్కెట్టు కొనిస్తేనే రైలులో ప్రయాణం చేసేవాడు. చాలాసార్లు తన దగ్గర డబ్బులేక పస్తుండాల్సి వచ్చేది.
మైసూరులో స్వామికి దివాను శేషాద్రి అయ్యర్ మరియు మైసూరు మహారాజా వారితో పరిచయం ఏర్పడింది. పండితుల సభలో స్వామీజీ సంస్కృతం లో చేసిన ప్రసంగం మహారాజా వారిని ముగ్ధుల్ని చేసింది. భారతదేశం వివిధ మతాల మరియు వివిధ తత్వాల సమ్మేళనం. పాశ్చాత్యులు విజ్ఞానశాస్త్రంలో మంచి పురోగతి సాధించారు. ఈ రెండు కలిస్తే మానవజాతి మంచి పురోగతిని సాధించగలదు. కాబట్టి నేను అమెరికా వెళ్ళి అక్కడ వేదాంతాన్ని వ్యాప్తి చెయ్యాలనుకుంటున్నాను అని స్వామీజీ మైసూరు మహారాజాతో అన్నాడు. అయితే ఆ ఖర్చులన్నీ నేనే భరిస్తానన్నాడు. మాహారాజా. స్వామీజీ ఆయనకు కృతజ్ఞతలు తెలిపి సమయం వచ్చినపుడు తప్పకుండా ఆయన సహాయం తీసుకుంటానని చెప్పి సెలవు తీసుకున్నాడు.
తరువాత స్వామీజీ భాస్కర సేతుపతి పరిపాలిస్తున్న రామనాడును సందర్శించాడు. అక్కడి రాజు స్వామీజీని మిక్కిలి గౌరవించాడు. మీరు అమెరికాలో జరగబోవు సర్వ మత సమ్మేళనానికి తప్పకుండా హాజరవాలి. అందుకయ్యే ఖర్చంతా నేను భరిస్తాను అన్నాడు. దానిని గురించి తప్పకుండా ఆలోచిస్తానని ఆయనకు మాట ఇచ్చి అక్కడి నుంచి రామేశ్వరానికి వెళ్ళి చివరకు కన్యాకుమారి చేరుకున్నాడు. కొద్ది దూరం ఈదుకుంటూ వెళ్ళి ఒక రాయి మీద కూర్చున్నాడు. పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ భారతదేశపు ఆధ్యాత్మిక విలువల్ని వారికి వివరించడం తన ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నాడు. తరువాత స్వదేశానికి తిరిగి వచ్చి నిదురపోతున్న భారతజాతిని మేల్కొలపాలనుకున్నాడు. అతని ప్రయాణానికి ఖర్చుల నిమిత్తం దేశం నలుమూలల నుంచీ విరాళాలు వచ్చి పడ్డాయి. కానీ అతడు మాత్రం తన ప్రయాణానికి ఎంత కావాలో అంతే స్వీకరించాడు. మిగిలిన ధనాన్ని దాతలకు తిరిగి ఇచ్చివేశాడు. అతను ఎక్కిన నౌక బొంబాయి తీరం నుంచి 1893, మే 31వ తేదీన బయలు దేరింది.
విదేశాలలో...
జులై నెలలో స్వామీజీ చికాగో నగరానికి చేరుకున్నాడు. సర్వమత సమ్మేళనాన్ని గురించి వాకబు చేశాడు. అప్పటికి ఆ సదస్సుకు మూడు నెలల వ్యవధి ఉంది. చికాగో నగరం చాలా ఖరీదయిన నగరం కావడంతో స్వామీజీ బోస్టన్ నగరానికి వెళ్ళాడు. దారి మధ్యలో ఒక మహిళ స్వామికి పరిచయం అయింది. ఆయనతో కొద్ది సేపు మాట్లాడగానే ఆమెకు ఆయన గొప్పతనమేమిటో అర్థం అయింది. ఆయన సామాన్యుడు కాదని తెలిసి కొద్ది రోజులు ఆమె ఇంటిలో బస చేయమని కోరింది. స్వామీజీ అందుకు అంగీకరించాడు. అప్పుడప్పుడు చుట్టుపక్కల జరిగే చిన్న సభలలో ఉపన్యసించేవాడు. వీటిలో ప్రధానంగా భారతీయ సంస్కృతి మరియు హిందూ ధర్మం ప్రధాన అంశాలుగా ఉండేవి. నెమ్మదిగా చాలామంది పండితులు ఆయనకు మిత్రులయ్యారు. వారిలో ఒకరు జాన్ హెన్రీ రైట్. అతడు హార్వర్డ్ విశ్వవిద్యాలయం లో గ్రీకు విభాగంలో ఆచార్యుడు. సమ్మేళనానికి హాజరయ్యే సభ్యులంతా నిర్వాహకులకు పరిచయపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కానీ స్వామీజీ తన పరిచయ పత్రాన్ని ఎక్కడో పోగొట్టుకున్నాడు. అప్పుడు రైట్ పరిచయ పత్రాన్ని రాశాడు. ఆ పత్రంలో స్వామీజీ చాలా మంది ప్రొఫెసర్ల కన్నా మంచి పరిజ్ఞానం కలవాడని రాసి పంపించాడు. స్వామీజీ చికాగోకు తిరిగి వచ్చాడు. సదస్సు 1893, సెప్టెంబర్ 11న ప్రారంభమైంది. దేశవిదేశాల నుంచి వచ్చిన వేలాది మంది ప్రతినిధులు అక్కడ చేరారు. వివేకానంద వారందరిలోకెల్లా చిన్నవాడు. అతను మాట్లాడే వంతు వచ్చేసరికి గుండె వేగం హెచ్చింది. అందరు సభ్యుల దగ్గరా ఉన్నట్లు ఆయన దగ్గర ముందుగా తయారు చేసిన ఉపన్యాసం లేదు. అతని ప్రసంగాన్ని చివరలో ఉంచమని అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశాడు. ఉపన్యసించడానికి ముందు గురువైన రామకృష్ణులవారినీ, సరస్వతీ దేవిని మనస్పూర్తిగా ప్రార్థించాడు.
అమెరికా దేశపు ప్రియ సహోదరులారా! అని స్వామీజీ తన మృధు మధుర కంఠస్వరంతో అనగానే సభ మూడు నిమిషాలపాటు చప్పట్లతో దద్దరిల్లింది.శబ్దం ఆగిన తరువాత తన ప్రసంగాన్ని ఆరంభించాడు. అక్కడున్న ప్రతీ ప్రతినిధి స్వామీజీ ప్రసంగాన్ని ప్రశంసించారు. వార్తాపత్రికలు ఆయన వ్యాసాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. అక్కడి ప్రజలకు ఆయన ఆరాధ్యుడయ్యాడు. ఆయన మాట్లాడడానికి లేచాడంటే చాలు, చెవులు చిల్లులుపడే శబ్దంతో చప్పట్లు దద్దరిల్లేవి. కొన్ని సంస్థలు సభ జరుగుతున్నపుడు మధ్యలోనే తమ సంస్థకు ఆహ్వానించేవి.అనతి కాలంలోనే స్వామీజీకి ప్రపంచ ప్రఖ్యాతి లభించింది. ఎక్కడికి వెళ్ళినా స్వామీజీ తన ప్రసంగంలో భారతదేశపు విలువల్ని చాలా సేపు వివరించేవాడు. చరిత్ర అయినా, సామాజిక శాస్త్రం అయినా, తత్వశాస్త్రం అయినా, సాహిత్యమైనా ఎటువంటి తడబాటు లేకుండా ఉపన్యసించేవాడు.కొత్త అవతారం,హిందూ మతాన్ని చక్కగా తెలుపగల నైపుణ్యం, వికాసవంతమైన వ్యక్తిత్వం,ఈ మూడు గుణాలతో ఆయన అందరి హృదయాలను గెలవగలిగాడు.వాదనలలో ఆయనను గెలవగలిగిన వారు లేరు.ఆయన ఆంగ్ల నైపుణ్యం అపారం. అటువంటి మనీషి యుగానికి ఒకరే పుడతారు.ఆయనను సజీవంగా చూస్తూ ఆయన బోధనలను వినడం నిజంగా మనం చేసుకున్న పుణ్యం అని ఒక పత్రిక వ్యాఖ్యానించింది.
సిస్టర్ నివేదిత...
స్వామీజీ కృషి వల్ల ఒక్క అమెరికాలోనే కాకుండా అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ భారతదేశం పట్ల గౌరవం ఏర్పడింది. ఆయన ఎక్కడ ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళినా జనం గుమికూడి ఎంతో ఓపికగా ఎదురుచూసేవారు. ఉపన్యాసం అయిపోయిన తరువాత ఆయన్ని తమ ఇళ్ళకు ఆహ్వానించి ఆదరించేవారు. ఇంగ్లాండు నుంచి కూడా ఆయనకు ఆహ్వానం లభించింది. ఆయనకు అక్కడ ఘనస్వాగతం లభించింది. వార్తాపత్రికలు ఆయనను ఘనతను, వాగ్ధాటిని శ్లాఘించాయి. ఎంతోమంది ఆయనకు శిష్యులయ్యారు. వారిలో ముఖ్యులు సిస్టర్ నివేదిత గా మార్పు చెందిన మార్గరెట్ నోబుల్. తరువాత ఆమె భారతదేశానికి వచ్చి ఇక్కడే ఉండిపోవడం జరిగింది.
నాలుగు సంవత్సరాల పాటు విదేశీ పర్యటన తరువాత స్వామీజీ తిరిగి భారతదేశానికి విచ్చేశాడు. ఆయన తిరిగి వచ్చేసరికి ఆయన కీర్తి దశదిశలా వ్యాపించిపోయింది. జనవరి 15, 1897 ఆయన కొలంబోలో దిగగానే ఆయనకు చక్రవర్తికి లభించినంత స్వాగతం లభించింది. మద్రాసుకు చేరుకొనేటప్పటికి ఆయన అభిమానులు రథం మీద లాగుతూ ఊరేగించారు.లెక్కలేనన్ని పూలమాలలు, సందేశాలు లభించాయి. ఎక్కడికి వెళ్ళినా తమ గురువు చెప్పిన సందేశాన్ని వ్యాప్తి చేశాడు.ఆయన దగ్గరకు మార్గదర్శకత్వం కోసం వచ్చేవారికి ఆధ్యాత్మిక విలువల యొక్క ప్రాధాన్యాన్ని బోధించేవాడు. అదే స్పూర్తితో, లక్ష్యంతో1897 లో రామకృష్ణ మఠాన్ని[4] స్థాపించాడు. తరువాత రెండు సంవత్సరాలలో గంగానది ఒడ్డున గల బేలూర్ వద్ద స్థలాన్ని కొని మఠం కోసం భవనాల్ని నిర్మించాడు. ఈ మఠం తరువాత శాఖోపశాఖలుగా విస్తరించింది. [5]
ముఖ్య సూత్రములు తత్త్వములు
1885 - 1895 మధ్య కాలంలో జైపూర్‌లో వివేకానంద ఫొటో
వివేకానందుడు గొప్ప తాత్వికుడు. అతని ముఖ్య బోధనల ప్రకారం అద్వైత వేదాంతం తత్త్వ శాస్త్రములో నే కాకుండా , సామాజికంగా రాజకీయంగా కూడా ఉపయోగ పడుతుంది. రామకృష్ణుడు నేర్పిన ముఖ్యమైన పాఠాలలో 'జీవుడే దేవుడు' అనేది అతని మంత్రముగా మారింది. 'దరిద్ర నారాయణ సేవ' (పేదవారి సేవ తో భగవంతుని సేవ) అనే పదాన్ని ప్రతిపాదించాడు. "విశ్వమంతా బ్రహ్మం నిండి ఉండగా మనము మనని గొప్ప వారని తక్కువ వారని ఎలా అనుకుంటాము?" అనే ప్రశ్న తనకు తాను వేసుకుని ఈ తేడాలన్నీ మోక్షము సమయములో కలిగే దివ్యజ్యోతి లో కలిసి పోతాయని తెలుసుకున్నాడు. అప్పుడు పుట్టే ప్రేమ నుండి, తమలోని బ్రహ్మాన్ని తెలుసుకోలేని మనుష్యులను ఆదుకునే సత్ప్రవర్తన పుడుతుంది.అందరు తనవార నుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనే వేదాంత తత్వానికి చెందిన వ్యక్తి వివేకానందుడు. వ్యక్తిగత మోక్షము పై వ్యామోహము ను కూడా వదిలివేసి, ఇతరులను బంధవిముక్తులను చెయ్యడమే మనిషికి జ్ఞానోదయము అని నమ్మిన మనిషి. రామకృష్ణా మిషన్ (రామకృష్ణా మఠము)ను "వ్యక్తి మోక్షమునకు, ప్రపంచ హితమునకు"(आत्मनॊ मोक्षार्थम् जगद्धिताय च) అనే నినాదము మీద స్థాపించాడు.
• సిద్ధాంతాలు, పిడివాదాలు, సంప్రదాయాలు, దేవాలయాలు మున్నగువాటిని గురించి ఆలోచించకు. మనిషి హృదయంలో దీపిస్తూన్న ఆత్మ వస్తువుతో సరిపోల్చితే అవి ఎందుకూ కొరగావు. ఆ వస్తువే ఆధ్యాత్మిక శక్తి. మొదట ఈ శక్తిని సముపార్జించండి. ఇతర ధర్మాలను నిందించవద్దు. ప్రతి మతంలోను, ప్రతి సిద్ధాంతంలోను, ఎంతోకొంత మంచి వుంటుంది.సోదర ప్రేమ గురించి ప్రసంగాలుమాని, ఆ ప్రేమను కార్యరూపంలో ప్రదర్శించండి.త్యాగ, సాక్షాత్కారాలను పొందినవాడే ప్రపంచంలోని సర్వమతాలలోని ఏకత్వాన్ని దర్శించగలడు. వ్యర్థ వాదాలకు ఆస్కారం లేదని గ్రహింపగలడు. అపుడే మానవాళికి సహాయం చేయగలడు. వాస్తవానికి అన్ని మతాలు ఒకే సనాతన ధర్మం యొక్క అంశాలు.
స్వామి వివేకానంద ఎన్నో దివ్య ప్రబోధాలను అందించారు. అవి ఇక్కడ వివరించబడ్డాయి.
• గమ్యం చేరేవరకు ఆగవద్దు. జాగ్రుతులు కండి.
• దీర్ఘ (?)అంతమౌతోంది. పగలు సమీపిస్తోంది. ఉవ్వెత్తున ఉప్పొంగే ఉప్పెన తీవ్రతను ఎవరూ నిరోధించలేరు. ఆవేశపూరితులు కండు; ప్రేమతత్వాన్ని వీడవద్దు; విశ్వాసాన్ని, నమ్మకాన్ని, సడలనీయకండి. భయం విడనాడండి. భయమే పెద్ద పాపం.
• ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడవద్దు. ఘనమైన ఫలితాలు క్రమంగా సమకూరుతాయి. సాహసాన్ని ప్రదర్శించండి.
• మీ సహచరులకు నాయకత్వం వహించే తలంపువద్దు. వారికి మీ సేవలను అందించండి.
స్వామి వివేకానందుని స్పూర్తి వచనాలు
• మందలో ఉండకు ..వందలో ఉండటానికి ప్రయత్నించు..
• ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు..
• కెరటం నాకు ఆదర్శం .. లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు
• మతం అనేది సిద్దాంత రాద్దాంతాలలో లేదు .. అది ఆచరణలో ఆద్యాత్మికులుగా పరిణతి చెందడంలో మాత్రమే ఉంది.
• ఈ ప్రపంచం బలవంతులకు మాత్రమే సహాయపడుతుంది..
మరణం
అవిశ్రాంతంగా పని చేయడం వలన స్వామి ఆరోగ్యం దెబ్బతిన్నది. అమెరికాలోని ఆయన శిష్యుల అభ్యర్థన మేరకు మరల అక్కడికి వెళ్ళాడు. ప్యారిస్ లోని సర్వమత సమావేశాలలో పాల్గొని తిరిగి స్వదేశానికి వచ్చాడు. రానూ రానూ అంతర్ముఖుడయ్యాడు. శరీరమైతే బలహీనంగా తయారయ్యింది కానీ ఆయన ఆత్మ,మనసు మాత్రం చాలా చురుగ్గా వ్యవహరించేవి. జులై 4, 1902న యధావిధిగా ఆయన రోజూవారీ కార్యక్రమాలు నిర్వర్తించుకున్నాడు. శిష్యులకు బోధనలు చేశాడు. భోంచేసిన తరువాత కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నాడు. కొద్ది సేపటి తరువాత ఆయనకు చిన్న వణుకు లాంటిదేదో కలిగింది. తనను చూడడానికి వచ్చిన వారితోనూ, శిష్యులతోనూ చాలా ఉల్లసంగా నవ్విస్తూ గడిపాడు. రాత్రి 9 గంటల సమయంలో ఆయన అలసిపోయినట్లుగా కనిపించాడు. చేతులలో సన్నగా వణుకు ప్రారంభమైంది.చిన్నగా అరిచి లేచి కూర్చున్నాడు. దీర్ఘంగా శ్వాస పీల్చి నెమ్మదిగా శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. ఆయన శిష్యులు తల్లితండ్రులను కోల్పోయిన అనాథలవలే దుఖించారు.
ఉపయుక్త గ్రంథసూచి
• శ్రీ వివేకానంద జీవిత చరిత్ర- శ్రీ చిరంతనానందస్వామి, 4 వముద్రణ, 1978,రామకృష్ణ మఠం, మద్రాసు, ముద్రణ నవభారత్ ప్రింటర్స్ & ట్రేడర్స్, మద్రాసు-600086
• శ్రీ వివేకానంద జీవిత చరిత్ర- శ్రీ చిరంతనానందస్వామి, 4 వముద్రణ, 1978,రామకృష్ణ మఠం, మద్రాసు, ముద్రణ నవభారత్ ప్రింటర్స్ & ట్రేడర్స్, మద్రాసు-600086 (సంగ్రహప్రచురణము కళాశాల విద్యార్ధులకై) పుస్తక ముఖచిత్రం

స్త్రీలు చేయ తగిన చేయ కూడని పనులు

స్త్రీలు ఎప్పుడు గుమ్మడి కాయను కొట్టరాదు ఎందుకంటె గర్భ సంచి కిందికి జారిపోయే అవకాశములు ఎక్కువ.
గర్భిణి స్త్రీలు శూర టెంకాయ, తమిళంలో చిదరు కాయ్ అంటారు దానిని కొట్ట కూడదు ఎందుకంటె అదురుడుకు గర్భము జారిపోవచ్చు, అదే మాదిరి శూర టెంకాయ కొట్టే స్తలములో కూడా ఉండకూడదు.
గ్రహణ సమయమందు భూమ్యాకర్షణ శక్తి మార్పు చెందుతుంది. దాని పరిమాణము మనపై చాల ఉంటుంది ముఖ్యముగా మన కడుపులో ఆహార పదార్థములు జీర్ణమవ్వడానికి కావలసిన ఆమ్లములు ఉండవు అందువల్ల జీర్ణము కాదు ఈ కారణముగానే గ్రహణ సమయమునకు ముందుగ మూడు గంటలకు పూర్వమే మన కడుపులో ఏమి ఉండకూడదు అంటారు.
మీ భర్త పిల్లలు మంగళ వారము నాడు క్షవరము గడ్డము గీసుకోవడము చేయనీయ వద్దు. ఈ ప్రక్రియ దరిద్రాన్ని సంభవింప చేయును.
మంచి పనులను శుక్ల పక్షము నందే అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయ వలెను.
మీరు మీ పిల్లలు దిండు పైన కూర్చో వద్దు ఐతే ఈ కాలములో అందరూ దీనిని తప్పక చేస్తుంటారు.
స్త్రీలు రాత్రి సమయమున గాజులు కమ్మలు తీయరాదు.
దుఃఖము విచారణ చేయ వచ్చిన వారిని ఆహ్వానించ కూడదు. అలాగే వారు పోయేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్ప కూడదు. ఈ మధ్య కాలంలో దుఃఖము విచారించ వచ్చిన వారిని రండి రండి అంటూ సాదరముగా ఆహ్వానించి స్థలము ఇచ్చి కూర్చోపెట్టి కాపీలు ఇచ్చి చాల అతిథి మర్యాదలు చేస్తారు .అపరోక్షముగా మనము అశుభములను కోరుకోవడానికి ఇది నాంది అవుతుంది.
కొత్త వస్త్రములను ధరించే ముందు దానికి కొంత పసుపు ఏదైనా ఒక మూల రాయాలి, పసుపు క్రిమి నాసిని.
ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోడదు అయితే ఈ మధ్య కాలములో ఈ పని చాల చోట్లలో సహజమై పోయింది.
నలుపు రంగు వస్తువులు బట్టలు ధరించ కండి ఈ మధ్య కాలంలో సువాసిని స్త్రీలుకుడా నలుపు రంగు వస్తువులు ధరించడం ఎక్కువై పోయింది.
ఉప్పు మిరప చింతపండు వీటిని ఎవరికి ఇచ్చిన చేతిలో ఇవ్వకూడదు ,కింద పెట్టండి వాళ్ళే తీసుకొంటారు .ఈ మద్య కాలంలో ఉప్పు చేతితో వడ్డించడం చాల చోట్లలో గమనిస్తాము.
ప్రతి రోజు భోజనమునకు ముందు కాకికి అన్నము పెట్టండి, ఇది పితృ దేవతలకు ప్రీతి .కాకికి మనము భోజనము చేయుటకు ముందు కుక్కకు మనము తిన్న తర్వాత పెట్టాలి. అయితే కుక్కలను ఎల్లప్ప్పుడు కన్న సంతానానికంటే ఎక్కువగా లాలిస్తూ దాని నోటికి ఆకులోంచి అందిస్తూ భోజనము చేయడము ఎక్కువై పోయింది.
టెంకాయ చిప్ప తామ్బులము ఇచ్చేటప్పుడు మూడు కండ్లు వుండే భాగము మీరు ఉంచుకొని మిగత భాగము ఇతరులకు ఇవ్వవలెను.
స్త్రీలు ఎప్పుడు జుట్టు విరపోసుకొని ఉండకూడదు .ఇది జ్యేష్టాదేవి స్వరూపము ఇంటిలో మంగళము జరుగుటకు విఘ్న కారణమవుతుంది. ఈ చర్య ప్రతి గృహములో ఇప్పుడు ఒక తప్పని సరి అయిపొయింది.
శుక్రవారమునాడు గాని ,జీతము రాగానే గాని ఆ డబ్బుతో మొట్ట మొదటి సారి ఉప్పు కొనండి ఈ చర్య పై పై డబ్బులు చేరటానికి అవకాశము ఎక్కువ.
కాలిపైకాలు వేసుకొని కుర్చోవడము, కాళ్లాడిస్తూ కూచోవడం, ఒంటి కాలితో నిలవడం, స్తిరముగా నిలవక ఉగుతుండడం లాంటి పనులు చేయకూడదు ఇందువల్ల ఒకటి దారిద్ర హేతువు మరియొకటి ఆ ప్రదేశములు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశములు ఎక్కువ.
ఎల్లప్పుడు ఇచ్చి పుచ్చుకోవడానికి కుడి చేతిని అలవాటు చేయాలి ,ఎడమ చేతిని ఉపయోగించ కూడదు.
సుమంగళి స్త్రీలు రాత్రి వేళలందు అలిగి ,ఆహారము తినకుండా నిద్రించ కూడదు.
స్త్రీలు బహిష్టు సమయమందు పూలు తలలో పెట్టుకోరాదు.
పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పు రాదు ,రేపు తీసుకుంటాను అని అనవలెను.
ఎప్పుడు మన నోటినుండి పీడ ,దరిద్రం, శని పీనుగా కష్టము, అనే పదములను ఎప్పుడు ఉపయోగించ కూడదు.
ఇంటిలో దుమ్ము ధూళి, సాలెగూడు కట్టడం లాంటివి దారిద్ర హేతువులు, పదిరోజులకు ఒకమారు మంగళ శుక్ర వారములు కాకుండా దులిపి శుభ్రము చేయవలెను.
శ్రాద్ధ దినమందు ఇంటి ముందు ముగ్గు శ్రాద్ధము అయ్యేవరకు వేయకూడదు, శ్రాద్ధానంతరము ముగ్గు వేసి తర్వాత ఇంటిలోని వారు భోజనము చేయవలెను.
దిండులు, ఓర దుప్పట్లు అప్పుడప్పుడు ఉతుకుతూ వాడాలి .మనకు తెలియని సుక్ష్మ క్రిములు చాల ఉంటాయి దాని వాల్ల మనకు హాని జరుగును.

సద్గురువు అంటే ఎవరు ?

మాయాజగత్తులో ప్రవేశించి అజ్ఞానంతో ప్రాకృతదారపుత్ర గ్రహదులయందు భవపాశంచే కట్టబడిన మానవుణ్ణి బంధవిమోచనమును చేసి హృదయలోతుల్లో నిక్షిప్తమైన జ్ఞాననిధిని వెలికి తీసుకురాగలవారు, భౌతికమైన స్వరూపాలకు అతీతమైన దైవానుభవం కల్గించేవారు, దేవాలయమనే దేహంలో దైవత్వాన్ని దర్శింపజేసేవారు, ఆత్మను పరమాత్మలో చేర్చగలవారే నిజమైన సద్గురువులు. 'తమసోమా జ్యోతిర్గమయా' అజ్ఞానమనే చీకట్లును పోగొట్టి జ్ఞానమనే వెలుగులను నింపే సమర్ధుడే సద్గురువు.
'ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే' ఈశ్వరుడు, సద్గురువు, ఆత్మ ఒక్కటే. మూర్తి భేదభావమే తప్ప తేడాలేదు.
స్వస్వరూపమును తెలియజేప్పేదే నిజమైన విద్య. ఇదే శాశ్వతానంద విద్య, ఆధ్యాత్మిక విద్య. ఇంతటి ఆధ్యాత్మికవిద్య గురుముఖతా రావాలి.
వేదన్తానామనేకత్వాత్ సంశయానాం బహుత్వతః /
వేదాస్యాప్యతిసూక్ష్మత్వాత్ న జానాతి గురుం వినా //
వేతాంతమార్గములు అనేకములగుటచేతను, సంశయములు అనేకములగుటచేతను, తెలియదగిన బ్రహ్మము మిక్కిలి సూక్ష్మమగుటచేతను గురుదేవుడు వినా ఇది గోచారం కాజాలదు.
భక్తుల కోరిక వలన మానుషస్వరూపంలో(స్వభక్తేచ్చయా మానుషం దర్శయంతం) మానవులను తరింపజేయుటకోసం ఆ సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరుడు ప్రియభక్తునిపై కృప కలిగి, భక్తుని పరిపక్వస్థితిని బట్టి, వాని పురోభివృద్ధి కొఱకు తన దివ్యత్వాన్ని గురురూపంలో వ్యక్తపరుస్తాడు.
మానవులు సృష్టిలో భగవంతున్ని స్వయంగా తమంతట తాముగా చేరుకోలేరు. స్వప్రయత్నంతో భగవంతుడిని చేరుకోవడం కష్టం కాబట్టి గురువు ఆవశ్యకత తప్పనిసరి.
గురువు నిశ్చయంగా అవసరం. గురువుతప్ప మరెవ్వరూ, బుద్ధి ఇంద్రియాలకు సంబంధించిన విషయకీకారణ్యం నుంచి మానవుణ్ణి బైటికి తీసి రక్షించలేరని ఉపనిషత్ పేర్కొంటుంది. సాధరణంగా సాధకులు తమ మనస్సులతో ఈశ్వరచింతన చేయుదురు. మనస్సు త్రిగుణాత్మకం. త్రిగుణములకు, మనోబుద్ధులకు అతీతమైన బ్రహ్మమును ఆత్మానుభవంగల ఆచార్యుని వలననే దైవతత్వం తెలుసుకోగలరు. 'తద్విజ్ఞానార్ధం స గురుమేవాభి గచ్చేత్సమిత్పాణి: శ్రోత్రియం బ్రహ్మనిష్టం' (ముండకోపనిషత్)
భవబంధాలచే ఆత్మవిస్మృతి కలిగియున్న జీవునకు ఆత్మావభోధమును గలుగజేయువాడే గురుదేవుడు. నిరంతర నిశ్చల ఆత్మనిష్టాగరిష్టులై, అందరి యెడల, అన్నింటి యెడల, సర్వకాల సర్వావస్థల్లో, సర్వచోట్ల సర్వులయందు, స్థిరచిత్తులై సమదృష్టి కలిగియుండినవారే సద్గురువులని శ్రీరమణులు అంటారు

నాగా సాధువులు

ఎవరి అపార్థాలతో వారికి పని లేదు..
అలంకారాలు అక్కర లేదు..
జుట్టు జడలు కట్టినా పట్టింపు లేదు.
ఆహార్యం ప్రధానం కాదు..
నగ్నత్వమే వారి వేషం..
ఆహారం ముఖ్యం కాదు..
దొరికిందే తింటే చాలు..
రుచితో పనిలేదు..
శరీరంపై మోహం లేదు..
మృత్యువంటే భయం లేదు..
హిమాలయ సానువుల్లో నివాసం...
పుష్కరం వస్తేనే జనంలోకి ప్రవాహం..
అడుక్కునే వాళ్లంటూ తిట్టేవాళ్లున్నారు..
అవధూతలని అర్చించేవారూ ఉన్నారు..
ఎవరితోనూ వారికి అవసరం లేదు..
వారు ఎవరికీ అర్థం కారు..
ఎవరి అపార్థాలతోనూ వారికి పని లేదు.
ఏమైనా అనుకోండి.. పిచ్చివాళ్లని నిందించుకోండి... వెర్రిబాగుల వాళ్లని వెక్కిరించండి... వంటిమీద నూలుపోగైనా లేకుండా తిరుగుతున్నారని ఆక్షేపించండి... శరీరం నిండా విభూతి రాసుకున్నారని నొసలు నొక్కుకొండి.. హుక్కా పీలుస్తున్నారంటూ ఆశ్చర్యపోండి... వారికి మీ ఊసులు అక్కర లేదు.. వారికి మీ అభిప్రాయాలతో పని లేదు.. వారికి లోకంతో పని లేదు.. లోకం తమ గురించి ఎన్ని అనుకున్నా వారికి అవసరం లేదు.. ఎవరు వారు..? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ ఉంటారు? ఏం చేస్తారు?
ఇంటి నుంచి బయటకు కాలు మోపితే, అంతా మనల్నే చూడాలని ఎంత తాపత్రయ పడతాం? ఆడామగా తేడా లేకుండా అద్దం ముందు నిలబడి గంటల తరబడి తయారవటం తెలిసిందే.. ఒంటి అలంకారం కోసం వాడే కాస్మోటిక్స్‌ అన్నీ ఇన్నీ కావు.. పర్‌ఫ్యూమ్స్‌ గురించయితే చెప్పనే అక్కర్లేదు.. వంద గ్రాముల పర్‌ఫ్యూమ్‌ను వంద పదులైనా సరే కొనటానికి వెనుకాడం... కానీ, ఇవన్నీ అక్కరలేని జాతి ఒకటి ఉంది.. మన దేశంలోనే ఉంది..మన మధ్యలోనే ఉంది.. ఆ జాతికి వీటితో పనే లేదు.. ఎవరితోనూ ఆ జాతికి సంబంధమూ లేదు..
2
ఎందుకిలా ఉంటారు? మామూలుగా ప్రపంచం అంతా తమను చూస్తున్నదన్న జిజ్ఞాస వీరికెందుకు ఉండదు? ఎందుకు పట్టదు..? మనకు తెలిసిన సిగ్గు, అభిమానం, మానావమానాలు వీరికి ఉండవా? కనీసం కౌపీనం కూడా లేకుండా వీళ్లిలా ఉండటానికి కారణం ఏమిటి?
సాధారణంగా మనం నిత్యం చూసే సాధు సంతులకు కాషాయం, కమండలం, దండం అస్తిత్వాలు.. మిగతా రెంటి మాటెలా ఉన్నా, కాషాయం సన్యాసానికి ఒక విధంగా యూనిఫామ్‌ లాంటిది.. ఎందుకంటే కాషాయం త్యాగానికి చిహ్నం.. సన్యాసులూ అన్నింటినీ త్యాగం చేసి వెళ్తారు కాబట్టి, సాధారణంగా వారు కాషాయాన్నే ధరిస్తారు..
ఇది కామన్‌ ఎలిమెంట్‌.. ఇందులో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు..కానీ ఎవరికీ అంతుపట్టని సాధువుల సమాజం ఒకటుంది.. అది అత్యంత రహస్య సమాజం.. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఎక్కడ ఉన్నాయో తెలియని అఖారాల్లో ఉండే సాధు జాతి.. దాని పేరు నాగా.. ఆ సన్యాసులే నాగా సాధువులు.
మిగతా సొసైటీతో వీరికి ఎలాంటి సంబంధం లేదు.. తమ లోకంలోనే వారు జీవిస్తుంటారు.. అన్నింటినీ వదిలిపెట్టేసిన వారు.. చివరకు శరీరంపై బట్టల్నీ విడిచిపెట్టిన వాళ్లు.. నాగా సాధువులు
వీరు జనావాసాల్లోకి పుష్కరాల సమయంలోనే వస్తారు.. ఒకే ఒక్క ఊరేగింపుగా వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించి పుష్కరాలు పూర్తికాగానే తిరిగి వారి ఆవాసాలకు వెళ్లిపోతారు..
అంతే కాదు.. జనం మధ్యలోకి వచ్చినప్పుడు వీరి చేష్టలు విచిత్రంగా ఉంటాయి.. విడ్డూరంగా కనిపిస్తాయి..
త్రిశూలాలు ధరిస్తారు.. కత్తులు పట్టుకుంటారు.. వాటితో వీరంగం వేస్తారు.. వీరనాట్యాలు చేస్తారు.. కర్రసాము చేస్తారు..
హుక్కా, చిలుమ్‌ వంటి వాటి ద్వారా పొగాకు, నార్కొటిక్స్‌ వంటివి పీలుస్తారు..
ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని సాధువులని పిలవటం ఏమిటి? అదే మిస్టరీ... అతి కఠినమైన యోగ సాధనకు పరాకాష్ట..
3
సభ్య సమాజానికి ఏవైతే నిషేధాలో...అవన్నీ వారు చేస్తారు.. బట్టలు ధరించకపోవటమే ఒక సమస్య అనుకుంటే, హుక్కా, చిలుమ్‌ పీల్చటం, ఏది పడితే అది తినేయటం.. ఒంటిని కనీసం శుభ్రంగా కూడా ఉంచుకోకపోవటం.. ఇవన్నీ నిజంగా సాధు లక్షణాలేనా? అన్నీ నెగెటివ్‌ షేడ్సే.. ఏమిటీ రహస్యం? వాట్‌ ఈజ్‌ ది సీక్రెట్‌ ఆఫ్‌ నాగాస్‌..
పవిత్ర గంగానదీ తీరంలో పుష్కరాలు వచ్చినప్పుడు, మహా కుంభమేళా జరుగుతుంది.. ఆ కుంభమేళా సమయంలో ప్రధాన ఆకర్షణగా నిలిచేది నాగా సాధువులే. వేల సంఖ్యలో దిగంబర సాధువులు విభూతి అలంకారాలతో శివ పంచాక్షరి నినదిస్తూ రావడం ఒక అపురూప సన్నివేశం..
నాగా సాధువులు పుష్కరాల సమయంలోనే జనంలోకి వస్తారు.. జనానికి కనిపిస్తారు.. పుష్కరాలకు ముందు కానీ, తరువాత కానీ, వారు బయటి ప్రపంచానికి కనిపించరు..
వారి చర్యలు విచిత్రం.. వారి చేష్టలు విచిత్రం. అందుకే వారిది అత్యంత అరుదైన సమాజం.. హిమాలయాలు.. దేవతల ఆవాసాలంటారు.. నాగా సాధువులు ఉండేది కూడా ఈ హిమాలయాల పర్వత శ్రేణుల్లోనే.. కాకపోతే బయటి ప్రపంచానికి అందుబాటులో లేని మారుమూల పర్వత ప్రాంతాలను ఏరి కోరి ఎంచుకుని మరీ తమ మెడిటేషన్‌ను కొనసాగిస్తారు.
వారికి ఎండ లేదు.. వాన లేదు.. చలి లేదు.. విభూతే వారి శరీరాన్ని అన్నింటి నుంచీ కాపాడుతుంది. చిలుమ్‌, హుక్కా వంటివి శరీరంలో వేడిని కలిగిస్తాయి.. మనసుకు ఏకాగ్రతను కలిగిస్తాయి..
వారు శివుడిని, అగ్నిని ఆరాధిస్తారు.. మిగతా దేవుళ్లందరినీ పూజిస్తే వాళ్లు స్పందించే సరికి చాలా సమయం పడుతుందిట.. అగ్నిని ఆరాధిస్తే.. ఆయనకు ఆహుతులను అర్పిస్తే వెంటనే విభూతి రూపంలో ఫలితాన్ని అందిస్తాడట.. ఆ విభూతే నాగా సాధువులకు సర్వస్వం అవుతోంది..
4
విభూతి అంటే ఐశ్వర్యం.. నాగా సాధువులకు ఈ విభూతే ఐశ్వర్యం.. సర్వ సంపదలూ ఈ విభూతే.. పరమేశ్వరుడే స్వయంగా ధరించిన విభూతే వారికి సర్వాలంకారం. చూసే మనబోటి వాళ్లకు విచిత్రంగా అనిపించవచ్చు. కానీ, వారికి అది అవసరం లేదు.. అత్యంత కఠినమైన యోగసాధన చేసి అన్నింటికీ అతీతమైన దశకు చేరుకున్న శివసైనికులు వీరు.
ఉజ్జయిని.. మహా కాళేశ్వరుడిగా శివుడు పూజలందుకునే పవిత్ర పుణ్యక్షేత్రం. జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఉజ్జయిని కూడ ఒకటి.. దేశంలోని మిగతా శైవ క్షేత్రాల కంటే ఉజ్జయినిలో ఒక విశిష్టమైన ఆచారం ఉంది.. ప్రతి రోజూ రాత్రి పూట ఉజ్జయిని స్మశాన వాటికలో అప్పటికప్పుడు తాజాగా మండిన చితిలో నుంచి భస్మరాశిని తీసుకువచ్చి మహాకాళేశ్వరుడికి అభిషేకం చేస్తారు.. భస్మరాశి విభూతిగా మారిపోతుంది... మన శరీరమే విభూతి అని చెప్పటానికి ప్రతీక ఈ అభిషేకం..
నాగా సాధువులు తమ శరీరానికి రాసుకునే విభూతి కూడా ఇదే. శరీరం ఎప్పటికైనా భస్మరాశిగానే మారాల్సి ఉంటుందనటాన్ని ఎక్స్‌ప్రెస్‌ చేయటమే దీని ఉద్దేశం.
సాధువుల్లో నాగాలను సృష్టించింది దత్తాత్రేయుడని చెప్తారు. ఎప్పుడు, ఎలా సృష్టించిందీ ఎవరికీ తెలియదు.. సనాతన ఆధ్యాత్మిక ధర్మాన్ని రక్షించేందుకు అదిశంకరాచార్య నాగా సాధువులందరినీ ఒకటి చేశారని అంటారు..
మనం ఉంటున్న ఈ మెటీరియలిస్టిక్‌ వరల్డ్‌ను వీరు కేర్‌ చేయరు. . ఆర్మీలో ఓ రెజిమెంట్‌లాగా నాగా సాధువులు ఉంటారు. వీళ్లు శివుడికి సైనికుల్లా వ్యవహరిస్తారు..ఎవరినీ దగ్గరకు రానివ్వరు.. అఘోరాల్లా అతి తీవ్రంగా లేకపోయినా, వీరి దారి వేరు.. చాలా ఆవేశపరులు.. వారి ఆగ్రహం ప్రదర్శించటానికి బెస్ట్‌ ఆప్షన్‌గా పరిగెడ్తారు.. ఇంకొందరు హింసాత్మకంగా కూడా మారతారు..
అఖారాలని పిలిచే వారి ఆశ్రమాల్లోకి కూడా ఎవరినీ రానివ్వరు.. ఎవరైనా చొచ్చుకుని పోతే అక్కడ మరింత విచిత్రమైన చర్యలు కనిపిస్తాయి. సామాన్యులకు అసాధారాణమైన యోగాసనాల్లో నాగా సాధువులు కనిపిస్తారు.. ఆశ్రమంలోకి వచ్చిన వారిపై ముందు ఆగ్రహించినా తరువాత అనుగ్రహిస్తారు.. సామాన్యంగా కనిపించే సన్యాసులకు, వీరికి అదే తేడా... అందుకే వీరిని నాగాలన్నారు..
-5-
సాధువులుగా మారటం తేలికే.. సన్యాసం తీసుకోవటమే కష్టం. అన్ని సుఖాలను వదిలేసి ఆశ్రమ జీవితం గడపటం ఇంకా కష్టం. కానీ ఈ ఆశ్రమ జీవితాన్నీ వదిలేసి, శరీరాన్ని గాలికి వదిలేసి, నిద్ర, ఆహారాలను నిర్లక్ష్యానికి అప్పజెప్పేసి పూర్తిగా నాగాలుగా మారటం ఊహించినంత తేలిక కాదు.. చాలా, చాలా కష్టపడ్డ తరువాత కానీ, నాగాలుగా మారటం కుదరనే కుదరదు..
నాగా సాధువులు అంటే ప్రధానంగా దిగంబరులు.. ఇదెలా సాధ్యం? జీవితాంతం ఇలా ఉండటం ఎలా వీలవుతుంది? అదీ మంచు కొండల్లో.. గడ్డకట్టే చలిలో నూలుపోగైనా లేని ఒంటిని కేవలం విభూతి ఎలా రక్షిస్తుంది.. కాస్త మోతాదులో తీసుకునే మత్తు పదార్థాలు ఏమూలకు పనికి వస్తాయి? మరి వీళ్లెలా ఉండగలుగుతున్నారు?
నిజం.. ఇలా ఉండటం సామాన్యుడికైతే క్షణమైనా సాధ్యం కాదు.. నాగాలుగా మారేందుకు ఈ సాధువులు చాలా హార్డ్‌వర్క్‌ చేయాల్సి ఉంటుంది.
సర్వస్వం త్యాగం చేసి నాగాలుగా మారాలని అనుకున్న వారు ముందుగా ఇల్లూ వాకిలీ వదిలేసి సాధారణ సన్యాసం స్వీకరించాలి.
ఆరు సంవత్సరాల పాటు కఠినమైన బ్రహ్మచర్యాన్ని అవలంబించాలి.
అన్ని రుచులను వదిలేయాలి.
అన్ని వాసనలకూ దూరంగా ఉండాలి.
అన్ని సుఖాలను త్యాగం చేయాలి.
అన్ని మోహాలను వదిలిపెట్టాలి.
చివరకు వస్త్రాల్నీ వదిలేయాలి.
ఇవన్నీ అనుకున్నంత ఈజీ ఏమీ కాదు.. ప్రతి విషయంపైనా ఏకాగ్రత సాధించటానికి చాలానే కష్టపడతారు.. ఆ తరువాత అయిదుగురు గురువుల దగ్గర తమను తాము అన్నింటికీ అతీతంగా ఉండగలుగుతున్నట్లు నిరూపించుకోవలసి ఉంటుంది. ఆరు సంవత్సరాల బ్రహ్మచర్యంలో సాధువులు కౌపీనం అంటే లంగోటీ ధరించి ఉంటారు.. ఒక్కో దానిపై మోహం తీరిపోయాక చివరగా ఆ కౌపీనాన్ని సైతం విడిచిపెడతారు.. అంటే ఈ మెటీరియలిస్టిక్‌ వరల్డ్‌లోని సంసారం నుంచి తనను తాను నాగా సాధువు వేరు చేసుకున్నట్లని అర్థం.
నేను అనే ఈగోను విడిచేయడమే నాగా సాధువుల్లోని ప్రత్యేకత. బయటి శరీరం కంటే, లోపల ఆత్మ అన్నది ఒకటుందని వీరు గాఢంగా నమ్ముతారు.. ఆ ఆత్మే ప్రధానంగా జీవిస్తారు.. మిగతా శరీరంతో వారికి పని లేదు. కాబట్టి దాని గురించి పట్టించుకోరు.. మిగతా ప్రపంచం కంటే చాలా పరిశుభ్రమైన జీవనం తమదని నాగాలంటారు.
నాగా సాధువులు ఎక్కువగా ప్రయాణాలు చేయరు.. ఎక్కడికీ వెళ్లరు.. కేవలం కుంభమేళాలు జరిగినప్పుడే ఆ నదీతీరానికి వాళ్లు వస్తారు.. పవిత్ర స్నానాలు చేసి వెళ్లిపోతారు.. ఈ లోకంలో ఈశ్వరుడికి అచ్చమైన ప్రతీకలు నాగాలు..

అరుంధతీవ్రతం


అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రక్రుతి లో ఉండే భీబస్తవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన, లన నుండి బయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టానో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టాను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు .దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము -అరుంధతీవ్రతం- గురించి తెలుసుకొని ఆLinkనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకిందాం .--
చైత్ర శుద్ధవిదియనాడు ఉమాశివాగ్నిపూజ చేయాలని స్మృతి కౌస్తుభం అనే వ్రత గ్రంథం పేర్కొంటోంది. ఈ రోజున ఉమాదేవి - శివుడు - అగ్నిదేవులను దమనము అనే సుగంధభరిత పత్రాలలో పూజలు చేసినవా రికి వైధవ్యము సంప్రాప్తిం చదని, సంతానలేమితో బాధపడేవారికి కుమారస్వామివంటి కుమారుడు కలుగుతాడని కౌస్తుభం చెబుతోంది. కానీ, స్కందపురాణంలో చైత్ర శుద్ధ విదియనాడు అరుంధతీ వ్రతం చేయాలని ఉంది. చతుర్వర్గ చింతామణి ఈ పర్వదినాన నేత్ర ద్వితీయ వ్రతము, ప్రకృతి పురుష ద్వితీయా వ్రతాలను ఆచరించాలని చెబుతోంది. అయి తే, ఈ పర్వదినాన ఉమాశివాగ్ని పూజయే ప్రధానంగా ఆచరింపబడుతున్నప్పటికీ, అ రుంధతీ వ్రతం గురించి కూడ మన తెలుసు కోవల్సి ఉంది. సుమారు రెండు వేల సంవత్స రాలకిపైగా ఆచరింపబడుతూ వస్తున్న ఈ వ్రతం, వ్రత గ్రంథాల నుంచి హఠాత్తుగా అదృశ్యమైపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అర్వాచీనమైన అనేక ఇతిహాసాల్లో ఈ వ్రత ప్రాముఖ్యత విపులీకరించబడింది. జన్మజన్మ ల పర్యంతం వైధవ్యాన్ని నివారించమని కోరడమే ఈ వ్రతంలోని ప్రధాన ఉద్దేశం.
అరుంధతీ వ్రతం ఎలా చేయాలి..?
చైత్ర శుద్ధ విదియనాడు అభ్యంగస్నానమా చరించి అరుంధతీ, ధ్రువ, వశిష్టమూర్తులను పసుపుతో దిద్దుకోవాలి. ఈ మూడు ముద్దలకు సాధారణ పూజానంతరం చలిమిడి, పరమాన్నాన్ని నైవేద్యం పెట్టి, ఏడుగురు ముత్తైదువులకు ఒక్కొక్కరికి ఏడు తమలపాకులు, ఐదు అరటిపళ్ళు, రెండు వక్కలు, ఎనిమిది గాజులు, ఒక రవికె గుడ్డను వాయనంగా సమర్పించి. ఆశీర్వాదాన్ని పొందాలి. అనంతరం
ఈ క్రింది వ్రత కథను వారిచేత చదివించు కుని, శ్రద్ధగా వినాలి.
వ్రత కథ...
-పూర్వం కాశీనగరంలో నివసిస్తున్న సర్వశాస్త్ర బ్రహ్మ అనే విప్రుని కుమార్తె విధి వశాత్తూ బాల్యంలోనే వైధవ్యాన్ని పొందింది. భర్తను కోల్పోయిన ఆమె గంగ ఒడ్డున తపస్సు చేసి, పార్వతీ పరమేశ్వరుల కృపకు పాత్రురాలై, మరుజన్మలో తనకు వైధవ్యం ప్రాప్తించకూడదని ఆది దంపతుల చేత వాగ్దానం చేయించుకుని తపస్సును నిలిపింది. అనంతరం ఆదిదంపతులిద్దరూ కైలాసం వెళుతున్న తరుణంలో, పార్వతి తన నాథుని నిలువరించి, ఆమెకు బాల్యంలోనే వైధవ్యం కలగడానికి గల కారణాన్ని వివరించమని కోరింది. పార్వతి కోరికను కాదనలేని పరమశివుడు ఆ బాలవితంతువు కథను ఇలా వివరించాడు. ఆ బాలిక పేరు సుబల. సర్వశాస్త్ర బ్రహ్మ కుమార్తె అయిన సుబలను గుణనిధి అనే విప్రునికిచ్చి వివాహం జరిపించారు. విధి నిర్వహణ కోసం గుణనిధి దేశాంతరంవెళ్ళి, అన్యకారణాల వల్ల వేరొక స్ర్తీ వ్యామోహంలో పడి, ఆమెను వివాహం చేసుకున్న కొన్ని నెలల లోపే చనిపోయాడు.
స్వదేశంలో భార్యను వదిలి నందుకు, మొదటి భార్య జీవించి ఉండగా రెండవ స్ర్తీని వివాహం చేసుకున్నందుకు, అతనికి అకాల మృత్యువు సంభవించింది. గుణనిధి అకాలమృత్యువు గురించి తెలియని సుబల, భర్త చేసిన తప్పుకు వైధవ్యాన్ని శిక్షగా పొందింది. కాలక్రమంలో ఆమెకు భర్త చేసిన అపరాధం తెలిసి, మరుజన్మలో తనకు తిరిగి వైధవ్యం కలుగరాదని మనలను కోరుతూ తపమాచరించి సఫలీ కృతమైందని శివుడు పార్వతికి సుబల అకాల వైధవ్య చరితను వివరించాడు.
అరుంధతి విశిష్టత...
చంద్రభాగా నదీ తీరంలో మేధాతి అనే మహర్షి పుష్కరకాలం పాటు (12 సంవత్సరాలు) జ్యోతిష్టోమం అనే దీర్ఘయజ్ఞాన్ని నిర్వహించాడు. ఆ యజ్ఞవాటిక నుంచి వికృతి - అరంజ్యోతి, అరుంధతి అంటూ బహునామములుగల ఒక స్ర్తీ శిశువు జన్మించింది (కానీ, పురాణచంద్రిక అనే గ్రంథంలో ఈమె కర్దముని కుమార్తెగా చెప్పబడింది). అరుంధతి అనే పదానికి ఏ కారణం చేతనైనా ధర్మాన్ని అతిక్రమించ
నిదని అర్థం. ఉపనయన సమయంలో వటులకు గాయత్రీదేవి ఎటువంటిదో, వివాహసమయంలో వధువులకు అరుంధతీ దర్శనం అటువంటిది. వివాహంనాటి రాతలలో ఔపోసన అనంతరం వధువుకు ప్రత్యేకించి, అరుంధతీ నక్షత్రాన్ని, ఆమె పాతివ్రత్య నిష్టకు సంకేతంగా చూపిస్తుంటారు.

మార్తాండ సూర్య దేవాలయం


కాశ్మీర్ లో ఒకప్పుడు అత్యంత సుందరం గా శోభిల్లిన మార్తాండ సూర్య దేవాలయం
ఆ ఆలయం యొక్క విశిష్టతను ఒక్కసారి చదవండి.
ఇక్కడున్న ఫోటోలు :
( 1 ) మార్తాండ ఆలయం కూలగొట్టబడక ముందు ఎలా ఉండేది అన్న ఊహా చిత్రం .
( 2 )1868 లో జాన్ బుర్కే అనే బ్రిటీషర్ తీసిన ఫోటో
( 3 ) ప్రస్తుతం మార్తాండ సూర్య దేవాలయం యొక్క ఫోటో
కాశ్మీర్ లోని మార్తాండ సూర్య దేవాలయాన్ని రాజా బుల్నాట్ అనే రాజు నిర్మించారు. ఆకాలంలో ఆలయం ఎంతో శోభాయమానంగా విరాజిల్లింది.
ఆ విధంగా ఎంతో ప్రశస్తి చెందిన ఆ ఆలయాన్ని సికిందర్ అనే రాజు తన సైనికుల చేత ధ్వంసం చేయించాడు. దాదాపుగా 13 నెలల పాటు సైనికులంతా కలిసి ఎంతో కష్టపడితే, డెబ్బై శాతం ఆలయాన్ని మాత్రమే కూలగొట్టగలిగారు.
అంటే.......ఆ ఆలయాన్ని ఎంత పటిష్టంగా నిర్మించారో మనకు అర్థమవుతోంది. చివరికి.... ఎలాగైనా ఆలయాన్ని పూర్తి నాశనం చేయాలని , మిగిలిన భాగానికి భారీగా నిప్పు పెట్టారు.
అలా......ఆలయాన్ని ధ్వంసం చేసే క్రమంలో
అక్కడి సైనికులకు భూగర్భంలో ఒక రాగి ఫలకం దొరికింది.
ఆ రాగి ఫలకంలో “ రాజా బుల్నట్ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ జీవిత కాలం రాజు తెలుసుకోగోరి , ఆస్థాన జ్యోతిష్కులను అడుగగా.........వారు ఈ ఆలయం నిర్మించిన 1100 సంవత్సరాల తర్వాత సికిందర్ అనే పేరు గల రాజు చేతిలో ఇది ధ్వంసం అవుతుంది “ అని రాసి ఉంది.
దీనిని చదివించుకున్న సికిందర్ ఈ ఆలయం ధ్వంసం విషయాన్ని అంత కచ్చితంగా చెప్పిన అప్పటి జ్యోతిష్యుల పరిజ్ఞానానికి , నైపుణ్యానికి ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాడు.
ఈ రాగి ఫలకం విషయం తనకు ముందే తెలిసి ఉంటే , ఈ ఒక్క ఆలయాన్ని కూలగొట్టకుండా ఉండి , భారతీయుల యొక్క ఈ శాస్త్రం తప్పని నిరూపించే వాడిని అని సికిందర్ తన సైనికులతో వాపోయాడని చరిత్ర కారులు అంటారు.



గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతున్నవి

"గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతున్నవి" అని, కోపర్నికస్ 1453వ సంవత్సరంలో పేర్కొని, వివాదం రేకెత్తించాడు. ఈ సిద్ధాంతం బైబిలుకి వ్యతిరేకమని, చర్చి అతనిని వెలివేసింది. తరువాత 1632లో ఈ సిద్ధాంతాలను బలపరచిన గెలీలియో, చర్చి దృష్టిలో పాతకుడైనాడు. భూమి గుండ్రంగా ఉన్నదని, కోపర్నికస్ గెలీలియో, భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని న్యూటన్, కనుగొన్నట్లు మనం చదువుకున్నాం.
ఈ విషయాల గురించి మన వేదాల్లో ఉన్నది ఏమిటో చూద్దాం
1) వేద విజ్ఞానం, సూర్యుడే జగత్తుని పట్టి, అన్ని గ్రహాలను నడిపించుచున్నాడు అని ఘోషించుచున్నది.(కృష్ణ యజుర్వేదం – 3.4.11.16
2) గ్రహాలన్నీ అండాకార కక్ష్యలలో నిరంతరం పరిభ్రమించుచున్నవి.(ఋగ్వేదం – 1.164 – 1)
3) భూమికి ఉపగ్రహమైన చంద్రుడు, తన మాతృగ్రహం భూమి చుట్టూ తిరుగుచున్నాడు. అలాగే భూమి కూడా తన పితృగ్రహం ఐన స్వయంప్రకాశకమైన సూర్యుని చుట్టూ తిరుగుచున్నది అని వివరించారు.(ఋగ్వేదం - 10.189.1)
4) సూర్యుని చుట్టూ భూమి తిరుగుచున్నది. అందు వల్లనే సూర్యుడు మనకు తూర్పున ఉదయించుచూ పడమర వైపు అస్తమించినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. నిజానికి సూర్యుడు ఉదయించడు, అస్తమించడు.(ఐతరేయ బ్రాహ్మణం - 14.6)
5) ఇక "ఆర్యభట్టు" భూమి సూర్యుని చుట్టూ తిరిగే విధానాన్ని, "లఘు గురు న్యాయం"తో చక్కగా వివరించాడు. అక్కడ లఘువు అంటే తేలిక, చిన్న అని, గురువు అంటే ఘనమైన, ఆచార్యుడు, అని అర్థం. శాస్త్రవిషయాలలో నిపుణుడైన గురువు చుట్టూ శిష్యుడైన లఘువు తిరగడం లోకసహజం. ఆ విధంగా గురువు అయిన సూర్యుని చుట్టూ లఘువు అయిన భూమి తిరుగుతున్నదని అర్థం.
6) సూర్యుని నుంచీ వెలుగు పొందుతూ చంద్రుడు ప్రకాశిస్తున్నాడని "ఆర్యభట్టూ, వరాహమిహిరుడూ" ఖచ్చితంగా చెప్పారు. భూమి తనకక్ష్యలో సూర్యుని చుట్టూ తిరుగుతున్నదని, భూభ్రమణానికి 365రోజులు పడుతుందనీ ఖచ్చితంగా గణించారు.
7) ఋగ్వేదంలో "భూమియొక్క వృత్తపు అంచున ఉన్నవారు" అనే వాక్యముంది.(ఋగ్వేదం - 1.33.8)
8) బ్రహ్మాండం మధ్యలో భూగోళం ఆకాశంలో నిలిచి ఉన్నది అని సూర్యసిద్ధాంతంలో ఉంది(సూర్యసిద్ధాంతం-
12.32)
9) భూగోళః సర్వతో వృత్తః అని ఆర్యభట్టీయంలో ఈర్యభట్టు గోళపాద అధ్యాయంలో వివరించాడు.
10) ఆర్యభట్టీయం అనే గ్రంథం 13వ శతాబ్దంలో లాటిన్ భాషలోకి అనువాదం అయినది. ప్రపంచవ్యాప్తంగా తదనంతర ఖగోళ పరిశోధనల మీద ఈ గ్రంథం యొక్క ప్రభావం పూర్తిగా ఉండి ఉంటుంది.
11) తన కూతురైన లీలావతి ప్రశ్నించినపుడు భాస్కరాచార్యుడు నీవు చూసేదంతా నిజం కాదు, భూమి చదరంగా లేదు, ఎందుకంటే నీవు ఒక పెద్ద వృత్తం గీసి అందులోని నాల్గవ భాగం చూస్తే అది మనకు సరళరేఖలా కనిపిస్తుంది. కానీ నిజానికి అది వృత్తమే. అలాగే భూమికూడా గుండ్రంగానే ఉన్నది అని వివరించాడు.
12) ఈనాటి జియోగ్రఫీని మనం భూగోళశాస్త్రంగా ఉచ్చరిస్తున్నాం. ఈ శాస్త్రానికి ఆర్యభట్టు భూగోళశాస్త్రం అనే పేరు పెట్టాడు. గోళం అంటే గుండ్రనిది కాదా, ఇది ప్రతి భారతీయునికీ యుగయుగాలుగా తెలుసు కదా, దీనిని మేమే కనుగొన్నాం అని ఇతరులు చెప్పడం ఏమిటి.

జుట్టు రాలడాన్ని నిరోధించే ఆయుర్వేద, యునానీ ఔషధాలు

పసుపు... సంప్రదాయకంగా వంటల్లో వాడుతున్న సుగంధద్రవ్యం. సహజసిద్ధ యాంటీ-బయాటిక్‌గా హల్దీకి పేరు. అదే పసుపు జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. పసుపుతో పాటు దేవదారు వృక్షం బెరడు, గ్రీన్‌ టీ కూడా వెంట్రుకలు రాలిపోవడాన్ని నిరోధిస్తాయి. అయితే.. అలాంటి సహజసిద్ధమైన వస్తువులతో.. బ్రిటన్‌కు చెందిన పేంజియా అనే ఔషధ సంస్థ జుట్టు రాలడాన్ని నిరోధించే ఫార్ములా రూపొందించి దానికి మేధో హక్కుల (పేటెంట్‌) కోసం దరఖాస్తు పెట్టుకుంది. కానీ, భారత్‌ మాత్రం ఆ ఆటలేవీ సాగనివ్వలేదు. ఆ సంస్థపై నెగ్గి పేటెంట్‌ దరఖాస్తును వాపస్‌ తీసుకుని తోకముడుచుకునేలా చే సింది. శాసీ్త్రయ, పారిశ్రామిక పరిశోధన మండలి (సీ ఎస్‌ఐఆర్‌) విభాగమైన సంప్రదాయ విజ్ఞాన డిజిటల్‌ లైబ్రరీ (టీకేడీఎల్‌).. భారత సంప్రదాయ వస్తువులను కాపాడడంలో కృషి చేసింది. భారత్‌లో పూర్వ కాలం నుంచి పసుపు, దేవదారు బెరడు, గ్రీన్‌ టీని జుట్టు రాలడాన్ని నిరోధించే ఆయుర్వేద, యునానీ ఔషధాలుగా వాడినట్లు ఆధారాలతో సహా రుజువు చేసింది. దీంతో జూన్‌ 29న ఆ సంస్థ తన పేటెంట్‌ దరఖాస్తును వెనక్కు తీసుకుంది. వాస్తవానికి 2011 ఫిబ్రవరిలో ఆ సంస్థ దరఖాస్తు చేసింది. అవి సంప్రదాయ ఆయుర్వేద ఔషధాలంటూ 2014 జనవరి 13న టీకీడీఎల్‌ ఆధారాలు సమర్పించడంతో ఆ సంస్థ వెనకడుగు వేసింది. అంతర్జాతీయ దిగ్గజం కాల్గేట్‌-పామోలివ్‌.. దంత సమస్యలకు మెరుగైన పరిష్కారమైన జాజికాయపై పేటెంట్‌కు దరఖాస్తు చేసుకున్నప్పుడూ.. టీకేడీఎల్‌ సమర్థంగా తిప్పికొట్టింది. అర్చనా శర్మ నేతృత్వంలోని బృందం.. దానిని ఆయుర్వేద ఔ షధంగా ఎన్నో ఏళ్లుగా వాడుతున్నట్లు నిరూపించడంతో చేసేదిలేక సంస్థ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది.

ఆర్యభట్టా

ఆర్యభట్టాయ నమః
భారత ప్రాచీన మహోన్నత ఖగోళ, గణిత శాస్త్రవేత్త ప్రప్రథమ శ్రేణి శాస్త్రీయ సనాతన మేధావి, ఆర్యభట్ట(క్రీస్తు శకం.476 కేరళ రాష్ట్రంలో జన్మించారు. ఆ మహనీయుని శిలావిగ్రహం మహరాష్ట్ర పుణేలో నెలకొల్పారు. భాస్కర -1 ఆయన శిష్యుడు.
1) ఆర్యభట్టు రాసిన మహోన్నత పరిశోధనా గ్రంథం ఆర్యభట్టీయం. గణిత ఖగోళ శాస్త్రాల సంగ్రహంగా నాలుగు పాదాల అధ్యాయాలలో అద్భుత పరిశోధనలను ఆవిష్కరించారు.
2) గీతికా పాద – కల్ప మన్వంతర యుగాలు. జగత్సృష్టిశాస్త్రం. మహాయుగం 4.32 మిలియన్ సంవత్సరాలు.
3) గణితాపాద – క్షేత్ర వ్యవహారం, కొలతల 60వ గణితం, రేఖాగణిత వృద్ధి. శంఖు – ఛాయాసమీకరణలు
4) కాలక్రియా పాద – కాలప్రమాణం, పేర్కొన్నరోజున గ్రహాల స్థితి నిర్ణయం, అధికమాసం(క్షయతిథులు, ఏడు రోజుల వారం పేర్లతో.
5) గోళపాద – క్షేత్ర, త్రికోణ, సంబంధిత దివ్య గోళ, భూగోళ స్వరూప అంశాలు.
6) “పై” అనుచితమని, నిర్వివేకమని ఆర్యభట్ట ఏనాడో ప్రవచించిన అంశం యూరప్ లో లాంబర్ట్ 1761లో నిర్ధారించాడు.
7) ఆర్యభట్టు తన ఆఖరి పరిశోధనా గ్రంథమైన ఆర్యసిద్ధాంతంలోని ఖగోళ గణాంకాలలో శంమయ యంత్రం, ఛాయాయంత్రం వంటి అనేక పరికరాలను అద్భుత రీతిలో వివరించారు.
8) సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందన్న హిలియో సెంట్రిక్ సిద్ధాంతాన్ని కోపర్నికస్ కంటే వేయి సంవత్సరాలకు ముందే ప్రకటించడం భారత ప్రాచీన విజ్ఞాన ప్రతిభకు నిదర్శనం.
9) గ్రహణాల శాస్త్రీయ సిద్ధాంతాన్ని మొట్టమొదట ప్రతిపాదించిన మేధావి ఆర్యభట్ట
10) భూగోళ పరిధి 24,835 మైళ్లుగా ఆర్యభట్ట తన అద్భుత గణాంక ప్రతిభతో ప్రకటించడం అపూర్వం.
11) భారతదేశపు ప్రప్రథమ ఉపగ్రహం పేరు ఆర్యభట్ట
12) జాతీయ స్థాయిలో విద్యార్థులకు గణితంలో పోటీలు ఆర్యభట్ట గౌరవస్మృతికి నివాళి.
13) ఖగోళ శాస్త్రవేత్తగా ఆర్యభట్ట భూమధ్యరేఖకు సంబంధించిన కేరళ కన్యాకుమారి నుండి 08N00 అక్షాంశం వద్ద అంతరిక్ష గ్రహపరిశీలనాధ్యయనం చేసినట్లు రుజువులున్నాయి.
14) ఖగోళ శాస్త్ర విద్యార్థులు ఆర్యభట్ట సిద్ధాంతాల మీద పరిశోధన చేస్తే, అనేక అద్భుతాలను సాధించవచ్చు.

ఏలినాటి శని-నవగ్రహ దోష నివారణకు ఏం చేయాలంటే..?

ఏలినాటి శని
జ్యోతిష్యం అంటే ఎంత నమ్మకం లేని వాళ్ళయినా ఏలినాటి శని గురించి భయపడతారు. కానీ ఏలినాటి శని అంటే భయపడాల్సిన అవసరమే లేదని ధైర్యం చెప్పారు జ్యోతిష్య నిపుణులు/
. ప్రతి మనిషి జీవితంలో ఏలినాటి శని ముఫ్ఫై ఏళ్ళకొకసారి తప్పక వస్తుంది. ప్రతిసారీ 7 -1/2 సంవత్సరాలు వుంటుంది. సగటున మనిషి జీవితంలో 19 ఏళ్ళు శని ప్రభావంతో గడుపుతారు. శనిని అస్సలు తిట్టకోవాల్సిన అవసరంలేదు. ఎందుకంటే శని ఆయు కారకుడు. శని మందుడు కనుక తలపెట్టిన పనులను ఆలస్యం చేస్తాడు కానీ అసలు కాకుండా చెయ్యడు. వివాహాలు, ప్రమోషన్లు, ఏ శుభ కార్యాలయినా కేవలం శని మూలంగా ఆగవు. అవి కావటం లేదంటే శనే కాకుండా జాతకంలో ఇంకా వేరే గ్రహ ప్రభావాలుకూడా వున్నట్టు.
శనికి శనివారంనాడు అరచేతి వెడల్పు నల్లబట్టలో నల్ల నువ్వులు మూటలాగా కట్టి నవగ్రహాలు వున్నచోటో, లేక ఎక్కడన్నా శనీశ్వరుడుకి దానితో దీపారాధన చేసి, శనివారంనాడు 19 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. జన్మ నక్షత్రం రోజున శివునికి అభషేకం చేయించినా మంచిది
ముఖ్యంగా ఏలినాటి శని మిమ్మల్ని పీడిస్తున్నట్లైతే..? శనివారం పూట నవగ్రహాలకు తొమ్మిది సార్లు ప్రదక్షణ చేసి, శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపమెలిగించడం ద్వారా కొన్ని సమస్యలు దరిచేరవని , ఇలా తొమ్మిది వారాలు చేస్తే ఏలినాటి శని ప్రభావంతో కలిగే దోషాలు, కష్టనష్టాలు దూరమవుతాయని పెద్దలు చెబుతున్నారు.
అలాగే ఏలినాటి శని దోష నివారణకు శని విగ్రహాన్ని ఇనుముతో చేయించి, దానిని ఓ మట్టి కుండలోగానీ, ఇనుప పాత్రలో గానీ ఉంచాలి. దానిపై నల్లని వస్త్రమును కప్పి నల్ల పుష్పములు నల్ల గంధము, నల్లని పత్రములతో పూజించి బ్రాహ్మణునికి గానీ, శూద్రునికి గానీ సువర్ణ సహితముగా దానమివ్వాలి. దానితో పాటు నువ్వులు, పులగము దానము చేసినచో ఏలినాటి శని కొంతమేరకైనా నివృత్తి అగునని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా నవగ్రహ దోష నివారణకు ఏం చేయాలంటే..? ఏ గ్రహ శాంతికైనా చేసే అర్చన, దాన, హోమ, జపాదులను చిత్తశుద్ధితో చేయడం మంచిది. దేవతామూర్తులకు, సద్భ్రాహ్మణులకు గౌరవపూర్వక నమస్కారాలు చేసినట్లైతే కొంతమేరకు దోషవృత్తి తగ్గవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
ఏలినాటి శని గ్రహ దోష శాంతి విదానం :- ౧ మయూరి నీఎలం ధరించుట 2 శని జపం ప్రతి రోజు జపించుట 3 శని కి తిలభిషేకం చేఇంచుట 4 శివ దేవునకు అభిషేకం ,ప్రతి సనివారం రోజు ఎనిమిది రూపాయలు లేదా ఎనిమిది సంక్య వచ్చే లాగా బ్రహంనుకి దానం చేయుట 5 శని వారం రోజు నవగ్రహాల ఆలయం లో లేదా శివాలయం లో ప్రసాదం పంచుట 6 ప్రతి రోజు నువుండలు కాకులకు పెట్టుట వలన 7 శని వారం రోజు రొట్టి పై నువుల నూనే వేసి కుక్కలకు పెట్టుట వలన 8 హనుమంతుని పూజ వలన 9 సుందరకాండ లేదా నల చరిత్ర చదువత వలన 10 కాలవలో కానీ నది లో కానీ బొగ్గులు నల్ల నువులు మేకు కలపటం వలన 11 శని ఎకదాస నామాలు చదువత వలన ( సనేస్వర ,కోన, పింగల , బబ్రు, కృష్ణ , రౌద్ర ,అంతక , యమ, సౌరి, మంద ,చాయపుత్ర ) ప్రతి రోజు చడువటం వలన 12 బియపు రవ్వ మరియు పంచదార కలిపి చిమలకు పెట్టుట వలన 13 ఆవుకు నల్ల చెక్క ప్రతి రోజు పెట్టుట వలన 14 ప్రతిహి శని వారం రాగి చెట్టుకు ప్రదషణం మరిఉ నల్ల నువులు మినుములు కలిపినా నీటిని రాగి చెట్టు కు పోయటం వలన 15 ఇనుము తో చేసిన ఉంగరం ధరించుట వలన 16 చేపలు పట్టే పడవ ముందు బాగం లోని మేకు తో ఉంగరం చేసి ధరించుట వలన 17 బ్ర్హమనకు నల్ల వంకాయ, నల్ల నువులు, మేకు , నల్లని దుప్పటి దానం 18 ప్రతి శని వారం శివాలయం లేదా నవగ్రహలయం ముందు బిచ్చగాలకు ఆహరం పెట్టుట వలన నల్లని దుప్పటి దానం చేయటం వలన 19 అయ్యప్ప మాలా ధరించుట వలన శ్రీ వెంకటేశ్వర స్వామి కి తల నీలాలు ఇచ్చుట వలన శ్రీ వెంకటేశ్వర స్వామి మాలా ధరించుట వలన 20 ప్రతి శని వారం వెంకటేశ్వర స్వామి దరసనం శివాలయం లో శివుని దర్సనం హనుమంతుని దర్సనం వలన శని గ్రహ దోషం సాన్తిచ్చును

ప్రపంచంలోనే మొట్టమొదటి శస్త్రచికిత్స (Surgery) చేసినది సుశ్రుతులే

వైద్యశాస్త్రంలో భారతీయుల ప్రతిభ వేల ఏళ్ల నాటిది.....ప్రపంచంలోనే మొట్టమొదటి శస్త్రచికిత్స (Surgery) చేసినది సుశ్రుతులే.......
సుశ్రుతుల్ని క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి చెందిన వారిగా ఆధునిక చరిత్రకారులు భావిస్తున్నప్పటికీ,మన పురాణేతిహాసాల ప్రకారం ఆయన దాదాపుగా 5000 ఏళ్ల పూర్వం వారు. మనకు చరిత్రను రాసింది పాశ్చాత్యులు కావడం వలన, వాళ్లు బైబిలులో ఉన్నట్లుగా సృష్టి ఆవిర్భవించి ఆరు వేల ఏళ్లకంటే ఎక్కువ కాలేదని తీవ్రంగా నమ్మడం వలన, ఎవరినీ 3000 ఏళ్ల పూర్వం వాళ్లుగా అంగీకరించలేకపోయారు.
సుశ్రుతులు వేల ఏళ్ల క్రితమే వారణాసిలో జన్మించారు. ఆయుర్వేద వైద్య పితామహులుగా ఖ్యాతి గడించిన ధన్వంతరి వద్ద విద్యనభ్యసించారు. పాశ్చాత్య ప్రపంచం విజ్ఞాన పరంగా కళ్లు తెరవక ముందే ఆయన సర్జరీ చేసి చూపించారు.
1) పక్షుల ముక్కుల రూపురేఖలను అనుసరించి, దృఢమైన పట్టు ఉండే విధంగా, సుశ్రుతులు సర్జరీ పరికరాలను తయారు చేసి, వినియోగించినట్లుగా తెలుస్తోంది.
2) వైద్య నియమ సూత్రాలూ, శస్త్రచికిత్స, పురిటి విధులు, మందులు, ఔషధజ్ఞానం మానవశరీర నిర్మాణాన్ని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు.
3) కొన్ని ఉత్పాదకాలు, వనమూలికల మొక్కలు, పుష్ప, ఫలాల ఔషధ మొక్కల గుర్తింపు, లాంటి వృక్షాల్లో ఔషధగుణాల్ని ఆయన కనిపెట్టారు.
4) శస్త్రచికిత్సా నైపుణ్యాన్ని విశదీకరించే సుశ్రుత సంహిత అనే అద్భుత గ్రంథాన్ని ఆయన సంస్కృతంలో రచించారు.
5) మెడ నుంచి ముఖం వైపు చర్మపు పొరల ప్రతిరూప చికిత్స, ప్రస్తుత అధునాతన ప్లాస్టిక్ సర్జరీ కి సుశ్రుతులు నాందీ పలకడంతోనే ఆయన ప్రజ్ఞ అర్థమవుతోంది.
6) తెగిపోయిన, మరియు కోతకు గురైన ముక్కుకు, ప్లాస్టిక్ సర్జరీని చేసి చూపించారు.
7) సుశ్రుతులు సర్జరీ సందర్భంలో రక్తస్రావాన్ని అరికట్టే విధానంలో చీమతలను బంధన సూత్రంగా వినియోగించే కొత్త పద్ధతి కనిపెట్టారు.
8) సుశ్రుత సంహిత ప్రకారం, సర్జన్ కు ఉండవలసిన లక్షణాలు, ధైర్యం, చురుకుదనం, తక్షణచర్య, పరికరాల పదును, చెమట వణుకు లేకపోవడం..
9) ప్రొస్టేట్ గ్రంధిని ఏ ఏ జాగ్రత్తలు తీసుకుంటూ ఎలా తొలగించాలి? ఎముకలు చిట్లడం ఎన్ని రకాలుగా ఉంటుంది? దానికి శస్త్రచికిత్స చేయడానికి సూత్రాలు ఏవి? యిలాంటి ఎన్నో శాస్త్రీయ పద్దతులను సుశ్రుతులు వేల సంవత్సరాల క్రితమే శోధించి, మానవజాతికి అందించారు.
10) ఎముకలు విరగడం అనేది 12 రకాలుగా ఉంటుందని కనుగొన్నారు.
11) మూత్రనాళం లో పేరుకొనే రాళ్ళను తొలగించడం ఎలాగో, సశాస్త్రీయంగా నిర్వహించి నిరూపించారు. అతి సున్నితమైన కంటిలో ఏర్పడే శుక్లాలను, వారి శస్త్రచికిత్సా విధానం ద్వారా విజయవంతంగా తొలగించారు. పొట్టభాగాన్ని, జీర్ణాశయ పొరలను, చీమతలకాయంత సన్నని సూదులతో కుట్లు చేసి అతికించి ప్రపంచాన్ని నివ్వెరపరిచారు.
12) పోస్ట్‌మార్టం (శవ పరీక్ష) వేల ఏళ్ళ క్రితమే నిర్వహించి మార్గదర్శకత్వం వహించిన తొలి శాస్త్రవేత్త సుశ్రుతులు.శరీర నిర్మాణ శాస్త్రం పట్ల గాఢమైన అవగాహన ఉండాలని చెప్పారు. స్వయంగా వివిధ ప్రయోగాలు చేశారు. ఆరోగ్యంగా ఉండి, పిన్న వయసులో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని గడ్డిలో చుట్టి, నిరంతరం ప్రవహించే నీటిలో కొద్దికాలం ఉంచి తీసిన తర్వాత, శిష్యులందరి సమక్షంలో ఆ దేహాన్ని కోసి, అవయవాలకు సంబంధించిన జ్ఞానాన్ని వివరించేవారు.
13) గర్భిణీ స్త్రీ ఉదరంలో శిశువు క్రమ వికాసం, ఫలదీకరణ దశలు, తొమ్మిది నెలల్లో గర్భాశయంలో చోటుచేసుకునే క్రమపరిమాణాలు, శిశువు పెరుగుదలలోని దశలను గురించి ఎంతో విజ్ఞానాన్ని అందించారు సుశ్రుతులు.
14) నూతన మిలీనియం సందర్భంగా, 2000 సంవత్సరంలో బ్రిటన్ లోని వైద్య శాస్త్ర అంతర్జాతీయ సంస్థ, ఒక జాబితాను వెలువరించింది. అందులో ప్రపంచ ప్రసిద్ధి పొందిన శస్త్ర చికిత్స వైద్యుల ఫోటోలతో పాటుగా వారి వివరాలు పేర్కొన్నారు. ఆ జాబితాలో తొలి చిత్రం ఆచార్య సుశ్రుతులది. ఈయన ప్రపంచంలో మొట్టమొదటి శస్త్రవైద్య శిఖామణిగా పేర్కొనడం జరిగింది
15) ఇలా చెప్పుకుంటూ పోతే సుశ్రుతుల ప్రతిభ అనంతమని తెలుస్తుంది.
16) అన్నీ పాశ్చాత్యులే కనిపెట్టారనీ, భారతీయులకు ఏమీ చేతకాదనీ, అన్నీ పాశ్చాత్యులు పెట్టిన భిక్షే అనీ, మనం ఆత్మన్యూనతకు లోను కాకుండా, వారిని ఆదర్శపురుషులుగా తీసుకుని, వారి మార్గంలో నడవడానికి సంకల్పిస్తే రేపటి రోజు మనదే కావచ్చు.
సుశ్రుతాయ నమః

తులసీ దళాలను సరైన రోజులలోనే తెంపుతున్నారా?

కార్తీక మాసంలో మనం శివ విష్ణువులను సమానంగా పూజిస్తూ ఉంటాం. ఇంకా అనేక వ్రతాలు కూడా కార్తీకమాసంలో వస్తాయి. శివ విష్ణువులకు తులసి అత్యంత ప్రీతిదాయకం. తులసి దేవతావృక్షం. తులసీ దళాలను మనం ఎప్పుడు పెడితే అప్పుడు తెంపరాదు. వాటికి అనేక నియమాల్ని మనకు పురాణాల్లో వ్యాసాదులు తెలియజేసారు.
విష్ణుధర్మోత్తర, పద్మ పురాణాల్లో ఇట్లా ఉంది. వైధృతి, వ్యతీపాత యోగములయందు, ఆది, మంగళ, శుక్రవారముల యందు, పూర్ణిమ, అమావాస్య, ద్వాదశి తిథుల యందు, సంక్రమణం రోజున, జాతాశౌచ, మృతాశౌచముల యందు, ఎట్టి పరిస్థితులలోనూ తులసిని తెంపరాదు. తెంపిన యెడల విష్ణువు శిరస్సును తెంపినట్లే యని పురాణ వాక్యం. ఇవి వదిలి మిగతా రోజులలో తులసిని తెంపవచ్చు.
తులసిని తెంపుతున్నపుడు ఈ శ్లోకాన్ని పఠించాలి.
తులస్యమృతనామాసి సదా త్వం కేశవ ప్రియే
కేశవార్థం విచిన్వామి వరదా భవశోభనే.
ఉసిరి ఆకుల విషయం
కార్తీకమాసములో ఉసిరి ఆకులు తెంపిన వారికి కూడా విష్ణువు శిరస్సును తెంచిన దోషం వస్తుందని పౌరాణిక వచనం. కార్తీక మాసంలో వనభోజనంలో ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేయడం అనేది మనకు సాంప్రదాయం. ఆ సందర్భంలో ఉసిరి ఆకులు తెంపే అవకాశం ఉంటుంది కాబట్టి, కార్తీకమాసంలో ఉసిరి ఆకులు తెంపరాదని ఋషులు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం.

సర్వే గుణాః కాంచనమాశ్రయన్తి

.
అన్ని లోహములు బంగారమునే చేరును అని భావము. కారణం బంగారం సర్వశ్రేష్ఠమైన లోహం....ఎన్ని లోహములున్నా బంగారమునకు ఉన్న విలువ వేరు. ఇతర లోహాలన్నీ బంగారాన్ని ఆశ్రయించినపుడు గొప్పగా వెలుగొందుతాయి.
అలాగే సనాతనధర్మం బంగారం వంటిది. అంతే స్వచ్ఛమైనది. ఇతర ఏ మతాలు ఏర్పడినా కూడా అవన్నీ చివరకు సనాతనధర్మాన్ని ఆశ్రయించవలసినదే. మరి ఇతర లోహాలు లేనిదే కేవలం బంగారంతో మాత్రమే ఆభరణాన్ని తయారు చేయలేము కదా అనే ప్రశ్న ఉదయిస్తుంది.
అవును నిజమే.
సనాతనధర్మం ఎప్పుడూ తన చుట్టూ ఒక గీత గీసుకుని ఉండిపోలేదు. అందరినీ కలుపుకుని పోవడమే సిద్ధాంతంగా నమ్మింది. ఆ సిద్ధాంతం నమ్మడం వలనే భారతదేశంలోనికి ఇన్ని మతాలు అడుగు పెట్టగలిగాయి. అడుగు పెట్టడమే కాకుండా వారి జనాభాను కూడా పెంచుకోగలిగాయి. వేరే ఏ మతంలోనూ వృద్ధి చెందని విధంగా సనాతన భారతదేశంలో చారువాక సిద్ధాంతం(నాస్తిక సిద్ధాంతం) కూడా ప్రాచుర్యం పొందింది. అందుకే సనాతనధర్మాన్ని బంగారంతో పోల్చారు. తాను చాలా గొప్పదే ఐనప్పటికీ ఇతర లోహాల్ని కూడా బంగారం ఎలా అయితే కలుపుకుని పోతుందో, సనాతన ధర్మం కూడా తాను గొప్పదైనా అన్ని మతాలనూ కలుపుకుని పోతుంది.
బంగారాన్ని ఎలా అయితే ఇతర లోహాలతో పోల్చి చూడలేమో, సనాతనధర్మాన్ని కూడా ఇతర మతాలతో పోల్చలేమని గుర్తించాలి.

గురుగ్రహ దోష నివారణకు హయగ్రీవస్తోత్రం

జాతకంలో గురుగ్రహ దోషం ఉన్నవారు ప్రతిరోజు హయగ్రీవ స్తోత్రం చదివితే గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది.భక్తి బావనలు, ఉన్నత విద్య,విదేశి విద్య కలగాలంటే గురుగ్రహ అనుగ్రహం ఉండాలి.గురుగ్రహానికి అధిదేవత హయగ్రీవుడు.
సకల విద్యాధి దేవతయైన శ్రీమన్నారాయణుడు ‘హయగ్రీవుని’గా అవతరించాడు.సరస్వతీదేవి, వేదవ్యాసుడు హయగ్రీవుని నుండి విద్యాశక్తిని సముపార్జించారని ‘హయగ్రీవ స్తోత్రం’లో దేశికాచార్యులు పేర్కొన్నారు.హయగ్రీవోపాసన వాక్‌శక్తిని, విద్యాశక్తిని, జ్ఞానశక్తిని సిద్ధింపచేస్తుంది.
జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్
ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే
జ్ఞానం, ఆనందం, మూర్త్భీవించిన దైవస్వరూపం హయగ్రీవుడు. నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వవిద్యలకు ఆధారభూతమైన విద్యాధిదేవత హయగ్రీవునకు నమస్కారము.
హయగ్రీవుని పూజించడంవల్ల విద్య, ఐశ్వర్యం, అధికారం, ఆయువు మొదలైనవన్నీ లభిస్తాయి. విద్యార్థులు హయగ్రీవుని పూజించడంవల్ల చదువు బాగా వస్తుంది.పిల్లలున్న ఇంట హయగ్రీవ పూజ పిల్లలకు విద్యాటంకాలు తొలగించి, ఉన్నత విద్యను అందిస్తుంది.
హయగ్రీవస్తోత్రం
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం |
నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః||
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ |
తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్మా ప్రవాహవత్||
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోధ్వనిః |
వి శోభతే చ వైకుంఠ కవాటోద్ఘాటన ధ్వనిః||
ఫలశ్రుతి :
శ్లోకత్రయ మిదం దివ్యం హయగ్రీవ పదాంకితం |
వాదిరాజయత్రిప్రోక్తం పఠతాం సంపదాంప్రదం||

గోమూత్రంలో ఔషదాలు

గోవు పాలు, మూత్రము, పేడ కూడా మానవునికి ఎంతో ఉపకరిస్తాయి. గోమూత్రంనుండి శిలాజిత్తు అనే మందును తయారుచేసి ఆయుర్వేద వైద్యులు వాడుతారు. ఇటీవలి పరిశోధనాలలో గోమూత్రానికి క్యాన్సర్ కారక రోగకణాన్ని నిరోధించే శక్తి ఉన్నదని శాస్తజ్ఞ్రులు భావిస్తున్నారు. గోమూత్రం..వ్యాధి కారణమైన జీవులను సంహరిస్తుంది. పేడకు కూడా ఈ గుణముంది. అందుకే గోమూత్రం ఈ రోజున మందుల దుకాణాలలో లీటరు సీసా వంద రూపాయలు అమ్ముతోంది. సృష్టిలో ఏ జంతువు మూత్రానికి ఈ గుణాలు లేవు.అంటే అవుకు అత్యంత ప్రాశస్త్యం, ప్రాముఖ్యం ఉండబట్టే కదా.. మనకు పూజ్యనీయమైంది! గోవులు మాంసం పెట్టినా ముఖం త్రిప్పుకుంటాయి.
మన దేశంలో వ్యవసాయానికి గోవు చాలా అవసరం. దుక్కిదున్నటానికి, బళ్ళు లాగటానికి మాత్రమే కాకుండా వాటి మూత్రం, పేడ ఎరువులుగా వాడబడటం వలన రసాయన ఎరువుల వాడకం తగ్గి, రైతుకు ఆర్థికభారం తగ్గుతుంది.
గోమూత్రంలో నైట్రోజన్‌, కార్పోలిక్‌, ఆసిడ్‌ రసాయనాలున్నాయి. ఆవు మూత్రంలో లాక్టోజ్‌, సల్ఫర్‌, అమ్మోనియా గ్యాస్‌, కాపర్‌, పొటాషియం, మాంగనీస్‌, యూరియా, ఉప్పు, పలు రకాల క్షారములు, ఆమ్లం ఉంటాయి.
గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమమైన కీటకనాశిని, ఎరువుగా పేరుంది. గోమూత్రంలో అధికంగా నీరు కలిపి పంటలపై చల్లితే పంట దిగుబడితో పాటు ఖర్చు తగ్గుతుంది.
గోవు పేడ, గోమూత్రం ద్వారా తయారయ్యే మందులతో ఉదరకోశ వ్యాధులు నయమవుతాయి. దేశీ ఆవుల మూత్రం గంగాజలంతో సమానం.
గోమూత్రం వలన చర్మవ్యాదులు , గుండెవ్యాదులు లతో పాటు ఎయిడ్స్ , కాన్సర్ వంటి మొండి వ్యాధులు నయమవుతాయయనే విశ్వాసము ఉంది . శరీరము విసర్జించే అనేక సూక్ష్మపోషక పదార్ధాలను పూరిస్తుంది . కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది . లివర్ సక్రమముగా పనిచేసేటట్లు చేస్తుంది . జ్ఞాపక శక్తిని పెంచుతుంది . వృద్ధాప్యం దరిచేరనీయదు . గుండె , మెదడు లోని కణాల్ని బలపరుస్తుంది .
పరిశో్ధకుల అభిప్రాయం ప్రకారము గోమూత్రం లొ పోషకాలు ->A, B,C,D,E విటమిన్లు , సోడియం , మెగ్నీషయం , పొటాషియం , గంధకం , ఐరన్‌ , నత్రజని , వంటి మూలకాలు , మాలిక్ , సిట్రిక్ , టైట్రిక్ , సక్సీనిక్ ఆమ్లాలతో పాటు ఎంజైములు , హార్మోనులు , క్రియాటినిన్‌ , లాక్టోజ్ వంటివి ఉన్నాయి .
చర్మ వ్యాధులు వున్నవారికెవరికైనా వారి శరీరంలో సల్ఫర్ లోపించిందని గమనించాలి. భారతీయ గోమూత్రంలొ సల్ఫర్ విరివిగా వుంటుంది. గోమూత్రం లోపలికి తీసుకుంటూ, పై పూతగా వాడుకుంటుంటే మూడు నెలలో చర్మ రోగాలే కాకుండా సొరియాసిస్, ఎక్జిమా,మోకాళ్ల నొప్పులు, నడుం నొప్పులు , దగ్గు(20 ఏళ్ళగా వున్నా దగ్గులు కూడా), జలుబు పూర్తిగా పోతుంది.గోమూత్రం సేవించాక ఒకసారి టి.బి తగ్గిందంటే జీవితంలో మరళా రాదు. తెలియకుండానే ఎన్నో వ్యాధులు తగ్గిపోతాయి.

బుదగ్రహ దోష నివారణకు బ్యాంబు ట్రీ:-( వెదురు చెట్టు)


బ్యాంబుట్రీ దీనినే వెదురు చెట్టు అని కూడ అంటారు.ఇది గ్రీన్ కలర్ లో ఉంటుంది.ఇది మన నవగ్రహాలలో బుథ గ్రహానికి చెందినది.బుదుడు వ్యాపార వృద్ది కారకుడు కావటం వలన ఇది వ్యాపార సంస్థలలో ఉంచితే వ్యాపారం దిన దినాభివృథ్ధి చెందుతుంది.వ్యాపార సంస్థలలో నరథిష్టికి ' ఆకర్షణకు ,వ్యాపారభివృథ్థికి చాలా మంచిది .
విద్యకి,వాక్ శుద్దికి బుదుడు కారకుడు.పిల్లలు చదువు కొనే టేబుల్ దగ్గర ఉంచితే మంచి తెలివితేటలు ,చదువుపై శ్రద్ద ,సరియైన సమయంలో (పరీక్ష సమయములలో ) గుర్తుకు వచ్చే ఆలోచనలు(క్రియేటివిటి) .మంచి వాక్ ఫటిమ కలిగి భావ ప్రకటన చేయగలడు.వెదురు మొక్క పెరుగుదలను ప్రత్యక్షంగా చూడటం వలన మనలో కూడ జీవితంలో ఉన్నత స్ధాయికి ఎదగాలనే భావన కలుగుతుంది.
ఇంటిలో ఏమైనా వాస్తు దోషాలు ఉన్న,వీడిపోటు ఉన్న ఇంటిలో సింహా ద్వారానికి ఎదురుగా ఉంచితే వీథిపోటు ,చిన్న చిన్న వాస్తు దోషాలు నరదృష్టి ,కనుదృష్టి,చెడు ఎనర్జీని తీసివేసి పాజిటివ్ ఎనర్జీని కలిగించి మంచి అన్యోన్నత ,ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు కలిగి ఎప్పుడు సుఖశాంతులు ,థనాభివృద్దితో ఇల్లు కళకళ లాడుతుంది .
అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఈ వెదురు మొక్కలు రకరకాల ఆకృతులలో రూపొందించిన గాజు ,మట్టి పాత్రలలో ఉంచి తూర్పు,ఉత్తర,ఈశాన్య దిక్కుల యందు ఉంచి అప్పుడప్పుడు నీటిని మారుస్తూ ఉండాలి.
వెదురు మొక్కలను గృహాలకంరణలో భాగంగా చాలా మంది తమ ఇళ్లలో ‘ఇండరో మొక్కలుగా’ను పెంచుకుంటున్నారు. ‘వెదురు మొక్కలను’ లక్కి ప్లాంట్స్‌గా అభివర్ణించుకుంటున్న పలువురు ఈ మొక్కలను ఇళ్లలో పెంచితే ‘ధన బలం’ పెరుగుతుందని విశ్వసిస్తున్నారు. ఈ సంస్కృతి అలా అలా వ్యాపించటంతో ఇళ్లలోనే కాదు ఆఫీసుల్లోనూ, దుకాణ సముదాయాల్లో ఎక్కడ చూసిన ఈ మొక్కలే దర్శనమిస్తున్నాయి.

సూర్యభగవానుడి సర్వరోగ నివారణ స్తోత్రం

సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఐశ్వర్య ప్రదాత. కర్మ సాక్షి. ప్రత్యక్ష నారాయణుడు. సమస్త సూర్యమండలానికి వెలుగును ప్రసాదించే దైవము. అటువంటి సూర్యారాధన సమస్త రోగములను హరించి ఆరోగ్యమును అందిస్తుంది.సర్వ రోగాలు మాయమవ్వాలంటే సూర్యభగవానుడిని స్తుతించండి.శక్తివంతమైన సూర్య స్తోత్రమును ప్రతిరోజూ పఠిస్తే... రోగాలు దరిచేరవు.
ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహన్నుత్తరాం దివందేవః |
హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాశునాశయతు |1|
నిమిషార్టే నైకేన త్వేచశ తేద్వేసహస్రేద్వే |
క్రమమాణ యోజనానాం నమోస్తుతే నళిననాధాయ |2|
కర్మజ్ఞానఖదశకం మనశ్చజీవ ఇతి విశ్వసర్గాయ |
ద్వాదశధాయోవిచరతి సద్వాదశమూర్తి రస్తు మోదాయ|3|
త్వం యజుఋక్ సామత్వం త్వమాగమస్త్వం వషట్కారః |
త్వం విశ్వం త్వం హంసః త్వం భానో ! పరమహంసశ్చ |4|
శివరూపాత్ జ్ఞానమహంత్వత్తో ముక్తిం జనార్దనాకారాత్ |
శిఖిరూపాదైశ్వర్యం భవతశ్చారోగ్యమిచ్చామి |5|
త్వచిరోషా దృశిదోషా హృదిదోషా యే~ఖిలేంద్రి యజదోషాః |
తాన్ పూషా హతదోషః కించిద్రోషాగ్నినాదహదు |6|
తిమిరమివ నేత్రతిమిరం పటలమివాశేషరోగపటలం నహః |
కాచమివాధినికోశం కాలపితారోగశూన్యతాం కురుతాత్ |7|
యశ్యచ సహస్రాంశోరభిషులేశో హిమాంశు బింబగతః |
భాసయతి నక్తమఖిలం కీలయతు విపద్గణానరుణః |8|
యేనవినాంధం తమసం జగదేతత్, యత్రసతి చరాచరం విశ్వం |
దృతబోధం, తం నళినీ భర్తారం హర్తారమా పదామీళే |9|
వాతాశ్మరీ గదార్శః త్వగ్దోష మహోదర (ప్రమేహాంశ్చ) |
గ్రహణీ భగంధరాఖ్యా మహారుజోపిత్వమేవహంసి |10|
ధర్మార్ధ కామ మోక్ష ప్రతిరోధిన ఉగ్రతాపవేగకరాన్ |
బందీకృతేంద్రియ గణాన్ గదాన్ విఖండ యతుచండాంశుః |11|
త్వం మాతాత్వం శరణత్వం దాతాత్వం ధనః త్వమాచార్యః |
త్వం త్రాతా త్వం హర్తావిపదాం ; అర్క ! ప్రసీద మమ |12|
ఫలశ్రుతి-
ఇత్యార్యా ద్వాదశకం సాంబస్య పురోనభా స్థలాత్పతితం |
పఠతాం భాగ్యసమృద్ధిః సమస్త రోగక్షయ స్స్యాత్ ||
ఈ స్తోత్రాన్ని శ్రద్ధతో పఠించేవారికి భాగ్యాభివృద్ధి కలుగుతుంది. అన్ని జబ్బులూ హరింపబడతాయి.

అహం వదిలితే ...


మనలో అహంకారం నశించినప్పుడు భగవంతుడు మనవాడు అవుతాడు. నేను, నాది, నా అనే అర్థాలకు వాడు, వాడిది, వాడే అనే భావాన్ని జోప్పించాలి. భగవంతుడు తప్ప అన్యం ఏదీ లేదు అనే సత్యానికి మనం దగ్గర కావాలి. ‘సత్య నిష్ఠఏ ఈ కలియుగానికి తరుణోపాయం’ అని శ్రీరామకృష్ణులు వాక్రుచ్చారు. సత్యం అన్నది సత్తుకు సంబంధించినటువంటిది. సత్ పరబ్రహ్మ వస్తువు. సత్ యే ఆనందం. ఆనందమే బ్రహ్మం.
ఒక వ్యక్తి తన స్వగ్రామం నుంచి కాలి బాటలో మరొక గ్రామానికి పని నిమిత్తం వెళ్ళాడు. తిరుగు ప్రయాణంలో చీకటి పడిన కారణంగా దారి తప్పి దురదృష్టవశాత్తూ ఒక పాడుబడిన బావిలో పడ్డాడు. అదృష్టమో, దురదృష్టమో తెలియదు కానీ అతని చేతికి చెట్టుకొమ్మ ఒకటి దొరికింది. ఆ చెట్టుకొమ్మను పట్టుకు వ్రేలాడుతూ పైకి రావడానికి విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యపడక అలాగే వ్రేలాడుతూ ఉండిపోయాడు. ఉదయం వెలుతురు వచ్చిన వెంటనే బావిలో సగం లోతులో వ్రేలాడుతున్న అతను క్రిందకు చూసినప్పుడు పెద్ద పెద్ద బండ రాళ్ళు కనపడ్డాయి. వాటిని చూసి, ‘ఆహా! ఏమి నా అదృష్టం ఈ కొమ్మ దొరికి ఉండకపోతే ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాణ్ణి’ అని అనుకోని భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేశాడు.
ఆపదనుండి బయట పడడానికి ఇంకొకరి సహాయం కోసం ఎంత అరిచినా ఎవరూ రాలేదు. అరిచి అరిచి సొమ్మసిల్లిన అతను వీళ్ళనూ వాళ్ళనూ పిలిచి ప్రయోజనం ఏమిటి భగవంతుణ్ణే పిలుస్తాను అని అనుకొని భగవంతుణ్ణి నీవు పిలిచావు కాబట్టి వచ్చాను’ అన్నాడు.
‘అవును, నువ్వు నిజంగా భగవంతుడివే! ఆలస్యం చేయక నన్ను పైకి లాగి కాపాడు’ అని బావిలోకి వ్యక్తి వేడుకున్నాడు. ‘నిన్ను కాపాడడానికి వచ్చాను. అయితే దానికి ముందు నేను వేసే కొన్ని ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పవలసి ఉంటుంది’ అన్నాడు. ‘అడగవలసింది ఏమిటో త్వరగా అడుగు’ అన్నాడు లోపలి వ్యక్తి.
నన్ను నిజంగా భగవంతుణ్ణి అని నీవు విశ్వసిస్తున్నావా?’
దానికి బదులుగా బావిలోని వ్యక్తి, ‘విశ్వసిస్తున్నాను, నీవు నిజంగా భగవంతుడివే’ అన్నాడు.
‘నిన్ను కాపాడడం నా వల్ల సాధ్యమవుతుందని నీవు నిజంగా నమ్ముతున్నావా?”
‘నమ్ముతున్నాను’ అన్నాడు.
‘నేను ఏది చెప్పినా చేస్తావా?”
‘కచ్చితంగా చేస్తాను, నా ప్రాణమైనా ఇస్తాను’ అన్నాడు.
‘అలా అయితే నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి. నువ్వు ఏ కొమ్మనైతే పట్టుకొని ఉన్నావో, దాన్ని వదిలేయి. నేను నిన్ను కాపాడతాను’ అన్నాడు భగవంతుడు
బావి లోపలి వ్యక్తి బయటి వ్యక్తిని చూసి, ఆయన చేతిలో ఏవిధమైన తాడు కానీ, నిచ్చిన కానీ, మరే విధమైన పరికరం కానీ లేకపోవడంతో సందిగ్ధంలో పడ్డాడు. కొమ్మను వదిలితే భగవంతుడు రక్షించడం మాట అటుంచి, ముందు కిందనున్న బండరాళ్ళ మీద పది, తల పగిలి చస్తానని అనుకున్నాడు.
‘ఇది చాలా కఠినమైన షరతు. కొమ్మను వదలడం తప్ప, నువ్వు ఏం చెప్పినా చేస్తాను’ అన్నాడు బావిలోని వ్యక్తి.
‘నువ్వు ఏమీ చేయనక్కరలేదు. కొమ్మను వదిలితే చాలు’ అన్నాడు భగవంతుడు.
సరిగ్గా ఇదే రీతిగా మనం కూడా అహంకారమనే కొమ్మను పట్టుకొని వ్రేలాడుతున్నాం. ఎప్పుడైతే మనం ఆ అహంకారాన్ని వదులుకుంటామో అప్పుడు భగవంతుడు తప్పకుండా మనల్ని కాపాడతాడు. కాబట్టి, మనమందరం అహంకార శూన్యులుగా మారాలి.