Wednesday, 27 January 2016

సంతానం కోసం షష్ఠి దేవి స్తోత్రం

షష్టీ దేవి ప్రకృతి దేవి యొక్క షష్టా౦శ (ఆరవ కళ) వల్ల అవతరించినది గనుక ఆమెకు షష్టీ దేవి అని పేరు వచ్చినది.ఈమె కుమార స్వామికి ప్రియురాలు.పిల్లలలకి తరుచుగా అనారోగ్యాలు కలుగుతున్న,ఆపదలు వస్తున్నా,బాలారిష్టాలు ఉన్నా షష్ఠిదేవి కధ విన్న,చదివిన,వ్రాసిన షష్ఠిదేవి శిశువులకు పక్కనే ఉండి వారి ఆయువుని అభివృద్ధి చేస్తుంది.గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా షష్ఠిదేవి స్తోత్రం చదివితే పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది. సంతానం లేనివారు షష్ఠిదేవి స్తోత్రం శ్రద్ధగా పఠిస్తే దీర్ఘాయుష్మంతులు అయిన సంతానం పొందుతారు.
నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమో నమః
శుభాయై దేవసేనాయై షష్ట్యై దేవ్యై నమో నమః
వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః
సుఖ దాయై మోక్షదాయై షష్ట్యై దేవ్యై నమో నమః
సృష్టె షష్ఠాంశరూపాయై సిద్ధాయైచ నమో నమః
మాయాయై సిద్ధయోగిన్యై షష్ఠీ దేవ్యై నమో నమః
సారయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః
బాలాధిష్ఠా తృ దేవ్యై చ షష్ఠీ దేవ్యై నమో నమః
కల్యాణ దేవ్యై కల్యాణ్యై ఫల దాయైచ కర్మణాం
ప్రత్యక్షా యై సర్వభక్తానాం షష్ఠ్యై దేవ్యై నమో నమః
పూజ్యాయై స్కందకాంతాయై సర్యేషాం సర్వ కర్మసు
దేవ రక్షణ కారిణ్యై షష్ఠీ దేవ్యై నమో నమః
శుద్ధ సత్వ స్వరూపయై వందితాయై నృణాం సదా
హింసా క్రోధ వర్జితాయై షష్ఠీ దేవ్యై నమో నమః
ధనం దేహి జయం దేహి పుత్రందేహి సురేశ్వరీ !
మానం దేహి జయం దేహి ద్విషోజహి మహేశ్వరి
ధర్మం దేహి యశోదేహి షష్ఠీ దేవి నమో నమః
దేహి భూమిం ప్రజాం దేహి విద్యాందేహి సుపూజితే
కల్యాణం చ జయం దేహి విద్యా దేవి నమో నమః
నమోస్తుతే నమోస్తుతే షష్ఠీ దేవి నమో నమః

No comments:

Post a Comment