Saturday, 30 January 2016

జుట్టు రాలడాన్ని నిరోధించే ఆయుర్వేద, యునానీ ఔషధాలు

పసుపు... సంప్రదాయకంగా వంటల్లో వాడుతున్న సుగంధద్రవ్యం. సహజసిద్ధ యాంటీ-బయాటిక్‌గా హల్దీకి పేరు. అదే పసుపు జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. పసుపుతో పాటు దేవదారు వృక్షం బెరడు, గ్రీన్‌ టీ కూడా వెంట్రుకలు రాలిపోవడాన్ని నిరోధిస్తాయి. అయితే.. అలాంటి సహజసిద్ధమైన వస్తువులతో.. బ్రిటన్‌కు చెందిన పేంజియా అనే ఔషధ సంస్థ జుట్టు రాలడాన్ని నిరోధించే ఫార్ములా రూపొందించి దానికి మేధో హక్కుల (పేటెంట్‌) కోసం దరఖాస్తు పెట్టుకుంది. కానీ, భారత్‌ మాత్రం ఆ ఆటలేవీ సాగనివ్వలేదు. ఆ సంస్థపై నెగ్గి పేటెంట్‌ దరఖాస్తును వాపస్‌ తీసుకుని తోకముడుచుకునేలా చే సింది. శాసీ్త్రయ, పారిశ్రామిక పరిశోధన మండలి (సీ ఎస్‌ఐఆర్‌) విభాగమైన సంప్రదాయ విజ్ఞాన డిజిటల్‌ లైబ్రరీ (టీకేడీఎల్‌).. భారత సంప్రదాయ వస్తువులను కాపాడడంలో కృషి చేసింది. భారత్‌లో పూర్వ కాలం నుంచి పసుపు, దేవదారు బెరడు, గ్రీన్‌ టీని జుట్టు రాలడాన్ని నిరోధించే ఆయుర్వేద, యునానీ ఔషధాలుగా వాడినట్లు ఆధారాలతో సహా రుజువు చేసింది. దీంతో జూన్‌ 29న ఆ సంస్థ తన పేటెంట్‌ దరఖాస్తును వెనక్కు తీసుకుంది. వాస్తవానికి 2011 ఫిబ్రవరిలో ఆ సంస్థ దరఖాస్తు చేసింది. అవి సంప్రదాయ ఆయుర్వేద ఔషధాలంటూ 2014 జనవరి 13న టీకీడీఎల్‌ ఆధారాలు సమర్పించడంతో ఆ సంస్థ వెనకడుగు వేసింది. అంతర్జాతీయ దిగ్గజం కాల్గేట్‌-పామోలివ్‌.. దంత సమస్యలకు మెరుగైన పరిష్కారమైన జాజికాయపై పేటెంట్‌కు దరఖాస్తు చేసుకున్నప్పుడూ.. టీకేడీఎల్‌ సమర్థంగా తిప్పికొట్టింది. అర్చనా శర్మ నేతృత్వంలోని బృందం.. దానిని ఆయుర్వేద ఔ షధంగా ఎన్నో ఏళ్లుగా వాడుతున్నట్లు నిరూపించడంతో చేసేదిలేక సంస్థ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది.

No comments:

Post a Comment