Saturday 30 January 2016

తులసి నోము

పూర్వీకుల నుంచి తులసి మొక్కకు పూజలు చేయడం సంప్రదాయం. తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి, హారతులు పడతారు. జ్వరమొచ్చినా.. జలుబు చేసిన రెండు ఆకులు నమలమంటారు. ఎన్నో ఔషధ గుణాలున్న ఆరోగ్యప్రదాయిని తులసి. అందుకే తులసి మొక్కకు కోట కట్టి పూజిస్తారు. రామాలయంలేని ఊరుగానీ ... తులసి మొక్కలేని ఇల్లుగాని కనిపించవు.
తులసి కాలుష్యాన్ని నివారించే గుణమున్న మొక్క. మొక్కలన్నీ పగలంతా కార్బన్‌డైయాక్సైడ్‌ ను పీల్చుకొని ఆక్సిజన్‌ను వదులుతాయి. రాత్రి సమయంలో కార్చన్‌డైయాక్సైడ్‌ వదులుతాయి.కాని తులసి 24 గంటలు ఆక్సిజన్‌నే విడుదల చేస్తుంది. అందుకే ఇది ఔషధ మొక్క కాగలిగింది.
శో యాన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా
య దగ్రే సర్వవేదశ్చ తులసీం త్వా నమామ్యహమ్‌
శ్రీ మహాలక్ష్మీ నారాయణ స్వరూపిణియైన ‘‘తులసి’’ యొక్క మూలంలో సర్వతీర్థాలు, మధ్యభాగ మందు సమస్త దేవతలు, తులసి యొక్క పైభాగము సర్వవేదాలతో కొలువై వున్న తులసీ మాతకు ముందుగా నమస్కరించుకుని, అంతటి పూజ్యనీయమైన ఆ తులసి ఆవిర్భావ చరిత్ర – తులసి ప్రాశస్త్యమును గూర్చి, మన పురాణములలో ఎన్నో కథలు కానవస్తున్నాయి. వాటిలో ఒక గాథను సమీక్షించుకుందాం!
పూర్వము ఒకానొక ఊరిలో ఒక చిన్నది వుండేది. ఆమెకు సవతి తల్లి పోరు ఎక్కువగా వుండేది. అది భరించలేక ఆ చిన్నది తన అమ్మమ్మ గారి ఇంటికి వేల్లిపోయినది. సవతి తల్లి ఆ పిల్లను తీసుకు రమ్మని భర్తను వేదించేది. అందకు అతడు అంగీకరించలేదు. ఒకనాడు సవతి తల్లి తన భర్తతో ఆ పిల్లను తీసుకు రమ్మని ఎంతగానో పట్టు పట్టింది. అప్పుడు ఆమె భర్త నువ్వే వెళ్లి తీసుకొని రమ్మన్నాడు. చేసేది లేక సవతి తల్లి ఆ చిన్న దాని తాతగారించికి వెళ్ళింది. పిల్లను పంపించమని అడిగింది. వారు అంగీకరించలేదు. వారితో జగదమాది ఆఖరికి ఎలాగైతేనేం వాళ్ళను ఒప్పించి ఆ చిన్న దానిని తన వెంట ఇంటికి తీసుక వచ్చింది.
ఒక రోజున ఆ చిన్నది తన సవతి తల్లి తులసి పూజ చేయడం చూసింది. తనకు కూడా ఆసక్తి కలిగి ఇంట గల అరిసెలు తెచ్చి నైవేద్యం పెట్టి తులసి దేవిని పూజించింది. ఆమె భక్తికి మెచ్చి తులసి దేవి సాక్షాత్కరించి ఓ చిన్నదానా! గత జన్మలో నువ్వు కన్నె తులసి నోము నోచి ఉల్లంఘించి నందువల్ల నీకు తల్లి పోయి సవతి తల్లి కలిగింది. కనుక నువ్వు కన్నె తులసి నోము నోచుకోమన్నది. ఆ తులసీ దేవి చెప్పిన ప్రకారం ఆ చిన్నది కన్నె తులసి నోమును భక్తి శ్రద్దలతో నోచి సంవత్సరాంతమున ఉద్యాపన చేసుకున్నది. నాటి నుండి ఆ సవతి తల్లి ఆమె పట్ల ప్రేమానురాగాలు కలిగి ఎంతో ఆదరణతో చూసుకునేది.
తులసమ్మకు పదమూడు జతల అరిసెలు నైవేద్యము పెట్టి పూజచేయ్యాలి. ఒక కన్యకు తలంటు నీళ్ళు పోసి పరికిణి, రవిక ఇచ్చి అరిసెలు వాయనమివ్వాలి.

No comments:

Post a Comment