.
అన్ని లోహములు బంగారమునే చేరును అని భావము. కారణం బంగారం సర్వశ్రేష్ఠమైన లోహం....ఎన్ని లోహములున్నా బంగారమునకు ఉన్న విలువ వేరు. ఇతర లోహాలన్నీ బంగారాన్ని ఆశ్రయించినపుడు గొప్పగా వెలుగొందుతాయి.
అలాగే సనాతనధర్మం బంగారం వంటిది. అంతే స్వచ్ఛమైనది. ఇతర ఏ మతాలు ఏర్పడినా కూడా అవన్నీ చివరకు సనాతనధర్మాన్ని ఆశ్రయించవలసినదే. మరి ఇతర లోహాలు లేనిదే కేవలం బంగారంతో మాత్రమే ఆభరణాన్ని తయారు చేయలేము కదా అనే ప్రశ్న ఉదయిస్తుంది.
అవును నిజమే.
సనాతనధర్మం ఎప్పుడూ తన చుట్టూ ఒక గీత గీసుకుని ఉండిపోలేదు. అందరినీ కలుపుకుని పోవడమే సిద్ధాంతంగా నమ్మింది. ఆ సిద్ధాంతం నమ్మడం వలనే భారతదేశంలోనికి ఇన్ని మతాలు అడుగు పెట్టగలిగాయి. అడుగు పెట్టడమే కాకుండా వారి జనాభాను కూడా పెంచుకోగలిగాయి. వేరే ఏ మతంలోనూ వృద్ధి చెందని విధంగా సనాతన భారతదేశంలో చారువాక సిద్ధాంతం(నాస్తిక సిద్ధాంతం) కూడా ప్రాచుర్యం పొందింది. అందుకే సనాతనధర్మాన్ని బంగారంతో పోల్చారు. తాను చాలా గొప్పదే ఐనప్పటికీ ఇతర లోహాల్ని కూడా బంగారం ఎలా అయితే కలుపుకుని పోతుందో, సనాతన ధర్మం కూడా తాను గొప్పదైనా అన్ని మతాలనూ కలుపుకుని పోతుంది.
బంగారాన్ని ఎలా అయితే ఇతర లోహాలతో పోల్చి చూడలేమో, సనాతనధర్మాన్ని కూడా ఇతర మతాలతో పోల్చలేమని గుర్తించాలి.
No comments:
Post a Comment