పాపాలను, శాపాలను పోగొట్టి కష్టాలను తీర్చి ఆయుశ్యును పెంచే అమోగమైన అక్షర సాధనం అదిత్య హృదయం. ఈ అమోగమైన స్తోత్రరాజాన్ని శ్రీ రామ చంద్రునికి ఆగస్త్యమహర్షి మంత్రాల వంటి మాటలతో వివరించాడు.అదిత్య హృదయము మహాపవిత్రమైన గ్రంధము. శ్రీమద్ రామాయణ మహాకావ్యమందలి యుద్దకాండలో 105వ సర్గలో సూర్యభగవానుని స్తుతికి ‘‘ఆదిత్య హృదయం’’ అని నామకరణం చేశారు.
సంతానం లేనియి ‘‘ఆదిత్య హృదయము’’ ను నిత్యము పారాయణము చేసినచో వారికి సంతానము కలుగును.న్యాయ వివాదాలలో చిక్కుకొని కోర్టు చుట్టు తిరుగుతూ సతమతం అయేవారు. దీనిని పారాయణ ము చేసినచో వారికి విజయం కలుగుతుంది. కఠిక దారిద్రంచే భాద పడుచున్నవారు అనునిత్యం పారాయణం చేస్తే సకల అష్ట ఐశ్వర్య సంపదలు కలుగుతాయి. ఆనారోగ్య రుగ్మతలతో భాదపడుచున్నివారు అదిత్య హృదయమును పారాయణము చేసినచో వారి రోగాలు మాయమగును. వ్యాపారస్తులు పారాయణము చేసినచో వారివ్యాపారం అభివృద్ధిచెంది ధనం సమకూరుతుంది. నిరుద్యోగులు పారాయణము చేస్తే వారికి మంచి ఉద్యోగం లబిస్తుంది. విద్యార్ధులు పారాయణము చేసినచో పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. కుటుంబ కలహాలతో భాదపడేవాడు పారాయణము చేసినచో వారికి మేలు జరుగును.
ఆదిత్య హృదయం రామ,రావణ సంగ్రామములో వెలువడింది. ఆమోగమైన తపశ్శక్తి కలిగిన రావణసురున్ని వధించడానికి శ్రీరామునికి శక్యము కాలేదు. రావణుడు చావు లేకుండునట్లు అనేక వరములు పొందడం వల్ల శ్రీరామునకు రావణాసుర వధ వీలు కాలేదు. శ్రీరాముడు ఎన్ని ఆస్త్ర శస్తమ్రులను ప్రయోగించినను రావణుడు చావలేదు.దీనితో శ్రీరాముడు చింతాకాంతుడెై ఉండెను. రామరావణ యుద్ధమును చూచుటకై దేవతలతో కలిసి ఆగస్త్య మహాముని శ్రీరామునిచేరుకొనియిట్లనియే.
ఓరామ!నీకు మహీ పవిత్రమైన రహస్యమును చెప్పెదను వినుము. మహా పుణ్యప్రదము, జయప్రదము, మంగళకరము, శుభ కరము, సమస్త పాపాలను నశింపజేయు, దీర్ఘ ఆయుషును కులుగజేయు అదిత్య హృదయమును నీకు ఉపదేశించెదను. దీని వల్ల నీవు యుద్ధమును, రావణున్ని సులభంగా జయించగలవు.
శ్రీరాముడు భక్తితో ఆదిత్య హృదయమును మూడు సార్లు పఠించగా ఆ పరమాత్ముడు అనందించినవాడెై దేవతలతో కలిసి వచ్చి ఆదిత్యుడు పులకాంకిత శరీరుడెై శ్రీరాముని జూచి ‘‘ఓ రామా! రావణునకు అంత్యకాలము సంప్రాప్తించినది.’’ అలస్యం చేయక త్వరపడుము అని ఆశీర్వదించాడు. త్వర అనే మాట ఆదిత్యుని నోట వెలువడిన వెంటనే రావణ సంహారము జరిగి లోక కళ్యాణము జరుగుతుంది. బయటి శత్రువులనే కాక అంతశ్శత్రువులను కూడా అవలీలగా జయించేందుకు ఆదిత్య హృదయము ఆమోగమైన అక్షర సాధనం అని ఉపదేశించాడు.తాను వెలుగుతూ ప్రపంచానికి వెలుగును ఇచ్చే భాస్కరుని నమ్ముకుంటే ఎవరికి ఏమి లోటు ఉండదనెను.
No comments:
Post a Comment