Thursday 15 September 2016

గ్రహదోషం - శాంతి పూజలు

మానవ జీవితమున నవగ్రహాల ప్రభావంతో ఈతిబాధలు తప్పవు. నవగ్రహాలలో ఒక్కో గ్రహం, దాని తాలూక దోషం.. ఆయా వ్యక్తులకు మనఃశాంతి లేకుండా చేస్తుంటాయి. అందువల్ల గ్రహదోషం అనగానే వాటికి శాంతి చేయించడానికి పలు రకాల అవస్థలు పడుతుంటారు. అయితే ఈ గ్రహదోషాలు తొలగిపోవడానికి నియమబద్ధమైన పూజలే కాదు, వివిధ రకాల స్నానాలను గురించి కూడా శాస్త్రాలు చెబుతున్నాయి.
స్నానౌషధములు సిద్ధౌషధ సేవల వల్ల వ్యాధులు, మంత్ర జపము వల్ల సకల భయం తీరునట్లుగా ఔషధస్నాన విధానం వల్ల గ్రహదోషములు నశించును.
సూర్య గ్రహ దోష నివారణకు...
కుంకుమ పువ్వు, మణిశిల, ఏలుకలు, దేవదారు, వట్టివేళ్ళు, యష్టిమధుకము, ఎర్ర పుష్పాలు, ఎర్రగన్నేరు పువ్వులు.. ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఈ నీటితో స్నానం చేయాలి. సూర్య గ్రహ దోష నివారణకు గాను సూర్యున్ని పూజించుట, ఆదిత్య హృదయం పారయణ చేయుటకు, కెంపు,(మాణిక్యము) ధరించుట, సూర్యునకు గోధుములు, బెల్లం, కంచు, గుర్రము, రక్త చందనం, పద్మములు, ఆదివారం, దానం చేస్తే.. రవి వలన కలిగిన దోషాలు తొలుగును.
కంచుతో చేయబడిన ఉంగరం ధరించుట వల్ల మంజిష్టం గజమదం, కుంకుమ పువ్వు రక్త చందనములను రాగి పాత్రయందలి నీటిలో కలిపి ఆ రాగి పాత్ర యందలి నీటితో స్నానము చేసిన దోష నివృత్తి కలుగుతుంది. రాగి ఉంగరము ధరించడం కూడా మంచిదే.
శుభ తిధి గల ఆదివారము రోజున సూర్యుని
ఓం-హ్రాం-హ్రీం-హ్రౌం-సః సూర్యాయనమహః
అను మూలమంత్రమును 40 రోజులలో 6 వేలు జపము పూర్తి చేసిన సూర్య సంబంధమైన దోషాలు తొలగిపోతాయి.
చంద్ర గ్రహ దోష నివారణకు...
గో మూత్రం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు పేడ, ఆవు నెయ్యి, శంఖములు, మంచి గంధములు, స్పటికము.. ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానము చేయాలి. చంద్రగ్రహ దోష నివారణకు చంద్రుని పూజించుట, దుర్గా దేవి ఉపాసించుట, బియ్యం దానం చేయుట, ముత్యం ఉంగరాన్ని ధరించుట గాని, మాలగా వేసుకొనుట గాని చేయాలి. సీసం, తెల్లని ఆవు, ముత్యములు, తెల్లని వస్త్రం నేయితో నింపిన కలశం, ఎద్దులలో ఎదేని ఒకటి సోమవారం దానము చేసినచో చంద్రునకు సంబంధించిన దోషం పోవును. వట్టివేర్లు, దిరిసెన గంధం, కుంకుమ పువ్వు, రక్త చందనము కలిపి శంఖములోపోసిన నీటితో స్నానం ఆచరిస్తే చంద్ర దోష పరిహారం కలుగుతుంది.
సీసపు ఉంగరము, వెండి ఉంగరము గాని ధరించుట మంచిది. శుభ తిధి గల సోమవారము నందు ఓం-శ్రాం-శ్రీం-శ్రౌం-సః చంద్రయనమః
అను మంత్రమును 40 జపము చేసి చివరి రోజున అంటే.. 41వ రోజున బియ్యం, తెల్లని వస్త్రం నందు పోసి దానం చేస్తే చంద్ర దోష నివారణ కలుగుతుంది.
కుజ గ్రహ దోష నివారణకు...
మారేడు పట్టూ, ఎర్ర చందనము, ఎర్ర పువ్వులు, ఇంగిలీకము, మాల్కంగినీ, సమూలంగా పొగడ పువ్వులు.. ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానం ఆచరించాలి. కుజ దోష నివారణకు గాను కుజుని పూజించి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్లగానీ, ఎర్రని పగడమును గాని కందులు, మేకలు, బెల్లము, బంగారము, ఎర్రని వస్త్రము, రాగి వీటి యందేదయిన దానము చేయుటకు కాని కుజదోష నివారణ అవుతుంది. వెండి పాత్రయందు చండ్రకర్ర గంధము, దేవదారుగంధం ఉసిరిక పప్పు కలిపిన నీటితో స్నానం ఆచరిస్తే అంగారకదోష నివారణ కలుగుతుంది.
బంగారు ఉంగరము ధరించు ఆచారము కలదు. శుభ తిధి గల మంగళవారం రోజున
ఓం-క్రాం-క్రీం-క్రౌం-సః భౌమాయనమః అను మంత్రమును 7 వేలు 40 రోజులలో పూర్తి చేసిన ఎర్రనిరంగు బుట్టలో కందులు వేసి 41 వ రోజున దానం చేయడం మంచిది.
బుధ గ్రహ దోష నివారణకు...
చిన్న సైజులో ఉండే పండ్లు, ఆవు పేడ, గోరోచనము, తేనే, ముత్యములు బంగారము.. ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానం ఆచరించవలెను. బుధ గ్రహ దోష నివారణకుగాను బుధ గ్రహమునకు పూజ,విష్ణు సహస్రనామ పారయణ చేయాలి. పెసలు దానము చేయాలి. ఆకు పచ్చ రంగు బట్ట, తగరము, టంకము, పచ్చ పెసలు, మరకతము, లొట్టపిట్ట, గజదండము (అంకుశము), పచ్చని పూవులు... వంటి వానిలో ఒకటి దానం చేసినచో బుధగ్రహం వలన కలుగు దోషం పరిహరించబడును.
నదీసంగమము నందు గల సముద్రపు నీటిని మట్టిపాత్రలో పోసి ఆ నీటిలో గజమదము కలిపి, ఆ నీటిని స్నానం చేస్తే కూడా బుధ దోషం తొలగును. ఇత్తడి లేక కంచు ఉంగరము ధరించుట సంప్రదాయము. శుభ తిధితో కూడిన బుధవారమునందు
ఓం-బ్రాం-బ్రీం-బ్రౌం-సః బుధాయనమః
అను మంత్రమును 40 రోజులలో జరిపించి చివరి రోజున అనగా 41 ఆకు పచ్చని వస్త్రములలో పెసలు పోసి దానము చేసినచో బుధగ్రహ దోష నివారన కలుగును.
గురు గ్రహ దోష నివారణకు...
మాలతీ పువ్వులు, తెల్ల ఆవాలు, యష్టి మధుకం, తేనే... వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానము చేయాలి. గురు దోష నివారణకు గురుగ్రహమును పూజించుట నమక పారాయణ చేయడం వల్ల దోష నివారణయగును. పుష్యరాగం ఉంగరమున ధరించుట శనగలు, పుష్యరాగం, పసుపు, చక్కెర, ఏనుగు, బంగారు రంగువస్త్రము గాని, బంగారము గాని ఎదొకదానిని దానము చేయుటవలన కూడా గురునకు సంబంధించిన దోషము శాంతించగలదు. బంగారుతో చేసిన పాత్రతో బ్రహ్మమేడి (బొడ్డ), మారేడు, మర్రి, ఉసిరిక ఫలములను వేసి ఆ నీటితో స్నానం చేస్తే.. గురువునకు సంబంధించిన దోషము తొలగిపోవును.
బంగారముతో చేసిన ఉంగరము సాంప్రదాయము. శుభతిధి గల గురువారము నాడు ఉదయము ఓం-హ్రాం-హ్రీం-హ్రౌం-సః బృహస్పతయే నమః
అను మంత్రము 40రోజులలో 16వేలు జపము పూర్తి చేసి పసుపు పచ్చని బట్టలో సెనగలు దానమిచ్చినచో గురుగ్రహ దోష శాంతి కలుగును.
శుక్ర గ్రహదోష నివారణకు...
కుంకుమ పువ్వు, యాలుకలు, మణిశిల, శౌవర్చ లవణము.. ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానం ఆచరించాలి. శుక్ర గ్రహ గ్రహ నివారణకు గాను శుక్ర గ్రహమునకు లక్ష్మీదేవికి పూజ చేయాలి. వజ్రమును ఉంగరంను ధరించుట వలన శుభ వస్త్రము, తెల్లని గుర్రము తెల్లని ఆవు, వజ్రం, వెండి, గంధము, బియ్యం బొబ్బర్లు వీటియందేదొకటి దాన మిచ్చుట వలన గాని శుక్ర గ్రహ దోషం నివారింపబడును. వెండి పాత్రయందలి నీటిలో గోరోచనము గజమదము, శక్తిపుష్పము, శతావరిని కలిపి, ఆ నీటితో స్నానం ఆచరిస్తే శుక్రగ్రహ సంబంధమైన దోషం తొలగును.
వెండితో చేసిన ఉంగరము గాని, ముత్యముతో వెండి ఉంగరము ధరించుట సంప్రదాయము. శుభతిధితో కూడిన శుక్రవారమునందు
ఓం-ద్రాం-ద్రీం-ద్రౌం-సః శుక్రాయనమః
అను మంత్రము 20,వేలు 40రోజులలో జపము పూర్తిచేసి ,41వ రోజున తెల్లని వస్త్రములో బొబ్బరులుపోసి దానము చేసిన శుక్ర సంబంధమైన దోషం నివారింపబడును.
శని గ్రహ దోష నివారణకు..:
సాంబ్రాణి, నల్ల నువ్వులు, సుర్మరాయి, సోపు.. వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానం చేయాలి. శని గ్రహ దోష నివారణకు శనిగ్రహ పూజలు,ఈశ్వర పూజ, తైలాభిషేకం, నీలమణి ధరించుట, నువ్వులు దానం చేయడం వల్ల గ్రహ దోష నివారణ కలుగును. నీలం, నూనె, నువ్వులు, గేదె, ఇనుము, నల్లని ఆవులందు ఏదో ఒకటి దానం చేయవలెను. ఇనుప పాత్రయందు గల నీటిలో మినుములు, ప్రియంగు ధాన్యము, నీలగంధ, నీల పుష్పములు వేసి ఆ నీటితో స్నానము చేస్తే శనిగ్రహ దోష నివారణయగును.
శుభతిధి గల శనివారము నుండి
ఓం-ఖ్రాం-ఖ్రీం-ఖ్రౌం-సః శనయేనమః
అను మంత్రము 40 రోజులలో 19వేలు జపము చేసి, 41వ రోజున నువ్వులు నల్లని బట్టలో వేసి శని గ్రహ దోష నివారణ కలుగుతుంది.
రాహు గ్రహ దోష నివారణకు...
నువ్వు చెట్టు ఆకులు, సాంబ్రాణి, కస్తూరి, ఏనుగు దంతము (ఏనుగు దంతం లభించకపోతే మిగిలినవి).. ఈ వస్తువులను నీళ్ళలో వేసి ఆ నీటితో స్నానం ఆచరించాలి. రాహు గ్రహ దోష నివారణకుగాను రాహు గ్రహమును పూజించుట, దుర్గాదేవిని పూజించుట, గోమేధికమును ధరించుట వలన రాహు గ్రహ దోష నివారణ యగును, గోమేధ్కము, గుర్రము, నీలవస్త్రము, కంబళి నూనె, మినుములు, పంచలోహములు, వీటియందేదైన దానం చేయడం వల్ల కూడా దోష శాంతి కలుగును.
గేదె కొమ్ముతో చేసిన పాత్రయందలి ఉదకమున గుగ్గిలము, ఇంగువ,హరిదళము, మనశ్శిలలతో కలిపి ఆ నీటితో స్నానం చేసి అన్చో రాహు దోషం తొలగును. పంచ లోహములతో చేసిన ఉంగరము ధరించుట సాంప్రదాయం. శుభతిధి గల శనివారము నాడు రాహుమంత్రమగు
ఓం-భ్రాం-భ్రీం-భ్రౌం-సః రాహవే నమః
అను మంత్రమును 40 రోజులలో 18 వేలు జపము పూర్తి చేసి, 41వ రోజున మినుము చల్లని బట్టలో వేసి దానం చేసినచో రాహుగ్రహ సంబంధమైన దోషం తొలగిపోవును.
కేతు గ్రహ దోష నివారణకు...
సాంబ్రాణి, నువ్వుచెట్టు ఆకులు, మేజ మూత్రం, మారేడు పట్ట, ఏనుగు దంతం, (ఏనుగు దంతం లభించకపోతే మిగిలినవి).. ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానం చేయవలెను. కేతు దోష నివారణకుగాను కేతుగ్రహమును పూజించి సూర్యనమస్కారములు చేస్తూ ఉలవలు దానం ఇవ్వాలి. వైఢూర్యం, నూనె, శాలువా, కస్తూరి, ఉలవలు వీటిని దానం చేసినా కూడా కేతుగ్రహ దోష నివారణ కలుగుతుంది.
ఖడ్గమృగము కొమ్ముతో చేయబడిన పాత్రయందు గల నీటిలో పర్వతముల యందు పందికొమ్మతో తవ్వబడిన మట్టి, మేక పాలు కలిపి ఆ నీటితో స్నానం ఆచరిస్తే కేతుగ్రహ దోష నివారణ కలుగును. పంచలోహముల ఉంగరం ధరించుట సాంప్రదాయం. శుభ తిధి గల మంగళవారం నాటి నుంచి
ఓం-ప్రాం-ప్రీం-ప్రౌం-సః కేతవే నమః
అను మంత్రమును 40 రోజులలో 7 వేలు జపము పూర్తి చేసి 41వ రోజున ఎర్రని వస్త్రంలో ఉలవలు పోసి దానమిచ్చిననూ కేతుగ్రహ దోష నివారణ కలుగుతుంది.

Sunday 11 September 2016

ఆదిత్య హృదయం


ఆదిత్య హృదయం అనే ఈ స్తోతము సూర్యభగవానుడి ని ఉద్దేశించినది. రామాయణం యుద్ధకాండలో శ్రీ రాముడు అలసట పొందినప్పుడు, అగస్త్య మహర్షి యుద్ధ స్థలానికి వచ్చి ఆదిత్య హృదయం అనే ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు.ఈ ఉపదేశము అయిన తరువాత శ్రీరాముడు రావణాసురుడిని నిహతుడిని చేస్తాడు. వాల్మీకి రామాయణం లోని యుద్ధకాండమునందు 107 సర్గలో ఈ అదిత్య హృదయ శ్లోకాలు వస్తాయి.
1. తతో యుద్ద పరిశ్రాంతం సమరే చింతయా స్థితం |
రావణంచాగ్రతో దృష్వా – యుద్దాయ సముపస్థితమ్‌ ||
అర్థము : యుద్ధము చేసి చేసి మిక్కిలి అలసియున్న శ్రీరాముడు సమరరంగమున చింతా క్రాంతుడైయుండెను. పిమ్మట రావణుడు యుద్ధసన్నద్ధుడై ఆ స్వామి యెదుట నిలిచి యుండెను.
2. దైవతైశ్చ సమాగమ్య – ద్రుష్టు మభాగ్యతో రణం |
అర్థము : ఉపగమ్యాబ్రవీ ద్రామ – మగస్త్యో భగవాన్‌ ఋషి: ||
యుద్ధమును చూచుటకై దేవతలతో కూడి అచ్చటికి విచ్చేసిన పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముని సమీపించి, ఆ ప్రభువుతో ఇట్లు పల్కెను.
3. రామ రామ మహాబాహో – శృణుగుహ్యం సనాతనం |
యేనసర్వా నరీ న్వత్స – సమరే విజయిష్యసి ||
అర్థము : ఓరామా! మహాబాహో! నాయనా! సనాతనము మిగుల గోప్యము ఐన ఈ స్తోత్రమును గూర్చి తెలిపెదను వినుము. దీనిని జపించినచో సమరమున నీవు శత్రువులపై విజయము సాధించగలవు.
4. ఆదిత్యహృదయంపుణ్యం – సర్వశత్రువినాశనం |
జయావహం జపేన్నిత్యం – మక్షయ్యం పరమం శుభమ్‌ ||
అర్థము : ఈ ఆదిత్యహృదయ అను స్తోత్రము పరమ పవిత్రమైనది. సమస్త శత్రువులను నశింపజేయునది. నిత్యము దీనిని జపించినచో సర్వత్ర జయములభించుట తథ్యము. ఇది సత్ఫలములను అక్షయముగ ప్రసాదించునది.
5. సర్వ మఙ్గలమాఙ్గల్యం – సర్వపాపప్రణాశనం |
చిన్తాశోకప్రశమన – మాయుర్వర్ధన ముత్తమమ్‌ ||
అర్థము : ఇది పరమపావనమైనది. సకల శ్రేయస్సులను సమకూర్చి సమస్త పాపములను నశింపజేయును ఆధివ్యాధులను తొలగించి ఆయుస్సును వృద్ధిపరుచును. సర్వ జపములలో శ్రేష్ఠమైనది. కావున దీనిని జపించుట ఎంతేని ఆవశ్యము.
6. రశ్మిమన్తం సముద్యన్తం – దేవాసురనమస్కృతం |
పూజయస్వ వివస్వన్తం – భాష్కరం భువనేశ్వరమ్‌ ||
అర్థము : అనంతమైన బంగారుకిరణములతో శోభిల్లుచు, జాతికి జాగృతి కూర్చును. దేవాసురులు ఈయనకు ప్రణమిల్లుదురు. మిక్కిలి తేజస్సుగలవాడు, సమస్త భువనములన నియంత్రించువాడు, లోకములకు వెలుగునిచ్చు ఆదిత్యుని పూజింపుము.
7. సర్వదేవాత్మకో హ్యేష – తేషస్వీ రశ్మిభావన: |
ఏష దేవాసురగణాన్‌ -లోకా న్పాతి గభ స్తిభి: ||
అర్థము : ఇతడు సమస్త దేవతలకు ఆత్మయైనవాడు. తేజో రాశి. తన కిరణములచే లోకమునకు శక్తిని, స్ఫూర్తిని ప్రసాదించువాడు. దేవాసుర గణములతో గూడి సమస్త లోకములను తన కిరణములచే రక్షించుచుండువాడు.
8. ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ – శివ స్స్కన్ధ: ప్రజాపతి: |
మహేన్ద్రో ధనద: కాలో – యజు స్సోమో హ్యపాంపతి: ||
అర్థము : బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారస్వామి, ప్రజాపతి, దేవేంద్రుడు, కుబేరుడు, కాలస్వరూపుడు, యముడు, చంద్రుడు, వరుణుడు మరియు
9. పితరో వసస్సాధ్యా – హశ్శినౌ మరుతో మను: |
వాయు ర్వహ్ని: ప్రజా: ప్రాణా – ఋతుకర్తా ప్రభాకర: ||
అర్థము : పితృదేవతలు. వసువులు, సాధ్యులు. అశ్వినీదేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రజలు మొదలగువారి స్వరూపములు అన్నిము ఇతనివే. షడృతువులకు కారకుడు ఈ ప్రభాకరుడే.
10 ఆదిత్య స్సవితా సూర్య: – ఖగ: పూషా గభస్తిమాన్‌ |
సువర్ణసదృశో భాను: – స్వర్ణరేతా దివాకర: ||
అర్థము : ఆదిత్యుడు జగత్‌సృష్టికి కారకుడు. జనులు తమవిధులు నిర్వర్తించుటకు ప్రేరణయిచ్చును. లోకోపకారం కొరకు ఆకాశమున సంచరించి వర్షములద్వారా జగత్తును పోషించి తన కిరణములను ప్రకాశింపజేయును. బంగారు వన్నెతో తేజరిల్లుచు అద్భుతముగా ప్రకాశించువాడు. బ్రహ్మాండములు ఉత్పత్తికి బీజమైనవాడు. చీకట్లను తొలగించుచు దివాసమయమున ప్రాణులను కార్యనిమగ్నులను గావించువాడు.
11. హరిదశ్వ స్సహస్రార్చి – స్సప్తసప్తి ర్మరీచిమాన్‌ |
తిమిరోన్మథన శ్శంభు – స్త్వష్టా మార్తాణ్డ అంశుమాన్‌ ||
అర్థము : శ్యామవర్ణముగల రథాశ్వములు గలవాడు. అసం ఖ్యాకములైన కిరణములు గలవాడు. సప్త అను పేరుగల రథాశ్వముగలవాడు. రథమునకు ఏడు గుఱ్ఱములుగలవాడు. తేజో నిధానములైన కిరణములు గలవాడు. సర్వసంహారకుడు. జగత్ప్రళయమునకు పిమ్మట దానిని మరల సృజించుటకై ఆవిర్భవించెడివాడు. నిరంతరము తన కిరణములచే ప్రకాశించుచుండువాడు.
12. హిరణ్య గర్భ శ్శిశిర – స్తపనో భాస్కరో రవి: |
అగ్ని గర్భో దితే:పుత్ర – శ్శంఖ శ్శిశిరనాశన: ||
అర్థము : బ్రహ్మాండములను తన ఉదరమునందు ధరించువాడు. తాపత్రయములతో బాధపడువారికి ఆశ్రయమై వాటిని తొలగించుటకు శాంతిని ప్రసాదించువాడు, తపింపజేయువాడు. దివ్యములైన వెలుగులను గూర్చువాడు. సకల లోకములకు స్తుతిపాత్రుడు. దివాసమయమున అగ్నిని గర్భమునందు ధరించువాడు. అదితి దేవికి పుత్రుడుగా అవతరించినవాడు. సాయంకాలమున స్వయముగా శాంతించువాడు. మంచును తొలగించువాడు.
13. వ్యోమనాథ స్తమోభేదీ – ఋగ్యజుస్సామపారగ: |
ఘనవృష్ఠి రపాంమిత్రో – విన్ద్యవీథీప్లవఙ్గమ: ||
అర్థము : ఆకాశమునకు అధిపతియైనవాడు. రాహువును ఛేదించు లక్షణముగలవాడు. పూర్వాహ్ణమున ఋగ్వేదరూపము, మధ్యాహ్న సమయమున యజుర్వేదరూపమును, సాయంసమయమున సామవేదరూపమునను అలరారుచుండెడివాడు. ఘనముగా వర్షములను కురిపించుచుండువాడు. అందువలననే జలములను వర్షింపజేయువాడు అని ఖ్యాతి వహించెను. వింధ్యగిరి మార్గమున అతివేగముగా సంచరించువాడు.
14. ఆతపీ మణ్డలీ మృత్యు: – పింగల స్సర్వతాపన: |
కవిర్విశ్వోమహాతేజా – రక్త స్సర్వభవోద్భవ: ||
అర్థము : వేడిని కలిగియుండువాడు. వృత్తాకారమైన బింబము గలవాడు. విరోధులను రూపుమాపువాడు. ప్రభాత సమయమున పింగళవర్ణము కలిగియుండువాడు. మధ్యాహ్న సమయమున సర్వప్రాణులను తపింపజేయువాడు. వ్యాకరణాది సమస్త శాస్త్రముల యందును పండితుడు. విశ్వమును నిర్వహించువాడు. గొప్ప తేజస్సు గలవాడు. సకల ప్రాణులయందును అనురక్తి గలిగి యుండువాడు. సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు.
15. నక్షత్రగ్రహతారాణా – మధిపో విశ్వభావన: |
తేజసా మపితేజస్వీ – ద్వాదశాత్మ న్నమోస్తుతే ||
అర్థము : నక్షత్రములకు, గ్రహములకు, తారలకును అధిపతియైనవాడు. విశ్వస్థితికి హేతువు. అగ్న్యాది తేజస్సులకు మించిన తేజస్సు గలవాడు. పన్నెండు రూపములతో విలసిల్లువాడు. ఈ నామములతో ప్రసిద్ధికెక్కిన సూర్యభగవానుడా నీకు నమస్కారం.
16. నమ: పూర్వాయ గిరయే – పశ్చిమే గిరయే నమ: |
జ్యోతిర్గణానాం పతయే – దినాధిపతయే నమ: ||
అర్థము : స్వామీ! నీవు పూర్వగిరియందును, పశ్చిమగిరి యందును విలసిల్లుచుండువాడు. గ్రహములకు, నక్షత్రములకు, దివారాత్రములకు అధిపతివి. ఉపాసకులకు జయము అనుగ్రహించునట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.
17. జయాయ జయభద్రాయ – హర్యశ్వాయ నమో నమ: |
నమో నమ స్సహస్రాంశో – ఆదిత్యాయ నమో నమ: ||
అర్థము : జయములను, శుభములను చేకూర్చువాడవు. శ్యామవర్ణముగల రథాశ్వములుగలవాడవు. వేలకొలది కిరణములు గలవాడవు. అదితి పుత్రుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.
18. నమ ఉగ్రాయ వీరాయ – సారఙ్గాయ నమో నమ: |
నమ: పద్మప్రబోధాయ – మార్తాణ్డాయ నమో నమ: ||
అర్థము : నిన్ను ఉపాసించని వారికి నీవు భయంకరుడవు. ప్రాణులకు శక్తిని ప్రసాదించువాడవు. శీఘ్రముగ ప్రయాణించువాడవు. పద్మములను వికసింపజేయువాడవు. జగత్ప్రళయమునకు పిమ్మట మరల సృజించుటకై ఆవిర్భవించు నట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.
19. బ్రహ్మేశానాచ్యుతేశాయ – సూర్యా యాదిత్యవర్చసే |
భాస్వతే సర్వభక్షాయ – రౌద్రాయ వపుషే నమ: ||
అర్థము : బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకవు. దివ్య తేజస్సంపన్నుడవు. కాంతికి నిధియైన వాడవు. ప్రళయకాలమున లయకారకుడవు. అందువలన రుద్రస్వరూపుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.
20. తమోఘ్నాయ హిమఘ్నాయ – శత్రుఘ్నా యామితాత్మనే |
కృతఘ్నఘ్నాయ దేవాయ – జ్యోతిషాం పతయే నమ: ||
అర్థము : తమస్సును రూపుమాపువాడవు. జడత్వమును, శీతలత్వమును నశింపజేయువాడవు. నిన్ను ఆశ్రయించి నవారి శత్రువులను సంహరించువాడవు. పరమాత్మ స్వరూపుడవు. కృతఘ్నులను నశింపజేయుచు, దివ్యతేజస్సు విరజిమ్ముచు, జ్యోతులకు అధిపతివైన నీకు నమస్కారము.
21. తప్తచామీకరాభాయ – వహ్నయే విశ్వకర్మాణే |
నమస్తమోభినిఘ్నాయ – రుచయే లోకసాక్షిణే ||
అర్థము : బంగారమువంటి వన్నెగలవాడవు. ఆహుతులను గ్రహించువాడవు. సర్వజగత్కర్తవు. తమస్సులను పారద్రోలువాడవు. ప్రకాశస్వరూపుడవు. జగత్తున జరిగెడి సర్వజనుల కర్మలకు సాక్షియైన వాడవు. కనుక ఓ భాస్కరుడా నీకు నమస్కారము.
22. నాశయ త్యేష వైభూతం – త దేవ సృజతిప్రభు: |
పాయత్యేష తపత్యేష – వర్స త్యేష గభస్తిభి: ||
అర్థము : రఘునందనా! ఈ ప్రభువే సమస్త ప్రాణులను లయమొనర్చును. పిదప సృష్టించి పాలించుచుండును. ఇతడు తన కిరణముల చేత జగత్తును తపింపజేయును. వర్షములను ప్రాసాదించుచుండును.
23. ఏష సుప్తేషు జాగర్తి – భూతేషు పరినిష్ఠిత: |
ఏష చైవాగ్నిహోత్రఞ్ఛ – ఫలంచై వాగ్ని హోత్రిణామ్‌. ||
అర్థము : ఇతడు సకల ప్రాణులలో అంతర్యామిగా నుండును. వారు నిద్రించుచున్నను తాను మేల్కొనియే యుండును. హవిస్సు యొక్క స్వరూపము ఇతడే. తత్ఫలస్వరూపమూ ఇతడే.
24. వేదాశ్చక్రతవశ్చైవ – క్రతూనాం ఫల మేవ చ |
యాని కృత్యానిలోకేషు – స ర్వ ఏషరవి: ప్రభు: ||
అర్థము : ఇతడు వేదవేద్యుడు. యజ్ఞఫలస్వరూపుడు. లోకములో జరిగెడి సమస్త కార్యములకు ఈ సూర్యభగవానుడే ప్రభువు.
25. ఏనమాపత్సుకృచ్ఛ్రేషు – కాన్తారేషు భయేషు చ |
కీర్తయ న్పురుష: కశ్చి – న్నావసీదతి రాఘవ ||
అర్థము : రఘురామా! ఆపదలయందును, కష్టముల యందును, దుర్గమమార్గములయందును, భయస్థితులయందును ఈ స్వామిని కీర్తించినవారికి నాశము ఉండదు.
26. పూజాయ స్వైన మేకాగ్రో – దేవదేవం జగత్పతిత్‌ |
ఏత త్త్రిగుణితం జప్త్వా- యుద్దేషు విజయిష్యసి ||
అర్థము : దేవదేవుడు, జగత్పతియైన ఈ సూర్యభగవానుని ఏకాగ్రతతో పూజింపుము. ఈ ఆదిత్యహృదయమును ముమ్మారు జపించినచో నీవు ఈ మహా సంగ్రామము నందు విజయము పొందగలవు.
27. అస్మిన్‌ క్షణే మహాబాహో – రావణం త్వం వధిష్యసి |
ఏవముక్త్వాతదా గస్త్యో – జగామ చ యథాగతమ్‌ ||
అర్థము : మహాబాహో! రామా! ఈ క్షణముననే నీవు రావణుని వధింపగలవు అని పలిగి అగస్త్య మహర్షి తన స్థానమునకు చేరెను.
28. ఏత చ్ఛ్రుత్వా మహాతేజా – నష్టోశోకో భవ త్తదా |
ధారయామాస సుప్రీతో – రాఘవ: ప్రయతాత్మవాన్‌ ||
అర్థము : మహాతేజస్వియైన శ్రీరాముడు అగస్త్యమహాముని ద్వారా ఈ ఆదిత్యహృదయ మహిమను గ్రహించి చింతారహితుడయ్యెను. అతడు మిక్కలి సంతృప్తి పొంది ఏకాగ్రతతో ఆదిత్యహృదయ మంత్రమును మనస్సు నందు నిలుపుకొనెను.
29. ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు – పరంహర్ష మవాప్తవాన్‌ |
త్రిరాచమ్య శుచిర్భూత్వా – ధను రాదాయ వీర్యావాన్‌ ||
అర్థము : పిదమ ముమ్మారు ఆచమించి శుచియై సూర్యభగవానుని జూచుచు ఈ మంత్రమును జపించి పరమ సంతుష్టుడాయెను. పిమ్మట ఆ రఘువీరుడు తన ధనువును చేబూనెను.
30. రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్దాయ సముపాగమత్‌ |
సర్వయత్నేన మహతా వధే తస్య ధృతోభవత్‌ ||
అర్థము : మిక్కిలి సంతుష్టుడైయున్న ఆ రాముడు రావణుని జూచి యుద్ధమునకై పురోగమించెను. అన్ని విధములుగా గట్టి పూనికతో ఆ నిశాచరుని వధించుటకు కృతనిశ్చయుడయ్యెను.
31. ఆథ రవి రవద న్నిరీక్ష్య రామం ముదితమానా: పరమం ప్రహృష్యమాణ: |
నిశచరపతి సంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచ స్త్వరేతి ||
అర్థము : పిమ్మట దేవతలమధ్యనున్న సూర్యభగవానుడు రావణుడు నశించుట తథ్యము అని ఎరింగి మానసోల్లాసమును పొందినవాడై, పరమ సంతోషముతో శ్రీరాముని జూచి రామా! త్వరపడుము అని పలికెను.