Friday 29 April 2016

కర్తరీ


భారత పురాణాల ప్రకారం కాలాన్ని సూర్య, చంద్ర, బృహస్పతి మానాలలో కొలుస్తారు. 27 నక్షత్రాలు ప్రతిరోజు ఒక దాని తర్వాత ఒక్కటి ఉదయించి, అస్తమిస్తాయి. చంద్రుడు ఉదయించి నప్పుడు ఏ నక్షత్రం ఉదయిస్తే ఆ నక్షత్రం ఆ రోజుగా భావిస్తారు. చైత్ర పౌర్ణమినాడు చిత్ర నక్షత్రంతో ఉదయించే చంద్రుడు మరుసటిరోజు వెనుకబడుతాడు. సూర్యుని గమనంతో ముడిపడి వున్న కాలమానాన్ని సౌరమానం అంటారు. సూర్యుడు 14 రోజులపాటు ఒకే నక్షత్రంతో కలిసి ఉదయించి తర్వాత వెనుకబడుతాడు. అశ్వనీ నక్షత్రంలో సూర్యుడు ఉదయించడం అరంభం కాగానే సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినట్లుగా గణిస్తారు. సూర్యునితో కలిసి ఏ నక్షత్రం ఉదయిస్తుందో ఆ 13 రోజుల సమయాన్ని కార్తె అని పిలుస్తారు. ఇలా అశ్వని నుండి రేవతి వరకు 27 కార్తెలు వుంటాయి.
సాధారణంగా కర్తరీ మే నెల 4 వతేదీన డొల్లుకర్తరీ ,మే నెల 11 వ తేదీన నిజకర్తరీ ప్రారంబమై మే నెల 28 వ తేదీతో కర్తరీ త్యాగం జరుగుతుంది.
సూర్యుడు మేషరాశికి చెందిన భరణి నక్షత్రం 4 వ పాదంలో ప్రవేశించినది మొదలుకొని వృషభ రాశిలోని రోహిణి నక్షత్రం మొదటి పాదం దాటే వరకు గల మద్య కాలాన్ని “కర్తరీ” అంటారు.అంటే భరణి నాలుగో పాదం ,కృత్తిక నాలుగు పాదాలు,రోహిణి మొదటి పాదం మొత్తం ఆరు పాదాలలో సూర్యుడు ఉన్న కాలం కర్తరీ అంటారు.దీనినే “కత్తెర” అనికూడ అంటారు. కర్తరి నక్షత్ర కాలంలో సూర్యుడు నిప్పులు చెరుగుతాడు.డిగ్రీలలో చెప్పాలంటే మేషరాశిలో(డిగ్రీల 23°-20' నిమిషాలు) నుండి వృషభరాశిలో (డిగ్రీల 26°-40' నిమిషాలు).
సూర్యుడు భరణి నక్షత్రం ప్రవేశించిన రోజే “డొల్లు కర్తరీ”ప్రారంభమవుతుంది.దీనినే "చిన్న కర్తరీ" అని కూడా అంటారు.సూర్యుడు కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశించే రోజుతో డొల్లు కర్తరీ అంతమై "నిజకర్తరి" ప్రారంభమవుతుంది.సూర్యుడు రోహిణి నక్షత్ర రెండవ పాదం ప్రవేశంతో కర్తరీ త్యాగం అవుతుంది.
కర్తరీ లో చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి.కర్తరిలో గృహ సంబంధమయిన పనులు చేయద్దన్నారు. నాటిరోజులలో వేసవిలో గృహ సంబంధమయిన పనులు తప్పించి మరొక పని వుండేడి కాదు. వేసవి నుంచి, వడగాడ్పు నుంచి రక్షణకే ఈ కర్తరి చెప్పి పని వద్దన్నారు. నిజానికి నక్షత్రమాన ప్రకారంగా వచ్చే కార్తెలు కర్షక, కార్మిక పంచాంగం అనచ్చు.భరణి మూడు నాలుగు పాదాలలో సూర్యుడున్నపుడు దొల్లు కర్తరి, కృత్తిక నాలుగు పాదాలు, రోహిణి రెండు పాదాలలో సూర్యుడు ఉన్నప్పుడు పెద్ద కర్తరి అంటాం. కర్తరి అంటే కత్తెర అని అర్ధం, దేనికి కత్తెర? ఎండలో పనికి కత్తెరనమాట. వేసవిలో మే నెలలో 4,5 తారీకులమొదలు మే 27,28 దాకా కర్తరి ఉంటుంది. ఆ తరవాత చల్లబడుతుంది కనక పనులు మొదలుపెట్టచ్చని చెప్పి ఉంటారు. వేసవిలో కార్మికుల భద్రతకోసం ఎంత గొప్ప ఏర్పాటు చేసేరో చూడండి. ఈ కార్తెలు ఒక రోజు ఇంచుమించులో ప్రతి సంవత్సరం ఒకలాగే వస్తాయి.
కర్తరీలో చెట్లు నరకటం, నారతీయటం, వ్యవసాయం ఆరంభం, విత్తనాలు చల్లటం,భూమిని త్రవ్వటం,తోటలు వేయటం, చెఱువులు, బావులు,కొలనులు త్రవ్వటం,కొత్త బండి కొనటం,అదిరోహించటం,నూతన గృహ నిర్మాణం చేయటం,పాత గృహాలను బాగు చేయటం వంటి గృహ నిర్మాణ పనులు చేయరాదు.
కర్తరీలో ఉపనయనం,వివాహం,యజ్ఞం,మండపాదులను కప్పటం వంటి పనులు చేయవచ్చును.

చేసిన పాపాలకి శిక్ష

మనం చేసిన పాపాలకి శిక్ష ఉంటుందని తెలుసు. కానీ తెలియకుండా కొన్ని, తెలిసి కొన్ని చేసేస్తూ ఉంటాం. ఈ విషయంలో మన సనాతన ధర్మంలో స్పష్టమైన విశ్లేషణ ఉంది. మనం చేసే అన్ని తప్పులు (పాపాలు) మూడిటితోనే చేస్తాం. (1) కాయిక (శరీర గత); (2) వాచిక (మాటతో); మరియు (3) మానసిక (మనసుతో). ఆ తప్పులు ఏమిటో తెల్సుకుని వాటిని ఎలా అరికట్టవచ్చో చూద్దాం. 

ఒకవేళ ఆ తప్పులు చేసినట్లైతే ప్రాయశ్చిత్తానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ మూడు విధములైన తప్పులకు మూడు విధములైన తపస్సులు చెప్పేరు. ఇవి ఎవరికి వారే వ్యక్తిగతంగాపరీక్షించుకుని మార్పు చెందే సుళువైన మార్గం.

(1) కాయిక (శరీరగత) పాపములు: మనుధర్మ శాస్త్ర ఆధారంగా…

శ్లోకం: అదత్తాముపాదానం హింసాచైవా విధానతః, పరదారోపసేవా చ శరీరం త్రివిధం స్మృతం.

అర్థం: అన్న్యాయముగా డబ్బు సంపాదించడం, హింస చేయడం, శాస్త్ర విరుద్ధమైన పనులు చేయడం, పరస్త్రీ సంగమం.. ఇవి శరీరముతో చేసే పాపములు (తప్పులు).

ఈ తప్పులని నిరోధించే మార్గం భగవద్గీత ఆధారంగా…
శ్లోకము: దేవ ద్విజ గురు ప్రాఙ్ఞ్య పూజనం శౌచమార్జవం, బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే.

అర్థము: దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, ఙ్ఞానులను పూజించడం, శరీరమును శుచిగా ఉంచడం, పవిత్రమైన ఆచారములు, డబ్బును, ఇతర ద్రవ్యములను న్యాయముగా సంపాదించడం, బ్రహ్మచర్యము (తన భార్యతో తప్ప ఇతర స్త్రీలయందు కామ దృష్టి లేకపోవడం), ఇతరులను హింసించకుండా ఉండడం.. ఇవి శారీరిక తపస్సులు.                                                            

(2) వాచిక (మాటతో) పాపములు:

శ్లోకము: పారుష్యమనృతం చైవ పైశున్యం చాపి సర్వశః, అసంబద్ధ ప్రలాపశ్చ
వాఙ్ఞ్మయంస్యాచ్చతుర్విధం.

అర్థం: కఠినముగా మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం, ఇతరులను నిందిస్తూ మాట్లాడడం, వ్యర్థమైన/పనికిమాలిన మాటలాడడం.. ఇవి వాక్కుతో చేసే తప్పులు.

ఈ తప్పులని నిరోధించే మార్గం భగవద్గీత ఆధారంగా…

శ్లోకము: అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్, స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్ఞ్మయం తప ఉచ్యతే.

అర్థము: ఉద్వేగం కలిగించకుండా మాట్లాడడం, ఇష్టముగా మరియు మేలుకలిగించే విధంగా మాట్లాడడం, యదార్థము మాట్లాడడం, వేద శాస్త్రములను పఠించడం, పరమేశ్వరుని నామ జపం చేయడం.. ఇవి వాక్కుకి సంబంధించిన దోషాలను పోగొట్టే తపస్సనబడుతుంది.

(3) మానసిక పాపములు:

శ్లోకము: పరద్రవ్యేష్వభిధ్యానం మనసానిష్ట చింతనం, వితథాభినివేశశ్చ త్రివిధం కర్మ మానసం.

అర్థము: ఇతరుల డబ్బును, ద్రవ్యాలను దోచుకోవాలనే ఆలోచన, పరులకి కీడుతలపెట్టే ఆలోచన, శరీర అభిమానము.. ఇవి మనసుకి సంబంధించిన పాపములు.

ఈ తప్పులని నిరోధించే మార్గం భగవద్గీత ఆధారంగా…

శ్లోకము: మనః ప్రసాదః సౌమ్యత్త్వం మౌనమాత్మ వినిగ్రహ:, భావ సంశుద్ధిరిత్యేతత్తపోమానసముచ్యతే.

అర్థము: మనసుని ప్రసన్నంగా ఉంచుకోవడం, శాంత భావం, సదా భగవచ్చింతన చేసే స్వభావం, మనోనిగ్రహం, అంతఃకరణాన్ని పవిత్రంగా ఉంచుకోవడము.. ఇవి మానసిక దోషములను పోగొట్టే తపస్సులనబడతాయి. అన్నిటిలోకి మానసిక తపస్సు చాలా గొప్పది. ఎందుకంటే అనేక తప్పులకు కారణం మానసిక దోషాలే. మనందరం ఈ నిముషం నుండే అభ్యాసం మొదలెడదాం 

భూమి గుండ్రంగా ఉన్నదని మొట్టమొదట చెప్పినది ఎవరు..?

మొట్టమొదట భూమి గుండ్రంగా ఉన్నదని మొట్టమొదట చెప్పినది ఎవరు..?
మనం చదువుకున్న చరిత్ర ప్రకారం 16,17 శతాబ్దాలకు చెందిన
కెప్లర్ , కోపర్నికస్, గెలీలియోలని.
కాని ఋగ్వేదం లోని క్రింది మంత్రం గమనించండి.
" చక్రాణాసః పరీణహం పృథివ్యా...."అర్థం "
అంటే భూమి యొక్క వృత్తపు అంచున ఉన్నవారు..."
అతిప్రాచీన గ్రంథం అయిన " సూర్యసిద్దాంతం " 12వ అధ్యాయం,32వ శ్లోకంలో
"మధ్యే సమంతాదణ్ణస్య భూగోళో వ్యోమ్ని తిష్టతి"
"బ్రహ్మాండం మద్యలో భూగోళం ఆకాశంలో నిలిచిఉంది"... అని దాని అర్థం.
ఆర్యభట్టు రచించిన "ఆర్యభట్టీయం" గ్రంథంలోని గోళపాద అధ్యాయంలో 6వ శ్లోకం
" భూగోళః సర్వతో వృత్తః" ..అంటే
భూమి వృతాకారంలో ఉన్నదని అర్థం.
క్రీ.శ.505 లో వరాహమిహిరుడు
" పంచ మహాభూతమయస్తారా గణ పంజరే మహీ గోళః..(13-1)"
అంటే .... పంచ భూతాత్మకమైన గుండ్రని భూమి,
పంజరం లో వేలాడే ఇనుప బంతిలా,
ఖగోళంలో తారల మధ్య నిలిచిఉంది"అన్నాడు.
" లీలావతి " గ్రంథం లో భాస్కరాచార్యుడు
" నీవు చూసేదంతా నిజం కాదు.ఎందుకంటే నీవు ఒక పెద్ద వృత్తం గీసి
అందులో నాల్గవ భాగం చూస్తే
అది మనకు ఒక సరళరేఖలా కనిపిస్తుంది.
కానీ నిజానికి అది వృత్తమే.
అలాగే భూమి కూడా గుండ్రంగానే ఉన్నది."

Wednesday 27 April 2016

యోగము ప్రాణాయామము


యాజ్ఞవల్క్యుడు, జనకమహారాజా ! నీకిక యోగము గురించి చెప్తాను. సాంఖ్యము కలుగు జ్ఞానము యోగముతో కలిగే బలమూ రెండూ సాటి లేనివి. కొంత మంది సాంఖ్యము యోగము వేరు వేరు అంటారు కాని నాను మాత్రం రెండూ ఒకటే అని భావిస్తాను. 'మనోధారణ ప్రాణాయామము అనునవి రెండు ప్రధాన యోగములు. మొదటిది నిర్గుణము రెండవది సగుణము. మనో ధారణ అంటే మనసును ఏకాగ్రతగా ఉంచడం. ప్రాణాయామము అనగా శ్వాసను క్రమపద్ధతిలో వదిలి పీల్చడం. ఇది మానవుడికి అసౌకర్యం కలిగించదు. క్రమపద్ధతిలో ప్రాణాయామం చేస్తూ ఇంద్రియములను అదుపులో ఉంచుకున్న వాడు యోగసిద్ధి పొందగలడు. ప్రాణాయామం చేసే సాధకుడు నియమ నిష్టలు పాటించాలి. ప్రాణాయామముకు రోజూ కొంత సమయము పాటించాలి. శరీరముకు అసౌకర్యం కలుగని రీతిలో ప్రాణాయామం అభ్యసించాలి. ఇలా ప్రాణాయామం పగలు రాత్రి అభ్యసించాలి. దీని వలన లోపలి వెలుపలి శరీరం శుద్ధి పొందుతుంది. యోగసిద్ధికి ప్రాణాయామము దానివలన కలిగే అంతః బాహ్య శుద్ధి మూలము. ఇది సగుణతంత్రం.
మనోధారణ నిర్గుణతంత్రము. ఇంద్రియములను మనసులో, మనసును అహంకారంలో, అహంకారమును బుద్ధిలో, బుద్ధిని ప్రకృతిలో లీనం చేయడమే ధ్యానం. నిరంతరం ధ్యానంలో నిమగ్నమైన వాడికి ముసలితనము లేదు. యోగికి మలినములు అంటవు, నిరంతర ఆనందము పొందుతూ పరమాత్మ దర్శనం పొందుతాడు. యోగి గాలిలో పెట్టిన దీపంలా నిశ్చలంగా ఉంటాడు. నిర్మలాకాశంలా ఉంటాడు, అటుపోటులకు చలించని సముద్రంలా ఉంటాడు. అతడి చుట్టూ భయంకర శబ్ధాది మనసుని కలవర పెట్టే విషయములను పట్టించు కొనడు. దీనినే యోగ మార్గం అంటారు. కాని ఈ మార్గంలో నడవడానికి ఎలాంటి అలసత్వం పనికి రాదు. ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండాలి. ఈ యోగికి ఎవరికి అందని మోక్షం లభిస్తుంది.
మరణ సమయంలో ఈ యోగికి పాదముల నుండి ప్రాణములు పోయినట్లైన విష్ణుపదము, పిక్కల నుండి పోయిన వసువులు ఉండే లోకమును, జానువుల(మోకాళ్ళ) నుండి పోయిన సాధ్యులు ఉండే లోకము లభిస్తుంది, విసర్జకావయవము నుండి పోయిన సూర్యలోకము లభిస్తుంది, తొడల నుండి పోయిన ప్రజాపతిలోకము లభిస్తుంది, జననేంద్రియముల నుండి పోతే భూలోకప్రాప్తి లభిస్తుంది, పార్శ్వముల నుండి పోతే మరుత్తుల లోకము ప్రాప్తిస్తుంది, బొడ్డులోనుండి పోతే చంద్రలోకము లభిస్తుంది, చేతుల నుండి పోతే స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది, వక్షస్థలం నుండి పోతే కైలాసప్రాప్తి లభిస్తుంది, ముఖములో నుండి పోతే విశ్వదేవతలు ఉండే లోకం లభిస్తుంది. చెవుల నుండి పోతే దిక్పాలకులు ఉండే లోకం లభిస్తుంది. ముక్కుల నుండి పోతే వాయుదేవుడు ఉండే లోకం లభిస్తుంది. కళ్ళ నుండి పోతే అగ్ని దేవుడు ఉండే లోకం లభిస్తుంది. కనుబొమల నుండి పోతే అశ్వినీ దేవతలుండే లోకం ప్రాప్తిస్తుంది. నుదురు నుండి పోతే పితృ దేవతలు ఉండే లోకం లభిస్తుంది. తలపైభాగం(బ్రహ్మరంధ్రం ) నుండి పోతే శాశ్వతానందం ఇచ్చే మోక్షం లభిస్తుంది.
మరణసమయం ఆసన్నమైనప్పుడు ఆకాశంలో అరుంధతీనక్షత్రం కనిపించదు. ముక్కు చెక్కినట్లు కనపడినా, చంద్రుడు మలినంగా కనపడినా అతడి ఆయుస్షు ఒక సంవత్సరమని తెలుసుకోవాలి. ముఖవర్ఛస్సు పెరిగినా తరిగినా, తెలివితేటలు పెరిగినా తరిగినా అతడి ఆయువు ఆరునెలలే అని తెలుసుకోవాలి, పూర్ణచంద్రుడిలో, సూర్యబింబంలో వెలితి కనపడితే అతడి ఆయుర్ధాయం ఏడురోజులే అని తెలుసుకోవాలి. దేవాలయముకు వెళ్ళినప్పుడు దేవుడికి సమర్పించిన పుష్పములు, సుగంధద్రవ్యములు దుర్ఘంధం వెదజల్లితే అతడి ఆయుస్షు ఆరునెలలు మాత్రమే చెవులు ముక్కు వాలిపోయినా దంతములు రంగుమారినా కళ్ళలో కాంతి సన్నగిల్లినా, శరీరం నల్లబడ్డా అతడికి తక్షణమే మృత్యువు అని తెలుసుకోవాలి. మానవుడు అంత్య కాలంలో చేరినప్పుడు ఏ కారణం లేకుండానే కళ్ళలో నుండి నీరు కారుతూ ఉంటుంది. తలమీద నుండి పొగలు సెగలు వచ్చినా అతడికి చివరి దశ ఆసన్నమైనదని తెలుసుకోవాలి. యోగి అయిన వాడు ఈ సూచనలు గమనించి నిరంతర ధ్యానసమాధిలో ఉండి జీవుడిని ప్రమాత్మలో కలపడానికి ప్రయత్నిస్తాడు. అటువంటి యోగి ప్రాణములు విడువగానే పరమాత్మలో లీనమై శాశ్వతానందం పొందుతాడు.

హోమం విశిష్టత

ప్రతి మనిషికీ ఎంతోకొంత స్వార్థం ఉంటుంది. నిజమే కానీ, కేవలం మన కోసమే మనం బ్రతకడంలో అర్ధం లేదు. తోటివారి శ్రేయస్సును కూడా కొంచెం దృష్టిలో ఉంచుకోవాలి. అందరూ బాగుంటేనే, మనమూ బాగుంతామని గుర్తించి, గుర్తుంచుకోవాలి. మహర్షులు ఎన్నో సందర్భాలలో 'పరోపకారార్థమిదం శరీరమ్' అని చెప్పారు. చెప్పడమేకాదు, ఆచరణాత్మకంగా చేసి చూపించారు. బహుశా అందుకే కావచ్చు మహర్షులకు వాక్ శుద్ధి వుండేది. వారు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఇతరుల కోసం ఎంతో కొంత చేసేవారు.
మహర్షులు మాట్లాడేది తప్పకుండా జరిగేది. సత్ప్రవర్తన, సత్యవాక్కుల మహత్తు అది. మహర్షులు వివిధ ప్రయోజనాల కోసం రకరకాల హోమాలు చేసేవారు. తమ ఆశయాలను నేరవేర్చుకునేవారు. ఇక్కడ గమనించవలసింది ఏమంటే మహర్షుల కోరికలన్నీ నేరుగా కానీ, అంతర్గతంగా కానీ ప్రజల కోసమే ఉద్దేశించి వుండేవి. అంటే లోక కళ్యాణం కోసం అన్న మాట!
ఆమధ్య శ్రీశైలం దగ్గర జరిగిన హోమం సందర్భంగా ఆకాశంలో పెను పరిమాణంలో పెద్ద శిల నదీ జలాల్లో పడటం, జాలరులు తాటి చెట్టు ఎత్తున పైకి లేవటం పేపర్లలో కూడా వచ్చింది. హోమాల్లో ఎన్నో రకాల సమిధలు వాడవలసి వుంటుంది. ఒక్కో సమిధ ఒక్కో గ్రహానికి సంబంధించినదై వుంటుంది. అంటే అన్ని గ్రహాలూ సమతుల్య స్థితిలో వుంటేనే సృష్టి సక్రమంగా వుంటుంది
. కొన్నిసార్లు వాతావరణం సానుకూలంగా ఉండదు. వ్యాధులు సోకటం, వర్షాలు సక్రమంగా పడకపోవటం లాంటివి జరుగుతాయి. ఏ ఒక్క గ్రహానికి సంబంధించిన శక్తి (ఎనర్జీ) భూమిమీద తక్కువగా వున్నా అసమతుల్యతలు ఏర్పడతాయి. అందుకే ఆయా గ్రహాలకు సంబంధించిన మూలికలు, ధాన్యాలతో, ఇతర వస్తువులతో హోమం చేస్తారు. స్థూలంగా ఇదీ హోమం చేయటంలో ఉద్దేశ్యం.
హోమ ఫలాలు సమిష్టిగానే కాకుండా, వ్యక్తిగతంగా కూడా అందుకునే విధంగా జ్యోతిష్యవేత్తలు కొన్ని సూచనలు చేశారు. ఎవరైనా ఒక వ్యక్తిపై నవగ్రహాలలో ఏదో ఒక గ్రహ ప్రభావం తక్కువగా వుంటే దానికి సంబంధించిన రంగంలో లేదా విషయంలో ఆ వ్యక్తికి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఏ వ్యక్తి అయితే వ్యతిరేక ఫలితాలను అనుభవిస్తున్నాడో ఆ వ్యక్తి ఇంట్లో హోమం చేయిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి. సూర్య గ్రహ ప్రభావం బాగా తగ్గిపోయి, అదే సమయంలో ఇతర గ్రహాలు కూడా అననుకూలంగా మారితే, ఆ వ్యక్తి అకాల మృత్యువాతన పడవచ్చు లేదా ఆరోగ్య పరంగా తీవ్ర నష్టం జరగవచ్చు. దీనిని నివారించేందుకు సూర్యగ్రహానికి సంబంధించిన శాంతి చేయమని సూచిస్తారు.
తరచుగా హోమాలను చేసినట్లయితే ఏ రకమైన ప్రమాదాలు, ఇబ్బందులు ఎదురుకావు. హోమాలలో రకరకాల మూలికలు వాడతారు. శని గ్రహం అనుకూలత కోసం శమీ వృక్ష సమిధను, రాహువు కోసం గరిక ఉపయోగిస్తే, సూర్యానుగ్రహం కోసం అర్క సమిధను ఉపయోగిస్తారు. కేతు గ్రహ ఉపశాంతికోసం దర్భను ఉపయోగిస్తారు. ఆయుర్వేదం ప్రకారం అర్కలో కుష్టు వ్యాధిని నయం చేసే శక్తి వుంది.
శరీరంలో ఉత్పన్నమయ్యే వివిధ రకాల దోషాలను పోగొట్టగలిగే శక్తి ఈ మూలికకు వుంది. అలాగే చంద్రగ్రహ శాంతి కోసం మోదుగను వాడతారు. అటు వైద్యపరంగా చూస్తే జీర్ణ వ్యవస్థను అద్భుతంగా పునరుజ్జీవింప చేసే శక్తి మోదుగకు వుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. రావి చెట్టు కలపను గురు గ్రహోపశాంతి కోసం ఉపయోగిస్తారు.ఇది వివిధ కఫ దోషాలను రూపుమాపుతుందని ఆయుర్వేదంలో వుంది.
హోమంవల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా మన ఆరోగ్యానికి. పరోక్షంగా నవగ్రహాలపై ప్రభావం చూపుతుందని అర్థం అవుతుంది. మరో ముఖ్య సంగతి ఏమంటే, హోమ క్రమం గురించి క్షుణ్ణంగా తెలిసినవారు హోమం చేస్తేనే హోమ ఫలం అందుతుంది

Tuesday 26 April 2016

నక్షత్రము - నాటాల్సిన వృక్షం


వ్యక్తి జన్మించే సమయంలో సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరలో ఉన్నాడో దాన్నే జన్మ నక్షత్రముగా జ్యోతిష్యశాస్త్రం తెలుపుతుంది. జీవన గమనంలో వచ్చే అన్ని మలుపులను దీని ఆధారంగా చెప్పగలిగే శాస్త్రమే జ్యోతిష్యం. ఈ శాస్త్రంలో జీవితంలో సంభవించే సమస్యలు ఎలా వస్తాయో, వాటికి ఏ గ్రహాలకుకు శాంతులు చేయాలో ఈ శాస్త్రములో పరిహారాలు సూచించబడతాయి. దానికనుగుణంగా మనం నక్షత్ర శాంతులు, గ్రహ శాంతులు జరిపించుకోవాల్సి ఉంటుంది.
జ్యోతిష్య శాస్త్రములోని 27 నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు, అధిదేవతలు ఉన్నట్లుగానే వాటికి సంబంధించిన వృక్షాలు కూడా ఉన్నాయి. చాలామందికి నక్షత్రాలకి వృక్షాలు ఉంటాయన్న సంగతి తెలియదు. అయితే నక్షత్రానికి సంబంధించిన వృక్షాన్ని స్వయంగా పెంచటం ద్వారా దోషాలేమన్నా ఉంటే తొలగటమే గాక, సర్వ సౌఖ్యాలను పొందవచ్చు. ఈ సూత్రాన్ని ఆచరించడం శుభం. మీరు జన్మించిన నక్షత్రానికి దగ్గర సంబంధం గల వృక్షాన్ని పెంచితే అది పెరిగి పెద్దయ్యే కొద్దీ శుభాలను కలుగుతాయి.
నాటవలసిన మొక్కనుగాని లేక, విత్తనాన్ని గాని మీకు ఎక్కడ వీలైతే అక్కడ, రోడ్లపక్కన, పార్కు, కొండ, అడవి, దేవాలయాలలో ఇలా మీకు ఎక్కడ వీలుంటే అక్కడ నాటవచ్చు. అయితే అది పెరిగేలా శ్రద్ద చూపించాలి. మీ నక్షత్రము చూసుకుని ప్రతి నెల ఒక్కసారయినా ఆ వృక్షాన్ని దర్శించి నమస్కరించడం శుభం. మీ గ్రామంలో లేదా నివాస సమీపంలో ఎక్కడ ఆ వృక్షం కనిపించినా నమస్కరించండి. ఎలాంటి పరిస్థితిలోనూ ఆ వృక్షాన్ని దూషించటంగాని, నరకటం గాని చేయకూడదు. పసి పిల్లలచేత కూడా ఇలా జన్మనక్షత్రానికి అనుగుణంగా వృక్షాన్ని నాటించి చూడండి వారి జీవితంలోనూ శుభాలే కలుగుతాయి.
జన్మనక్షత్రాన్ని అనుసరంచి పెంచాల్సిన వృక్షాలు - ఫలితాలు
అశ్వని నక్షత్రము
అశ్వని నక్షత్ర జాతకులు విషముష్టి లేదా జీడి మామిడిని పెంచాలి, పూజించడం మంచిది. దీని వలన జననేంద్రియాల, చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ చెట్లని పెంచి పూజించడం ద్వారా సంతాన అబివృద్ది కూడా కలుగుతుంది.
భరణి నక్షత్రము
భరణి నక్షత్ర జాతకులు ఉసిరి చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వల్ల జీర్ణ వ్యవస్థ , ఉదర సంబంధిత, పైత్యం, పైల్స్ వంటి బాధల నుంచి ఉపశమనం పొందగలరు. అలాగే వీరికి క్రియేటివిటి ఎక్కువగా ఎక్కువగా ఉన్న వృత్తులను ఎంచుకొని చక్కగా రాణించడానికి ఉపకరిస్తుంది
కృత్తిక నక్షత్రము
కృత్తిక నక్షత్రము అత్తి / మేడి చెట్టును పెంచాలి, పూజించడం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షింపబడతారు. అలాగే సంపూర్ణ ఆరోగ్యము కూడా చేకూరుతుంది. అలాగే చక్కటి వాక్చాతుర్యం, ఏదైనా చేయాలనీ సంకల్పిస్తే ఎటువంటి విమర్శలనైన తట్టుకొని నిలబడే శక్తి కలుగుతాయి.
రోహిణి నక్షత్రము
రోహిణి నక్షత్ర జాతకులు నేరేడు చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల చక్కెర వ్యాధి, నేత్ర సంబంధిత సమస్యల నుంచి బయటపడగలరు. అలాగే మంచి ఆకర్షణీయమైన రూపం, సత్ప్రవర్తన వంటి లక్షనాలు కలుగుతాయి. వ్యవసాయం, వాటికి సంబందించిన వృత్తులలో చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుంది.
మృగశిర నక్షత్రము
మృగశిర నక్షత్ర జాతకులు మారేడు, చండ్ర చెట్టుని పెంచాలి, పూజించాలి. దీని వల్ల ద్వారా గొంతు, స్వరపేటిక, థైరాయిడ్, అజీర్త.. వంటి సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది. ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వలన ఆర్దికపరమైన చిక్కుల నుండి బయటపడగలరు.
ఆరుద్ర నక్షత్రము
ఆరుద్ర నక్షత్ర జాతకులు చింత చెట్టుని పెంచాలి. పూజించాలి. దీంతో గొంతు, స్వరపేటిక సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. అంతే కాకుండా విష జంతువుల నుంచి సమస్యలు ఎదురుకావు. వీరి మనస్తత్వాన్ని అనుకూలమైన దిశగా మార్చుకొని విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది.
పునర్వసు నక్షత్రము
పునర్వసు నక్షత్ర జాతకులు వెదురు లేదా గన్నేరు చెట్టును పెంచాలి, పూజించాలి. దీంతో ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులు క్షయ, ఉబ్బసం శ్వాసకోస బాధల నుంచి, రొమ్ము క్యాన్సర్ నుంచి బయటపడతారు. బాలింతలు దీనిని పెంచడం వలన ముఖ్యంగా పాలకి లోటు ఉండదని చెప్పవచ్చు. జఠిల సమస్యలు వచ్చినా , చాకచక్యంతో మెలిగి బయటపడడానికి ఉపయోగపడుతుంది.
పుష్యమి నక్షత్రము
పుష్యమి నక్షత్ర జాతకులు రావి లేదా పిప్పిలి చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వల్ల నరాల సంబంధిత బాధలు నుంచి బయటపడతారు. శత్రువుల బారి నుంచి కూడా బయటపడతారు. రోగ, రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. స్త్రీలు సంతానవతులవుతారు.
ఆశ్లేష నక్షత్రము
ఆశ్లేష నక్షత్ర జాతకులు సంపంగి లేదా చంపక వృక్షాన్ని పెంచాలి, పూజించాలి. దీనివలన శ్వేత కుష్ఠు, చర్మ సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. విపత్కార పరిస్థితుల్లో చాకచక్యంతో బయట పడటానికి కూడా ఉపయోగపడుతుంది.
మఖ నక్షత్రము
మఖ నక్షత్ర జాతకులు మర్రి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల ఎముకల సంబంధిత వ్యాధుల నుంచి, అనుకోని వ్యాధుల నుంచి బయటపడతారు. అలాగే భార్యభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండడానికి, తల్లిదండ్రులకు, సంతానానికి కూడా మేలు కలుగుతుంది. జీవితంలో వీరు తలపెట్టే ముఖ్యమైన కార్యాలలో ఆటంకాలు కలగకుండా ఉంటాయి
పుబ్బ నక్షత్రము
పుబ్బ నక్షత్ర జాతకులు మోదుగ చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివలన సంతానలేమి సమస్య తీరుతుందని శాస్త్రం చెబుతోంది. అలాగే మంచి సౌందర్యం కూడా చేకూరుతుందని చెప్పవచ్చు. ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపడడానికి ఎటువంటి వ్యవహారాలలోనైన తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది.
ఉత్తర నక్షత్రము
ఉత్తర నక్షత్ర జాతకులు జువ్వి చెట్టుని పెంచి పూజించాలి. దీనివల్ల హృదయ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడతారు. ఇతరులకు సహాయ సహకారాలను చేతనైనంతగా అందించడానికి. మంచి ప్రవర్తనతో చుట్టూ స్నేహితులను చేసుకోవడానికి ఉపయోగపడుతుంది
హస్త నక్షత్రము
హస్త నక్షత్ర జాతకులు సన్నజాజి, కుంకుడు చెట్లను పెంచాలి, పూజించాలి. దీని వలన ఉదర సంబంధిత బాధల నుంచి ఉపశమనం పొందుతారు. పరిస్థితులను తట్టుకొని అన్నిటికీ ఎదురీది విజయం సాధించడానికి, దైవభక్తి కలగడానికి ఉపయోగపడుతుంది.
చిత్త నక్షత్రము
చిత్త నక్షత్ర జాతకులు మారేడు లేదా తాళ చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వలన పేగులు, అల్సర్, జననాంగ సమస్యల నుంచి బయటపడతారు. ఎవరిని నొప్పించకుండా తెలివి తేటలతో ఇతరులను చిత్తు చేయగలిగిన చాకచక్యం కలగడానికి ఉపయోగపడుతుంది.
స్వాతి నక్షత్రము
స్వాతి నక్షత్ర జాతకులు మద్ది చెట్టును పెంచాలి, పూజించాలి. దీనివల్ల స్త్రీలు గర్భసంచి సమస్యల నుంచి బయటపడతారు అలాగే ఉదర సంబంధిత సమస్యలు దూరంగానే వుంటాయి. రకరకాల విద్యలలోను రాణిస్తారు. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. భావోద్వేగాలు అధికంగా ఉన్నా తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది.
విశాఖ నక్షత్రము
విశాఖ నక్షత్ర జాతకులు వెలగ, మొగలి చెట్లను పెంచాలి, పూజించాలి. దీని వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. ఎటువంటి పరిస్థితులనైన తట్టుకొని నిలబడడానికి, ముందు చూపు తో అన్ని విషయాలను గ్రహించి ముందుకు సాగడానికి, వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది.
అనురాధ నక్షత్రము
అనురాధ నక్షత్ర జాతకులు పొగడ చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా కాలేయ సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి, పరోపకారం చేయడానికి, విద్యలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా, పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగడానికి, ఆలోచనా శక్తి అబివృద్ది చెందడానికి ఉపయోగపడుతుంది.
జ్యేష్ఠ నక్షత్రము
జ్యేష్ఠ నక్షత్ర జాతకులు విష్టి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల కాళ్ళు, చేతుల సమస్యలు, వాతపు నొప్పుల బాధ తగ్గుతుంది. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయడానికి ఉపయోగపడుతుంది.
మూల నక్షత్రము
మూల నక్షత్ర జాతకులు వేగి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీని వల్ల పళ్ళకి సంబంధించిన, మధుమేహం, కొలస్ట్రాల్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. అలాగే జుట్టు రాలడం కూడా నియంత్రణలో ఉంటుంది.
పూర్వాషాడ నక్షత్రము
పూర్వాషాడ నక్షత్ర జాతకులు నిమ్మ లేదా అశోక చెట్లను పెంచాలి, పూజించాలి. దీనివల్ల కీళ్ళు, సెగ గడ్డలు, వాతపు నొప్పులు, జననేంద్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
ఉత్తరాషాడ నక్షత్రము
ఉత్తరాషాడ నక్షత్ర జాతకులు పనస చెట్టుని పెంచాలి, పూజించాలి. దీని వల్ల చర్మ సంబంధిత వ్యాధులు ఏర్పడవు. ఆర్దికపరమైన సమస్యలు తలెత్తవు. భూములకి సంబంధించిన వ్యవహారాలు బాగా కలసి వస్తాయి. సంతానపరమైన సమస్యలు ఉన్న వారికి అవి తొలగి వారు మంచి అభివృద్దిలోకి రావడానికి ఉపయోగపడుతుంది.
శ్రవణం నక్షత్రము
శ్రవణ నక్షత్ర జాతకులు జిల్లేడు చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వల్ల మానసిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలగుతాయి. న్యాయం, ధర్మం పాటించేడానికి. కార్యజయం సిద్దించడానికి ఉపయోగపడుతుంది.
ధనిష్ఠ నక్షత్రము
ధనిష్ఠ నక్షత్ర జాతకులు జమ్మి చెట్టును పెంచాలి. పూజించాలి. దీనివల్ల మెదడుకి సంబంధించిన సమస్యలు ఏర్పడవు. అలాగే వీరికి తెలివి తేటలు, మంచి వాక్చాతుర్యం, ధైర్యం కలగడానికి, సంతానాభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది.
శతభిషం నక్షత్రము
శతభిషం నక్షత్ర జాతకులు కడిమి చెట్టు లేదా అరటి చెట్టును పెంచాలి. పూజించాలి. దీనివల్ల శరీర పెరుగుదలకి సంబంధించిన, మోకాళ్ళ సమస్యల నుంచి బయటపడతారు. మంచి శరీర సౌష్టవం, చక్కటి ఉద్యోగం కొరకు, జీవితంలో చక్కగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది.
పూర్వాభాద్ర నక్షత్రము
పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు మామిడి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల కండరాలు, పిక్కలకి సంబంధించిన సమస్యలు తలెత్తవు. వృత్తి ఉద్యోగాలలో మంచి స్థితిని పొందడానికి. కళలు, సాంస్కృతిక రంగాలలో విశేషమైన పేరును తెచ్చుకోవడానికి, విదేశాలలో తిరిగే అవకాశం కొరకు, ఆర్ధిక స్థిరత్వం కొరకు, రాజకీయాలలో రాణించడానికి ఉపయోగపడుతుంది.
ఉత్తరాభాద్ర నక్షత్రము
ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు వేప చెట్టుని పెంచాలి. పూజించాలి. దీనివల్ల శ్వాస కోశ బాధలు, కాలేయ సంబంధిత బాధల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే విదేశాలలో ఉన్నత విద్యలను అభ్యసించడానికి, ఉన్నత పదవులు, సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్ఠలు కొరకు, వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉండడం కొరకు ఉపయోగపడుతుంది.
రేవతి నక్షత్రము
రేవతి నక్షత్ర జాతకులు విప్ప చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. మంచి విజ్ఞానం, విన్నూతమైన వ్యాపారాలలో నైపుణ్యం కొరకు, కీలక పదవులు, సంతాన ప్రేమ , గౌరవం అప్యాయతలు వృద్ది చెందడానికి, జీవితంలో అందరి సహాయ సహకారాలు లభించడానికి ఉపయోగపడుతుంది.

శరీర శుద్ధి

రచన: విశ్వామిత్ర మహర్షి
శరీర శుద్ధి
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం” గతో‌உపివా |
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శ్శుచిః ||
పుండరీకాక్ష ! పుండరీకాక్ష ! పుండరీకాక్షాయ నమః |
ఆచమనః
ఓం ఆచమ్య
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా (ఇతి త్రిరాచమ్య)
ఓం గోవిందాయ నమః (పాణీ మార్జయిత్వా)
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః (ఓష్ఠౌ మార్జయిత్వా)
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య)
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః (వామహస్తె జలం ప్రోక్ష్య)
ఓం పద్మనాభాయ నమః (పాదయోః జలం ప్రోక్ష్య)
ఓం దామోదరాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య)
ఓం సంకర్షణాయ నమః (అంగుళిభిశ్చిబుకం జలం ప్రోక్ష్య)
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః (నాసికాం స్పృష్ట్వా)
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః (నేత్రే శ్రోత్రే చ స్పృష్ట్వా)
ఓం అచ్యుతాయ నమః (నాభిం స్పృష్ట్వా)
ఓం జనార్ధనాయ నమః (హృదయం స్పృష్ట్వా)
ఓం ఉపేంద్రాయ నమః (హస్తం శిరసి నిక్షిప్య)
ఓం హరయే నమః
ఓం శ్రీకృష్ణాయ నమః (అంసౌ స్పృష్ట్వా)
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః
(ఏతాన్యుచ్చార్య ఉప్యక్త ప్రకారం కృతే అంగాని శుద్ధాని భవేయుః)
భూతోచ్చాటన
ఉత్తిష్ఠంతు | భూత పిశాచాః | యే తే భూమిభారకాః | యే తేషామవిరోధేన | బ్రహ్మకర్మ సమారభే | ఓం భూర్భువస్సువః |
దైవీ గాయత్రీ చందః ప్రాణాయామే వినియోగః
(ప్రాణాయామం కృత్వా కుంభకే ఇమం గాయత్రీ మంత్రముచ్ఛరేత్)
ప్రాణాయామః
ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ సత్యమ్ |
ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి |
ధియో యో నః’ ప్రచోదయా”త్ ||
ఓమాపో జ్యోతీ రసో‌உమృతం బ్రహ్మ భూ-ర్భువ-స్సువరోమ్ || (తై. అర. 10-27)
సంకల్పః
మమోపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనే, అభ్యుదయ ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా, ప్రవర్త మానస్య, అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, (భారత దేశః – జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ/ఉత్తర దిగ్భాగే; అమేరికా – క్రౌంచ ద్వీపే, రమణక వర్షే, ఐంద్రిక ఖండే, సప్త సముద్రాంతరే, కపిలారణ్యే), శోభన గృహే, సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమాన, … సంవత్సరే, … అయనే, … ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, శ్రీమాన్, … గోత్రః, … నామధేయః, … గోత్రస్య, … నామధేయోహంః ప్రాతః/మధ్యాహ్నిక/సాయం సంధ్యామ్ ఉపాసిష్యే ||
మార్జనః
ఓం ఆపోహిష్ఠా మ’యోభువః’ | తా న’ ఊర్జే ద’ధాతన | మహేరణా’య చక్ష’సే | యో వః’ శివత’మో రసః’ | తస్య’ భాజయతే హ నః | ఉశతీరి’వ మాతరః’ | తస్మా అర’ంగ మామ వః | యస్య క్షయా’య జిన్వ’థ | ఆపో’ జనయ’థా చ నః | (తై. అర. 4-42)
(ఇతి శిరసి మార్జయేత్)
(హస్తేన జలం గృహీత్వా)
ప్రాతః కాల మంత్రాచమనః
సూర్య శ్చ, మామన్యు శ్చ, మన్యుపతయ శ్చ, మన్యు’కృతేభ్యః | పాపేభ్యో’ రక్షంతామ్ | యద్రాత్ర్యా పాప’ మకార్షమ్ | మనసా వాచా’ హస్తాభ్యామ్ | పద్భ్యా ముదరే’ణ శిశ్ంచా | రాత్రి స్తద’వలుంపతు | యత్కించ’ దురితం మయి’ | ఇదమహం మా మమృ’త యో నౌ | సూర్యే జ్యోతిషి జుహో’మి స్వాహా” || (తై. అర. 10. 24)
మధ్యాహ్న కాల మంత్రాచమనః
ఆపః’ పునంతు పృథివీం పృ’థివీ పూతా పు’నాతు మామ్ | పునంతు బ్రహ్మ’ణస్పతి ర్బ్రహ్మా’ పూతా పు’నాతు మామ్ | యదుచ్ఛి’ష్ట మభో”జ్యం యద్వా’ దుశ్చరి’తం మమ’ | సర్వం’ పునంతు మా మాపో’‌உసతా ంచ’ ప్రతిగ్రహగ్గ్ స్వాహా” || (తై. అర. పరిశిష్టః 10. 30)
సాయంకాల మంత్రాచమనః
అగ్ని శ్చ మా మన్యు శ్చ మన్యుపతయ శ్చ మన్యు’కృతేభ్యః | పాపేభ్యో’ రక్షంతామ్ | యదహ్నా పాప’ మకార్షమ్ | మనసా వాచా’ హస్తాభ్యామ్ | పద్భ్యా ముదరే’ణ శిశ్ంచా | అహ స్తద’వలుంపతు | య త్కించ’ దురితం మయి’ | ఇద మహం మా మమృ’త యోనౌ | సత్యే జ్యోతిషి జుహోమి స్వాహా || (తై. అర. 10. 24)
(ఇతి మంత్రేణ జలం పిబేత్)
ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)
ద్వితీయ మార్జనః
దధి క్రావణ్ణో’ అకారిషమ్ | జిష్ణో రశ్వ’స్య వాజి’నః |
సురభినో ముఖా’కరత్ప్రణ ఆయూగ్‍మ్’షి తారిషత్ ||
(సూర్యపక్షే లోకయాత్రా నిర్వాహక ఇత్యర్థః)
ఓం ఆపో హిష్ఠా మ’యోభువః’ | తా న’ ఊర్జే ద’ధాతన | మహేరణా’య చక్ష’సే | యో వః’ శివత’మో రసః’ | తస్య’ భాజయతే హ నః | ఉశతీరి’వ మాతరః’ | తస్మా అర’ంగ మామ వః | యస్య క్షయా’య జిన్వ’థ | ఆపో’ జనయ’థా చ నః || (తై. అర. 4. 42)
పునః మార్జనః
హిర’ణ్యవర్ణా శ్శుచ’యః పావకాః యా సు’జాతః కశ్యపో యా స్వింద్రః’ | అగ్నిం యా గర్భ’న్-దధిరే విరూ’పా స్తాన ఆపశ్శగ్గ్ స్యోనా భ’వంతు | యా సాగ్ం రాజా వరు’ణో యాతి మధ్యే’ సత్యానృతే అ’వపశ్యం జనా’నామ్ | మధు శ్చుతశ్శుచ’యో యాః పా’వకా స్తాన ఆపశ్శగ్గ్ స్యోనా భ’వంతు | యాసాం” దేవా దివి కృణ్వంతి’ భక్షం యా అంతరి’క్షే బహుథా భవ’ంతి | యాః పృ’థివీం పయ’సోందంతి’ శ్శుక్రాస్తాన ఆపశగ్గ్ స్యోనా భ’వంతు | యాః శివేన’ మా చక్షు’షా పశ్యతాపశ్శివయా’ తను వోప’స్పృశత త్వచ’ మ్మే | సర్వాగ్’మ్ అగ్నీగ్‍మ్ ర’ప్సుషదో’ హువే వో మయి వర్చో బల మోజో నిధ’త్త || (తై. సం. 5. 6. 1)
(మార్జనం కుర్యాత్)
అఘమర్షణ మంత్రః పాపవిమోచనం
(హస్తేన జలమాదాయ నిశ్శ్వస్య వామతో నిక్షితపేత్)
ద్రుపదా ది’వ ముంచతు | ద్రుపదా దివే న్ము’ముచానః |
స్విన్న స్స్నాత్వీ మలా’ దివః | పూతం పవిత్రే’ణే వాజ్య”మ్ ఆప’ శ్శుందంతు మైన’సః || (తై. బ్రా. 266)
ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)
ప్రాణాయామమ్య
లఘుసంకల్పః
పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతస్సంధ్యాంగ యథా కాలోచిత అర్ఘ్యప్రదానం కరిష్యే ||
ప్రాతః కాలార్ఘ్య మంత్రం
ఓం భూర్భువస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || 3 ||
మధ్యాహ్నార్ఘ్య మంత్రం
ఓం హగ్ం సశ్శు’చిష ద్వసు’రంతరిక్షస ద్దోతా’ వేదిషదతి’థి ర్దురోణసత్ | నృష ద్వ’రస దృ’తస ద్వ్యో’మ సదబ్జా గోజా ఋ’తజా అ’ద్రిజా ఋతమ్-బృహత్ || (తై. అర. 10. 4)
సాయం కాలార్ఘ్య మంత్రం
ఓం భూర్భువస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ సత్యమ్ | ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓమాపో జ్యోతీ రసో‌உమృతం బ్రహ్మ భూ-ర్భువ-స్సువరోమ్ ||
(ఇత్యంజలిత్రయం విసృజేత్)
కాలాతిక్రమణ ప్రాయశ్చిత్తం
ఆచమ్య…
పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కాలాతిక్రమ దోషపరిహారార్థం చతుర్థా అర్ఘ్యప్రదానం కరిష్యే ||
ఓం భూర్భువస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ సత్యమ్ | ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓమాపో జ్యోతీ రసో‌உమృతం బ్రహ్మ భూ-ర్భువ-స్సువరోమ్ ||
(ఇతి జలం విసృజేత్)
సజల ప్రదక్షిణం
ఓం ఉద్యంత’మస్తం యంత’ మాదిత్య మ’భిథ్యాయ న్కుర్వన్-బ్రా”హ్మణో విద్వాన్ త్సకల’మ్-భద్రమ’శ్నుతే అసావా’దిత్యో బ్రహ్మేతి || బ్రహ్మైవ సన్-బ్రహ్మాప్యేతి య ఏవం వేద || అసావాదిత్యో బ్రహ్మ || (తై. అర. 2. 2)
(ఏవమ్ అర్ఘ్యత్రయం దద్యాత్ కాలాతిక్రమణే పూర్వవత్)
(పశ్చాత్ హస్తేన జలమాదాయ ప్రదక్షిణం కుర్యాత్)
(ద్విరాచమ్య ప్రాణాయామ త్రయం కృత్వా)
ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)
సంధ్యాంగ తర్పణం
ప్రాతఃకాల తర్పణం
సంధ్యాం తర్పయామి, గాయత్రీం తర్పయామి, బ్రాహ్మీం తర్పయామి, నిమృజీం తర్పయామి ||
మధ్యాహ్న తర్పణం
సంధ్యాం తర్పయామి, సావిత్రీం తర్పయామి, రౌద్రీం తర్పయామి, నిమృజీం తర్పయామి ||
సాయంకాల తర్పణం
సంధ్యాం తర్పయామి, సరస్వతీం తర్పయామి, వైష్ణవీం తర్పయామి, నిమృజీం తర్పయామి ||
(పునరాచమనం కుర్యాత్)
గాయత్రీ అవాహన
ఓమిత్యేకాక్ష’రం బ్రహ్మ | అగ్నిర్దేవతా బ్రహ్మ’ ఇత్యార్షమ్ | గాయత్రం ఛందం పరమాత్మం’ సరూపమ్ | సాయుజ్యం వి’నియోగమ్ || (తై. అర. 10. 33)
ఆయా’తు వర’దా దేవీ అక్షరం’ బ్రహ్మసంమితమ్ | గాయత్రీం” ఛంద’సాం మాతేదం బ్ర’హ్మ జుషస్వ’ మే | యదహ్నా”త్-కురు’తే పాపం తదహ్నా”త్-ప్రతిముచ్య’తే | యద్రాత్రియా”త్-కురు’తే పాపం తద్రాత్రియా”త్-ప్రతిముచ్య’తే | సర్వ’ వర్ణే మ’హాదేవి సంధ్యావి’ద్యే సరస్వ’తి ||
ఓజో’‌உసి సహో’‌உసి బల’మసి భ్రాజో’‌உసి దేవానాం ధామనామా’సి విశ్వ’మసి విశ్వాయు-స్సర్వ’మసి సర్వాయు-రభిభూరోమ్ | గాయత్రీ-మావా’హయామి సావిత్రీ-మావా’హయామి సరస్వతీ-మావా’హయామి ఛందర్షీ-నావా’హయామి శ్రియ-మావాహ’యామి గాయత్రియా గాయత్రీ చ్ఛందో విశ్వామిత్రఋషి స్సవితా దేవతా‌உగ్నిర్-ముఖం బ్రహ్మా శిరో విష్ణుర్-హృదయగ్‍మ్ రుద్ర-శ్శిఖా పృథివీ యోనిః ప్రాణాపాన వ్యానోదాన సమానా సప్రాణా శ్వేతవర్ణా సాంఖ్యాయన సగోత్రా గాయత్రీ చతుర్విగ్‍మ్ శత్యక్షరా త్రిపదా’ షట్-కుక్షిః పంచ-శీర్షోపనయనే వి’నియోగః | ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ సత్యమ్ | ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓమాపో జ్యోతీ రసో‌உమృతం బ్రహ్మ భూ-ర్భువ-స్సువరోమ్ || (మహానారాయణ ఉపనిషత్)
ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)
జపసంకల్పః
పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సంధ్యాంగ యథాశక్తి గాయత్రీ మహామంత్ర జపం కరిష్యే ||
కరన్యాసః
ఓం తథ్స’వితుః బ్రహ్మాత్మనే అంగుష్టాభ్యాం నమః |
వరే”ణ్యం విష్ణవాత్మనే తర్జనీభ్యాం నమః |
భర్గో’ దేవస్య’ రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః |
ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః |
ధియో యో నః’ ఙ్ఞానాత్మనే కనిష్టికాభ్యాం నమః |
ప్రచోదయా”త్ సర్వాత్మనే కరతల కరపృష్టాభ్యాం నమః |
అంగన్యాసః
ఓం తథ్స’వితుః బ్రహ్మాత్మనే హృదయాయ నమః |
వరే”ణ్యం విష్ణవాత్మనే శిరసే స్వాహా |
భర్గో’ దేవస్య’ రుద్రాత్మనే శిఖాయై వషట్ |
ధీమహి సత్యాత్మనే కవచాయ హుమ్ |
ధియో యో నః’ ఙ్ఞానాత్మనే నేత్రత్రయాయ వౌషట్ |
ప్రచోదయా”త్ సర్వాత్మనే అస్త్రాయఫట్ |
ఓం భూర్భువస్సువరోమితి దిగ్భంధః |
ధ్యానమ్
ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్చాయైర్-ముఖై స్త్రీక్షణైః |
యుక్తామిందుని బద్ధ రత్న మకుటాం తత్వార్థ వర్ణాత్మికామ్ |
గాయత్రీం వరదాభయాంకుశ కశాశ్శుభ్రంకపాలంగదామ్ |
శంఖంచక్ర మధారవింద యుగళం హస్తైర్వహంతీం భజే ||
చతుర్వింశతి ముద్రా ప్రదర్శనం
సుముఖం సంపుటించైవ వితతం విస్తృతం తథా |
ద్విముఖం త్రిముఖంచైవ చతుః పంచ ముఖం తథా |
షణ్ముఖో‌உథో ముఖం చైవ వ్యాపకాంజలికం తథా |
శకటం యమపాశం చ గ్రథితం సమ్ముఖోన్ముఖమ్ |
ప్రలంబం ముష్టికం చైవ మత్స్యః కూర్మో వరాహకమ్ |
సింహాక్రాంతం మహాక్రాంతం ముద్గరం పల్లవం తథా |
చతుర్వింశతి ముద్రా వై గాయత్ర్యాం సుప్రతిష్ఠితాః |
ఇతిముద్రా న జానాతి గాయత్రీ నిష్ఫలా భవేత్ ||
యో దేవ స్సవితా‌உస్మాకం ధియో ధర్మాదిగోచరాః |
ప్రేరయేత్తస్య యద్భర్గస్త ద్వరేణ్య ముపాస్మహే ||
గాయత్రీ మంత్రం
ఓం భూర్భువస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి |
ధియో యో నః’ ప్రచోదయా”త్ ||
అష్టముద్రా ప్రదర్శనం
సురభిర్-ఙ్ఞాన చక్రే చ యోనిః కూర్మో‌உథ పంకజమ్ |
లింగం నిర్యాణ ముద్రా చేత్యష్ట ముద్రాః ప్రకీర్తితాః ||
ఓం తత్సద్-బ్రహ్మార్పణమస్తు |
ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)
ద్విః పరిముజ్య |
సకృదుప స్పృశ్య |
యత్సవ్యం పాణిమ్ |
పాదమ్ |
ప్రోక్షతి శిరః |
చక్షుషీ |
నాసికే |
శ్రోత్రే |
హృదయమాలభ్య |
ప్రాతఃకాల సూర్యోపస్థానం
ఓం మిత్రస్య’ చర్షణీ ధృత శ్రవో’ దేవస్య’ సాన సిమ్ | సత్యం చిత్రశ్ర’ వస్తమమ్ | మిత్రో జనాన్’ యాతయతి ప్రజానన్-మిత్రో దా’ధార పృథివీ ముతద్యామ్ | మిత్రః కృష్టీ రని’మిషా‌உభి చ’ష్టే సత్యాయ’ హవ్యం ఘృతవ’ద్విధేమ | ప్రసమి’త్త్ర మర్త్యో’ అస్తు ప్రయ’స్వా న్యస్త’ ఆదిత్య శిక్ష’తి వ్రతేన’ | న హ’న్యతే న జీ’యతే త్వోతోనైన మగ్ంహో’ అశ్నో త్యంతి’తో న దూరాత్ || (తై. సం. 3.4.11)
మధ్యాహ్న సూర్యోపస్థానం
ఓం ఆ సత్యేన రజ’సా వర్త’మానో నివేశ’య న్నమృతం మర్త్య’ంచ | హిరణ్యయే’న సవితా రథేనా‌உదేవో యా’తి భువ’నా నిపశ్యన్’ ||
ఉద్వయ ంతమ’స స్పరి పశ్య’ంతో జ్యోతి రుత్త’రమ్ | దేవన్-దే’వత్రా సూర్య మగ’న్మ జ్యోతి’ రుత్తమమ్ ||
ఉదుత్యం జాతవే’దసం దేవం వ’హంతి కేతవః’ | దృశే విశ్వా’ య సూర్య”మ్ || చిత్రం దేవానా ముద’గా దనీ’కం చక్షు’ర్-మిత్రస్య వరు’ణ స్యాగ్నేః | అప్రా ద్యావా’ పృథివీ అంతరి’క్షగ్‍మ్ సూర్య’ ఆత్మా జగ’త స్తస్థుష’శ్చ ||
తచ్చక్షు’ర్-దేవహి’తం పురస్తా”చ్చుక్ర ముచ్చర’త్ | పశ్యే’మ శరద’శ్శతం జీవే’మ శరద’శ్శతం నందా’మ శరద’శ్శతం మోదా’మ శరద’శ్శతం భవా’మ శరద’శ్శతగ్‍మ్ శృణవా’మ శరద’శ్శతం పబ్ర’వామ శరద’శ్శతమజీ’తాస్యామ శరద’శ్శతం జోక్చ సూర్యం’ దృషే || య ఉద’గాన్మహతో‌உర్ణవా” ద్విభ్రాజ’మాన స్సరిరస్య మధ్యాథ్సమా’ వృషభో లో’హితాక్షసూర్యో’ విపశ్చిన్మన’సా పునాతు ||
సాయంకాల సూర్యోపస్థానం
ఓం ఇమమ్మే’ వరుణ శృధీ హవ’ మద్యా చ’ మృడయ | త్వా మ’వస్యు రాచ’కే || తత్వా’ యామి బ్రహ్మ’ణా వంద’మాన స్త దాశా”స్తే యజ’మానో హవిర్భిః’ | అహే’డమానో వరుణేహ బోధ్యురు’శగ్ం సమా’న ఆయుః ప్రమో’షీః ||
యచ్చిద్ధితే విశోయథా ప్రదేవ వరుణవ్రతమ్ | మినీమసిద్య విద్యవి | యత్కించేదం వరుణదైవ్యే జనే‌உభిద్రోహ మ్మనుష్యాశ్చరామసి | అచిత్తే యత్తవ ధర్మాయుయోపి మమాన స్తస్మా దేనసో దేవరీరిషః | కితవాసో యద్రిరిపుర్నదీవి యద్వాఘా సత్యముతయన్న విద్మ | సర్వాతావిష్య శిధిరేవదేవా థాతేస్యామ వరుణ ప్రియాసః || (తై. సం. 1.1.1)
దిగ్దేవతా నమస్కారః
(ఏతైర్నమస్కారం కుర్యాత్)
ఓం నమః ప్రాచ్యై’ దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః దక్షిణాయై దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః ప్రతీ”చ్యై దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః ఉదీ”చ్యై దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః ఊర్ధ్వాయై’ దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమో‌உధ’రాయై దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమో‌உవాంతరాయై’ దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ముని నమస్కారః
నమో గంగా యమునయోర్-మధ్యే యే’ వసంతి తే మే ప్రసన్నాత్మాన శ్చిరంజీవితం వ’ర్ధయంతి నమో గంగా యమునయోర్-ముని’భ్యశ్చ నమో నమో గంగా యమునయోర్-ముని’భ్యశ్చ న’మః ||
సంధ్యాదేవతా నమస్కారః
సంధ్యా’యై నమః’ | సావి’త్ర్యై నమః’ | గాయ’త్ర్యై నమః’ | సర’స్వత్యై నమః’ | సర్వా’భ్యో దేవతా’భ్యో నమః’ | దేవేభ్యో నమః’ | ఋషి’భ్యో నమః’ | ముని’భ్యో నమః’ | గురు’భ్యో నమః’ | పితృ’భ్యో నమః’ | కామో‌உకార్షీ” ర్నమో నమః | మన్యు రకార్షీ” ర్నమో నమః | పృథివ్యాపస్తేజో వాయు’రాకాశాత్ నమః || (తై. అర. 2.18.52)
ఓం నమో భగవతే వాసు’దేవాయ | యాగ్‍మ్ సదా’ సర్వభూతాని చరాణి’ స్థావరాణి’ చ | సాయం ప్రాత ర్న’మస్యంతి సా మా సంధ్యా’‌உభిరక్షతు ||
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే |
శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివః ||
యథా శివమయో విష్ణురేవం విష్ణుమయః శివః |
యథా‌உంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి ||
నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ |
జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః ||
గాయత్రీ ఉద్వాసన (ప్రస్థానం)
ఉత్తమే’ శిఖ’రే జాతే భూమ్యాం ప’ర్వతమూర్థ’ని | బ్రాహ్మణే”భ్యో‌உభ్య’ను ఙ్ఞాతా గచ్చదే’వి యథాసు’ఖమ్ | స్తుతో మయా వరదా వే’దమాతా ప్రచోదయంతీ పవనే” ద్విజాతా | ఆయుః పృథివ్యాం ద్రవిణం బ్ర’హ్మవర్చసం మహ్యం దత్వా ప్రజాతుం బ్ర’హ్మలోకమ్ || (మహానారాయణ ఉపనిషత్)
భగవన్నమస్కారః
నమో‌உస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే |
సహస్ర నామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీ యుగ ధారిణే నమః ||
భూమ్యాకాశాభి వందనం
ఇదం ద్యా’వా పృథివీ సత్యమ’స్తు | పితర్-మాతర్యది హోప’ బృవేవా”మ్ |
భూతం దేవానా’ మవమే అవో’భిః | విద్యా మేషం వృజినం’ జీరదా’నుమ్ ||
ఆకాశాత్-పతితం తోయం యథా గచ్ఛతి సాగరమ్ |
సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి ||
శ్రీ కేశవం ప్రతిగచ్ఛత్యోన్నమ ఇతి |
సర్వవేదేషు యత్పుణ్యమ్ | సర్వతీర్థేషు యత్ఫలమ్ |
తత్ఫలం పురుష ఆప్నోతి స్తుత్వాదేవం జనార్ధనమ్ ||
స్తుత్వాదేవం జనార్ధన ఓం నమ ఇతి ||
వాసనాద్-వాసుదేవస్య వాసితం తే జయత్రయమ్ |
సర్వభూత నివాసో‌உసి శ్రీవాసుదేవ నమో‌உస్తుతే ||
శ్రీ వాసుదేవ నమో‌உస్తుతే ఓం నమ ఇతి |
అభివాదః (ప్రవర)
చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు | … ప్రవరాన్విత … గోత్రః … సూత్రః … శాఖాధ్యాయీ … అహం భో అభివాదయే ||
ఈశ్వరార్పణం
కాయేన వాచా మనసేంద్రియైర్వా | బుద్ధ్యా‌உ‌உత్మనా వా ప్రకృతే స్స్వభావాత్ |
కరోమి యద్యత్-సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి ||
హరిః ఓం తత్సత్ | తత్సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు

Friday 22 April 2016

జ్ఞానం


ఎటువంటి బంధాలకీ హేతువు కాకుండా మనల్ని పరమాత్మతో ఎడబాటు లేకుండా చేసే దివ్యమైన ఆస్తి జ్ఞానం. ఆ జ్ఞానం గురువు యొక్క అనుగ్రహం చేత ఉపదేశరూపంగా మనకు సంక్రమిస్తుంది. దానికి కాలభయం లేదు. చొర భయం లేదు. అది తరిగి పోతునదన్న భయం లేదు దీన్ని నిలబెట్టుకోడానికి మనం పాపాలు చెయ్యనవసరం లేదు. అనుక్షణం వృద్ధి అయ్యే అమూల్య సంపదే గురు అనుగ్రహము. ఆ జ్ఞానమే గురువు మనకు ఇచ్చే ఆస్తి. అదే నిత్యానందం.
ఒక విద్య అయినా, ఒక గొప్ప విషయమైనా ఎవరినుండైనా గ్రహింప వచ్చని ధర్మశాస్త్రాలు చెప్పుచున్నాయి. ఎవరు చెబుతున్నారన్నది ప్రధానం.అతడేమి చెపుతున్నాడు, అందులో ఏదయినా అర్ధమున్నడా సారమున్నదా అన్నది మనం గ్రహించాలి. జ్ఞానము, విద్య నేర్చుకోడానికి, ఎవరయినా ఫరవాలేదు. ఎ జాతి వారైనా ఏకులము వారయినా ఫరావాలేదు .
హిందూ వివాహము
'అవివాహిత అయిన కన్య ఈశ్వరునే భార్తగాను, వివాహిత అయిన తరువాత భర్తనే ఈశ్వరునిగాను ఎంచుకోవాలన్నారు..మన మతంలో వివాహం ఒక ఒడంబడిక - కాంట్రాక్ట్ కాదు. అత్మోన్నత్తికి ఏర్పడిన సంస్కారం."
అన్నారు మహా స్వామివారు. ఈ సందేశం నేటి సమాజానికి, ఈ నాటి తరానికి శిరోధార్యం కావాలి.
జగద్గురువులు -- శ్రీ కంచి పరమాచార్య.

Thursday 21 April 2016

జన్మనక్షత్రమున చేయదగిన కార్యములు

జన్మ నక్షత్రమున అన్న ప్రాశనము, అక్షరాభ్యాసము, చౌళము, ఉపనయనము, నిషేకము, వ్యవసాయము, భుసంపాదన, మొదలగునవి శుభము. స్త్రీకి జన్మనక్షత్రమున వివాహము చేయుట మంచిది. పురుషులకు జన్మ నక్షత్రమున ఉపనయనము మంచిది
వారశూలలు -- శని సోమ వారములు తూర్పునకు, దక్షణమునకు గురువారము, పడమరకు ఆది శుక్రవారము ఉత్తరమునకు బుధ మంగళవారములు వారశూలలు. ఆ వారములలో ఆదిక్కునకు ప్రయాణము చేయరాదు.
తిధి శూలలు -- తూర్పునకు- పాడ్యమి, నవమి, తిదులలోను, ఉత్తరమునకు, విదియ, దశమి యందును, ఆగ్నేయమునకు, తదియ ఏకాదశి యందును, నైరుతి దిక్కునకు చవితి ద్వాదశి తిదులయండును, దక్షినమునకు పంచమి త్రయోదశి యందును, పడమరకు, షష్టి, చతుర్దశి యందును, వాయువ్యమునకు, సప్తమి, పున్నమి యందును, ఈశాన్యమునకు, అష్టమీ, అమావాస్యలయందును, ప్రయాణము చేయరాదు.
యాత్రా ( ప్రయాణ ) విషయములు. --- పాడ్యమి యందు కార్య నాశనము, విదియ ధన లాభము, తదియ యందు శుభము, చవితి యందు సంకటము , పంచమి నాడు, శుభము, షష్టి కలహము, సప్తమి ధనలాభము, అష్టమి కార్యనాశనము, నవమి విచారము, దశమి శుభము, ఏకాదశి కార్యజయము, ద్వాదశి కార్యనాశనము, త్రయోదశి శుభము, చతుర్దశి మరణము, పున్నమి అమావాస్యలలో కార్యనాశనము జుగును. ఈవిషయములు గమనించి ప్రయాణము చేయవలెను.

సంభాషణలు - సాత్విక స్వభావము

ఒక వ్యక్తి తన పూజాదికములు ముగించి ఉదయమే ఏదో పనిమీద వెడుతున్నప్పుడు పొరుగుడువాడు దారిలో కలిసి "స్వామీ పూజ సక్రమముగా ముగిసినదా?" అని ప్రశ్నించాడు. 
" ఆ ఎప్పుడో!" అని సమాధానమిచ్చిన ఎడల అది అహంకారపూరిత సమాధానము, ఆ వ్యక్తి చేసినది రాజసిక పూజ అని గ్రహించవలెను. అలాకాక, "భగవంతుని దయచే స్వామి సేవ సక్రమముగా ముగిసినది" అని సమాధానమిచ్చిన ఆ వ్యక్తి సాత్విక స్వభావముచేత పూజ ముగించెనని గ్రహించవలెను. ఇక్కడ ఆవ్యక్తి పొరుగువానిలో కూడా సాత్విక భావము ఇనుమడించేలా సమాధానమొసిగినాడని గ్రహించవలెను. మన సంభాషణము ఎదుటవానిలో సాత్వికభావనలు పెంపొందేలా చూచుకోవటము ప్రతి వారి కర్తవ్యము

సుందర కాండ 55 వ సర్గ


తపసా సత్య వాక్యేన అనన్యత్వాచ్చ భర్తరి
ఆపి సా నిర్దహేదగ్నిం న తామగ్ని ప్రధక్ష్యతి (55.29 )
సుందరకాండ 55వ సర్గలో 29వ శ్లోకం ఇది. తన తపోబలం చేతను సత్యభాషణ చేతను శ్రీరాముని నిరంతరం ధ్యానించే సీతాదేవి అగ్నినే దహిస్తుంది తప్ప అగ్ని ఆమెను దహించలేదు అంటారు హనుమ.
ఈ శ్లోకం అత్యంత మహిమన్వితమైనది. సంభవించిన ఆపదలు తొలిగిపోతాయి. ఆరోగ్యం సిద్ధిస్తుంది.

తగాదాల్లో ఉన్న ఆస్తి మనకు వస్తుందా... రాదా... తెలుసుకోవాలంటే....?

మంగళవారం రాత్రి దుర్గాదేవి గుడి మూసే ముందు అమ్మ వారికి పూజకు కుంకుమ, నిమ్మ కాయల దండ ఇచ్చి వెనుదిరిగి చూడకుండా ఇంటికి రావాలి. కొద్ది రోజుల్లోనే మనకు మంచి ఫలితం కనపడుతుంది.
లేదా
ఇండివిడ్యువల్ హౌస్ అయితే కాంపౌండ్ వాల్ బయట దక్షిణంలో నిమ్మచెట్టు పెంచాలి



పెద్ద మొత్తంలో ఇచ్చిన డబ్బులు తిరిగి రావడానికి ఏం చేయాలి.....!!
తెల్లజిల్లేడు పూలదండ మంగళ, శుక్రవారాల్లో శివుడికి గానీ, గణపతికి గానీ, హనుమంతుడికి గానీ వేయాలి. ఇలా 52 వారాలు చేయాలి. ఇలా చేస్తూ ఉంటే వాయిదా పద్ధతిలో క్రమేపి ధనం తిరిగి వస్తుంది.


వచ్చిన ధనం వచ్చినట్టే ఖర్చై పోతుంటే ఏం చేయాలి....?
మంగళవారం రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు తలకింద గరిక పెట్టుకోవాలి. మరుసటి రోజు దాన్ని పారే నీటిలో వేయాలి.

జ్యోతిష్యంలో భవిష్యత్తు

జ్యోతిషంలో ఎవరైనా ఆశించేది ఖచ్చితంగా భవిష్యత్తు చెప్పగలగడం. 2 + 2 = 4 అన్నంత ఖచ్చితంగా జ్యోతిషం ద్వారా మనకి భవిష్యత్తు తెలిసి ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు.
అపి సాగర పర్యంతా విచేతవ్యా వసుంధరా।
దేశోహ్యరత్ని మాత్రోపి నాస్తి దైవజ్ఞ వర్జితః॥
పదిహేడవ శతాబ్దంలో నీలకంఠ దీక్షితులు తన ‘కలి విడంబనం’ లో చెప్పిన శ్లోకమిది. సముద్రపర్యంతమూ ఉన్న ఈ భూమిని మొత్తం శోధించినా, ఈ దేశంలో జ్యోతిష్కుడు లేని భూమి ఒక గుప్పెడు కూడా లేదు అని దాని భావం.
చాలామంది జ్యోతిష్కులు భవిష్యత్తు నిజంగానే తెలుస్తుందని అంటారు. అయితే అలా భవిష్యత్తు చెప్పకూడదనో, పార్వతీ దేవి శాపం ఉంది కాబట్టి భవిష్యత్తుని ఖచ్చితంగా తెలుసుకోలేమనో కొందరు అంటారు.
ఫలాని గ్రహచారేణ సూచయంతి మనీషిణ:
కోవక్తా తారతమ్యస్య తమేకం వేధసం వినా ||
గ్రహచారాన్ని బట్టి ఫలితాలు ఈ విధంగా ఉండవచ్చు అని పండితులు సూచిస్తారు. కానీ ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది అని ఎవరు చెప్పగలరు, ఆ బ్రహ్మదేముడు తప్ప అని ఆ శ్లోకానికి భావం.అంటే జ్యోతిషం ద్వారా సూచనగా భవిష్యత్తు తెలిసే అవకాశం ఉండవచ్చు, కానీ ఖచ్చితంగా ఫలితాలు చెప్పలేము అని.
శాస్త్రవిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లోకూడా ఏమిటీ నమ్మకాలు అని పెదవి విరిచేవారు కొందరైతే జ్యోతిషం కూడా సైన్సే అనేవాళ్ళు మరికొందరు. ఏది ఏమైనా జ్యోతిషానికి ఉన్న ఆకర్షణశక్తి అసాధారణమైనది అని ఎవరైనా అంగీకరించక తప్పదు.
విచిత్రవ్యక్తి అనుభవాన్ని గురించి విన్నవాళ్ళు జ్యోతిష్కులంతా మోసగాళ్ళు అనే అభిప్రాయానికి రావడం తేలిక. కానీ అందరూ మోసగాళ్ళే అనడం అంత సులభమైన విషయం కాదు. జ్యోతిషంలో ఏ పట్టూ లేకపోతే ఇంతకాలం బహుళ ప్రాచుర్యంలో నిలబడ గలగడం, అనేకమంది అధ్యయనం చేసి జ్యోతిష్కులుగా సఫలమవ్వడం సాధ్యంకాదు. మరి నిజంగానే జ్యోతిషంలో ఖచ్చితంగా భవిష్యత్తు చెప్పగల ’సత్తా’ ఉందా? ఒక సైన్సుగా అది పరిశీలనకి నిలబడగలదా? ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలంటే మొదట జ్యోతిషం అసలు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి.
భౌతికశాస్త్ర పితామహుడు న్యూటన్ జ్యోతిషాన్ని (ఇంకా రసవాదమూ మొదలైన చాలా విషయాల్ని) నమ్మేవాడు. ఎవరో ఆయనదగ్గర జ్యోతిషాన్ని విమర్శిస్తే ’సర్, నేను జ్యోతిషాన్ని చదివాను, మీరు చదివారా?’ అని అడిగాడుట.
1975లో 186 మంది సైంటిస్టులు (అందులో 18మంది నోబెల్ గ్రహీతలు) జ్యోతిషం అశాస్త్రీయమైనది అని ప్రకటించారు. దానికి ఒక జ్యోతిష్కుడి సమాధానం ఏమిటో తెలుసునా? ’అవునుట. నిర్ణయించారుట. అయితే వాళ్ళెవరూ జ్యోతిషం తెలిసినవాళ్ళు కారుట. వాళ్ళు నోబెల్ బహుమతి పుచ్చుకున్నది జ్యోతిషంలో కాదు అని టక్కున చెప్పాడు ఆ జ్యోతిష్యుడు

ద్వాదశ రాశులు -- ద్వాదశ జ్యోతిర్లింగాలు

01. మేషరాశి: "రామేశ్వరం" :
శ్లోకం:- "సుతామ్ర పర్ణీ జలరాశి యోగే, నిబధ్య సేతుం విశిఖైర సంఖ్యై
శ్రీరామ చంద్రేన సమర్పితం తం, రామేశ్వరాఖ్యం నియతం నమామి."
ఈ రాశి కుజునికి స్వగృహం, చర రాశి వారికి పదకండవ ఇంటి అధిపతి అయిన శని బాధకుడు. గ్రహ పీడా నివారణార్థం రామేశ్వర తీర్థ యాత్ర,, పైన చెప్పిన శ్లోకం రోజు చదువుకొనుట చేయవలెను, శ్రీరామ చంద్రుడు శని బాధ నివారణార్ధం ఈ లింగము స్తాపించేనని చెప్పబడినది. కుజునకు కందుల దానము, యెర్ర వస్త్ర దానములుకుడా చేసిన మంచి ఫలితములు వచ్చును.
02. వృషభ రాశి: "సోమనాధ జ్యోతిర్లింగము"
శ్లోకం:- "సౌ రాష్ట్ర దేశే విదేశే తిరమ్యే జ్యోతిర్మయం చంద్ద్ర కళావ సంతం,భక్తి ప్రాధానాయ క్రుపావతీర్ణం తం సోమనాధం శరణం ప్రపద్యే."
ఈ రాశి శుక్రునికి స్వ గృహం, చంద్రునికి ఉచ్చ రాశి. సోమనాధ జ్యోతిర్లింగం శ్రీ క్రిష్ణుడుచే స్తాపించ బడింది. ఈ రాశికి శని నవామాదిపత్య బాధకుడు అయినందున శని దోషాలకు సోమనాధ దేవాలయ దర్శనం, పై శ్లోక ధ్యానము చేసిన సుభ ప్రదము. జన్మ నక్షత్రమందు రుద్రాభిషేకం చేయించుట వలన మంచి ఫలితములు పొందగలరు. బొబ్బర్ల దానము, బియ్యము దానము చేసిన మంచిది.
03. మిధున రాశి: "నాగేశ్వర జ్యోతిర్లింగం":
శ్లోకం:-"యామ్యే సదంగే నగరే తిరమ్యే విభ్శితాంగం వివిధైశ్చ భొగై ,
సద్భక్తి ముక్తి ప్రదమేకం, శ్రీ నగనాధం శరణం ప్రపద్యే."
ఈరాశి బుధునికి స్వగృహము. దోషాలకు నాగేశ్వర పుణ్య క్షేత్ర దర్శన, ప్రతి రోజు పై శ్లోకమును చదువుట, ఈ రాశి శని సంచరించు కాలమునందు జన్మ నక్షత్ర రోజున కైలాస యంత్ర ప్రస్తార మహా లింగార్చన జరిపించిన విశేషమైన ఫలితములు కలుగును.
04. కర్కాటకం: "ఓం కార జ్యోతిర్లింగం":
శ్లోకం:-"కావేరికా నర్మదాయో పవిత్రే , సమాగమే సజ్జన తారణాయ,
సదైవమాన్దాత్రు పురే వసంతం, ఓం కారమీశం శివమే మీడే"
ఈ రాశి చంద్రునకు స్వగృహం , . ఓం కార జ్యోతిర్లింగ దర్శనం, రోజు పై శ్లోకం చదువుట , జన్మ నక్షత్రం రోజున ఓం కార బీజాక్షరం ఉచారిస్తూ ఉండటం మంచి నివారణ ఉపాయములు.
05. సింహరాశి : "శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం"
శ్లోకం:-"ఇలాపురే రమ్య విశాల కేస్మిన్ సముల్ల సంతం చ జగద్వ రేణ్యం,
వందే మహా దారాతర స్వభావం, ఘ్రుశ్నేస్వరాఖ్యం శరణం ప్రపద్యే."
సింహరాశి సూర్యునకు స్వగృహం. ఘ్రుష్నేస్వర జ్యోతిర్లింగ దర్శనం, పై శ్లోకమును రోజు చదువుట, జన్మ నక్షత్రం నాడు ఏక దశ రుద్రాభిషేకం ద్వారా దోషాలనుండి విముక్తి పొందవచ్చును.
06. కన్యా రాశి: "శ్రీ శైల జ్యోతిర్లింగం".
శ్లోకం:-"శ్రీ శైల శ్రుంగే విభుధాతి సంగే తులాద్రి తుంగే పి ముదావసంతం,
తమర్జునం మల్లిక పూర్వ మేకం, నమామి సంసార సముద్ర సేతుం."
ఈ రాశికి అధిపతి బుధుడు. బాధల నుండి ఉపశమనం పొందుటకు శ్రీ శైల మల్లిఖార్జున దర్శనం, భ్రమరాంబ కి కుంకుమ అర్చన, జన్మ నక్షత్రం రోజున చండి హోమం చేసిన ఉపశమనం పొందగలరు. రోజు పైన చెప్పిన శ్లోకం చదువుట, జన్మ నక్షత్రం రోజున ఆవుకి ఆకు కూరలు, పచ్చ పెసలు తినిపించుట మంచిది.
07. తులారాశి: "మహాకాళే శ్వరం":
శ్లోకం:- "అవన్తికాయాం విహితావరం, ముక్తి ప్రధానాయ చ సజ్జనానాం
అకాల మృత్యో : పరిరక్ష ణా ర్థం వందే మహాకాల మహాసురేశం "
ఈ రాశికి శుక్రుడు అధిపతి, మహాకాళేశ్వర దర్శనము ద్వారా, , శుక్ర వారము సూర్యోదయ సమయములో బొబ్బర్లు దానం చేయుట ద్వారా దోషములు, బాధలనుండి విముక్తి పొందవచ్చును.
08. వృశ్చిక రాశి: "వైద్యనాదేశ్వరుడు:
శ్లోకం:-"పూర్వొత్తరె ప్రజ్వాలికానిధానే , సాదావసంతం గిరిజాసమేతం ,
నురాసురారాదిత పాదపద్మం, శ్రీ వైద్య నాదం తమహం నమామి."
ఈ రాశికి కుజుడు అధిపతి, వృశ్చికం వైద్య వృత్తికి, శస్త్ర చికిత్సలకి కారణ భూతం. బాధలకు వైద్య నాదేశ్వరుని దర్శించి , పూజించుట ద్వారా , మంగళ వారము జన్మ నక్షత్రము రోజున కందులు, యెర్రని వస్త్రములు దానము చేయుట మంచిది. ఋతు క్రమ దోషములున్న స్త్రీలు పెద్ద ముత్తైదువులకు యెర్రని వస్త్రములు దానము చేయుట మంచిది.
09. ధనురాశి : "విశ్వేశ్వర లింగం":
శ్లోకం:- "సానంద వనే వసంతం, ఆనందకందం హత పాప బృందం
వారణాసీనాధ మనాద నాదం, శ్రీ విశ్వ నాదం శరణం ప్రపద్యే."
ఈ రాశి వారికి గురుడు అధిపతి, స్వస్తానం. వేదాంత ధోరణి విపరీత ఆలోచనలు, సైంటిఫిక్ ఆలోచనలు, వీరి లక్షణం. అద్దిశంకరుల వారికి మోక్షం ప్రసాదించిన కాశీ క్షేత్రం, , అన్నపూర్ణ వద్ద శివుడు భిక్ష అడుగుట, అర్ధరాత్రి గంగకి ఆవలి ఒడ్డున "నారాయణ మంత్రం"తొ శివుడు జీవులకి మోక్షము ప్రసాదిస్తాడని పురాణాలలో చెప్పబడింది. పై శ్లోక పారాయణ, పూజ చేయుట, కాశి క్షేత్ర దర్శనము , గురువారము రోజున, జన్మ నక్షత్రము రోజున శనగల దానము ఇచ్చుట ద్వారా శని, గురు గ్రహ దోషాల నుండి విముక్తి పొందవచ్చును.
10. మకరము: "భీమ శంకరం" :
శ్లోకం:- "యం డాకినీ శాకినికాసమాజై : ,నిషేవ్యమాణం పిశితా శనైశ్చ ,
సదైవ భీమాది పద ప్రసిధం, తం శంకరం భూత హితం నమామి."
ఈ రాశి అధిపతి శని. గురునికి నీచ, కుజునికి ఉచ్చ,గురుడు అంటే జీవుడు , అహంకార పూరితమైన గజరాజు మొసలిచే పీదిన్చాబడి గజేంద్ర మోక్షము అనే ఆర్తి పూరితమైన ఘట్టం పురాణాలలో చెప్పబడింది. దోషాలకి భీమ శంకరం దర్శనం,,పూజ చేయుట, పై శ్లోక పారాయణము నిత్య పారాయణము, శని వారము నల్ల నువ్వుల దానము, నల్లని వస్త్రాలు దానము ఇచ్చుట, అవిటివారికి, ముసలి వారికి వస్త్ర దానము చేయుట మంచిది
11. కుంభం:"కేదారేశ్వరుడు":
శ్లోకం:-"మహాద్రి పార్శ్వే చ రమంతం, సంపూజ్య మానం సతతం మునీన్ద్రై :
సురాసురై ర్యక్ష మహోర గాద్యై : కేదారమీశం శివమేక మీడే ".
ఈ రాశికి శని అధిపతి, దోషాలకి కేదాద్రేశ్వర దర్శనము, పూజించుట, నిత్యమూ పై శ్లోక పారాయణము, శని వారము నువ్వుల దానము, అభిషేకం, మహన్యాస పూర్వక రుద్రాభి షేకం చేసిన మంచిది.
12. మీనా రాశి: "త్రయంబకేశ్వరుడు" :
శ్లోకం:-"సహ్యాద్రి శీర్షే విమలే వసంతం, గోదావరీ తీర పవిత్ర దేశే ,
యద్దర్శనాథ్ పాతక మాశు నాశం, , ప్రయాతి తం త్రయంబక మీశ మీడే ".
ఈ రాశి అధిపతి గురుడు. త్రయంబకేశ్వరుడు ఎప్పుడు నీటి మధ్యలో ఉంటాడు. అధిక ఫలితాలని ఇస్తాడని పురాణ ప్రసిద్ది. దోషాలకు త్రయంబకేశ్వర దర్శనము, చిత్రపటము పూజ మందిరము నందు ఉంచి నిత్యమూ పై శ్లోకము పారాయణము చేయుట మంచిది.

సుఖదుఃఖములు

ఒక భవనము కడుతూంటే పదో అంతస్థులో ఉన్న సూపర్ వైజర్ కింద ఉన్న కార్మికుడిని పిలిచాడు. కానీ ఆ కార్మికుడికి పిలుపు అందలేదు. సూపర్ వైజర్ అప్పుడు ఓ పదిరుపాయల నోటు ఆ కార్మికుడి ముందు పడేట్టు వేశాడు. ఆ నోటు కార్మికుడు జేబులో పెట్టుకున్నాడు కానీ పైన ఉన్న సూపర్ వైజర్ మాట వినలేదు పైకి చూడలేదు. అప్పుడు ఆ సూపర్ వైజర్ మరో ఇరవై రూపాయల నోటు పడేశాడు. ఆ నోటు కూడా కార్మికుడు జేబులోకి పెట్టేసుకున్నాడు. కానీ పైకి చూడలేదు. అప్పుడు ఆ సూపర్ వైజర్ ఓ చిన్న రాయి తీసుకుని ఆ కార్మికుని వీపుకి తగెలేలా వేశాడు. అప్పుడు ఆ కార్మికుడు పైకి చూసి సూపర్ వైజర్ మాట విని ఆయన చెప్పినట్లు చేశాడు. 
అలాగే భగవంతుడు మనకి అనేక రకాల సుఖానుభవాన్ని ఇస్తూ ఉంటాడు. కానీ ఆయన చెప్పినట్లు మనం వినకుండా మనము సుఖానుభవములో మునిగి తేలుతూంటే, మనము ఆయన మాట వినేటట్లు ఓ చిన్న దు:ఖానుభవము ఇచ్చి మళ్ళీ తనవైపుకి తిప్పుకుంటాడు. ఈ విషయము గమనించి మనము మన దైనందిన జీవితము సాగిద్దాము

సత్యప్రభావం

పూర్వం ఒక రాజ్యంలో గజదొంగ యుండేవాడు. అర్ధారాత్రి పూట దొంగతనాలు చేసేవాడు. బాగా చీకటి పడేవరకు గ్రామాలలోయున్న దేవాలయములలో సత్కాలక్షేపాలలో పాల్గొనేవాడు. అలా చీకటి పడేవరకు వేచియుండేవాడు. దీని కారణంగా అతనికి తన జీవిత తరుణోపాయం ఏమిటి అనే వ్యధ అతనిలో జనించింది. ఒకరోజు అతడు ఆధ్యాత్మిక బోధ చేసే ఒక పండితుని వద్దకు వెళ్ళి నా జీవిత తరుణోపాయం సెలవివ్వండి అని ప్రార్ధించాడు. "నీవు దొంగతనం మానివేయమన్నాడు" ఆ పండితుడు. "అది నా వృత్తి. దానిని మానలేనన్నాడు." "సరే భగవన్నామము మానసికంగా" చేయమన్నాడు". అదీ కుదరదన్నాడు. అయితే "సత్యవ్రత దీక్ష స్వీకరించి సత్యము" పలకమన్నాడు. దానికి గజదొంగ తన దగ్గరకి ఎవ్వరు రారు కనుక సత్యం పలకటం తేలికయని "సరే"నన్నాడు. ఒకరోజు రాజుగారి కోటలో దొంగతనానికి బయలుదేరి వెళ్ళాడు. ఇంతలో రాజు, అతని సేనాని మారువేషాలలో తిరుగుతూ అతనిని గమనించి "ఎక్కడికి బయలుదేరావు" అని అడిగారు. దానికి ఆ గజదొంగ నేను రాజుగారి కోటలో దొంగతనానికి బయలుదేరానని చెప్పాడు. "అరె! ఇంత పెద్ద విషయాన్ని ఇంత ధైర్యంగా ఎలా చెప్పావు ప్రమాదం కదా" అన్నారు. దానికి "అయ్యా! నేను ఒక స్వామి వద్ద సత్యం పలుకుతానని ప్రమాణం చేశాను. కనుక మీతో సత్యమే చెప్పాను" అన్నాడు. ఆరోజు రాత్రి కోటలో గజదొంగ నాలుగు వజ్రాలు కాజేశాడు. సేనాని చాకచక్యంగా గజదొంగను పట్టుకున్నాడు. దొంగవద్ద నాలుగు వజ్రాలు దొరికినవి. కాని మంత్రి ఐదో వజ్రం ఎక్కడ అని గదమాయించాడు. అయ్యా! నేను అబద్దమాడను. అది నా నియమము. నేను నాలుగు వజ్రాలే దొంగిలించాను అన్నాడు. దొంగతనం జరుగగానే ప్రధమ విచారణ మంత్రిగారే చేసినందువల్ల ఆ అయిదో వజ్రం మంత్రిగారే అపహరించి దొంగపై అబాంఢము వేశాడని రాజు గ్రహించి మంత్రిని సోదా చేయగా అతని వద్ద అయిదవ వజ్రం దొరికింది. మంత్రిని ఆ పదవినుండి తొలగించి గజదొంగకు తన ఆస్థానంలో నగర రక్షణ పదవి ఇచ్చి అతనిని రాజు సత్కరించాడు.
సత్యానికి కట్టుబడ్డ దొంగ నగర రక్షణ పదవిలో నియమింపబడ్డాడు. సత్యానికి యుండే విలువని ప్రాధాన్యతను గుర్తెరిగి భారతజాతి ఔన్నత్యానికి వెన్నెముక అయిన సత్యధర్మ దీక్షను అందరు స్వీకరించాల్సియున్నది. సత్యం జాతి ఔన్యత్యం ఆయు:ప్రమాణాలని పెంచుతుందని అందరూ గ్రహించాలి

దేవాలయాల్లో దానం చేయాల్సినవి

ఎక్కడైనా కొత్తగా దేవాలయం నిర్మిస్తుంటే.. ఆ ఆలయానికి ఏమి సాయం చేస్తే బాగుంటుందని ఆస్తికులు ఒక్కోసారి సందిగ్ధంలో పడుతుంటారు. దేవాలయానికి ఏ వస్తువు ఇస్తే ఎలాంటి పుణ్యం కలుగుతుందో సూటిగా వివరించి చెబుతుంది విష్ణు ధర్మోత్తర పురాణం తృతీయ ఖండం మూడు వందల నలభై ఒకటో అధ్యాయం. దేవాలయం అనేది ఒక పుణ్య వ్యవస్థ. దాని నిర్మాణ నిర్వహణలకు అందరూ సహకరిస్తేనే ఆ వ్యవస్థ చక్కగా కొనసాగుతూ ఉంటుంది. దర్శనానికి వెళ్ళిన వారికి శాంతిని ప్రసాదించేదిగానూ ఉంటుంది. అందుకే ఎవరికి చేతనైనంతలో వారు దేవాలయాలకు సహాయ సహకారాలను అందిస్తూ అవసరమైన వాటిని దానం చేయాలంటున్నాయి పురాణాలు.
ఆలయ గోడలకు సున్నం కొట్టించడం, ఆలయ ప్రాంగణాన్ని చక్కగా ఊడ్చి ముగ్గులు పెట్టి అందంగా తీర్చిదిద్దటంలాంటి శ్రమదానాలకు శ్రీమహావిష్ణులోక ప్రాప్తి లాంటి పుణ్యఫలాలను చెప్పాయి పురాణాలు. అలాగే ఆలయానికి శంఖాన్ని దానం చేస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఆ తరువాత మానవజన్మ ఎత్తాల్సి వచ్చినా కీర్తిమంతుడే అవుతాడు. గంటను దానం చేస్తే మహా గొప్ప కీర్తిని పొందుతాడు. గజ్జలను, మువ్వలను ఇచ్చినవాడు సౌభాగ్యాన్ని పొందుతాడు.
చల్లదనం కోసం ఆలయ ప్రాంగణంలో పందిళ్ళు నిర్మిస్తే కీర్తి పొందటానికి, ధర్మబుద్ధి కలగటానికి కారణమవుతుంది. పైన ఎగిరే పతాకాలను ఇచ్చినవాడు సకలపాపాల నుంచి విముక్తుడై వాయులోకాన్ని పొందుతాడు. ఆ పతాకాలు ఆలయానికి ఎంత శోభను కూర్చుతుంటే అంత యశస్సును దాత పొందుతాడు. చాందినీలు ఏర్పాటు చేసిన వాడు గొప్ప సుఖాలకు పాత్రుడవుతాడు. ఆలయంలో వేదికను నిర్మించి ఇచ్చినవాడు పృథ్వీపతి అవుతాడు. మనోహరమైన కుంభాన్ని ఇచ్చినవాడు వరుణలోకాన్ని, నాలుగు కలశాలను దానం ఇచ్చినవాడు నాలుగు సముద్రాల పర్యంతం ఉన్న భూమి మీద, అంతసుఖాన్ని అనుభవిస్తాడు. కమండలువును ఆలయానికిస్తే గోదాన ఫలితం దక్కుతుంది. వట్టివేళ్ళతో తయారు చేసిన చాపల లాంటివి ఇస్తే సర్వపాపాలు నశిస్తాయి. ఆలయానికి సమకూరిన గోవులను మేపటానికి గోపాలకుడిని ఇచ్చినా పాపవిముక్తే ఫలితం. చామరాలను దానం చేస్తే గొప్ప ధనప్రాప్తి కలుగుతుంది.
దేవుడికి ఆసనాన్ని సమకూరిస్తే సర్వత్రా ఉత్తమ స్థానం లభిస్తుంది. పాదపీఠ ప్రదానం ఉత్తమగతికి సోపానం. ధ్వజ సమర్పణం లోకంలో గొప్పకీర్తిని పొందటానికి వీలు కల్పిస్తుంది. దేవుడికి ముఖ లేపనాలను అంటే ముఖానికి అలంకిరంచే గంధ ద్రవ్యాలను ఇచ్చినవాడు ఉత్తమరూప సంపత్తిని పొందుతాడు. దర్పణం (అద్దం) దానం చేసినా మంచిరూపం లభిస్తుంది. దేవుడి పరిచర్యల కోసం చిన్న చిన్న పాత్రలను ఇస్తే సర్వకామ సమృద్ధమైన యజ్ఞం చేసినంత ఫలం దక్కుతుంది. ధ్యానం, సశ్యాలు, బీజాలు, బంగారం, వెండి, ఇతర లోహాలు ఇచ్చినవాడు అనంతరం పుణ్య ఫలితాన్ని పొందుతాడు. వెండి మంచి రూపానికి, బంగారం సర్వకోరికలు సిద్ధించటానికి దానం చేస్తుంటారు. పాడి ఆవును ఇస్తే గోలోకప్రాప్తి, బండిని లాగేఎద్దునిస్తే అంతకు పదింతలు పుణ్యఫలం లభిస్తాయి. మేకలు, గొర్రెలు, బర్రెలు, దున్నలు, ఒంటెలు, కంచరగాడిదలు లాంటివి ప్రదానం చేస్తే మామూలు ద్రవ్య దాన ఫలం కన్నా వేయింతల ఫలం లభిస్తుంది.
వన్యమృగాలు, పక్షులదానం అగ్నిష్ఠోమయాగ ఫలితాన్ని ఇస్తుంది. పచ్చని పతాకాలతో కూడిన గరుడ ధ్వజాన్నిస్తే ఇంద్రలోకప్రాప్తి కలుగుతాయి. నీలపతాకాలతో కూడిన తాలధ్వజం సమర్పిస్తే ఉత్తమలోకాలు ప్రాప్తిస్తాయి. ఆలయానికి మహాద్వార తోరణాలను ఇచ్చినవాడికి ఉత్తమలోకాల వాకిళ్ళు తెరచి సిద్ధంగా ఉంటాయి. శయన, ఆసనదాతకు వైకుంఠంలో శాశ్వత స్థితి ఫలం, ఉత్తరీయాన్ని సమర్పిస్తే సర్వకామ ఫలప్రాప్తి, దేవాలయంలో శిల్పాలు, చిత్రాలు లాంటివి కావలసిన పదార్థాలను వాద్య పరికరాలను ప్రదానం చేసినవాడు దేవసేనలో స్థానాన్ని పొందుతాడని విష్ణు ధర్మోత్తర పురాణం పేర్కొంటోంది.
దేవుడిని ఆశ్రయించి ఉండేవాడికి ఏ కొద్దిపాటి ఇచ్చినా దైవానుగ్రహపాప్తికి కారణమవుతుంది. ఈ వరుసలోనే ధాన్యాలు, సశ్యాలు, రసాలు, శాకాలు, ఇచ్చిన వారికి పుణ్యంతో పాటు శోకరహితస్థితి కలుగుతుంది. వంట పాత్రలను ప్రదానం చేసినా పుణ్యఫలమే. పుష్పవృక్ష, తోటల ప్రదానం గ్రామాధిపత్యానికి, జలాశయ నిర్మాణం, లాంటివన్నీ భగవత్‌కృపను పొందటానికి కారణాలవుతాయని విష్ణుధర్మోత్తర పురాణం పేర్కొంటోంది. దేవాలయం ఒక పవిత్ర స్థానం. భక్తులు అక్కడ మనశ్శాంతిని పొందేందుకు వీలుంటోంది. అంతటి ఉత్తమ వ్యవస్థకు ఎవరికి చేతనైనంతలోవారు సహకరిస్తే ఆ పవిత్ర ఉత్తమ వ్యవస్థ చిరకాలం నిలిచి ఉంటుందన్న లక్ష్యంతోనే ఇలా దేవాలయాలు దాన విశేషాలను పురాణాలు పేర్కొంటున్నాయన్నది అంతరార్థం.

శాస్త్ర వచనం

నిజంగా పరిశీలన చేయాలనుకునే వారు ముందునుండే వివరాలు తెలుసుకుని ఒక ప్లాన్ చేసుకుంటారు
చూస్తే చూద్దాం లేకపోతే లేదు అనుకునే వారు మాత్రం వారు చూడగానే కనబడకపోతే చాలు అది అంతా అసత్యం.అని.అంటూ ఉంటారు
అందుకే మన.విద్యలను కూడా పూర్తిగా గ్రంధములలో పెట్టకుండా నిజమైన తృష్ణ కలిగిన వారు గురుముఖతా తెలుసుకుంటారనే అసలు రహస్యాలు బయట పెట్టలేదు
తొందర తనముతో వాటిలో సత్యము లేదు అని భావన.చేస్తూ ఉంటాము
శనైః పన్థాః శనైః కన్థా శనైః పర్వత లంఘనమ్ ।
శనైర్విద్యా శనైర్విత్తం పంచైతాని శనైః శనైః ।।
మెల్ల మెల్లగా నడవగా నడవగా మార్గం పూర్తి అవుతుంది,
రోజూ కొంచెం కొంచెం కుట్టగా కుట్టగా వస్త్రం పూర్తి అవుతుంది, మెల్లిమెల్లిగా ఎక్కి పర్వతం దాటాలి,
కొంచెం కొంచెంగా నేర్చుకుంటూ విద్య సంపాదించాలి,
కొంచెం కొంచెంగా సంపాదిస్తే ధనం పోగవుతుంది,
ఈ అయిదింటియందు తొందర పనికి రాదు అని శాస్త్ర వచనం.

హనుమాన్ జయంతి - సింధూరం ప్రాముఖ్యత


చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపు కునే హనుమాన్ జయంతి రోజున జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో ఆంజనేయస్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలూ చేకూరుతాయి. హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాం తంలో హనుమంతుడిని ఆలయంలో దర్శించుకుని, ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు, నువ్వులనూనెతో దీపమెలిగించే వారికి ఆయు ర్దాయం, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. ఇంకా హనుమంతుని ఆలయాల్లో ఆకు పూజ చేయించడం, హనుమాన్ కళ్యాణం జరిపే వారికి ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే గృహంలో పూజచేసే భక్తులు, పూజామందిరమును శుభ్రం చేసుకుని పసుపు, కుంకు మలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం, ఎర్రటి పువ్వులతో అలంకరించు కోవాలి. నైవేద్యానికి బూరెలు, అప్పాలు, దానిమ్మ పండ్లు సమర్పించుకోవచ్చు.
ఆంజనేయాయనమః అనే మంత్రంతో పూజా సమయంలో హనుమాన్ చాలీసా, ఆంజనేయ సహస్రము, హనుమచ్చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి. లేదా ఓం ఆంజనే యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి, ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించు కోవడం మంచిది. ఇంకా అరగొండ, పొన్నూరు, కసాపురం, గండిక్షేత్రం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం. ఇదే రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు, హనుమాన్ చాలీసా పుస్తకములు దానం చేసేవారికి సుఖసంతోషాలు చేకూరుతాయని నమ్మకం.
రామాయణకాలంలో సీతమ్మవారు పాపిడిలో సింధూరం ధరించేది. ఒకసారి ఆంజనేయస్వామి అది చూసి అలా ఎందుకు ధరిస్తున్నారని సీతమ్మని అడిగారు. అందుకు సీతమ్మ నీ స్వామి, నాస్వామి అయిన శ్రీరామచంద్రుని ఆయుష్షు పెరగాలనీ ఆయనకి అన్నీ శుభాలు జరగాలనీ పాపిడిలో సింధూరం ధరిస్తాను. ఆడవారు పాపిడిలో సింధూరం ధరిస్తే మగవారి ఆయుష్షు పెరుగుతుంది, వారికి అన్నీ శుభాలు జరుగుతాయి అని చెప్పిందట. ఆంజనేయస్వామి రాముడికి పరమ భక్తుడు. ఆయన వూరుకుంటాడా!? వెంటనే వెళ్ళి ఒళ్ళంతా సిధూరం పూసుకొచ్చాడు. సీతమ్మ అడిగిందట.
ఒళ్ళంతా సింధూరం ఎందుకు పూసుకున్నావని. దానికి ఆయన సమాధానం, అమ్మా, నువ్వు పాపిడిలో సింధూరం పెట్టుకుంటేనే స్వామి ఆయుష్షు పెరుగుతుందనీ, శుభం జరుగుతుందనీ అన్నావు కదా, మరి నేనాయన భక్తుణ్ణి, నేను ఒళ్ళంతా సింధూరం పూసుకుంటే నా స్వామికి ఇంకా ఎక్కువగా అన్నీ శుభాలే జరుగుతాయనీ, ఆయన చిరంజీవి కావాలని ఇలా పూసుకున్నాను అని చెప్పాడు.
అది పురాణ కధ అనుకోండి. లౌకికంగా చూస్తే ఆంజనేయస్వామి వాయుదేవుని పుత్రుడు, సూర్యదేవుని శిష్యుడు. వారిరువురూ ఎంతో తేజస్సు కలవారు. అందుకే ఆంజనేయస్వామి అమిత తేజోమూర్తి. ఎరుపు లేక సింధూరం తేజస్సుకి చిహ్నం. ఆయన తేజస్సుకి చిహ్నంగా ఆయనను సింధూరంతో అలంకరిస్తే స్వామి చూడటానికే ఎంతో తేజోవంతుడుగా కనుల విందు చేస్తాడనీ, ఆయన తేజస్సూ, శక్తీ మనకి వెంటనే స్ఫురి స్తుందనీ అలా అలంకరిస్తారు.ఇంకొక విషయం తెలుసా ఆంజనేయ స్వామి రామ భక్తుడుకదా. శ్రీరామ పూజ ఎక్కడ జరిగితే అక్కడ ఆంజనేయ స్వామి వుంటాడు. ఆ పూజ చూడటానికీ, ఆ నామ కీర్తన వినటానికీ. అందుకే శ్రీరామచంద్రుని పూజ చేసేటప్పుడు ఒక ఖాళీ ఆసనాన్ని వేసి వుంచాలట. అక్కడ ఆంజనేయస్వామి ఆసీనుడై శ్రీ రామ పూజ తిలకిస్తాడని నానుడి.

Wednesday 20 April 2016

మన మహర్షులు - కర్దమ మహర్షి

మన మహర్షులు - కర్దమ మహర్షి

కర్దమ మహర్షి.అయితే ఇతను అందరి కన్నాముందు, అంటే కృత యుగం నాటి వాడు. మహా విష్ణువునే తన కొడుకుగా పొందిన వాడు. తొమ్మిది మంది మునులకు తాతగారు.బ్రహ్మదేముడి మాట మీద సంతానాన్ని అభివృద్ధి చేసినందుకు ఇతనిని కర్దమ
ప్రజాపతి అని కూడా అంటారు.ఇంత గొప్ప మహర్షి గురించి మనం తెలుసుకోవాలి కదా.బ్రహ్మ దేముడు గంధర్వులని, అప్సరసలని, సిద్ధులని,కిన్నెరలని, కింపురుషులని సృష్టించాకా ఋషులని సృష్టించాడు. వీరందరినీ
ప్రజాసృష్టికి ఉపయోగించుకున్నాడు బ్రహ్మదేముడు. ఒకరోజు బ్రహ్మ కర్దముడిని పిలిచి నువ్వు సృష్టికార్యంలో నాకు
సహాయం చెయ్యాలి అని చెప్పాడు. అందుకు కర్దముడు మాట కాదనలేక సరే అన్నాడు.కర్దమ మహర్షి సరస్వతీ నదీ
తీరంలో ఆశ్రమం కట్టుకుని విష్ణుమూర్తి కోసం పదివేల సంవత్సరాలు తపస్సు చేసాడు. ఆ తపస్సుకి మెచ్చుకుని స్వామి
అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి కర్దముడు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అది కూడా సుఖాలకోసం కాదు, సృష్టి కార్యానికే, నువ్వు అనుమతినిస్తేనే పెళ్లి
చేసుకుంటా అని చెప్పాడు. అందుకు విష్ణుమూర్తి మహర్షి నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుంది. బ్రహ్మావర్త దేశపు రాజు, తన భార్య వచ్చి తన కూతుర్ని నీకిచ్చి వివాహం చేస్తారు. నీకు తొమ్మిది మంది కూతుర్లు పుడతారు. ఆ కూతుళ్ళకి తొమ్మిది మంది
మునులు పుడతారు. నీ తపస్సు వల్ల నీలో కూడా నేనే ఉన్నానని తెలుసుకుంటావు. నా అంశతో నేనే నీకు కొడుకుగా పుడతాను అని చెప్పి అంతర్ధానమవుతాడు. తరువాతి కాలంలో స్వాయంభువుడు తన భార్యతో కలిసి వచ్చి తన కూతురు దేవహుతిని పెళ్లి
చేసుకోమని కర్దముడిని అడుగుతాడు. అందుకు కర్దముడు పెళ్లి చేసుకుంటా గాని పిల్లలు పుట్టే దాకానే ఉంటాను.తరువాత తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోతాను అని చెపుతాడు. తన భార్య, కూతురిని అడిగి వాళ్ళు సరే అన్నాకా వారిద్దరికీ పెళ్లి
చేస్తాడు స్వాయంభువుడు. కొంతకాలానికి దేవహుతి తొమ్మిది మంది ఆడపిల్లలకు జన్మనిస్తుంది. పిల్లలు కలిగారు కదా ఇక నేను తపస్సు చేయటానికి వెళతాను అని చెప్తాడుకర్దముడు. దానికి బదులుగాఇంత మంది పిలల్ని పెంచి పెద్దచేసి పెళ్ళిళ్ళు చేయటం నా ఒక్కదానివల్ల కాని పని పిల్లల పెళ్ళిళ్ళు అయ్యి నాకు ఒక మగపిల్లవాడు పుట్టే దాకా ఉండమని కోరుకుంటుంది
దేవహుతి. అందుకు సమ్మతించి,విష్ణువుని పూజిస్తే తనకు కొడుకు పుడతాడని చెపుతాడుకర్దముడు.కొంతకాలానికి వారికి శ్రీ
మహావిష్ణువే కొడుకుగా జన్మిస్తాడు. అతనికి కపిలుడు అని నామకరణం చేస్తారు ఆదంపతులు. భగవంతుడే తనకుకొడుకు రూపంలో పుట్టాడని తెలుసుకున్న కర్దముడు కపిలునికి నమస్కారం చేసి,ప్రదక్షిణ చేసి మోక్షాన్నిప్రసాదించమని కోరుకుంటాడు.దానికి బదులుగా కపిలుడు,విష్ణుమూర్తి అంశ అయిన నన్నే తలుచుకుంటూ తపస్సు చేసి మోక్షాన్ని పొందు అని
చెపుతాడు. అతని ఆదేశానుసారంకర్దమ ప్రజాపతి ఆ జన్మాంతంశ్రీ మహావిష్ణువుని స్తుతిస్తూమోక్షాన్ని పొందుతాడు. ఇదండీ
కర్దమ ప్రజాపతి చరిత

లక్ష్మీదేవి శాశ్వత నిలయం......!!


'దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్‌
దీపేన సాధ్యతే సర్వమ్‌ సంధ్యా దీపన్నమోస్తుతే'
జ్యోతిని పరబ్రహ్మ స్వరూపం గా, మనోవికాసానికి, ఆనందాని కి, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తాం.పూర్వం దుర్వాస మహర్షి ఒకసారి దేవేంద్రుని ఆతిథ్యానికి మెచ్చుకొని ఒక మహిమాన్వితమైన హారాన్ని వారంగా ప్రస్తాడు. ఇంద్రుడు దాన్ని తిరస్కార భావంతో తన వద్ద నున్న ఐరావతము అనే ఏనుగు మెడలో వేయగా అది ఆ హారాన్ని కాలితో తొక్కి నాశనం చేస్తుంది. అది చూసిన దుర్వాసుడు ఆగ్రహం చెంది దేవేంద్రుని శపిస్తాడు.
దీంతో శాపగ్రస్తుడైన దేవేంద్రుడు రాజ్యాధిపత్యం కోల్పోయి, సర్వసంపదలు పోగొ ట్టుకొని దిక్కుతోచని స్థితిలో దేవేంద్రుడు శ్రీహరిని ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీ మహా విష్ణువు దేవేంద్రునికి ఒక సూచన ఇస్తాడు. ఒక జ్యోతిని వెలగించి దానిని శ్రీ మహా క్ష్మి స్వరూపంగా తలచి పూజించమని, ప్రార్ధించమని చెప్తాడు.
మహావిష్ణువు చెప్పిన విధంగా దేవేంద్రుడు పూజించడంతో దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. అప్పుడు దేవేంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యా న్ని, సర్వసంపదలను పొందుతాడు ఆనందంతో జీవిస్తాడు . ఆ తర్వాత ఒకసారి లక్ష్మీదేవితో తల్లీ నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండుట న్యాయమా ! నీ బిడ్డలు నీ కరుణాపొందే మార్గం లేదా అని ఆ తల్లిని అడుగుతాడు.
అప్పుడు ఆ తల్లి లక్ష్మీదేవి తనను త్రికరణ శుద్దిగా ఆరాధించే భక్తులకు వారి అభీష్టాలకు అనుగుణంగా... మహర్షులకు మోక్ష లక్ష్మి రూపంగా, విజయాన్ని కోరే బిడ్డలకు విజయలక్ష్మిగా, విద్యార్థులు నన్ను భక్తి తో ఆరాధిస్తే విద్యా లక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి నన్ను కొలిచేవారికి ధనలక్ష్మిగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మిగా వారికి ప్రసన్నురాలనవుతానని దేవేంద్రుని సమాధానం ఇస్తుంది. ఆ తల్లిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజిస్తారో వారికి ఆ తల్లి ప్రసన్నురాలై వారి కోర్కెలు నిరవేర్చుతుంది.
శాశ్వత నిలయం :
గురుభక్తితో దేవతలను, పితృదేవతలను పూజించేవారు.. సత్యం పలికే వారు.. దాన ధర్మాలు చేసేవారు.. భార్యను గౌరవించేవారు.. బ్రాహ్మణుల పట్ల భక్తి చూపేవారు.. పగటిపూట నిద్రపోని వారు.. వృద్ధులు.. బలహీనులు.. అసహాయులైన స్త్రీలు.. పేదవారి పట్ల కరుణగల వారు.. పారిశుద్ధ్యాన్ని పాటించేవారు.. అతిథులకు పెట్టిన తర్వాతే భోజనం చేసేవారు శ్రీ మహాలక్ష్మికి అత్యంత ఇష్టులు అవుతారు. వారి ఇళ్లలోనే శ్రీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది. పెద్దస్థాయిలో ఉండే అధికారుల.. మంత్రుల ఇళ్లలో మహాలక్ష్మి నివాసముంటుంది. అందుకే ఆయా వ్యక్తుల ముఖాల్లో ఒక విధమైన ఆకర్షణ, కళ ఉంటాయి. దీన్నే లక్ష్మీకళ అంటారు.
అయితే అసత్యాలు పలికే వారి వద్ద, ఇతరుల మనస్సును గాయపరిచే వారివద్ద లక్ష్మీదేవి నివాసముండదు. ఇంట్లో వెంట్రుకలు గాలికి తిరగాడితే లక్ష్మీ కటాక్షం దక్కదు. బయటికి వెళ్లి కాలును శుభ్రం చేసుకోకుండా ఇంటికి వచ్చే వాళ్ల ఇంట లక్ష్మీదేవి నివాసముండదు. తల్లిదండ్రులను లెక్కచేయని వారింట, గోళ్లు కొరికేవారింట శ్రీదేవి ఉండదని పురోహితులు అంటున్నారు.లక్ష్మీదేవి సకల సంపదలతోపాటు సౌభాగ్యాన్ని అందించే దేవత. అందుకే సౌభాగ్యవంతులందరూ శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మిని అర్చిస్తారు.
శుక్రుడికి ప్రత్యాధి దేవత మహాలక్ష్మీ మానవులకు కళలు అబ్బాలన్నా, బోగభాగ్యాలు ఉండాలన్నా, వాహన యోగం కలగాలన్నా మంచి ఇల్లు, మంచి తిండి, మంచి కళత్రం, అందం వీటన్నిటినీ ప్రసాదించేది శుక్రుడే అని గ్రహించాలి. శుక్రుడు భాగ్యకారకుడు. ఎవరైనా శుక్రుడి అను గ్రహం పొందాలంటే మహాలక్ష్మిని పూజించి తమ కోర్కెలను నిజం చేసుకోవచ్చు.