Thursday, 7 April 2016

భవన నిర్మాణ పునాదులలో శేషనాగును ఎందుకుంచుతారు?


పూర్తి భూమండలం శేషపడగపై సేదతీరుతుంది అనేది ప్రాచీన హైందవ సంప్రదాయం. అందుకే వెండి పడగ తయారు చేయించి, దానిలోకి శేషనాగుని స్ఫూర్తిని ఆపాదించి నూతన భవన నిర్మాణ పునాదులలో వుంచుతారు. శేషనాగు భూమండలాన్ని స్థిరంగా ఏ విధంగా పట్టివుంచుతాడో, పునాదిరాళ్ళు అదే మాదిరి భవన భారాన్ని స్థిరంగా మోయాలన్న వాంఛతో ఇలా చేస్తారు.

పాతాళలోకం భూమి కింద వుంది. ఈ పాతాళానికి అధిపతి నాగరాజు. కాబట్టి దుష్టశక్తుల ప్రభావాన్ని తొలగించుకోవడానికి పాముల్ని పూజిస్తారు. శేషనాగు క్షీరసాగరంలో కొలువై వుంటాడు కాబట్టి కలశంలో పాలు, పెరుగు, నెయ్యి వుంచి క్షీర సాగర ప్రతినిధిగా భావిస్తూ మంత్రాలు చదువుతారు. ఈ విష్ణు కలశంలో లక్ష్మీరూపు వుంచి కలశాన్ని భూమి లోపల పెడతారు. పునాది సందర్భంగా చేసే పూజలన్నీ ఈ నమ్మకాలతోనే సాగుతాయి.

No comments:

Post a Comment