Thursday, 7 April 2016

ధర్మానికి ప్రతీకే నందీశ్వరుడు......!!


శివుని ఎదురుగా ఉండే నందీశ్వరుడు ధర్మానికి ప్రతీక. ఈ ధర్మం శివుడిని చూస్తోంది. ఎన్ని ధర్మాలుచేసినా ఆ ధర్మం భగవంతుడి కోసం చెయ్యాలి. భగవంతుడికి అర్పితంగా చెయ్యాలి. భగవంతుడిని చూస్తూ చెయ్యాలి. కనుక మనం ధర్మం చేస్తున్నప్పుడు ప్రక్కవాడు చూసాడా లేదా అనుకోరాదు. భగవంతుడు చూస్తున్నాడని తెలుసుకొని ఆయన్ను చూస్తూ ధర్మం చెయ్యాలని నందీశ్వరుడు చెప్తున్నాడు. మనం ఆలయంలోకి వెళ్ళగానే నేర్చుకోవలసిన పాఠాలు ఇవి. మన ధర్మమే మనల్ని భగవంతుడి దగ్గరికి చేర్చుతుంది. నందిని చూడనిదే శివుని చూడకూడదంటే అర్ధం ధర్మమాచరించకుండా దైవం దగ్గరకి వెళ్ళలేమని పురాణం చెప్పిన అంశం.
ధర్మం ద్వారా దైవం. ధర్మాన్ని విడిచి పెట్టి దైవం లేదు. అక్రమార్జన తీసికెళ్ళి హుండిలో వేస్తే దాని వల్ల పాపాలు పోవు సరికదా పాపపు సొమ్ము దేవుడికేసిన కొత్తపాపం వస్తుంది. దైవానికి, గృహానికి, స్వార్జితానికి వాడేవన్ని ధర్మబద్ధమైనవే వాడాలి. ఎన్ని ధర్మాలు చేసిన భగవంతుడిని మర్చిపోరాదు. ధర్మం బాగా పాటిస్తానండి దైవాన్ని నమ్మను అంటే ప్రయోజనం ఉండదు. చేస్తున్న ధర్మం భగవంతుడివైపు చూస్తూ చెయ్యాలి

No comments:

Post a Comment