Friday 15 April 2016

శ్రీరామాయణ సూక్తి


మంచిమాట చెపితే వినడం ఎంత కష్టమో విభీషణుడు రావణునికి చెప్పాడు.
శ్లో!! సులభా: పురుషా: రాజన్ 
సతతం ప్రియవాదిన:
అప్రియస్య చ పథస్య
వక్తా శ్రోతా చ దుర్లభ: !!
" ఓ రాజా! మనకి నచ్చినట్లు మాట్లాడేవారెందరో సులభంగా చుట్టూ తిరుగుతునే ఉంటారు. మనకి మంచి కలిగించే మాటలు చెప్పేవాడు దొరకడం కష్టం. ఎందుకంటే అది మనకి వినడానికి చేదుగా ఉంటుంది. నచ్చకపోయినా హితమును కలిగించేదానిని "పథ్యము" అంటారు. అలాంటి మంచిమాటలు చెప్పేవారు అరుదే! వినేవారు అరుదే!!"

No comments:

Post a Comment