Thursday, 21 April 2016

జన్మనక్షత్రమున చేయదగిన కార్యములు

జన్మ నక్షత్రమున అన్న ప్రాశనము, అక్షరాభ్యాసము, చౌళము, ఉపనయనము, నిషేకము, వ్యవసాయము, భుసంపాదన, మొదలగునవి శుభము. స్త్రీకి జన్మనక్షత్రమున వివాహము చేయుట మంచిది. పురుషులకు జన్మ నక్షత్రమున ఉపనయనము మంచిది
వారశూలలు -- శని సోమ వారములు తూర్పునకు, దక్షణమునకు గురువారము, పడమరకు ఆది శుక్రవారము ఉత్తరమునకు బుధ మంగళవారములు వారశూలలు. ఆ వారములలో ఆదిక్కునకు ప్రయాణము చేయరాదు.
తిధి శూలలు -- తూర్పునకు- పాడ్యమి, నవమి, తిదులలోను, ఉత్తరమునకు, విదియ, దశమి యందును, ఆగ్నేయమునకు, తదియ ఏకాదశి యందును, నైరుతి దిక్కునకు చవితి ద్వాదశి తిదులయండును, దక్షినమునకు పంచమి త్రయోదశి యందును, పడమరకు, షష్టి, చతుర్దశి యందును, వాయువ్యమునకు, సప్తమి, పున్నమి యందును, ఈశాన్యమునకు, అష్టమీ, అమావాస్యలయందును, ప్రయాణము చేయరాదు.
యాత్రా ( ప్రయాణ ) విషయములు. --- పాడ్యమి యందు కార్య నాశనము, విదియ ధన లాభము, తదియ యందు శుభము, చవితి యందు సంకటము , పంచమి నాడు, శుభము, షష్టి కలహము, సప్తమి ధనలాభము, అష్టమి కార్యనాశనము, నవమి విచారము, దశమి శుభము, ఏకాదశి కార్యజయము, ద్వాదశి కార్యనాశనము, త్రయోదశి శుభము, చతుర్దశి మరణము, పున్నమి అమావాస్యలలో కార్యనాశనము జుగును. ఈవిషయములు గమనించి ప్రయాణము చేయవలెను.

No comments:

Post a Comment