సాధారణంగా పూజ అనగానే కొబ్బరి కాయలూ, పువ్వులు, పండ్లు, అగరొత్తుల గుబాళింపులు, దీపం తదితర పూజాద్రవ్యాలు గుర్తుకు వస్తాయి. పూజకు ఇవన్నీ తప్పనిసరిగా కావాల్సినవే. అయితే అమ్మవారికి అన్నింటికంటే ఇష్టమైనది మంత్రపూజ.
అమ్మకు సంబంధించిన సకల విశేషాలతో గల శ్రీ లలితా సహస్ర స్తోత్రాన్ని లేదా లలితా సహస్ర నామాల్ని చదువుతూ పూజచేయడం చాలా మంచిది. అలా కుదరని వారు కనీసం పౌర్ణమి రోజైనా పూజించాలని అంటారు.
మంత్రజపాన్ని ఎంతగాచేస్తే ఆ తల్లి అంతగా కరుణా కటాక్షాలు అందిస్తుందనేది భక్తుల అచంచల విశ్వాసం. లలితాసహస్రనామ పారాయణంతో పాటు పతి మాసంలో శ్రీదేవి భాగవతం కూడా శ్రద్ధగా చదివినట్లైతే శుభం కలుగుతుంది.
No comments:
Post a Comment