🙏
చాలా సంవత్సరాలుగా ఒక మాట కొందరి నోట వింటూ ఉంటాను."
మేము ద్రోణుడిలా వేలు అడిగామా?
మీ ఫీజు అడిగాము" గాని అని.
అది విన్నప్పుడల్లా ఏవో ప్రశ్నలు,ఆలోచనలు.
మీ ఫీజు అడిగాము" గాని అని.
అది విన్నప్పుడల్లా ఏవో ప్రశ్నలు,ఆలోచనలు.
నిజంగా ద్రోణుడు అంత నిర్ధయుడా? అంత స్వార్ధపరుడా?
సాగర తీరాల వరకు ఉన్న సమస్త భూమండలానికి ప్రభువులు కురువంశం వారు.
అంత గొప్ప కురు వంశానికి కాబోయే సామ్రాట్ లకు విద్య నేర్పే ఆచార్యునికి ఉన్న ఎన్ని విశిష్టతలను చూసి భీష్ముడు వారి చిన్నారులకు ద్రోణుడిని గురుస్ధానంపై నియమించి ఉంటాడు.
తన శిష్యుడైన అర్జునుని విజయుడు అని పిలవ బడడానికి,ఏకలవ్యుడిని వేలడిగాడని చెప్పడం ఎంత సరియైనది.
ధర్మం ఎప్పుడు కడు సూక్ష్మం అది అర్ధం కావడానికి కొంత శక్తి మనకుండాలి.
సమస్త అస్త్ర,శస్త్ర శ్రాస్త్ర రణ విద్యా విశారధుడైన ద్రోణాచార్యుడు త్రికాలజ్ఞుడు.
ధర్మానికి, అధర్మానికి మధ్య రాబోయే కాలంలో జరిగే కౌరవ,పాండవ సమరంలో ధర్మ పక్షపాతి,జగద్గురువు శ్రీకృష్ణుడు రధ సారధ్యంలో అర్జునుడు తప్పక విజయం సాధిస్తాడని తెలిసిన త్రికాలవేది ద్రోణుడు.
కౌరవ రాజ్యభూ సామంత భాగంలో భాగమైన ఏకలవ్యుడు నిస్వార్ధ దేశభక్తునిగా రాజ శాసనానికి బద్ధునిగా కౌరవ సైన్యం తరపున పోరాడితే చివరికి కర్ణునిలా మరణం తధ్యం కదా?
ఏకలవ్యుడు
అధర్మం వైపు ఉండి వ్యర్ధంగా చనిపోవడం కన్నా యద్ధానికి వెళ్ళకుండా ఉండడానికి,తనకు ప్రియమైన ఏకలవ్యుని కాపాడడం కోసం,తనను చెడ్డవాడని ప్రచారం జరుగుతుందని తెలిసి గురుదక్షిణగా కుడి బొటన వేలు అడిగాడు.
అధర్మం వైపు ఉండి వ్యర్ధంగా చనిపోవడం కన్నా యద్ధానికి వెళ్ళకుండా ఉండడానికి,తనకు ప్రియమైన ఏకలవ్యుని కాపాడడం కోసం,తనను చెడ్డవాడని ప్రచారం జరుగుతుందని తెలిసి గురుదక్షిణగా కుడి బొటన వేలు అడిగాడు.
కోపం ఉంటే తల అడగవచ్చుకదా?
ఏ ఉత్తమ గురువైనా శిష్యుల భవిష్యత్తు బావుండాలనే ఆశిస్తాడు.
యుగాలు మారిన గొప్ప శిష్యుడెవరంటే ఏకలవ్యుడే అంటారు కాని అర్జునుడని అనరు.
ఇంత గొప్ప కీర్తిని ఏకలవ్యునికి అందించి,
అపకీర్తిని అందుకున్న ఆదర్శగురువు ద్రోణుడు.
అపకీర్తిని అందుకున్న ఆదర్శగురువు ద్రోణుడు.
గురుకులానికి పరిమిత మైన విద్యను విద్యార్ధుల ఇంటికి (ప్రవేట్,హోం టీచింగ్)దరి చేర్చిన ధన్యగురువు
ద్రోణుడు.
ద్రోణుడు.
గురువు మాట వేదం శిష్యుడైన ఏకలవ్యునికి,శిష్యుడు రక్షణ మిన్న గురువుకి.
గురుశిష్యుల బంధం పవిత్రం.
అందుకే నేమో భారత ప్రభుత్వం "ద్రోణాచార్య"
అవార్డ్ ఇస్తోంది.
🙏గురుదేవోభవ🙏
పా ర్వ తీ ప తి
అవార్డ్ ఇస్తోంది.
🙏గురుదేవోభవ🙏
పా ర్వ తీ ప తి
No comments:
Post a Comment