అకుర్వన్తో2పి పాపాని శుచయ: పాపసంశ్రయాత్ !
పరపాపైర్వినశ్యంతి మత్స్యా నాగహ్రదే యథా !!
( 3-38-26)
మారీచుడు రావణునితో :
తాను ధర్మంచేస్తూ చాలా మంచిగా జీవితం గడిపే ధర్మాత్ముడు, నిరంతరం అధర్మం చేసే దుష్టస్వభావం కలిగినవాడితో సంబధం పెట్టుకున్నాడా, అటువంటివాడివల్ల ఏమయిపోతుందంటే, పాములు వున్న సరోవరంలో చేపలు కూడా చేరితే పాములవల్ల చేపలు నాశనమయిట్టు నశించిపోతాడు. ఈ సరోవరం నిండా పాములు పెరిగిపోతున్నాయని ఒకరోజున ఆ నీటినంతటిని తేసేసి పాములను కొట్టేస్తారు. చేపలను కొడదామని ఎవరూ కర్రలు తీసుకుని రారు. కాని కొట్టకపోయినా చనిపోయేవి మాత్రం చేపలే. అందుకని నీతో స్నేహం పెట్టుకోవడానికి నాకు భయంగా ఉంది. నీకు చాలా పాపపుటాలోచనలు వస్తున్నాయి, అన్నాడు.

No comments:
Post a Comment