Thursday, 7 April 2016

పద్దెనిమిది మెట్లు ఈ పద్దెనిమిది మెట్లు..!


మొక్కిన చెరగును చీకట్లు
ఎక్కిన తొలగును ఇక్కట్లు
ఇహానికి పరానికి వేసిన వంతెన ఈ మెట్లు " పద్దెనిమిది"

ఒకటో మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్ప
నమ్మితి నేనయ్యప్ప దేవుడు ఒకడే నంటు ఆ ఒకడివి నీవేనంటూ

రెండవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్ప
కొలిచితి నేనయ్యప్ప జ్ఞానం నీదే నంటూ అజ్ఞానిని నేనే అంటూ

మూడవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్ప
మొక్కితి నేనయ్యప్ప త్రిలోక నేతవు నీవని త్రికాల జ్ఞానివి నీవని " పద్దెనిమిది "

నాల్గవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్ప
పలికితి నేనయ్యప్ప చతుర్వేదములు నీవనీ చతురాననుడే నీవని

ఐదవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్ప
అంటిని నేనయ్యప్ప పంచ భూతములు నీవని పంచామ్రుతమే నీవనీ

ఆరవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్ప
అడిగితి నేనయ్యప్ప అరిషడ్వర్గము నాదని నరికే ఖడ్గం నీవని " పద్దెనిమిది "

ఎదవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్ప
వేడితి నేనయ్యప్ప ఏడు లోకాలు నీవని ఏలే దైవం నీవని
ఎనిమిదవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్ప
ఎరిగితి నేనయ్యప్ప అష్ట దిశలలో నీవని అష్ట సిద్దులు నీవని
తొమ్మిదవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్ప
తోచెను నాకయ్యప్ప నవరస మూర్తివి నీవని నవ చైతన్యం నీదని " పద్దెనిమిది "

పదవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్ప
పాడితి నేనయ్యప్ప దశావతారాలు నీవని మా దశలకు కారకుడవే అని
పదకొండవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్ప
ప్రనవిల్లితి నేనయ్యప్ప పార్వతి సుతుడే నీవనీ పరమ పావనుడు నీవనీ
పన్నెండవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్ప
పలికితి నేనయ్యప్ప గ్రహరాసులలో నీవనీ నీ అనుగ్రహము ఇక మాదని " పద్దెనిమిది "

పదమూడవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్ప
పిలిచితి నేనయ్యప్ప పదములు పాడితి అయ్యప్ప నీ పాదములు మొక్కితి అయ్యప్ప
పదునాల్గవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్ప
భక్తి తోడ నేనయ్యప్ప భగవతి సుతుదన్తయ్యప్ప భగవంతుడివె అయ్యప్ప
పదిహేనవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్ప
పాప వినాశక అయ్యప్ప కాల గమనమే నీవప్పా లోకాల తనయుడే అయ్యప్ప "పద్దెనిమిది "

పదహారవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్ప
పాడితి నేనయ్యప్ప సోదశ కలలే అయ్యప్ప చంద్ర కలాధర సుత అయ్యప్ప
పదిహేడవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్ప
పలికితి నేనయ్యప్ప మా తప్పోప్పులనే అయ్యప్ప మన్నిన్చవయా అయ్యప్ప
పద్దెనిమిదవ మెట్టున అయ్యప్ప ఓం అయ్యప్ప స్వామి అయ్యప్ప
మొకరిల్లితిని అయ్యప్ప అష్టాదశ మూర్తివి అయ్యప్ప అన్నదాత ప్రభువయ్యప్ప " పద్దెనిమిది 

No comments:

Post a Comment