Wednesday, 6 April 2016

సూర్య గ్రహణం - గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

🕉 సూర్య గ్రహణం - గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు - హిందూ ధర్మచక్రం ☸
గ్రహణం అనగానే ఒక రకమైన భయం ప్రజల్లో ఏర్పడుతుంది. అది చేయకూడదు ఇది చేయకూడదు . వీళ్ళు చూడరాదు. వాళ్ళు చూడరాదు . పాత్రల పైన దర్భలు వేయాలి.....
..............ఇంకా అతి సున్నిత విషయం గర్భిణీలు .గర్భిణీలు ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఇలా ఎన్నో భయాలు తలెత్తుతాయి.
🕉 నిజానికి గ్రహణ సమయంలో ఒక రకమైన చెడు కిరణాల ప్రభావం ఉంటుంది.
🕉 ఇది విశేషంగా సూర్యగ్రహణంలో అధికంగా ఉంటుంది. వీటినే Ultra Violated Rays / అతి నీలలోహిత కిరణాలు .
🕉 ఈ కిరణాలు చాలా శక్తివంతమైనవి . గ్రహణ సమయంలో సూర్యుడిని డైరెక్ట్ గా కనుక చూస్తె 100% చూపు పోయి గుడ్డివారు కావడం ఖాయం . ఈ విషయం సైన్సు కూడా చెబుతుంది.
🕉 మన పూర్వీకులు ఋషులు ఈ విషయం పై రీసర్చ్ చేసి ఈ కిరణాల దుష్ప్రభావం నుండి సమాజాన్ని కాపాడాలని కొన్ని నియమాలు చెప్పడం జరిగింది. అయితే వెనకటి వారు ఏదైనా దైవ సంబంధం అయితే కాస్త భయంతో నైనా ఆచరిస్తారని గ్రహణం ను చూస్తే పాపం - దోషం - అరిష్టం అని చెప్పి ఉంటారు.
🕉 వెనకటి కాలంలో విద్యుత్తు లేదు కనుక అందరి ఇంటి పై కప్పులకి సూర్య కిరణాలు ఇంట్లో పడే విధంగా పైకప్పులకి అద్దాలు ఏర్పాటు చేసేవారు. ఈ అద్దాల గుండా సూర్య కిరణాలు ఇంట్లోపడి వెలుతురు ఉండేది. అవే కిరణాలు గ్రహణ సమయంలో కూడా పడేవి కనుక గర్భిణీలు పడుకొని ఉండాలి ఎటూ తిరగకూడదు. వంట పాత్రల పైన దర్భలు పెట్టాలి అని చెప్పారు.
🕉 నేటి నవీన కాలంలో మనకు ఎక్కడా అటువంటి ఇళ్ళు లేవు కావున ఆ భయం అవసరం లేదు.
🕉 అయితే కావాలని బయట తిరిగితే సున్నితమైన వారికి అందులో గర్భిణీలకు ఇంకా త్వరగా ప్రమాదం కలుగుతుంది.
...................✍ హిందూ ధర్మచక్రం.☸

No comments:

Post a Comment