యోగ విద్య......!!
యోగ శక్తులు ప్రదర్శన చేసేవారిని అనుమానించడం అవమానకరంగా మాట్లాడటం సర్వసాధారణం. ఏదో గట్టి దృష్టాంతం మనసుకు హత్తుకుంటే తప్ప మహిమా ప్రదర్శన చేసే వారిని నమ్మని రోజులు దాపురించినవి , నమ్మకాలు ఎప్పుడు సన్నగిల్లునొ అప్పుడే మహిమాత్ములు భూమి పై రావడం తగ్గిస్తారు, ఏదో 100 సంవత్సరాలకు ఒక్క మహానుబావుడు మనల్ని ఆదుకోడానికి పూనుకుని వచ్చి మనిషికి మించిన శక్తి ఒకటి విశ్వాన్ని పరిపాలన చేస్తున్నదని నిరూపించి మనవ అహంకారాన్ని సంహరించి మరల స్వధామానికి చేరుతున్నారు . ఆ కోవకి చెందినా వారే సత్యసాయి , షిర్డీ సాయి , ఆది శంకరాచార్య , అక్కల్కోత్కర్ మహారాజ్ , నృశింహ సరస్వతి , రాఘవేంద్ర స్వామి , కంచి పరమాచార్య శ్రీ చంద్ర శేఖర సరస్వతి , మౌన స్వామి, గణపతి సత్ చిదానంద తదితరులు .. అయితే వీరు ఇప్పుడు లక్షల్లో లేక కోట్లల్లో ఒక్కరే పుడుతున్నారు ..కాని వీరు ప్రదర్శన చేసే విద్యలు పూర్వ కాలం లో ఎందరో చేసేవారు . పూర్వ కాలం లో ఎడ్యుకేషన్ అంటే కేవలం అక్షరజ్ఞానం కాదు యోగ శక్తి మరియు సిద్ధులు పొందటమే వెనుకటికి విద్య యొక్క పరమావధి . గురు కులం లో ఇట్టి యోగ శక్తులే నేర్పేవారు. వీటికి ఉదాహరణలే మన పురానములల్లో మనుష్యులు జంతువులతో మాట్లాడటం , ఉన్నవాడు ఉన్నట్టుగా పర్వతం వలె చాలా ఎత్తు పెరగడం లేక ఒక అంగుళం వరకు తగ్గడం లాంటివి ... ఇవ్వి చదివి చాలామంది కల్పిత కధలు అనుకుంటారు కాని ఇవ్వన్ని పాతంజలి యోగ సూత్రములు అనే శాస్త్రములో పతంజలి మహర్షి చాలా స్పష్టంగా వివరించారు .
అవ్వి ఈ క్రింద విధంగా ఉన్నవి
1. అణిమా సిద్ధి :అతి చిన్న ఆకారంగా మారడం.
హనుమ సముద్రమును దాటే సమయం లో సురస అనే రాక్షసి పెట్టిన పరీక్ష నెగ్గుటకు బొటన వ్రేలంత గా మారి నోట్లోనికి వెళ్ళి సురస యొక్క దంతాలకు చిక్కక బయట పడ్డాడు.
2. మహిమాసిద్ధి : అతి పెద్ద ఆకారంగా మారడం .
హనుమంతుడు సముద్రమును దాటాలని సంకల్పించి తన ఆకారమును మహిమా సిద్ధి చే పెంచి ఆ పై దూకాడు.
3. లఘిమాసిద్ధి :వాయు సమానమైన బరువుతో ఆకాశ ప్రయాణం చెయ్యడం , నిమిషం లో కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చెయ్యడం.
సంజీవిని పర్వతం తీస్కో రావడానికి హనుమస్వామి లఘిమా సిద్ధిని ఉపయోగ పెట్టారు.
4. గరిమాసిద్ధి :శరీరము యొక్క బరువు విపరీతంగా పెంచడం
రాముని దూతగా వెళ్ళిన అంగదుడు రావణ కొలువులో , వానరులను తేలిక చేసి మాట్లాడతున్న రావణాసురుని ఉద్దేశించి , మీ కొలువులో ఎవరైనా నా పాదమును జరపగలరేమో ప్రయత్నం చెయ్యండి అని పలుకగా , ఎవ్వరూ ఆ పని చెయ్యలేక చతికిలాపడ్డ విషయం మనకి తెలిసేందే

5. ప్రపత్తి : ఆకాశమంత ఎత్తు పెరగడం ; దూర శ్రవణం ; దూర దర్శనం ;మనో దర్శనం (మైండ్ రీడింగ్);జంతు భాషలు అర్ధం కావడం తిరిగి వాటి తో సంభాషణ చెయ్యడం; సకల రోగాల ను నయం చెయ్యడం
వామన మూర్తి బలి చక్రవర్తిని సంహరించడానికి ఆకాశమంత పెరగడానికి ఈ విద్య ఉపయోగాపెట్టాడు. దూర దర్శన ,దూర శ్రవణ విద్యల ద్వారా వ్యాస వాల్మీకులు భారత రామాయణాలు రాసారు.. సత్యసాయి వారు భక్తుడు మాట్లాడక ముందే అతను అడగాలని అనుకున్న ప్రశ్నలన్నిటికీ చక చకా సమాధానం చెప్తూ సాగిపోయ్యేవారు. అట్లే షిర్డీ బాబా తన వద్దకి వచ్చిన భక్తుల స్వంత విషయాలు భక్తుడు నోరు విప్పకుండానే చెప్పేవారు. దూర దర్శన సిద్ధి కలిగినవాడు మనో నేత్రం తో తాను అనుకున్న ప్రదేశములను, మనుషులను అట్లే సంఘటనలను చాల స్పష్టంగా చూడగలడు. ఈ సిద్ధి కలిగిన పారాశర మహర్షి కొన్ని వేల సంవత్సరాల క్రితమే 9 గ్రహాలు ఉన్నాయని అవి పనిచేసే తీరు ఎలా ఉంటుందో కూడా పరాశర సంహిత ద్వారా జ్యోతిష్య శాస్త్రమును రచించి ప్రజలకు అందించాడు.అంతకు పూర్వం కూడా నారద , జైమిని వంటి వారు అట్లే దర్శించి జ్యోతిష్య ఫలితాలు రచించారు . తరువాతి కాలం లో కలికాలపు scientist లకు అట్టి శక్తులు లేవు కాబట్టి వందల కోట్ల డాలర్లు వెచ్చించి టెలీస్కోపుల ద్వారా చూచి ఆ 9 గ్రహాల పేర్లే చెప్పారు. కలి మానవుడి శక్తి సన్నగిల్లిపోయిన కారణంగా మంత్రం తో చెయ్యలేనివి యంత్రం తో చెయ్యడానికి నా నా తంటాలు పడుతున్నాడు కానీ యోగ శక్తి తో సమానమైన శక్తి ని కనుక్కోవడం సాధ్యమా ..!!.? ... ఇక రోగాలు నయం చెయ్యడంలో షిర్డీ సాయి సత్యసాయి లు పెట్టింది పేరు. ఇక మన పురాణ కధలల్లో జంతువులతో సంభాషణ ఎన్నో చోట్ల ఉన్నది .రావణుని తో జటాయు సంభాషణ, అట్లే హనుమతో సంపాతి సంభాషణలే ఉదాహరణలు.
6. ప్రాకామ్య సిద్ధి :నీటిలో నివాసము చేసి , కావాలనుకున్నప్పుడు మరల భూమి పైకి రావుట , పరుల శరీరం లో కి వెళ్ళుట:
దుర్యోధనుడు నీటిలో కి వెళ్ళి తపమాచరించినట్లు మనకు మహాభారతం లో చెప్తారు. త్రిలింగ స్వామి నీటి లో ఆరు నెలలు వసించాడని యోగులు, పెద్దలు చెప్తారు. శ్రీ ఆదిశంకరులు రాజా అమరుక దేహం లోనికి పరకాయ ప్రవేశం చేసినట్లు శంకరుల జీవిత చరిత్రలో స్పష్టంగా ఉన్నది.
7. వశిత్వ సిద్ధి : సర్వ జనులు వశీకరణం చెందటం ఇందులో విశేషం.
ఈ సిద్ధి పొందిన గురువుల ఆధీనములో సర్వ దేశ ప్రజలు , రాజులూ ఉంటారు. ఎవరెన్ని ఉపాయాలు చేసినా వీరిని అనుసరిచే శిష్య బృందం పెరుగుతూనే ఉంటుంది . వీరు నమ్మిన ప్రతి భక్తుణ్ణి రక్షిస్తూ ఉంటారు. ఈ సిద్ధి విశేషంగా ఒక జీవిత కాలం లో ప్రదర్శన చేసిన వారు శ్రీ కృష్ణ పరమాత్మ,సత్యసాయి . దాదాపు ప్రపంచ రాజులంతా అతన్ని భగవంతుని గ అవతారం చాలించక ముందే అనుభవించి ఒప్పుకున్నారు..ఒప్పుకొక ఎదురు తిరిగిన వారు చాలా తక్కువ ,అట్లు ఒప్పుకోక ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించిన శిశుపాలుడు వంటి వారు చంపబడ్డారు , అట్లే సత్యసాయి దర్శనానికి ఒక్కోరోజు 14 నుండి 15 దేశాల అధినేతలు ఆశిస్సుల కోసం వచ్చేవారు , ప్రతీ భారత దేశ ప్రధాని మరియు రాష్ట్రపతి సత్యసాయి ని మానవాతీత శక్తి గా పరిగణించి పుట్టపర్తి వెళ్ళి ఆశీస్సులు పొందుట మనకి తెలుసు. అట్లే 155 దేశములల్లో సత్యసాయి భక్తులు దేవాలయాలు కట్టుకుని ప్రార్ధిస్తున్నారు , అతనితో పాటు రాముడు , కృష్ణుడిని కుడా వారు పూజిస్తూ ఉన్నారు.
వశిత్వ సిద్ధిలో క్రూర జంతువులు సైతం వశమైపోతవి , అరణ్యములల్లో సాధన చేసేవారు ఈ సిద్ధి పొంది క్రూర జంతువుల వలన ఏ భయమూ లేక తపమాచరించేవారు.
8. ఈశిత్వసిద్ధి: పూర్తిగా మహేశ్వర తత్వాన్ని ప్రదర్శన చెయ్యడం , జగత్తులో సర్వం ఈ సిద్ధి ద్వారా వశమైపోవును . విశ్వానికి ప్రభువుగా తన శక్తి ప్రదర్శన జరుగును.
చనిపోయిన వారిని బ్రతికించ కలగడం ఈ సిద్ధి పొందిన వారిలో ప్రత్యేకం.
సత్యసాయి కరణం సుబ్బమ్మ ను మరణించిన మూడవ రోజు లేపి తులసి తీర్ధమిచ్చిమరల పరలోక ప్రయాణం చేయించడం వందల మంది సమక్షం లో బుక్కపట్టణం లో జరిగింది. అట్లే నృశింహ సరస్వతుల వారు మరణించిన భర్తను పట్టుకు వచ్చిన స్త్రీని సుమంగళి గా ఉండమని దీవించి ఆ మరణించిన వ్యక్తిని లేపాడు.. ఆ తర్వాత దాదాపు 30 సంవత్సరాలు ఆ దంపతులు హాయిగా జీవనం చేసారు.
9. స్వర్ణ సిద్ధి : బంగారమును సృష్టించడం
సత్యసాయి తమ అవతార సమయం లో దాదాపు ప్రతి రోజు ఇట్టి సిద్ధిని ప్రదర్శించారు . అట్లే మౌన స్వామి కుర్తాళం లో అనేక సార్లు ఈ మహిమ చేసి చుపారు.
10. కామ రూప సిద్ధి
తను సంకల్పించిన శరీర రూపమును పొందుట , హనుమంతుడు ఈ సిద్ధి ని ఉపయోగ పెట్టి ఒక విప్రుని రూపం లో వెళ్ళి సుగ్రీవుని ఆజ్ఞ పై రాముల వారి వివరాలను అడిగి తెలుసుకున్నాడు .
11. యతః సంకల్ప సిద్ధి
ఇష్ట వస్తువుని సంకల్ప మాత్రముగా పొందుట
12. భూత జయ సిద్ధి
పంచభూతముల పై ఆధిపత్యము సాధించుట. గాలి , నీరు , నిప్పు వంటి పంచభూతముల ప్రవర్తనను సంకల్ప మాత్రమున నియంత్రించుట లేక సృస్టించుట

No comments:
Post a Comment