పురాణాలలో శని.........
నారదుడు ఒకసారి కైలాసానికి వెళ్ళి పరమేశ్వరునితో మానవులకు శనిగ్రహ పీడ ఎట్లు
తొలగునో చెప్పమనిప్రార్థించాడు. పరమేశ్వరుడు ‘‘ఓ నారదా! గ్రహాలలో మానవులపై అత్యంత ప్రభావం కలవాడు శని. ఈతడు సూర్యపుత్రుడు. ఇతనికి కాలరూపి గ్రహమని కూడా పేరు కలదు. ఇతని శరీరముపై ఉన్న ఒక్కొక్క రోమము వజ్ర సన్నిభమైనది. శనిగ్రహ పీడ తొలగించుకొనుటకు మానవులు సులభముగా శనిసోత్రమును పఠించాలి. ఈ స్తోత్రమును మొట్టమొదట పఠించినవాడు రఘు వంశ చక్రవర్తియైన దశరథుడు.
తొలగునో చెప్పమనిప్రార్థించాడు. పరమేశ్వరుడు ‘‘ఓ నారదా! గ్రహాలలో మానవులపై అత్యంత ప్రభావం కలవాడు శని. ఈతడు సూర్యపుత్రుడు. ఇతనికి కాలరూపి గ్రహమని కూడా పేరు కలదు. ఇతని శరీరముపై ఉన్న ఒక్కొక్క రోమము వజ్ర సన్నిభమైనది. శనిగ్రహ పీడ తొలగించుకొనుటకు మానవులు సులభముగా శనిసోత్రమును పఠించాలి. ఈ స్తోత్రమును మొట్టమొదట పఠించినవాడు రఘు వంశ చక్రవర్తియైన దశరథుడు.
పూర్వం రఘువంశ చక్రవర్తియైన దశరథుడు జ్యోతిషులు, పండితుల వలన భూమండలానికి 12 సంవత్సరాల క్షామము ఏరపడబోతున్నదని తెలుసుకొన్నాడు. దానికి కారణం కృత్తికా నక్షత్రము చివరనున్న శనిగ్రహము రోహిణీ నక్షత్రమును ఛేదించుకొని పోవడమేనని జ్యోతిషులు చెప్పారు. శనిగ్రహం ఇలా ఛేదించడాన్ని శాకట భేదమంటారు. ఈ విషయాలను తెలిసికొన్న దశరథుడు తన హితైషులైన మంత్రి పురోహితులతో విచారించాడు.
వశిష్టుల వారి సలహా తీసుకొన్నాడు. ఈ ప్రపంచానికి క్షామం రాకుండా చేసి క్షేమం కలిగించాలనే ఆలోచనచేశాడు. తాను స్వయంగా ధనుర్బాణాలు ధరించి నక్షత్ర మండలానికి రధారూఢుడై బయలుదేరాడు. లక్ష యోజనముల దూరమున నున్న రోహిణీ మండలము యొక్క ముందు భాగం చేరాడు. రధారూఢుడై ధనుర్బాణాలు ధరించి నక్షత్ర మండలమున దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న దశరథ చక్రవర్తిని చూచి శని ప్రత్యక్షమై చిరునవ్వుతో ఇలా పలుకరించాడు.
‘‘ఓ దశరథ మహారాజా! నీ అనన్య సామాన్యమైన పరాక్రమునకు మెచ్చాను. దేవతలు, గంధర్వులు, సిద్ధులు, విద్యాధరులు, కినె్నర కింపురుషులు నన్ను తలుచుకొని భయపడగా నీవు మాత్రం ఎంతో ధైర్యంతో నన్ను ఎదుర్కొనుటకు వచ్చావు. భూమండల క్షేమంకోరే నీ మంచితనాన్ని నేను ఇష్టపడ్డాను. ఏదైనా వరము కోరుకొమ్ము’’ అని అన్నాడు.
అంతట దశరథుడు ‘‘ఓ శనిదేవా! నీవు సూర్య చంద్రాదులున్నంతవరకు రోహిణీ నక్షత్రాన్ని ఛేదించుకొని పయనించకూడదు ఇదే నాకు కావలసిన వరం’ అని అనగా శని ‘‘తథాస్తు’’ అని అన్నాడు. అంతేకాక మరేదైనా వరాన్ని కోరుకోమని కూడా సంతోషంగా చెప్పాడు. అప్పుడు ‘‘దేశములో ఎన్నడూ కూడా 12 సంవత్సరాల క్షామం రాకూడదు- ఇలాంటి క్షామం వలన జనులు తీవ్రకష్టనష్టములకు లోను అవుతారు.కనుక ఎన్నడూ కూడా ఇలాంటి క్షామం రాకుండా వరం ప్రసాదించవలసిందని కోరుకున్నాడు. ఆకోరికకు శని సంతసించి ‘‘ఓ రాజా! నీవు కోరినట్లే ఎన్నడూ కూడా దేశంలో 12 సంవత్సరాల క్షామం ఏర్పడకుండుగాక’’ అని పలికిన శనిదేవుని గాంచి దశరథుడు ధనుర్బాణములు ప్రక్కన పెట్టి చేతులు జోడించి భక్తితో స్తుతించాడు.
శని సంతసించి తిరిగి వరాన్ని కోరుకొమ్మనగా దశరథుడు ‘ఓ శనిదేవా! నేటినుండి నీవు మనుష్యులనుగానీ దేవాసురులను గానీ పీడించకూడదు. ఇదే నీవు ఈయవలసిన వరం’’ అనగా శని ‘‘ఓ రాజా! ఎవరినీ పీడించవద్దనుట సాధ్యంకాదు. అయిననూ ఎవరైతే నీచే పఠింపబడిన నా స్తోత్రమును భక్తితో పఠిస్తారో వారిని నేను పీడించను. అంతేకాక ఎవరైతే శనివారం రోజున నన్ను శమీ పత్రములతో పూజించి నువ్వులు, మినపప్పు అన్నమును నైవేద్యముగా పెట్టి యధాశక్తి దక్షిణను తాహతు కొలది కపిల గోవును దానము చేసి ఈ స్తోత్రమును పఠిస్తారో వారికి శని దోషం తక్షణమే తొలగిపోవును’’ అని వరాన్ని ఇచ్చాడు. అంత దశరథుడుఎంతో సంతోషించి తిరిగి తన రాజ్యమునకు తిరిగి వచ్చాడు. ఈ విధంగా పరమేశ్వరుడు మానవులకు శనిగ్రహ పీడా పరిహార మార్గాన్ని నారదుని ద్వారా లోకమునకు తెలియపరిచారు.
దశరథ ప్రోక్త శని స్తోత్రం.....
నమః కృష్ణాయ నీలయ| శిఖి ఖండ నిభాయచ|
నమో నిల మథూకాయ| నిలోత్పల నిభాయచ|
నమో నిర్మాంస దేహాయ| దీర్ఘ శృతి జటాయచ|
నమో విశాల నేత్రాయ| శుష్కోదర భయానక|
నమః పౌరుష గాత్రాయ| స్థూల రోమాయతే నమః|
నమో నిత్య క్షుధార్తాయ| నిత్య త్రుప్తాయతే నమః|
నమో దీర్ఘాయ శుష్కాయ| కాలదంష్ట్ర నమోస్తుతే|
నమో నిల మథూకాయ| నిలోత్పల నిభాయచ|
నమో నిర్మాంస దేహాయ| దీర్ఘ శృతి జటాయచ|
నమో విశాల నేత్రాయ| శుష్కోదర భయానక|
నమః పౌరుష గాత్రాయ| స్థూల రోమాయతే నమః|
నమో నిత్య క్షుధార్తాయ| నిత్య త్రుప్తాయతే నమః|
నమో దీర్ఘాయ శుష్కాయ| కాలదంష్ట్ర నమోస్తుతే|
నమస్తే ఘోర రూపాయ| దుర్నిరీక్ష్యాయతే నమః|
నమస్తే సర్వ భక్షాయ| వలీముఖ నమోస్తుతే|
సూర్యపుత్ర నమస్తేస్తు| భాస్కరో భయ దాయినే|
అధో దృష్టే నమస్తేస్తు| సంవర్థక నమోస్తుతే|
నమో మందగాతే తుభ్యం| నిష్ప్రభాయ నమోనమః|
తపసా జ్ఞాన దేహాయ| నిత్యయోగ రతాయచ|
జ్ఞాన చక్షుర్నమస్తేస్తూ | కశ్యపాత్మజ సూనవే|
తుష్టో దదాసి రాజ్యం తం| క్రకుద్దో హరసి తత్ క్షణాత్|
దేవాసుర మనుష్యాశ్చ| సిద్ధ విధ్యాధారో రగాః|
నమస్తే సర్వ భక్షాయ| వలీముఖ నమోస్తుతే|
సూర్యపుత్ర నమస్తేస్తు| భాస్కరో భయ దాయినే|
అధో దృష్టే నమస్తేస్తు| సంవర్థక నమోస్తుతే|
నమో మందగాతే తుభ్యం| నిష్ప్రభాయ నమోనమః|
తపసా జ్ఞాన దేహాయ| నిత్యయోగ రతాయచ|
జ్ఞాన చక్షుర్నమస్తేస్తూ | కశ్యపాత్మజ సూనవే|
తుష్టో దదాసి రాజ్యం తం| క్రకుద్దో హరసి తత్ క్షణాత్|
దేవాసుర మనుష్యాశ్చ| సిద్ధ విధ్యాధారో రగాః|
No comments:
Post a Comment