జ్యోతిష్యశాస్త్రంలో అనేక యోగాలు సూచింపబడ్డాయి. రాశి, అంశ చక్రాలలో ఉన్న గ్రహస్థానలను పరిశీలిస్తూ ఈ యోగాలు ఉంటాయి. యోగాలను అనుసరించి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు కొన్ని యోగాలు గురించి తెలుసుకుందాం.
రవి సంబంధిత యోగాలు....
జ్యోతిష్యంలో రవి(సూర్యుడు)కి సంబంధించిన యోగాలు పరిశీలిద్దాం.
1. బుధాదిత్య యోగము
రవి బుధుడు ఏ రాశిలో ఉన్నా దానిని బుధాదిత్య యోగము అంటారు. జాతక చక్రంలో రవి, బుధులు మేషం, మిథునం, సింహం, కన్యారాశుల్లో కలిసి ఉంటే ఈ యోగం కలుగుతుంది. ఈ రాశుల్లో ఒకటి లగ్నమై అక్కడ రవి, బుధులు కలిసి ఉంటే రాజయోగం అనుభవిస్తారు. మిగిలిన చోట ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నా బుధాదిత్యయోగం కాదు.
ఫలితాలు: విచక్షణతో కూడిన కార్యాలు, వెనకడుగు వేయని పట్టుదల, పట్టు వదలని ప్రయత్నం వీరి స్వంతం.
2. శుభవేశి యోగము
రవికి రెండవ స్థానంలో శుభగ్రహాలు ఉంటే శుభవేశి యోగము అంటారు.
ఫలితం: సుఖమైన ప్రశాంత జీవితము, కీర్తి, మర్యాద, అదృష్టము వరించుట.
3. శుభవాశి యోగము
రవికి పన్నెండవ స్థానంలో శుభగ్రహాలు శుభవాశి యోగము అంటారు.
ఫలితాలు: కీర్తి ప్రతిష్టలు, సంపద, పలుకుబడి, పట్టుదల, స్వయంకృషితో అభివృద్ధి.
4. ఉభయరాశి యోగము
2, 12 స్థానాలలో శుభగ్రహాలు ఉంటే ఉభయరాశి యోగము అంటారు.
ఫలితాలు: సంతోషం, సంపద, కీర్తి, మర్యాద, పలుకుబడి, పట్టుదల ప్రయత్నంతో ముందుకు రావడం.
చంద్రుడు సంబంధిత యోగాలు
5. చంద్ర మంగళ యోగము
చంద్రుడు, కుజుడు ఒకే స్థానంలో ఉన్నా నేక చంద్రునికి కేంద్రంలో అంటే 1, 4, 7, 10 స్థానాలలోఉంటే చంద్రమంగళ యోగం అంటారు. జాతక చక్రంలో చంద్రునికి కేంద్రమందు కుజుడు ఉన్నా, లేక ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నా ఈ యోగం కలుగుతుంది.
ఫలితాలు: భాగ్యవంతులవుతారు, రసాయన, ఔషధ వ్యాపార రంగంలో అనుకూలత ఉంటుంది. మనో చంచలం రావడానికి అవకాశం.
6. వసుమతి లేక లక్ష్మి యోగము
చంద్రునికి ఉపజయ స్థానాలయిన 3, 6, 10, 11 స్థానాలలో బుధుడు, శుక్రుడు, గురువు ఉంటే వసుమతి లేక లక్ష్మి యోగము అంటారు.
ఫలితాలు: అకస్మాత్తుగా ధనాగమనం. ఎన్ని కష్టాలు ఎదురైనా ఈ యోగ జాతకులకు ధనం కొరత ఉండదని శాస్త్రం చెబుతోంది.
7. గజ కేసరి యోగము
గురు, చంద్రులు కర్కాటక రాశియందు ఉన్నప్పుడు ఈ యోగము కలుగుతుంది. చంద్రునికి కేంద్రంలో గురువు ఉంటే గజ కేసరి యోగము అంటారు.
ఫలితాలు: చంద్రునికి కేంద్ర స్థానంలో గురుడు ఉన్నా, లేక ఇతర స్థానాల్లో ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నా మిక్కిలి భోగభాగ్యాలు అనుభవిస్తారు. కీర్తి ప్రతిష్టలు, శత్రుజయం, ధనాగమనం, సంపద, దీర్ఘాయువు.
8. అనపా యోగము
చంద్రునికి పన్నెండు స్థానాలలో రాహువు, కేతువు మనహా మీలిన గ్రహాలు ఉంటే అనపా యోగము అంటారు.
ఫలితము: ఆరోగ్యమైన శరీరం.
9: శునభా యోగము
చంద్రునికి రెండులో రాహువు, కేతువు మినహా మిగిలిన గ్రహాలు ఉంటే అనపా యోగము అంటారు.
ఫలితాలు: స్వప్రయత్నంతో సంపాదన.
10. మేఘదృవా యోగము
చంద్రునికి 2, 12 స్థానాలలో ఏగ్రహాలు లేకుంటే అనపా యోగం అంటారు.
ఈ యోగము పీడ, కీడు కలిగిస్తుంది. అయినా కేంద్రం అంటే 1, 4, 7, 10 స్థానాలలో ఏదైనా గ్రహం ఉంటే నివృత్తి ఉంటుంది.
12 అది యోగము
చంద్రుడికి 6, 7, 8 స్థానాలలో శుభగ్రహాలు ఉంటే అది యోగం అంటారు.
ఫలితాలు: విలాసవంతమైన జీవితం.
13. శకట యోగము
చంద్రునికి , 6,8, 12వ స్థానంలో గురువు ఉంటే శకట యోగము అంటారు.రాశి చక్రములోని గ్రహములన్ని లగ్నము మరియు సప్తమ స్థానమల మాత్రమే ఉన్న శకట యోగము అంటారు.
గురువు లగ్నము తప్ప మిగిలిన స్థానములలో ఉన్న శకట యోగము సంభవిస్తుంది.
ఫలితాలు: జీవితంలో నిలకడ లేమి, అవమానము, ఆర్థిక బాధలు, శారీరక కష్టం, మానసిక బాధలు కలిగించును. ధనవంతుల గృహంలో జన్మించినా ఈ యోగప్రభావమున పేదరికమే అనుభవించవలసి ఉంటుంది. అర్హతకు తగిన గౌరవ, మర్యాదలు ఉండవు. అయితే ఇతర బాధలు ఉండవు. ఈ యోగముకు భంగము ఏర్పడినప్పుడు సమస్యలు ఉన్నా గౌరవ మర్యాదలాకు భంగము వాటిల్లదు

No comments:
Post a Comment