యవ్వరికైనను వారు జన్మించిన నక్షత్రము జన్మ నక్షత్ర మగును జన్మ నక్షత్రమునుండి
వరుస క్రమములో 7 వది నైధనము10 వది కర్మభము 16 వ నక్షత్రము సాంఘూతికము
18 వ నక్షత్రము సాముదాయకము 23 వ నక్షత్రము వైనాశము.వ నక్షత్రముమానసము
అని తెలుపబడినది,.సర్వేషు కర్మస్వపే' అని శాస్త్రము చెప్పుట వలన పైన పేర్కొనబడిన 7 నక్షత్రములు
అన్నిశుభకార్యములందు విడువ వలెను.
2) సగ్రహ చంద్ర దోషము: వివాహముహూర్త మందు చంద్రుడే గ్రహముతోనూ కలసి ఉండకూడదు.
రవి తోను గాని కుజుని తో గాని, బుధునితో గాని,శుక్రునితో గానికలిసి ఉందకూడదు. ఈ విషయమై
వేరు వేరు అభిప్రాయ భేదములున్నను కాలామ్రుతమున చంద్రునితో ఏ గ్రహము కలసి ఉండరాదని
చెప్పు చున్నది.బుధ గురువులతో కలసి ఉండుట శుభమని రామ దైవజ్జులు తెలిపిరి.
3) అష్టమ శుద్ధ్హి: ముహూర్త లగ్నమునుండి ఎనిమిదవ స్థానముఅందరికి ఆయుస్థానమే గాక
వివాహ విషయములో వధువుకు మాంగల్యస్థానము గుడా అగుచున్నది. ఈ స్థానమందు ఏ
గ్రహముఉండరాదని శాస్త్రము చెప్పుచున్నది. కొందరు శుభగ్రహమున్నను
చూచుచున్నను దొషము లేదనుచున్నారు. అనుగత సాంప్రదాయముగా పెద్దలు అష్టమ శుద్ధిని
పరిగణంచుచున్నారు.అష్టమ మందు ఏ గ్రహము లేకుండుయే అష్టమ శుద్ధి అనవలెను.
No comments:
Post a Comment