Saturday, 30 January 2016

బరువు తగ్గించడంలోనూ తమలపాకు బేష్ !

భారతదేశంలో భోజనం తర్వాత పాన్ నమలడం అనేది సర్వసాధారణం. అలాగే దానిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ మీరు తమలపాకు నమలడం వలన చాలా బరువు కోల్పోవటానికి సహాయం చేస్తుందని మీకు తెలుసా? మిరియాలతో కలిపి తీసుకున్నప్పుడు,అది ఎనిమిది వారాలలో ఫలితాలను చూపే ఒక శక్తివంతమైన బరువు నష్టం సాధనంగా మారుతుంది. ఇది ఎలా పనిచేస్తుందో మరియు దీనిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ వివరంగా ఉంది. తమలపాకు చాలా శక్తివంతమైన కడుపు ఉబ్బరం లక్షణాలు మరియు సరైన జీర్ణక్రియ చికిత్సలో సహాయపడతాయి. ఒక అధ్యయనం ప్రకారం ఈ ఆకును నమలటం వలన మీ జీవక్రియ వేగం పెరగటానికి సహాయపడుతుందని కనుగొన్నారు. ఇది కడుపు లో మ్యూకస్ ను పెంచడం ద్వారా ఆమ్లత్వంను నివారించడంలో సహాయపడుతుంది. గ్యాస్ట్రిక్ ఆమ్లాల వలన వచ్చే చెడు ప్రభావాల నుండి ఉదర పూతను రక్షిస్తుంది. అంతేకాక, మీ జీర్ణక్రియ పనిని ప్రారంభించడానికి తమలపాకు నమలటం వలన మీ నోటిలో లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది. మీరు తిన్న ఆహారం జీర్ణం కావటానికి సిద్ధంగా ఉందని మీ కడుపుకు సూచిస్తుంది. మీ కడుపు నుండి (ఆయుర్వేదంలో అమా అని పిలుస్తారు) విషాన్ని వదిలించుకోవటం కొరకు సహాయపడుతుంది. మలబద్ధకం నుండి (దానిలో అధిక పీచు ఉండుట వలన) ఉపశమనానికి సహాయపడుతుంది. అలాగే, ఆయుర్వేద గ్రంథాల ప్రకారం తమలపాకు బరువు నష్టం ప్రక్రియను వేగవంతం చేసి మీ శరీరంలో మేధా ధాతు (శరీర కొవ్వు)తగ్గించేందుకు సహాయం చేస్తుంది. మరోవైపు,మిరియాలలో ఫ్యాతో న్యూ త్రియంత్స్ మరియు పెప్పేరిన్ కలిగి ఉండుట వలన కొవ్వు విచ్ఛిన్నంలో సహాయపడుతుంది. మీరు తినే ఆహారంలో అన్ని పోషకాలు సరైన సమానత్వంతో ఉండాలి. అలాగే,నల్ల మిరియాలలో ఉండే పిపెరిన్ కంటెంట్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది మరింత హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి కొరకు కడుపు సంకేతంగా రుచి మొగ్గలను ప్రేరేపిస్తుంది. ఇది పొట్టలో ప్రోటీన్లు మరియు ఇతర ఆహారాలను జీర్ణం చేయుటలో సహాయపడుతుంది. మీ కడుపులో ఆహారం జీర్ణం కాకపోతే అపానవాయువు, అజీర్ణం, విరేచనాలు,మలబద్ధకం మరియు ఆమ్లత్వం వంటి వాటికీ కారణం అవుతుంది. అంతే కాకుండా, ఇది శరీరం నుండి అదనపు నీటిని మరియు విషాన్ని వదిలించుకోవటానికి ఒక గొప్ప మార్గం. ఇది చెమట మరియు మూత్రవిసర్జనను ప్రోత్సహిస్తుంది.
ఎలా ఉపయోగించాలి: లేత మరియు ఆకుపచ్చగా ఉన్న తమలపాకులో 5 మిరియాల గింజలను వేసి,తమలపాకును మడిచి నమలాలి. మిరియాలు ప్రారంభంలో మీకు కొంచెం కారంగా ఉండవచ్చు. కాబట్టి మీరు దానికి నమలుతూ మరియు మీ నోటిలో దానిని ఉంచుకోవచ్చు. మీ కడుపు లోకి పోషకాలు వెళ్ళటానికి మీ లాలాజలం అనుమతిస్తుంది. ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో 8 వారాల పాటు తీసుకోవాలి.
జాగ్రత్తలు: మీరు కొనుగోలు చేసినప్పుడు తినటానికి తాజాగా ఉన్నాయని నిర్దారణ చేసుకోండి. తమలపాకు పాత లేదా పసుపు రంగులోకి మారితే వాటిలో ఔషధ విలువలు కోల్పోతాయి.కుళ్ళిపోయిన ఆకులను తింటే కడుపు అప్ సెట్ అవుతుంది.

No comments:

Post a Comment