Thursday 28 January 2016

ధర్మరాజుతో నారదుడు శ్రీహరిని గూర్చి చెప్పిన మాటలు :


"ధర్మరాజా! కోపంతోకానీ, కోరికతో కానీ, స్నేహంతో కానీ, మోహంతో కానీ, శతృత్వంతో కానీ, ఇష్టంతో కానీ, భయంతో కానీ ఏవిధంగానైనా సరే శ్రీహరిని ఎల్లప్పుడూ స్మరిస్తున్నట్లయితే శ్రీమహావిష్ణువు సన్నిధానం లభిస్తుంది. ఆ స్వామి ఎవరినీ, ఎప్పుడు పరునిగా చూడడు. ఆయనకు తిట్టడం వలన బాధ, స్తుతుల వలన ఆనందము కలుగుతుందని భావించరాదు. జీవులు భయంవల్ల కానీ, ఇష్టం వలన కానీ, నామస్మరణ వల్ల కానీ, ఆయన లీలలు వినడం (శ్రవణం) వల్ల కానీ, ఏదో ఒక రీతిగా శ్రీహరిని తలచినచో ఆ జీవుడు స్వామి సాన్నిధ్యం పొందవచ్చును.
ఈ విధంగా ధర్మరాజా! మనస్సు లగ్నంచేసి శ్రీకృష్ణునే తలుచుకుంటూ గోపికలూ, భయంతో కంసుడు, వైరంతో శిశుపాలుడు మొదలైన రాజులు, బంధుత్వంతో యాదవులు, ప్రేమతో మీరూ, భక్తితో మహర్షులమైన మేమూ శ్రీహరి నామస్మరణ చేసి ఆ స్వామి అనురాగానికి పాత్రులమయ్యాం కాబట్టి ఏవిధంగానైనా సరే నిరంతరమైన భగవంతుని నామస్మరణ వలన జనుడు జనార్ధనుడౌతాడు. నరుడు నారాయణుడవుతాడు".
"ఓం నమో నారాయణాయ"

No comments:

Post a Comment