Sunday 24 January 2016

కాలసర్ప దోషం




కాలసర్ప దోషం సాదారణ మానవులపై ప్రభావం చూపించదు.కాలసర్ప దోషం ప్రపంచాన్ని ,దేశాన్ని,రాష్ట్రాన్ని,సంస్ధని,అదికారం చలాయించే వారికి కాలసర్పదోష ప్రభావం ఉంటుంది.వారు పరిపాలించేచోట సరియైన సమయంలో వర్షాలు పడక పంటలు సరిగా పండక ,ఆర్దికవ్యవస్ధ దెబ్బతిని,కోట్లాటలు,అనారోగ్య సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడతారు.
పరిపాలాద్యక్షుకుడికి,పాలనా వ్యవస్ధపై కాలసర్పదోష ప్రభావ కనపడుతుంది.పాలకులు సరియైన నిర్ణయాలు తీసుకోలేరు.
అయితే కాలసర్పదోషం ఉన్నవ్యక్తులకు,రాహు,కేతు దశలు నడుస్తున్న వ్యక్తులకు మానసిక ప్రశాంతత లేకుండా చేస్తాడు.కొన్ని రెమిడీస్ చేసుకుంటె రాహు,కేతు చాయగ్రహాలభాదలనుండి విముక్తి లభిస్తుంది.
జాతక చక్రంలో వున్న గ్రహాలలో రాహుకేతువుల గురించి చరిత్ర పరిశీలిస్తే.. క్షీరసాగర మధన సమయంలో అమృతం తాగబోయిన రాహువు అనే రాక్షసుని శ్రీహరి తన యొక్క సుదర్శనంతో చీల్చివేయడంతో మొండెం క్రింద భాగం, మొండెం పై భాగం రాహు కేతువులు అయిరి.
కాలసర్పదోషం అంటే రాహు కేతువుల మధ్యలో మిగిలిన రవి చంద్ర కుజ గురు శుక్ర శని గ్రహాలు ఒకపక్కన వుండి మరొక పక్కన అసలు గ్రహాలు లేకుండా ఉండడం. సరే బాగా జ్యోతిశ్శాస్త్రం రీసెర్చ్ చేసేవారు వారి అనుభవాలతో చెప్పే అంశాలు ఏమిటి అంటే రాహుకేతువుల మధ్య మాలికా యోగం (సప్తగ్రహ) అనగా వరుస ఏడు రాశులలో ఏర్పడితే అది ప్రమాదకరం అని రాహు కేతువులకు ఈ మాలికా యోగం వలన ప్రత్యక్ష సంబంధం కలగడం వంటివి ఏర్పడుతాయి. కావున ఇబ్బందికరం అని చెబుతారు.
మిగిలిన విషయాలలో కేవలం కాలసర్పదోషం వలన జీవితం పాడయిపోతుంది. అభివృద్ధి వుండదు అనే భావన వాదన శాస్త్ర దూరమైన విషయమే. మిగిలిన గ్రహాలు వాటి స్థితి బాగుండకపోతే వచ్చే ఫలితాలు బాగుంటే వచ్చే ఫలితాలు గూర్చి పరిశీలింపక కేవలం కాలసర్ప దోషం వలన జాతకం పాడయిపోతున్నది అని చెప్పే సిద్ధాంతులు నేటి సమాజంలో ఎక్కువ వున్నారు.
అసలు దోష శాంతి ఏమిటి? రాహు కేతువుల మధ్య మిగిలిన ఏడు గ్రహాలు చేరడం వలన వచ్చిన దోషం కావున శాంతి కోసం తొమ్మిది గ్రహాలకు జపం దానం హోమం తర్పణం చేయుట వైదిక ప్రక్రియ. తద్వారా దోష శాంతి చేకూరుతుంది. ఇది వైదీక విజ్ఞానం వున్న బ్రాహ్మణులు, నవగ్రహ మంటపం వున్న ప్రతి దేవాలయంలోనూ చేయించుకోవచ్చు. అలాగ కాకపోతే ఎవరి ఊరిలో వారు కాలసర్ప దోష శాంతి చేసుకోవచ్చు.
మరి కాలసర్పదోషమే ప్రధాన కారణంగా జరిగే నష్టాలు ఏమిటి అని పరిశీలిస్తే పంచాంగ గణిత ఫలితాంశాలు చెప్పే గ్రంథాలలో ‘్ధ్వజేపురోవర్తిని పృష్ఠ సంనే్థ విధుంతుదే మధ్య గతా గ్రహేంద్రాః/ తారాబిధా నాస్త్విహ కాల సర్వస్సస్యావనీ పాల వినాశహేతు’ గ్రంథాంతరం ‘అగ్రేకేతు రథో రాహుః సర్వే మధ్యగతా గ్రహః యోగోయం కాల సర్పాభ్యో నృపసస్య వినాశకృత్’ ఇలాగ కాలసర్ప దోషం జరిగే కాలంలో రాజులకు (పాలకులకు) అలాగే పంటలకు నాశనం కలుగును అని చెప్పబడినది. అందువలన కాలసర్ప దోషం కాలంలో దేశారిష్టము అనే అంశం సరిఅయినది.

No comments:

Post a Comment