Saturday 30 January 2016

ఆర్యభట్టా

ఆర్యభట్టాయ నమః
భారత ప్రాచీన మహోన్నత ఖగోళ, గణిత శాస్త్రవేత్త ప్రప్రథమ శ్రేణి శాస్త్రీయ సనాతన మేధావి, ఆర్యభట్ట(క్రీస్తు శకం.476 కేరళ రాష్ట్రంలో జన్మించారు. ఆ మహనీయుని శిలావిగ్రహం మహరాష్ట్ర పుణేలో నెలకొల్పారు. భాస్కర -1 ఆయన శిష్యుడు.
1) ఆర్యభట్టు రాసిన మహోన్నత పరిశోధనా గ్రంథం ఆర్యభట్టీయం. గణిత ఖగోళ శాస్త్రాల సంగ్రహంగా నాలుగు పాదాల అధ్యాయాలలో అద్భుత పరిశోధనలను ఆవిష్కరించారు.
2) గీతికా పాద – కల్ప మన్వంతర యుగాలు. జగత్సృష్టిశాస్త్రం. మహాయుగం 4.32 మిలియన్ సంవత్సరాలు.
3) గణితాపాద – క్షేత్ర వ్యవహారం, కొలతల 60వ గణితం, రేఖాగణిత వృద్ధి. శంఖు – ఛాయాసమీకరణలు
4) కాలక్రియా పాద – కాలప్రమాణం, పేర్కొన్నరోజున గ్రహాల స్థితి నిర్ణయం, అధికమాసం(క్షయతిథులు, ఏడు రోజుల వారం పేర్లతో.
5) గోళపాద – క్షేత్ర, త్రికోణ, సంబంధిత దివ్య గోళ, భూగోళ స్వరూప అంశాలు.
6) “పై” అనుచితమని, నిర్వివేకమని ఆర్యభట్ట ఏనాడో ప్రవచించిన అంశం యూరప్ లో లాంబర్ట్ 1761లో నిర్ధారించాడు.
7) ఆర్యభట్టు తన ఆఖరి పరిశోధనా గ్రంథమైన ఆర్యసిద్ధాంతంలోని ఖగోళ గణాంకాలలో శంమయ యంత్రం, ఛాయాయంత్రం వంటి అనేక పరికరాలను అద్భుత రీతిలో వివరించారు.
8) సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందన్న హిలియో సెంట్రిక్ సిద్ధాంతాన్ని కోపర్నికస్ కంటే వేయి సంవత్సరాలకు ముందే ప్రకటించడం భారత ప్రాచీన విజ్ఞాన ప్రతిభకు నిదర్శనం.
9) గ్రహణాల శాస్త్రీయ సిద్ధాంతాన్ని మొట్టమొదట ప్రతిపాదించిన మేధావి ఆర్యభట్ట
10) భూగోళ పరిధి 24,835 మైళ్లుగా ఆర్యభట్ట తన అద్భుత గణాంక ప్రతిభతో ప్రకటించడం అపూర్వం.
11) భారతదేశపు ప్రప్రథమ ఉపగ్రహం పేరు ఆర్యభట్ట
12) జాతీయ స్థాయిలో విద్యార్థులకు గణితంలో పోటీలు ఆర్యభట్ట గౌరవస్మృతికి నివాళి.
13) ఖగోళ శాస్త్రవేత్తగా ఆర్యభట్ట భూమధ్యరేఖకు సంబంధించిన కేరళ కన్యాకుమారి నుండి 08N00 అక్షాంశం వద్ద అంతరిక్ష గ్రహపరిశీలనాధ్యయనం చేసినట్లు రుజువులున్నాయి.
14) ఖగోళ శాస్త్ర విద్యార్థులు ఆర్యభట్ట సిద్ధాంతాల మీద పరిశోధన చేస్తే, అనేక అద్భుతాలను సాధించవచ్చు.

No comments:

Post a Comment