Saturday 30 January 2016

గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతున్నవి

"గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతున్నవి" అని, కోపర్నికస్ 1453వ సంవత్సరంలో పేర్కొని, వివాదం రేకెత్తించాడు. ఈ సిద్ధాంతం బైబిలుకి వ్యతిరేకమని, చర్చి అతనిని వెలివేసింది. తరువాత 1632లో ఈ సిద్ధాంతాలను బలపరచిన గెలీలియో, చర్చి దృష్టిలో పాతకుడైనాడు. భూమి గుండ్రంగా ఉన్నదని, కోపర్నికస్ గెలీలియో, భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని న్యూటన్, కనుగొన్నట్లు మనం చదువుకున్నాం.
ఈ విషయాల గురించి మన వేదాల్లో ఉన్నది ఏమిటో చూద్దాం
1) వేద విజ్ఞానం, సూర్యుడే జగత్తుని పట్టి, అన్ని గ్రహాలను నడిపించుచున్నాడు అని ఘోషించుచున్నది.(కృష్ణ యజుర్వేదం – 3.4.11.16
2) గ్రహాలన్నీ అండాకార కక్ష్యలలో నిరంతరం పరిభ్రమించుచున్నవి.(ఋగ్వేదం – 1.164 – 1)
3) భూమికి ఉపగ్రహమైన చంద్రుడు, తన మాతృగ్రహం భూమి చుట్టూ తిరుగుచున్నాడు. అలాగే భూమి కూడా తన పితృగ్రహం ఐన స్వయంప్రకాశకమైన సూర్యుని చుట్టూ తిరుగుచున్నది అని వివరించారు.(ఋగ్వేదం - 10.189.1)
4) సూర్యుని చుట్టూ భూమి తిరుగుచున్నది. అందు వల్లనే సూర్యుడు మనకు తూర్పున ఉదయించుచూ పడమర వైపు అస్తమించినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. నిజానికి సూర్యుడు ఉదయించడు, అస్తమించడు.(ఐతరేయ బ్రాహ్మణం - 14.6)
5) ఇక "ఆర్యభట్టు" భూమి సూర్యుని చుట్టూ తిరిగే విధానాన్ని, "లఘు గురు న్యాయం"తో చక్కగా వివరించాడు. అక్కడ లఘువు అంటే తేలిక, చిన్న అని, గురువు అంటే ఘనమైన, ఆచార్యుడు, అని అర్థం. శాస్త్రవిషయాలలో నిపుణుడైన గురువు చుట్టూ శిష్యుడైన లఘువు తిరగడం లోకసహజం. ఆ విధంగా గురువు అయిన సూర్యుని చుట్టూ లఘువు అయిన భూమి తిరుగుతున్నదని అర్థం.
6) సూర్యుని నుంచీ వెలుగు పొందుతూ చంద్రుడు ప్రకాశిస్తున్నాడని "ఆర్యభట్టూ, వరాహమిహిరుడూ" ఖచ్చితంగా చెప్పారు. భూమి తనకక్ష్యలో సూర్యుని చుట్టూ తిరుగుతున్నదని, భూభ్రమణానికి 365రోజులు పడుతుందనీ ఖచ్చితంగా గణించారు.
7) ఋగ్వేదంలో "భూమియొక్క వృత్తపు అంచున ఉన్నవారు" అనే వాక్యముంది.(ఋగ్వేదం - 1.33.8)
8) బ్రహ్మాండం మధ్యలో భూగోళం ఆకాశంలో నిలిచి ఉన్నది అని సూర్యసిద్ధాంతంలో ఉంది(సూర్యసిద్ధాంతం-
12.32)
9) భూగోళః సర్వతో వృత్తః అని ఆర్యభట్టీయంలో ఈర్యభట్టు గోళపాద అధ్యాయంలో వివరించాడు.
10) ఆర్యభట్టీయం అనే గ్రంథం 13వ శతాబ్దంలో లాటిన్ భాషలోకి అనువాదం అయినది. ప్రపంచవ్యాప్తంగా తదనంతర ఖగోళ పరిశోధనల మీద ఈ గ్రంథం యొక్క ప్రభావం పూర్తిగా ఉండి ఉంటుంది.
11) తన కూతురైన లీలావతి ప్రశ్నించినపుడు భాస్కరాచార్యుడు నీవు చూసేదంతా నిజం కాదు, భూమి చదరంగా లేదు, ఎందుకంటే నీవు ఒక పెద్ద వృత్తం గీసి అందులోని నాల్గవ భాగం చూస్తే అది మనకు సరళరేఖలా కనిపిస్తుంది. కానీ నిజానికి అది వృత్తమే. అలాగే భూమికూడా గుండ్రంగానే ఉన్నది అని వివరించాడు.
12) ఈనాటి జియోగ్రఫీని మనం భూగోళశాస్త్రంగా ఉచ్చరిస్తున్నాం. ఈ శాస్త్రానికి ఆర్యభట్టు భూగోళశాస్త్రం అనే పేరు పెట్టాడు. గోళం అంటే గుండ్రనిది కాదా, ఇది ప్రతి భారతీయునికీ యుగయుగాలుగా తెలుసు కదా, దీనిని మేమే కనుగొన్నాం అని ఇతరులు చెప్పడం ఏమిటి.

No comments:

Post a Comment