Thursday, 28 January 2016

పళని స్థల పురాణం

పార్వతీ పరమేశ్వరులు కైలాస పర్వతంపై ఉండగా నారదుడు అక్కడకు వచ్చి వారికి దివ్యమైన ఫలాన్ని ఇచ్చాడు. పరమేశ్వరుని కుమారులైన గణపతి, కుమారస్వామి ఆ ఫలం నాకే కావాలని ఇద్దరూ అడిగారు. అప్పుడు శివుడు వారిరువురితో “నేనొక పరీక్ష పెడతాను. ప్రపంచం మొత్తం చుట్టి ఎవరైతే మొదట వస్తారో వారికి ఆ ఫలం ఇస్తాను” అన్నాడు. ఇద్దరూ అందుకు సమ్మతించి గణపతి తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి నెమలి వాహుడైన కుమారస్వామి కంటే ముందుగా చేరుకుంటున్నాడు. దానితో కాస్త చిన్నమొహం చేసుకొని, అలిగి కైలాసం వదిలి, భూలోకమునకు వచ్చి ఒక కొండ శిఖరం మీద నివాసం ఉంటాడు కుమారస్వామి. ఏ తల్లి తండ్రులకైనా పిల్లవాడు అలిగితే బెంగ ఉంటుంది కదా! శివ పార్వతులు ఇద్దరూ షణ్ముఖుని బుజ్జగించడం కోసం భూలోకంలో సుబ్రహ్మణ్యుడు ఉన్న కొండ శిఖరం వద్దకు వచ్చి స్వామితో “ నువ్వే సకల జ్ఞాన ఫలానివి, నీకిక వేరే ఫలమెందుకు?” అని ఊరడిస్తారు. పండును తమిళంలో ‘ఫలం’ అంటారు. అప్పటినుండీ ఆ ప్రదేశం పళని అని పిలువబడుతున్నది.

No comments:

Post a Comment