భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల కిందటే ఎంతో సైన్స్ అండ్ టెక్నాలజీ నిజంగా ఉండేదా? మరైతే మనమెందుకు ఇంత వెనుకబడి ఉన్నాం???
భారతీయ పురాతన విజ్ఞానాన్ని గురించి చెబితే, కనుబొమ్మలు ఎగరేస్తూ, చెబుతున్నవాడని పిచ్చోడి లాగా చూస్తూ చాలా మంది అడిగే ప్రశ్న ఇదే. వీరి దృష్టిలో భారతీయులకు అంటే "" తన పూర్వీకులకు"" అసలేమీ తెలియదు. బ్రిటిష్ వాడు వచ్చాకే దేశంలో టెక్నాలజీ ప్రవేశించింది. అంతకుముందు మనం ఆటవికులం, .
ఇది నిజమేనా?
ముందుగా పాశ్చాత్య దేశాలలో సైన్స్ వికాసం ఎలా జరిగిందో చూద్దాం. కేవలం 450 సంవత్సరాల కిందనే గెలీలియో నుంచి పశ్చిమ దేశాలలో ప్రయోగ విజ్ఞానం ప్రారంభం అయింది. అంతకు ముందు కోపర్నికస్ సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అంతకుముందు ఏ సమస్య ఎదురైనా అరిస్టాటిల్ ను ప్రమాణంగా తీసుకొనేవారు. అరిస్టాటిల్ " ఒకే ఎత్తునుంచీ వదిలితే ఎక్కువ బరువున్న వస్తువు బరువు తక్కువగా ఉన్న వస్తువు కన్న ముందుగా కింద పడుతుందని" ప్రతిపాదన చేసాడు. యూరప్ లో ఇది పరమ ప్రమాణం అయింది. గెలీలియో ఇది తప్పని ప్రయోగపూర్వకంగా నిరూపించారు. అతన్ని మంత్రగాడన్నారు. కళ్లతో చూసినా నమ్మలేదు.
క్రీశ 139 లో టాలెమీ ""భూ కేంద్రిత విశ్వం "" సిధాంతాన్ని ప్రతిపాదించాడు. 1543 లో కోపర్నికస్ ""సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని"" ప్రతిపాదించాడు. ప్రజలు ఒప్పుకోలేదు.
గెలీలియో మళ్ళీ అదే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. వారతన్ని గృహనిర్బంధం చేసారు. 78 ఏళ్ల వయసులో అంధుడై చనిపోయాడు.
టైకో బ్రూనో ఇదే సిద్ధాంతాన్ని మళ్ళీ చెప్పాడు. 8 ఏళ్ళు జైల్లో పెట్టి, అయినా బుద్ధి రాలేదని 1600 సంవత్సరం లో సజీవ దహనం చేసి చంపారు.
ఈ ఉదాహరణలు చాలు 500 ఏళ్ల కింద పాశ్చాత్యుల సైన్స్ దృక్పథం ఎలా ఉండేదో తెలుసుకోవడానికి.
కానీ భారతదేశంలో వేలాది సంవత్సరాల నుంచి విద్యా,విఙ్ఞాన రంగాల్లో పూర్తి స్వేచ్ఛ ఉండేది. మన విఙ్ఞానవికాసంలో మూఢనమ్మకాలు చోటుచేసుకోలేదు.తర్కము, ప్రత్యక్ష అనుభవానికే ప్రాధాన్యత ఇవ్వబడినది. ఇక్కడ ఋషులే శాస్త్రజ్ఞులు. ఋషులే అధ్యాపకులు, ఋషులే డాక్టర్లు, ఋషులే సమాజ నిర్మాతలు. ఋషులంటే బ్రాహ్మణులు కాదు, అందులో అన్ని వర్ణాల వారూ ఉన్నారు. వ్యాసుడు, కణాదుడు, భాస్కరాచార్యుడు, ఆర్యభట్టు, వరాహమిహిరుడు, శుశ్రుతుడు, చరకుడు, పరాశరుడు, భరద్వాజుడు, అగస్త్యుడు, మయుడు, నాగార్జునుడు, భోజుడు, కౌటిల్యుడు, బోధిధర్ముడు పతంజలి, వాత్స్యాయనుడు ఇలాకొన్ని వందల మంది శాస్త్రజ్ఞులు భారతావని విఙ్ఞానవికాసంలో మనకు ఉగ్గు పోసారు.
ఐతే మన దేశంలో ఎన్నడూ అవసరాలకు మించి లేదా అర్హతలకు మించి సామాన్యులకు విద్యాబోధన చేయబడలేదు. ఇది కూడా సమాజంలో సమతౌల్యం కోసమే.
కానీ విద్యార్థులకు సకల విద్యలు నేర్పబడ్డాయి. ఇందుకు తార్కాణాలే నలంద, తక్షశిల యూనివర్సిటీలు. ఆకాలంలోనే ప్రపంచంలోని నలుమూలల నుంచి కనీసం 10,000 మంది తక్కువ గాకుండా ఒక్కో వర్సిటీలో చదివేవారు. అయితే మనపై జరిగిన సాంస్కృతిక దాడులలో ఈ విఙ్ఞాన భాండాగారాలలోని వ్రాతప్రతులన్నీ తగులబెట్టబడ్డాయి.నిరాటంకంగా నెల రోజులు ఈ పుస్తకాలు తగలబడ్డాయంటే ఇక ఆలోచించండి.
ఇక మన పండితుల ద్వారా లేదా విదేశీ రాయబారుల ద్వారా మన విఙ్ఞానం పశ్చిమంగా పయనించి వారిని కూడా విద్యావంతులను చేసింది.
ఆ తరువాత మనం బానిసలమయ్యాము. Defence లో పడ్డాము. పరిశోధనలు కాస్త ప్రాణ, సాంప్రదాయ రక్షణకు అంకితమయ్యాయి. ఇక బ్రిటిష్ వాడు మన దగ్గర మిగిలిఉన్న గ్రంథాలను అనువదించి, వాటిలోని సారాన్ని గ్రహించి కొత్త ఆవిష్కరణలతో కీర్తి గడించాడు.
400 సంవత్సరాల కిందటి వరకు మూర్ఖులుగా ఉన్న తెల్లవాళ్లు రాజ్యకాంక్షతో ఏదోఒకలాగా విఙ్ఞానాన్ని పెంచుకుంటే, కొన్ని వేల సంవత్సరాలు విఙ్ఞానవికాసం కలిగిన మనం రాజ్యాన్ని పోగొట్టుకొని విఙ్ఞాన హీనులం అయ్యాము.
ఇలా విధి వికటించింది.
అయినా నేటికీ మన విఙ్ఞానం ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. ప్రఫుల్ల చంద్రరే, జగదీశ్ చంద్ర బోస్, సి.వి.రామన్, విశ్వేశ్వరయ్య, రామానుజుడు, హోమీబాబా, విక్రమ్ సారాభాయ్, యల్లాప్రగడ సుబ్బారావు, సత్యేంద్రనాథ్, మేఘనాథ్ సాహ, శిశిర్ కుమార్, శాంతి స్వరూప్ భట్నాగర్, అబ్దల్ కలామ్ వంటి భారతీయ విజ్ఞాన సింహాలు ప్ర్రపంచాన్ని ఉర్రూతలూగించారు. నేటికీ ప్రపంచమంతా భారతీయ ఉద్యోగులు ప్రతిభ చూపుతున్నారు. అమెరికాలో మనవాళ్ళు లేకపోతే ఆ దేశం తలకిందులు అవుతుంది.
"""" భవిష్యత్తంతా మనదే"""""
బానిస భావాలు వదిలేద్దాం. మన దేశ ఔన్నత్యాన్ని గుర్తించి, మన వంతు పాత్రను నిర్వహిద్దాం.
భారతీయులుగా పుట్టినందుకు గర్విద్దాం.. మరోసారి చెప్పుకుందాం.
భారత్ ది గ్రేట్. భారత్ మాతా కీ జయ్

No comments:
Post a Comment