Saturday, 4 July 2015

మూషకం

ఎలుక గోడలలోనూ నేలలోనూ కలుగుల్లో నివసించే స్వభావం కలది కదా! ఒక చిన్న రంధ్రంద్వారా ప్రవేశిమ్చి ఎంత పెద్ద చిరాకునైనా కల్పించగలుగుతుంది. వైశయికలాలస కూడ ఎలుకలాంటిదే. ఎంత చిన్నగా అవకాశం ఇచ్చినా లోపల ప్రవేశించినతర్వాత ఇంతేలే...ఇంతే కదా.. అంటూ వ్యాప్తి నందుకుంటుంది. ఈ భావాన్నే హెచ్చరిస్తూ దాన్ని వాహనంగా స్వాధీనం చేసుకున్నాడు గణపతి. దక్షిణామూర్తి పాదం క్రింద అపస్మారరాక్షసునిలాననుకోండి! ఏ బలహీనతకైనా ఎంత చిన్న అవకాశం ఇచ్చినా అది లోపలికి వెళ్ళి వ్యసన వికాసం కలిగించి సాధనాలై ముఖ్యామహాసామ్రాజ్యాన్ని స్థాపించి కూర్చుంటుంది జాగ్రత్త, ఇదే దాని సంకేతం.
నాలుగు చేతులు: గణేశ్వరుని నాలుగు చేతులూ ౧. మనస్సు ౨. బుద్ధి ౩. చిత్తము ౪. అహంకారము - అనేవాటికి సంకేతాలు. ఈ నాల్గింటికీ మూలమైన శుద్ధ చైతన్యమే గణపతి వ్యక్తిత్వము. వ్యక్తిత్వంలోని ప్రతిభాంతర్గత క్రియాశక్తి చేతికి సంకేతం. కర్తరి ప్రయోగాత్మక క్రియాశక్తి దక్షహస్తాత్మకమైతే కర్మి ప్రయోగాత్మక క్రియాశక్తి వామహస్తాత్మకమౌతుంది. సర్వవ్యాపక-సర్వసమర్థ బ్రహ్మతత్త్వాన్ని చూపిస్తున్నాయా అనేట్లు ఆ నాలుగు చేతుల దిశ సూచిస్తుంది.

No comments:

Post a Comment