Sunday 5 July 2015

గురుకులంలో శిష్యుని ధర్మాలు

సూర్యుడస్తమించక ముందు, సూర్యుడు ఉదయించిన తరువాత బ్రహ్మచారి నిద్రింపకూడదు. అలా పొరపాటున నిద్రిస్తే మరునాడు పగలంతా గాయత్రీ జపం చేస్తూ, ఉపవాసం వుండి రాత్రి భోజనం చేయవచ్చు. ఇలా ప్రాయశ్చిత్తము చేసుకోని వాడిని మహాపాపం చుట్టుకుంటుంది.

గురువు సన్నిధానంలో గురువు కంటే మంచి ఆహారం తినకూడదు. గురువు కంటే మంచి బట్టలు కట్టకూడదు. గురువు పడుకోన్నాక పడుకోవాలి. గురువు నిద్ర లేవకముందే నిద్రలేవాలి. గురువును పేరుపెట్టి మాట్లాడకూడదు. గురువులా మాట్లాడి, నడిచి, నటించి అతన్ని వెక్కిరించకూడదు. గురువులను దూషిస్తే తన విద్య యంతయూ నశించును. గురువును ఎవరైనా నిందిస్తుంటే చెవులు మూసుకోవాలి. లేదా వేరొక చోటికి పోవాలి.
శిష్యుడు గురువుపై అపవాదు మోపితే గాడిదగా, నిందిస్తే కుక్కగా, గురువు సంపదను అనుభవిస్తే పురుగుగా, గురువును ద్వేషిస్తే కీటకంగా జన్మిస్తారు. గురువునకు గురువు వచ్చినప్పుడు, గురువునకు నమస్కరించినట్లే ఆయనకూ నమస్కరించాలి. గురువు ఇంట్లో ఉండేటప్పుడు తల్లిదండ్రులు వచ్చినా గురువు ఆనతి లేకుండా వారికి నమస్కారం చేయకూడదు.

సజాతీయులైన గురుపత్నులు గురువువలె పూజింపదగినవారు. గురుపత్ని జవరాలైతే యవ్వనంలో వున్న శిష్యుడు ఆమెకు పాదాభివందనం చేయకూడదు.
గురువు కుమార్తెను వివాహం చేసుకోవడం పాపం. గురువు కుమార్తె సోదరితో సమానము.
ఎల్లవేళలా గురువు యందు భక్తి ప్రపత్తులతో మెలగాలి.

No comments:

Post a Comment