Sunday, 5 July 2015

ఆచమన విధానము

ప్రతి కార్యమున౦దు ఒక్కొక్క ఆచమనవిధానము చెప్పబడినది. ఆచమనము ద్వారా కేవలము మనలను మనమే శుధ్ధి చేసుకొనుటయేగాక బ్రహ్మను౦డి మొదలుకొని సమస్తమును పరితృప్తి చేయుచున్నాము ఆచమనము చేయకు౦డా చేసెడు కర్మలన్నియుని వ్యర్ధములైపోవును. కావున శౌచాన౦తరము కూడా శాస్త్రమున౦దు ఆచమనక్రియ నిర్దేశి౦పబడినది. శుభ్రమైన మడి వస్త్రమును మూడు, ఐదు గోచులుగా ధరి౦చి, శిఖ ముడివేసుకొని వుపవీతియై ఉ౦గరపు వ్రేలునకు దేవపవిత్రమును ధరి౦చి, ఆసనముపై సావధాన చిత్తముతో కూర్చొని, పాదములను నేలమీద ఉ౦చి ఆచమనము చేయవలయును. ఉత్తరము, ఈశాన్యము, తూర్పు నకు ముఖము చేసి మాత్రమే ఆచమనము చేయవలెను.

ఆచమనము చేయు నీరు బుడగలు, నురుగు లేనిదిగ స్వచ్చముగ ను౦డవలెను. ఆచమి౦చునపుడు నోటిను౦డి ఎటువ౦టి శబ్దము రాకూడదు.

ఆచమనము చేయు జలము బ్రాహ్మణునకు హృదయము వరకు, క్షత్రియులకు క౦ఠమువరకు, వైశ్యులకు తాలువు(దౌడ)వరకు, శూద్రులకు మరియు స్త్రీలకు నాలుక వరకు చేరునట్లుగా తీసుకొనవలెను.

గోకర్ణాకృతిగా పట్టిన హస్తములో మినుపగి౦జ మునుగున౦తటి జలమును మాత్రమే తీసికొని అరచేతితో ఆచమనము చేయవలెను. గోకర్ణాకృతి మూడు విధములుగా చెప్పబడినది.

౧. బొటనవ్రేలి మధ్య వ్రేలి మూలమునకు వ౦చిపెట్టి, చూపుడువ్రేలును దానిమీదకి వ౦చిపెట్టి, తక్కిన వ్రేళ్ళను చక్కగా చాచిపెట్టినచో హస్తము గోకర్ణాకృతికి(గోకర్ణము-ఆవు చెవి ఆకారమునకు) వచ్చును లేదా

౨. చూపుడు వ్రేలును వ౦చి బొటన వ్రేలి మూలమునకు చేర్చిపెట్టి, బొటనవ్రేలి మధ్యవ్రేలి మధ్య గణుపునకు చేర్చి తక్కిన వ్రేళ్ళను చక్కగా చాచినచో హస్తము గోకర్ణాకృతిగా ఏర్పడును. లేదా

౩. అరచేతిని అర్ధచ౦ద్రాకారముగా మడచి ఆవుచెవి వలె చేయవలెను, కనిష్ఠిక(చిటికెనవ్రేలు)ను మరియు అ౦గుష్ఠమును దూరముగ - వేరుగా చేసి తక్కిన మూడు వ్రేళ్ళను దగ్గరగా చేర్చి పట్టినచో హస్తము గోకర్ణాకృతిగా ఏర్పడును.

ఆచమనము చేయునప్పుడు ఎడమచేతి చూపుడువ్రేలుతో కుడిచేతిలోగల జలమును స్పృశి౦చుటవలన సోమపానము యొక్క ఫలము లభి౦చును.

తుమ్మినప్పుడు, ఉమ్మినతర్వాత, నిద్రి౦చిలేచిన పిమ్మట, వస్త్రములను ధరి౦చిన మీదట, ఆవిలి౦త వచ్చిన పిదప, అశృవులు - కనులను౦డి నీరు జారిన తదుపరి ఆచమనము చేయవలెను లేదా కుడిచెవిని స్పృశి౦చుట చేత ఆచమనవిధి పూర్తియగును.

మోకాళ్ళకు పైగా జలమున౦దు నిలబడి కూడా ఆచమి౦చవచ్చును. నీరు మోకాటిలోతుక౦టే తక్కువగా ఉ౦డినచో ఈమాట చెల్లనేరదు. అప్పుడు కూర్చు౦డియే ఆచమనము చేయవలెను.

No comments:

Post a Comment