Sunday, 5 July 2015

కలియుగంలో జరిగే ధర్మహానికి తరుణోపాయం

ఇవి కలియుగంలో జరిగే ధర్మహాని అని మహర్షి చెప్పారు కదా ! మన మహర్షులు తమ ధ్యానంలో ఇవ్వన్నీ దర్శించారు. దర్శించటమే కాదు దానికి తరుణోపాయం చెప్పారు. 
అదే భగన్నామస్మరణ. ఈ కలియుగంలో తరించటానికి దైవ నామ స్మరణను మించినది ల
ేదు. 
తామరాకు మీద నీటి బొట్టు లా, దేనిని గ్రహించని పాదరసంలా మనసుని
నిగ్రహించగల్గితే, స్థిత ప్రజ్ఞత సాధించితే......బాధ ,దుఃఖం,విచారం దరి చేరనే
చేరవు. (పద్మపత్ర మివామ్భసా... గీత )
కానీ అలా ఉండటం అందరి మానవుల వల్ల సాధ్యం కాదు గదా ! ఎంతో సాధన చేస్తేనే గాని తామరాకు మీద నీటి బొట్టులా ఉండటం మానవులకు అలవాటు పడదు. 

డబ్బు, అధికారం విలువ ఇచ్చే ఈ ప్రపంచంలో మంచి వాడు ఎలా జీవనం వెళ్ళబుచ్చాలి ? ఆ సూత్రాలు ఏవో తెలియచెయ్యండి అని కదా మీ ప్రశ్న. 
దీనికి జవాబు మహర్షులు ఒక నీతి కధలో ఇలా చెప్పారు. 
ఒక యోగి పుంగవుడు ఒక గ్రామం నుండి వెడుతుండగా ఒక సర్పము కోరలతో కాట్లు వేస్తూ, ప్రజల మరణానికి కారణం అవ్వటం చూచాడు. దానిని చూచి అందరూ భయభ్రాంతులు అవుతూ న్నారు. యోగి ఆ సర్పము దగ్గరకు వెళ్లి, " ఓ సర్ప రాజమా ! నీవు అనేక పాపకార్యములు చేసి ఈ సర్ప జన్మము ఎత్తావు. ఇంకా ప్రజలకు కష్టాలు ఇచ్చి మరీ పాపం చేసుకుంటున్నావు. నీ పాప కార్యములు మని మంచి గా ఉండు . మానవ జన్మ పొంది మోక్ష ప్రాప్తి నోమ్డుతావు "అని సద్భోధ చేశాడు. ఆ యోగి చెప్పినట్లు ఆ సర్పము ఆనాటి నుండి ఎవరిని కాటు వెయ్యక, సాత్వికముగా ఉండటం ఆరంభించింది. కొన్ని నెలల తరువాత ఆ యోగి ఆ దారినే వెడుతూ ఒక వింత దృశ్యము చూశాడు. చిన్న పిల్లలూ ఆ సర్పముతో ఆటలాడుకుంటూ, దానిని బాధలకు గురిచేస్తున్నారు. 
అది చూచి ఆ యోగి " ఏమిటీ ! నీ పరిస్టితి ఇలా అయ్యింది. ? "అనడిగాడు. 
"స్వామీ మీరు చెప్పిన ప్రకారం మంచిగా ఉన్నందుకు నేను అనుభవిస్తున్న బాధలు "
అందుకా యోగిపుంగవుడు " ఓసి పిచ్చిదానా ! నిన్ను కాటు వేసి మనుషులను చంపవడ్డాను కానీ, "బుస"కొట్టవద్దని చెప్పలేదే " అని ఆ సర్పానికి తెలియబరిచాడు. 
మిత్రమా ! ఈ కధలోని నీతి గ్రహించి, మీ జీవనం సాగింతురు గాకా !

No comments:

Post a Comment