మనిషి పతనానికి ఎన్నో విషయాలు ఉంటాయి, అందుకే మనిషి ఒక స్థాయిని చేరడానికి ఒక సాధన కావాలి, ఆసాధన దైవంతో సంబంధం ఏర్పర్చగలగాలి అప్పుడు దివ్యుడు కాలగడు. దైవానుగ్రహం అనేది సూర్యుడైతే మనం చేసే సాధన ఒక చిన్న మిణుగురు పురుగంత లెక్కకు రాదు. అందుకు విశ్వామిత్రుడు తను సాధించినదానికి దైవ అనుగ్రహం మూలం అని భావించాడు. ఇది గుర్తించి శ్రీరామచంద్రుడిని తన వెంటతెచ్చి తను సాధించిన బల అతిబల విధ్యలని రామచంద్రునికి అర్పించాడు. ఆరు రాత్రుల యాగం చేసాడు. ఆతర్వాత విశ్వామిత్రుడు సీతమ్మతో రామచంద్రుడిని చేర్చి తను సిద్దిని పొందాడు. ఇదే కథ బాలకాండలో ఉంటుంది.
ఈ 'ఆరు రాత్రుల యాగం' అని చెప్పడంలో ఒక రహస్యం ఉంది. మనిషిలో కలిగే
అంతర్-వ్యాదులు ఒక ఆరు అని చెబుతారు. మొదటి వ్యాధి దేహాసక్తాత్మబుద్ధి,
అంటే దేహమే నేను అనుకొనే అజ్ఞానం. రెండోది స్వాతంత్ర్య అందత, నేను నా అంతట
బ్రతక గలను, ఎవరిపై ఆధారపడి లేను అనే అజ్ఞానం. మూడోది ఇతర శేషత్వ బుద్ధి,
మనం వల్ల కాదు మనం బ్రతికేది అని జ్ఞానం కల్గి, అది మన చుట్టూ ఉండేవారి
వల్ల అని అనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక వ్యాధి. నాలుగోది ఆత్మత్రాణ ఉన్ముఖత,
నన్ను నేనే ఉద్దరించుకోగలను, నాకు కావల్సినదేమో నేనే నిర్ణయించుకోగలను అనే
జబ్బు. అయిదోది ఆభాస బంధు ప్రీతి, మన చుట్టూ ఉన్నవారే సర్వస్వం అని
అనిపించేది, వారితోనే నిరంతరం ఉంటాను అనే బ్రాంతి. ఆరోది విషయ లౌల్యము, ఏది
కనిపించినా నాకే అనిపిస్తుంది. రకరాకాల వస్తువులు ఉంటాయి, వాటిని నేనే
పూర్తిగా అనుభవించాలి అనే భావన, ఇది అన్నింటికన్నా ప్రమాధకరమైన వ్యాధి. ఈ
ఆరింటి వల్లనే ఎన్నో ఉప వ్యాధులు పుట్టుకొస్తాయి. అన్నింటికీ మూలం ఈ ఆరు
వ్యాధులు అని చెబుతారు. అవన్నీ రాముడు తప్ప తొలగించేవాడు మరొకడు లేడు అని
రాముడిని తెచ్చుకున్నాడు.
ఆ వ్యాధులకు కారణం గడిచిన కర్మలు, ఇప్పుడు అనుభవించే కర్మలు, ఇప్పుడు తయారు చేసుకొని కొంతకాలం అయ్యాక అనుభవించే కర్మలు. గడచిన కర్మలను సంచితములు అని అంటారు. ఇప్పుడు అనుభవించే వాటిని ప్రారబ్దం అని అంటారు. ఇప్పుడు ఆచరించే వాటి వల్ల కొంతకాలం అయ్యాక వచ్చేవి ఆగామి అని అంటారు.
భగవంతుడిని ఆశ్రయిస్తే మన ప్రాచీన కర్మలని తుడిచి వేస్తాడు, ఇప్పుడు ఉండే కర్మలని అంటకుండా చేస్తాడు, రాబోయే కర్మలను దూరం చేస్తాడు. అట్లాంటివే గడిచిన కర్మలే సుభాహు అంటే, రాబోయే కర్మలే మారీచ, ఇప్పుడు మనం అనుభవించే కర్మలే మిగతా రాక్షసులు. జీవితమనే యాగాన్ని రక్షించగలిగేవాడు రాముడు. అట్లా రామచంద్రుడు మానవాస్త్రం వేసి మారీచుడిని తరిమివేసాడు. సుభాహు పైఅ అగ్ని అస్త్రం వేసి చంపివేసాడు. మిగతా వారిపై వాయువ్యాస్త్రం వేడి చెల్లా చెదురు చేసాడు. మనిషిగా మనం చేసే సాధనకు భగవంతుని అనుగ్రహం ఎంత అవసరమో విశ్వామిత్రుని కథ తెలుసుకుంటే అర్థం అవుతుంది.

No comments:
Post a Comment