Tuesday, 16 February 2016

సంఖ్యాయొగములు

ఫలదీపిక యను మూల గ్రంధమున ఈ యోగముల గురించి విపులము గా ఉన్నది.
సంఖ్యాయొగములు మొత్తము ఏడు: అవి ఈ విధముగా విభజించి చెప్పబడినవి.
1) వీణాయోగము : రాసిచక్రమున గ్రహములన్నియూ ఏడు రాసులందున్న 
ఈ యోగము కలుగును. ఈ జాతకుడు నిత్యము గీతా నృత్య విలాసములు
అనుభవించు వాడగును.
2) దామయోగము: గ్రహములన్నియూ ఆరు రాసులందున్న
ఈ యోగము చెప్పవలెను. ఈ యోగము గలవారు, ఉదారుడు పరోపకారి,
రాజ సమానుడు అగును.
3)పాశయోగము: జాతక చక్రమున గ్రహములన్నియూ
అయిదు రాసులందున్న ఈ యోగము కలుగును. సకల భోగములు,
కలవాడు మంచి శీలము కలవాడు, బంధువులు మిత్రులు కలవాడగును.
4) గ్రహములన్నియూ నాలుగు రాసులందున్న కేదారయోగము అనబడును.
ఈ యోగమున జన్మించినవాడు భూములు, సంపద అధికముగా కలిగి ధనవంతుడగును
5)శూలయోగము: ఈ జాతకమున గ్రహములన్నియూ మూడు రాసులందుండును.
ఈయోగము కలవారు, కోపము కలిగి, కఠిన మనస్సు,కలవాడుగా చెప్పవలెను.
6) యుగ యోగము: గ్రహములన్నియూ రెండు రాసులందున్న ఈ యోగము గా చెప్పవలెను.
ఈ జాతకునకుడు అమిత దరిద్రము అనుభవించుచు ,నిత్యము పేదరికమున కొట్టు మిట్టాడు చుండును
.7) గోళయోగము: గ్రహములన్నియూ ఒకే రాసియందున్న ఈ యోగము చెప్పుచున్నారు.
ఈ జాతకునకు, అన్నియూ నీచములే చెప్పిరి. ధనములేక, శీలము లేక ,నీచుల సహవాసము,
నిరుత్సాహము అల్పాయుస్షు కలవాడగును ఇక్కడ ఒక అనుమానము రావలెను.
రాహు కేతువులు ఒకే రాసిలో ఉండుట జరుగదు గదా? ఈ యోగమున
రాహు,కేతులకు మినహాయింపు చెప్పిరని భావించవలెను.

No comments:

Post a Comment