ఇంట్లో పెద్దలకు, దేవాలయంలో దేవునికి ఏవిధంగా నమస్కారం చేయాలి? అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళకి ఒకసారి మన పేరు మొదలైన వివరాలు చెప్పి నమస్కరించాలి. పెద్దవారు కూడా నమస్కరించిన పిన్నలను ఆశీర్వదించాలి. శివాలయంలో నందీశ్వరునికి బయటనే నమస్కారం చేయాలి.
పురుషులు సాష్టాంగ నమస్కారం చేయాలి. సాష్టాంగం అంటే లలాటం, రెండు కళ్ళు, రెండు భుజాలు, రెండు మోకాళ్ళు, రెండు పాదాలు, భుజాల నుండి నడుమువరకు గల భాగాలు. ఈ శరీర భాగాలన్నీ భూమిని తాకునట్లుగా వంగి నమస్కారం చేయాలి. స్రీలు మూడుసార్లు పంచాంగ నమస్కారం చేయాలి. పంచాంగ నమస్కారం అంటే లలాటం, రెండు మోకాళ్ళు, రెండు పాదాలు. ఇవిగాక మిగిలిన శరీర భాగాలు ఏవీ భూమిని తాకకూడదు.
దేవుని వద్ద నమస్కారం చేస్తున్నప్పుడు మన పేరు వివరాలు చెప్పనవసరము లేదు. కేవలం మనం చేసిన తప్పులను మన్నించమని కోరుతూ నమస్కరించాలి.
సన్యాసులకు స్రీలు, పురుషులు అందరూ నాలుగుసార్లు నమస్కారం చేయాలి. మన వివరాలు చెప్పనవసరం లేదు. ఓం నారాయణాయ అని చెప్పి నమస్కరించాలి. సన్యాసులు కూడా నమస్కారం స్వీకరిస్తూ నారాయణ అని చెప్పి ఆశీర్వదించవలసి ఉన్నది.
No comments:
Post a Comment