Friday, 12 February 2016

ముహూర్తము, ప్రాముఖ్యత ఆచరించవలసిన విధానము

ప్రస్తుత కాలమున విఙ్ఞులు విద్యాథికులు ముహూర్త విషయమున
సాంప్రదాయమును విస్మరిచి వివాహము పొంతనములు, ఉపనయనములు,
గృహారంభగృహప్రవేశములు, మొదలగు అత్యంత శుభప్రదమైన కార్యక్రమములు
జరిపించుటకు లక్షలాదిరూపాయలు వెచ్చించి ఆర్భాటముగా ఆ కార్యక్రమములు
నిర్వహించుచున్నారు. కానీ వాటినిర్వహణకు అత్యంత కీలకమైన ప్రధానమైన
ముహూర్తవిషయములందు జాతక విషయముల యందు, వివాహ పొంతముల యందు
తగినంత శ్రద్ధ చూపక, జ్యోతిష్కులను టెలీఫోన్ ద్వారా సమయాసమయములు గమనింపక, సంప్రదించి నిర్ణయించుచున్నారు.
ఈ విధానమును పాటించుట వలన జరిగిన కార్యక్రమములు తరువాతి కాలమున
ఏ జాతక దోషములు, వాస్తుదోషములు,లేకపోయిననువిఫలములగుట నా అనుభవమున
చాలా విషషయములలో నిజమని తెలిసి చిన్నవిషయమునుచెప్పుచున్నాను.
మిత్రులు,విజ్ఞులు, సాంప్రదాయమును పాటించి ముహూర్త
నిర్ణయమునకు, జాతక విషయములకు జ్యోతిష్కుల వద్దకు గురు భావముతో వెళ్లి సూర్యోదయము
తరువాత సూర్యాస్తనమునకు ముందు ప్రత్యక్షముగ సంప్రదించుట శాస్త్రసమ్మతము.
ఈవిధానమును పాటించిన ముహూర్తనిర్ణయమునకు ఎట్టి దోషములులేకుండా,
ఉత్తరోత్తర కాలమున జరిపించిన శుభకార్యములకు ఎట్టి అవాంతరములు,
దుష్పలితములు కలుగకుండా శుభప్రదమగును.
.కొంతమంది జ్యోతిష్కులు వారి వారి ఉనికి నివాసము మొదలగు
వివరములు తెలియజేస్తూ వెబ్-సైట్స్ సృష్టించియున్నారు.ఆ వెబ్-సైట్స్ దూరప్రాంతము
లందు ఉన్నవారు కానీ, విదేశములలో ఉన్నవారుకానీ, వారి వారి వ్యక్తిగత జ్యోతిష్కులను
సంప్రదించుటకు మాత్రమే ఉపయోగించుకొనిన కొంతవరకు సమంజసము. అట్టి వారు కూడా
భక్తిశ్రద్ధలతో జ్యోతిష్కులు నిర్ణయించిన గురుదక్షిణ చెల్లించిన అనంతరం సంప్రదించుట ధర్మబద్ధము.
టెలీఫోన్ ద్వారా మొక్కుబడిగా గురుదక్షిణ లేని సలహాలు, సంప్రదింపులు, అంత ఉపయోగకరము కాదు.
అట్టి ముహూర్త ఫలితము విశేషముగా ఉండదు.
వాస్తు,జ్యోతిష, ముహూర్త మొదలగు సలహాలు అందించు జ్యోతిష్కులు కూడా వాటి
వాటికి ప్రత్యేక రుసుము నిర్ణయించరాదు. అటులనే సంప్రదించిన వ్యక్తులు కూడా గురుదక్షిణ చెల్లించక
సంప్రదించుట కూడా శాస్త్ర సమ్మతము కాదు. వారి వారి శక్త్యానుసారము గురుదక్షిణ చెల్లించి సంప్రదించుట
ఉత్తమము.ముహూర్తము నిర్ణయించు సిద్ధాంతులకు తపఃశ్శక్తి, వాక్సుద్ధి, దైవబలము, దీర్ఘానుభవము కూడా
చాలా అవసరము. అట్టి వారిని గమనించి ఎంచుకొని ముహూర్త నిర్ణయమునకు జాతకమునకు సంప్రదించుట ఉత్తమము.ఈ విద్యలో నిష్ణాతులైన వారు కొద్ది మంది ఉన్నను శ్రమకోర్చివారిని కలిసి వారి సలహాల మేరకు నిర్ణయములుతీసుకొనుట శ్రేయస్కరము.నా ఈ చిన్నవిన్నపమును మిత్రులు విజ్ఞులు సహ్రుదయముతో స్వీకరించగలరని భావించుచున్నారు.

No comments:

Post a Comment