Wednesday, 17 February 2016

తల్లి దండ్రుల పాప పుణ్యాలు పిల్లలకు వస్తాయా....!!

మనం ఒకోసారి వింటూ ఉంటాము. ఏ జన్మలో ఏ పాపం చేసానో.ఈ జన్మలో ఈ రోగం తో బాధ పడుతున్నాను. ఏ జన్మలో ఏ పాపం చేసానో ఈ జన్మలో ఇలాంటి భర్త / భార్య దొరికాడు / దొరికింది. తెలిసి నేను ఏ పాపమూ చెయ్య లేదు అయినా నా కెందుకీ శిక్ష వేసాడు దేవుడు.
ఇలాంటి మాటలు వింటూ ఉంటాము. మరి చెయ్యని పాపాలకు వాళ్ళు శిక్షలు ఎందుకు అనుభవిస్తున్నారు అంటే కారణం మూడు తరములనుండి వారికి ఆనువంశికంగా వస్తున్న పాప పుణ్యాలు అని చెప్పుకోవచ్చు.
తాను గత జన్మ లో చేసిన పాప పుణ్యాలు మాత్రమే కాదు; ఈ జన్మలో తన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు చేసిన పాప పుణ్యాలు కూడా జీవికి ఆనువంశికంగా వస్తాయి అనే చెబుతోంది ధర్మ శాస్త్రం.
కనిపించే ఆస్తి పాస్తులు; ధన - ధాన్యాలు; వస్తు - వాహనాలు ఎలాగో కనబడనివి పాప పుణ్యాలు. కనిపించే ఆస్తి పాస్తులు తర తరాలనుండి ఎలా సంక్రమిస్తున్నాయో కనబడని పాప పుణ్యాలు కూడా అలాగే సంక్రమిస్తాయి అని చెబుతోంది ధర్మ శాస్త్రం. వారి ఆస్తి మాకు వద్దు, వారి పాప పుణ్యాలు మాకు వద్దు అన్నంత మాత్రాన ఇవి పోవు. ఎందుకంటే ఈ శరీరమే తల్లిదండ్రులు, తాత ముత్తాతల ప్రసాదమైనప్పుదు ఈ శరీరానికి అంటిన ఆ పాపాలు అంత సులభంగా పోవు..
అలా పోవాలంటే ప్రస్తుత జన్మలో నిత్యం భగవన్నామ స్మరణ చేయాలి; ఉన్నంతలో ఇతరులకు సహాయ సహకారాలు చేయాలి. పుణ్య నదులలో స్నానాదులు చెయ్యాలి, తీర్ధ యాత్రలు చెయ్యాలి. చేసిన పాపాలకుపశ్చాత్తాపం చెందాలి. ప్రస్తుత తరం పాపాలు భవిష్యత్ తరాలకు సోకకుండా చూసుకోవాలి.

No comments:

Post a Comment