Wednesday 10 February 2016

మనబొజ్జగణపయ్యకే అగ్రతాంబూలం

హిందూధర్మం లో ముక్కోటి దేవతలున్నా విఘ్నేశ్వరునికే అగ్రతాంబూలం .వైష్ణవులైనా శైవులైనా శాక్తేయులైనా మరేసాంప్రదాయకులైనా నిత్యార్చననుండి ప్రత్యేక కార్యక్రమాల్వరకు తొలిపూజ వినాయకునికేచేస్తారు. మనధర్మం లోగణపయ్యకు అంతప్రాధాన్యతఎందుకిచ్చారో ఆలోచిద్దాము. అది వారి అంధవిశ్వాసం అని కొట్టిపారేయటం తేలిక . కానీ ఏవిశ్వాసమైనా ఇన్నివేలసంవత్సరాలు కోట్లాది జనాన్ని ఆకట్టు కోగలుగుతున్నదంటే ,ఎక్కడో మానవహృదయాల లోతులలో ఎంతో నిగూఢమూ ప్రగాఢమూ అయిన అవసరాన్ని నెరవేరుస్తూండితీరాలి అనే యోచన వాస్తవికదృష్టికి,విజ్ఞతకు కనీసపు కొలబద్ద. ఆప్ర్యోజనమేమిటో యోచించటము సరైన మానవత్వము. విజ్ఞత. యిటువంటి విషయాన్ని మూఢవిశ్వాసమని కొట్టివేయడం ఆధునిక మూఢనమ్మకం.
కొన్నివేల సంవత్సరాలు మానవుడు భూమిమీద జీవిస్తూ వ్యక్తియొక్క జాతి యొక్క మనుగడ తక్కిన ప్రకృతితో ముడి పడివున్నదని తెలుసుకున్నాడు. .జాతి యొక్క జీవితావసరాలకు మించి ఇతరప్రాణులను,వృక్షజాతులనైతేనేమి బాధించక గౌరవించాలని నేర్చుకున్నాడు. సంస్క్రుతీ నాగరికతలు వికసించినకొద్దీ అదే అహింసా సూత్రం గా రూపోందింది.
మరొఅకపక్క వాటికి మనకి ఆధారమైన ప్రకృతిని కూడా గౌరవించాలని ,అన్ని ఆనందాలకు అవసరాలౌ ప్రకృతే ఆధారమని గ్రహించాడు. ఈభావాన్ని త్రికరణశుద్ధిగా ప్రకటించుకొనటమే ఆరాధన .ప్రకృతిలో వివిధ వస్తువుల ,జీవులరూపాలలో సకలాన్ని సృష్టించి పోషించే సృజనాత్మక శక్తినిదర్శించి ఆరాధించాడు మానవుడు.
ఈదర్శనమంతటీనీ ఇముడ్చుకున్నది విఘ్నేశ్వరుని ఆరాధన.ప్రత్యక్షంగా మానవునికి తెలిసిన అతిపెద్దజంతువునుండి అతిచిన్న చిట్టెలుకదాకా జంతుజాలాలన్నింటికీ ప్రతీక గణపతి రూపం.ఇందులో మానవుడుకూడా విదదీయరాని అంతర్భాగమేనన్న వివేకాన్ని సూచిస్తుంది మానవదేహం. వీటన్నిటినీ పోషించేది వాస్తవానికి వృక్షజాలమే ,కనుక వివిధపత్రితో ఆయనను పూజిస్తారు.అందరికీ ఆధారం భూమే ,అందుకే మట్టితో వినాయకుని ప్రతిరూపం చేయబడుతుంది. అయితే భూమ్మీద నీరులేకుంటేఏ జీవరాసి మనుగడలేదు కనుకనే సర్వజీవులు భూసారాన్ని జలముద్వారపొంది ఏర్పడినవే అని సూచిస్తూ పూజానంతరం విగ్రహాలను నదుల నీటిలో నిమజ్జనం చేయటం. అది సాధ్యపదనప్పుడు బావిలోవేస్తారు.
ఈరోజుల్లో ఇదంతా మూఢనమ్మకమని ప్రజల అజ్ఞానానికి మచ్చుతునకాని తోచడం సహజం. నానాటికీ ఆవులు గేదెలులాంటి పశువులు కూడా ఎలావుంటాయో తెలియని పిల్లలుతయారవుతున్నారు .డెయిరిఫారాలలోపరికరాలనుండి పాలు తయారయి వస్తాయనుకునే అమాయకత్వం తయారవనున్నది. కోళ్లఫారాలచూస్తేతప్ప కోల్లెలావున్నాయో తెలియపోతున్నాయి పిల్లలకు.దానికి మించికుటుంబావసరాలుతప్పతెలియని ,తెలుసుకోజూదని తరాలు తరువాత తయారయ్యి తమఇష్టాఇష్టాలుతప్ప ఇతరం పట్టించుకోని తరాలు తయారవుతున్నాయి. సమిష్టిగా మనవజాతికూడా తాత్కాలికమైన అవసరాలు క్షణికమైన సుఖాలు,ఆడంబరాలు.రాజకీయ ప్రాబల్యాలుగురించి మాత్రమే ప్రాకులాడుతున్నది. మానవత్వాన్ని ప్రకృతిలో తామొకభాగం మాత్రమేనన్న విషయాలను మరుస్తున్నారు.ప్రకృతి మనుగడపైన మానవజాతి మనుగడ ఆధారపడివున్నది. ఆసంగతి తిరిగి కనుగొన్నవారిని గొప్పవిజ్ఞానవేత్తలుగా గుర్తించి గౌరవి్ంచుకోలసిన దుస్థితికి వచ్చాము.విదేశాలలో ఇప్పుడు ఈజ్ఞానాన్నిగ్రహించి మేధావులులెందరో ప్రకృతిపట్లప్రేమ పెంచుకోవాలని గుర్తిస్తున్నారు.అత్యాధునికమైన ఈపోకడలు తెలియని నేటిమనవిద్యావంతులు వినాయకచవితి వంటి వేడుకలు విడ్డూరంగాతలచటం సహజం. విదేశీవిజ్ఞానవేత్తలందరూ కనుగొన్న జీవితసత్యాలు అనాదిగా మనమాచరిస్తున్న విఘ్నేశ్వరునిపూజలో వున్నాయని తెలియాలంటే నిర్మాణాత్మకమైన పరిశోధన అవసరము.
అయితే విఘ్నేశ్వరున్ని కొలిస్తేవిఘ్నాలు తొలగుతాయా? నిజమా? దేశమంతా కొలుస్తున్నపుడు వారందరికీ తొలగుతున్నాయా? వారి జీవితాలలో కష్తాలు లేవా ? అంటారేమో !
విఘ్నాలు కష్టాలు స్తూలంగా మూడురకాలు. అవి అనివార్యంగా ప్రకృతిరీత్యాజరిగేవి ,మరణం జబ్బు భూకంపం మొదలైనవి.ఒకరకం. సాటివారివలన సమాజపరంగాజరిగేవి ప్రమాదాలు ,అవినీతి ,రాజకీయాలు మతకలహాలు బాధ్యతారాహిత్యం వలన జరిగేవి ఇంకోరకం . మనఏకాగ్రతాలోపం వలన రాగద్వేషవ్యామోహాదులవలన వచ్చేవి మూడోరకం .సామన్యంగా మొదటిరకం ఇబ్బందులగూర్చి ఏమీచేయలేరు.మిగిలిన రెండురకాల ప్రమాదాలను మానవప్రయత్నం తో నివారించుకోవటం సిద్దాంతరీత్యాసాధ్యమే. పైనచెప్పిన పూజలోని అంతరార్ధాన్ని విపులీకరించి బోధించగలిగితే రెండవరకం ఇబ్బందులు నివారించుకోవచ్చు. అందులో అంతర్భాగం గానే అతి ప్రధానంగానో మూడవ రకం విఘ్నాలు నివారణ అవుతాయి .ఇందుకు తత్వమెరిగి పూజచేయాలి. సూక్ష్మమెరిగి నిత్యం పూజధ్యానాదులను చేయటం ద్వారా బుద్ధిసూక్ష్మమౌ ఏకాగ్రము అవుతుంది .ప్రతివిషయాన్ని లోతుగా అర్ధం చెసుకునే సామర్ధ్యం పెరుగుతుంది . అంతటితో వ్యామోహాలు తొలగుతాయి .అధిక న్యూనతా భ్రాంతులను వదలి మానవజీవిత మనుగడకవసరమైన అంశాలకు మత్రమే ప్రాధాన్యతనిస్తాడు. పైన చెప్పిన విఘ్నేశ్వరపూజాతత్వాన్ని అతనెరుగుటవల ప్రకృతిపట్ల సాటి మానవులపట్ల సరైన రీతిన ప్రవర్తించగలుగుతారు. ఇలాజీవించటానికే ఎక్కువప్రాధాన్యతనిచ్చి అనివార్యమైన కష్టసుఖాలపట్లనిర్లిప్తుడయి వుండగలుగుఇతాడు. ఇలా సమాజం లోఎంతమంది చేయగలుగుతారనదాన్నిబట్టి ఆవ్యక్తి సమాజములమనుగడ నిర్ణయమవుతుంది. ఏవిధంగాచూచినా విఘ్నేశ్వర పూజ ఒక చవితినాడెకాక పైవిషయాన్ని గమనిస్తూ తరచుగాచేస్తుండటమే శ్రేయస్కరం.

No comments:

Post a Comment