Wednesday 17 February 2016

ఇంటికి సున్నం ఎందుకు వేస్తారు....!!

మనిషికి చర్మం, ఇంటికి సున్నం వుండకపోతే కుదరవు. చర్మం రక్త మాంసాలకు కవచం గా వుంది ఎలా రక్షిస్తుందో, సున్నం కూడా గృహానికి రక్షణా కవచం లాగ వుంది రక్షిస్తుంది. గృహ నిర్మాణ రంగంలోకి సిమెంట్ రాక పూర్వం మహారాజుల మందిరాలు, దేవాలయాలు రుబ్బుడు సున్నం తో నిర్మించే వారు. తాజ్ మహల్,కుతుబ్ మీనార్, చార్మినార్, శ్రీరంగ నాధ దేవాలయం, కాశి విశ్వేశ్వరాలయం, స్వర్ణ మందిరం మొదలైన చారిత్రిక కట్టడాలన్నీ సున్నం తోనే నిర్మించారు. పూర్వ కాలం నాటి ఆన కట్టలు, వంతెనలు సున్నం తోనే కట్టినవి ఇప్పటికీ మూగ సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. సున్నానికి వున్న ఆయుర్దాయం లో ఐదవ వంతు మాత్రమే సిమెంట్ కి వుంది.
ఇండ్లకి పండుగ, పర్వదినాలలో సున్నం ఎందుకు వేయాలి అంటే...!
ఇటుకల ఇంటికైనా, మట్టి ఇంటి కైనా, రాతి కట్టడానికైనా బట్టీ సున్నం వేయడం ఎంతో మంచిది. శుభ ప్రదం మరియు ఆరోగ్య ప్రదం.ఇంటి లోపల బయట క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం సున్నం వేసుకుంటే. వేసవి వీడిమి నుండి రక్షణ లభిస్తుంది. అలాగే శీతా కాలపు అతి చల్లదనాన్ని కూడా లోనికి రానీయదు. సున్నం వేయడం వలన గదుల లోని వెలుతురు రెట్టింపు అవుతుంది. తెల్ల సున్నం మనసుకి ఎంతో ప్రశాంతతని ఇస్తుంది. అలాగే హానికారక సుక్ష్మ క్రిములు ఇంట్లోకి రావు.సున్నం వేసిన ఇంట్లో లక్ష్మి, సరస్వతులు ఇద్దరూ వుంటారు.ఇంట్లోని వారు ప్రశాంత జీవితం గడుపుతారు. అభివృద్ది కలుగుతుంది.
సున్నం వేయని ఇంట్లో గృహ ప్రవేశం చేయరాదు. ఇంట్లో పెళ్లి, ఉపనయనం వంటి శుభ కార్యక్రమాలు తలపెట్టినప్పుడు సున్నం తప్పని సరిగా వేయాలి. అలాగే ఆ ఇంట్లో మన ఆప్తుల మరణం సంభవించి సంవత్సరం పూర్తి అయినప్పుడు... సున్నం తప్పనిసరిగా వేయాలి. ప్రస్తుతం మనకు మన పూర్వీకులు వాడే సున్నం లభించుట లేదు. రక రకాల రంగులు ఎవరికి ఇష్టం వచ్చినవి వారు వేసుకుంటున్నారు. సున్నం వేయడం లోని శాస్త్రీయతను గుర్తించడం లేదు.

No comments:

Post a Comment