Sunday 21 February 2016

బిల్వపత్ర మహత్యం.....!!


శివుడిని బిల్వపవూతాలతో పూజించుట శ్రేష్టం. బిల్వ వృక్షం సాక్షాత్తు శివ స్వరూపమని దేవతలు భావిస్తారు. ఒకసారి శనిదేవుడు శివ సందర్శన కోసం పార్వతీ-పరమేశ్వరులను భక్తితో స్తుతించాడు. అప్పుడు మహా దేవుడైన శంకరుడు శని దేవుని విధి ధర్మాన్ని పరీక్షించేందుకు ‘‘నీవు నన్ను పట్టగలవా?’’ అని ప్రశ్నిస్తాడు. అందుకు శనిదేవుడు ‘‘తమ అనుక్షిగహం ఉన్నంత వరకు నాకు అసాధ్యంమైందేదీ లేదు. తమర్ని అట్టే పట్టగలను. మరుసటి రోజు సూర్యాస్తమయం వరకు శివుని పట్టుకోగలనని’’ శివునితో పలికాడు. శివుడు ఆ మర్నాడు ఉషోదయ కాలమందు శని నుంచి తప్పించుకోవడానికి బిల్వ వృక్ష రూపాన్ని దాల్చి.. ఆ వృక్షం నందు అగోచరంగా వశించాడు. మహేశ్వరుని జాడ తెలియక పార్వతీదేవితో సహా దేవాది దేవతలందరూ ముల్లోకాలను గాలించారు.
వారెవ్వరికీ పరమేశ్వరుడి జాడగానీ, శని జాడగానీ తెలియలేదు. సంధ్యా సమయానికి శివుడు బిల్వ వృక్షం నుంచి సాకార రూపంగా బయలు దేరాడు. ఆ మరుక్షణమే శని కూడా ప్రత్యక్షమయ్యాడు. శనీ నన్ను పట్టుకోలేక పోతివి! అని పరమేశ్వరుడు శనిని ప్రశ్నించాడు. అప్పుడు శనిదేవుడు నమస్కరించి ‘‘నేను పట్టుట చేతనే కదా లోకారాధ్యులైన తమరు ఈ బిల్వ వృక్ష రూపంగా వశించారు. నేనూ తమ తోడనే ఈ బిల్వవృక్షంలో అదృశ్య రూపాన నివసించాను కదా! ఐనా ఇదంతా శివలీల మహత్యమే గానీ, నా ప్రతిభ ఎంతమావూతమూ కాదు. సర్వ జగత్కర్తలైన దివ్య విభూతి ముందు నేనెంతటి వాడని ప్రభూ’’ అని విన్నవించాడు.
శని దేవుని విధి నిర్వహణకు, భక్తి ప్రపత్తులకు మెచ్చిన పార్వతీ వల్లభుడు శని ఈశ్వరుడినైన నన్నే కొద్దికాలం పట్టి వశించడం చేత నేటి నుంచి నీవు శనీశ్వరుడు అనే పేరుతో ప్రసిద్ధి పొందగలుగుతావు. అంతేకాక శని దోషం ఉన్నవారు ఆ దోష పరిహారార్థం నన్ను బిల్వ దళములతో పూజించిన వారికి దోష నివృత్తి కలుగుతుంది. బిల్వపవూతంతో పూజ చేసిన వారిని, శివ భక్తులను శనీశ్వరుడు బాధించడు’’ అని అభయ వర ప్రదానం చేశాడు శివుడు. అప్పటి నుంచి బిల్వవృక్షాన్ని శివ స్వరూపంగా భావించి పరమేశ్వరుని బిల్వ పత్రాలతో అర్చించుట ఆచారంగా వస్తుంది.

No comments:

Post a Comment