తులసీపూజతో మంచి సంతానం పొందవచ్చునని పురోహితులు చెబుతున్నారు. తులసిని ఆరాధించడం వల్ల సౌభాగ్యం, మంచి సంతానం, ఆయుర్ వృద్ధి, ధనం, ఆరోగ్యం. ధాన్యం, ఫలసిద్ధి వంటి శుభ ఫలితాలుంటాయి.
అందుచేత శుక్ర, శనివారాల్లో మహిళలు సూర్యోదయానికి ముందేలేచి శుచిగా తలస్నానమాచరించి, తులసి కోట ముందు దీపమెలిగించి, మూడుసార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.
అలాగే మహావిష్ణువుకు ప్రీతికరమైన తులసి ఆరోగ్ర ప్రదాయిని అని అందరికీ తెలుసు. కాబట్టి తులసీ మాలతో జపం పుణ్యప్రదమని, అందుచేత తులసి వృక్షానికి నీరు పోసి, ప్రదక్షిణం చేసి, నమస్కరిస్తే ఏడు ద్వీపాలతో కూడిన సాగరాన్ని ప్రదక్షిణ చేసిన ఫలం లభిస్తుంది.
ఇంకా తులసీ దళాలతో పూజ చేసే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయమవుతాయి. సర్వదా విష్ణువుకు ప్రీతికరమైనదిగా, సకల దేవతల చేత నమస్కరించబడేది తులసీ కావడంతో 'తులసీ పూజ' శ్రేష్టమైందని పురోహితులు సూచిస్తున్నారు.
No comments:
Post a Comment