Tuesday, 16 February 2016

గురువంటేఎవరు?

గురువంటేఎవరు? ఎవరిని గురువుగా భావించాలి?
ఆధ్యాత్మిక ప్రపంచములో ఈప్రశ్నకు చాలా లోతైనసమాధానం వున్నది. గురువంటే అజ్ఞానాంధకారాన్ని తొలగించేవాడు అని అర్ధము. తాను అజ్ఞానములో మునిగి ఇతరుల అజ్ఞానాన్ని తొలగిఁచబూనటం సాధ్యం కాదు. కనుక గురువు అనే పదానికి అర్హతపొందటానికి అందరూ తగరు. కనుక ఎఅవరిని బడితేవారిని గురువుగా భావించి పరుగులు తీయటం ప్రమాదకరము. గుడ్డివాని చేయి మరొక గుడ్డివాడు దారిచూపమని పట్టుకున్నట్లవుతుంది. గురువు అనేపదముతో సంబోధించాలంటే ఆయనలో మూడు లక్షణాలు ఉండాలి.
1 సర్వజ్ఞత :- ఆయనకు సర్వము తెలిసి వుండాలి ఆయనకు తెలియనిది ఈసృష్టిలో లేదు.
2 సర్వ వ్యాపకత :- ఆయన అణువుమొదలు బ్రహ్మాఁడమంతా వ్యాపించగలిగివుఁడాలి. తాను లేని చోటు లేదు కనుక భగవంతుని విశ్వవ్యాపకతా లక్షణము ఆయనకు వర్తించాలి
3 సర్వ సమర్ధత :- తాను సిశ్యున్ని రక్షించటం కోసము ఏదయినా చేయగల సమర్ధత కలిగియుండాలి. అవసరమయితే బ్రహ్మాడ నియమాలను సహితం మార్చగలిగేంతగా.
ఇటువంటి వారిని మనపు పరమ గురువులని భావించాలి. భగవంతుని పట్ల భక్తిభావము శాస్త్ర ప్రమాణము ఆయనలో కనపడాలి.
అటువంటివారిని పరిశీలించి,పరీక్షించిమరీ ఆశ్రయించాలేతప్ప. కేవలం భావావేశముతో గురువు...గురువు అని నాలుగురోజులు తిరిగి తరువాత ఇంకొక గురువును ఎన్నుకునే గుణము ఆధ్యాత్మికమ్ గా పతన హేతువవుతుంది.
శిష్యువిత్తాపహారులైన గురువులు కలిలో కావలసినంతమంది దొరుకుతారు. శిష్యచిత్తాపహారులు అరుదుగావుంటారని మహాత్ముల మాట. ఉల్లిగడ్దకు కూడ ఉపదేశమిచ్చేటి కల్ల గురువులు భువిన పుట్టెరయా అని తాతగారు[వీరబ్రహ్మేంద్ర] స్వాములవారు చెప్పి వున్నారు.
కనుక గురువును అని ఒకరిని ఎన్నుకున్నతరువాత మరల వారిని విడిచి పెట్టటం జరిగితే పతనమేతప్ప మరల ఏసద్గురువు వారిని అంగీకరించడు. వానికి సద్గతిలేదు.
మరి కలిలో గురువును ఆశ్రయించే అవకాశము లేదా ? గురువును ఎలా ఎన్నుకోవాలి? మనము తరించే అవకాశములేదా?
గురువు ఆవశ్యకత ఆధ్యాత్మిక మార్గములో ఎంత అవసరమో మహాత్ములయిన షిరిడి సాయినాధులు, రాఘవేంద్రులు లాంటి మహాపురుషుల జీవిత గాధలు చదివితే మనకు అర్ధమవుతుంది.
గురువును మనం గుర్తించలేనప్పుడు ఒక సులభమయిన ఉపాయము వున్నది. గురుచరిత్ర పారాయణము చెస్తూ వుంటే మనలోని దుర్గుణాలు నశించి,మన మనోభావాలు శుధ్ధపడి గురు సేవకు అర్హతకలిగి అప్పుడు గురువే మనలను వెతుక్కుంటూ వస్తాడు. భగవ్ంతుని అలా అనన్యంగా సేవిస్తూవున్నా గురువలాగే పరిగెత్తుకొస్తాడు లేగదూడదగ్గరకు గోమాత పరిగెత్తుకొచ్చినట్లు. అని రామకృష్ణ పరమహంస వారు చెబుతారు. గురుచరుత్ర మహిమను కూడా ఆచార్య ఎక్కిరాల భరద్వాజగారు అలానే వివరించారు. కనుక మనం ఎవరిని పడితే వారిని గురువు గురువు అని పిలవకుండా మీగురువుకొక్కరికే ఆపిలుపును పరిమితం చేసుకొని పవిత్రభావనతో సేవించాలి.
గురువాక్యం శిరోధార్యం :
రామునివల్ల ఉత్తమగతి పొందిన కబంధుడు తాను పొందిన సాయానికి కృతజ్ఞత చూపిస్తూ
‘‘రామా! సుగ్రీవుని వద్దకు వెడితే నీకు ఉపకారం జరుగుతుంది. దారిలో మతంగ ముని ఆశ్రమం ఉంటుంది. అక్కడకు తప్పకుండా వెళ్ళు. అక్కడ నీకోసం శబరి ఎదురు చూస్తోంది, ఆమెకు నీ దర్శనభాగ్యాన్ని కలిగించు. ఆమె చేసే సేవలను అందుకుని ఆమెను తరింపజెయ్యి. నీకు మంచి జరుగుతుంది’’ అని చెప్పి అదృశ్యమైపోయాడు.
పంపా సరస్సు సమీపంలో ఉన్న మతంగ మహర్షికి శిష్యురాలు శబరి. గురువును సేవించడమే తన జీవితానికి ధన్యత్వంగా భావిస్తూ, సేవ చేసింది. కొంతకాలం తరువాత మతంగుడు యోగం ద్వారా తన భౌతిక శరీరాన్ని విడిచి, పుణ్యలోకాలకు వెళ్ళాలనుకొన్నాడు. తనను కూడా తీసుకుపొమ్మంది శబరి. ‘‘నువ్వు ఇంకా కొంతకాలం ఈలోకంలోనే ఉండాలి. దైవసేవ చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండు. శ్రీరామచంద్రుడు తన తమ్ముడైన లక్ష్మణునితో కలిసి ఒకనాడు ఇక్కడికి వస్తారు. ఆయనను సేవించు. ఆ పుణ్యం వల్ల నీకు మోక్షం లభిస్తుంది’’ అని చెప్పి, గురువు సిద్ధిని పొందాడు. రాముడు ఎవరో తనకు తెలీదు. ఎందుకు వస్తాడో తెలీదు. తనకు ఏ సంబంధమూ లేని వ్యక్తికోసం తాను ఎందుకు ఎదురు చూడాలని అడగలేదు. గురువు వాక్యం శిరోధార్యం అనుకుని, అలాగే ఎదురుచూస్తోంది.
క్రమక్రమంగా వయసు మీదపడుతోంది. శరీరానికి పటుత్వం తప్పుతోంది. వార్ధక్యం బాధిస్తోంది. జరాదుఃఖాన్ని భరిస్తోంది. తలచుకుంటే గురుసేవ వలన తనకు లభించిన యోగవిద్య ద్వారా శరీరాన్ని విడిచిపెట్టగలదు శబరి. కాని గురువుగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. పోనీ ఇంతకాలానికి వస్తాడని ఒక స్పష్టమైన సమయాన్నైనా గురువుగారు చెప్పలేదు. చెప్పమని శబరి అడుగనూ లేదు. గురువు చెప్పింది వినడమే తప్ప, ఎదురుప్రశ్నలు వేసే అలవాటు, తిరస్కరించే నైజం లేదు. అందుకని రాముని రాకకోసం ఎదురు చూస్తోంది.
శబరి చూపులు ఫలించాయి. రాముడు రానే వచ్చాడు. అవధి లేని ఆనందంతో గబగబ ఎదురేగింది. సాదరంగా ఆహ్వానించింది. పాద్యం,
అర్ఘ్యం ఇచ్చింది. కూర్చోవడానికి ఆసనాన్ని సిద్ధం చేసింది. ఆ అడవిలో దొరికే మధురమైన ఆహారాన్ని తెచ్చి ఇచ్చింది. ఆయన రాక వల్ల తనకు విముక్తి కలిగిందని కాకుండా గురువాజ్ఞను పాటించేందుకు ఇన్నాళ్ళకు అవకాశం దొరికిందని ఆనందపడి, కుశలప్రశ్నలు వేసింది. ఆమె చేసిన సపర్యలన్నీ ఆనందంగా స్వీకరించాడు రాముడు. ఆ తరువాత సోదరులు ఇద్దరూ చూస్తుండగానే ఆమె మోక్షాన్ని పొందింది.
రాముడు తన గురువులైన వశిష్ఠ విశ్వామిత్రులను ఏనాడూ తిరస్కరించలేదు. అందువల్లే మరొక గురుభక్తురాలికి మోక్షాన్ని అనుగ్రహించగలిగాడు. ఆయుర్వేదశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించిన ఇందీవరాక్షుడు,
అవసరం తీరగానే తన గురువైన బ్రహ్మమిత్రుని దూషించాడు. ఫలితంగా విద్య నిరుపయోగమైపోవడమే కాకుండా బ్రహ్మరాక్షస జన్మను పొందాడు. అందువల్ల గురువాక్యం శిరోధార్యం. గురుద్రోహం, గురుతిరస్కరణం,
గురుద్రవ్యాపహరణం మహాపాతకం

No comments:

Post a Comment