Thursday, 18 February 2016

లక్ష్మీదేవి నామాన్ని నిత్యం స్మరిస్తూ వుంటే.....!!

లక్ష్మీదేవి నామాన్ని నిరంతరం స్మరిస్తూ వుండటం ద్వారా ఆ దేవదేవి అనుగ్రహం లభిస్తుంది. నిత్యం లక్ష్మీదేవి నామస్మరణ చేసే వారింట ఆ తల్లి స్థిరనివాసం చేస్తుంది. సాధారణంగా లక్ష్మీదేవి చంచలమైన మనసును కలిగి ఉంటుందనీ, అందువలన ఒకచోట కుదురుగా ఉండకుండా వెళ్లిపోతూ ఉంటుందని అనుకుంటూ వుంటారు. నిజానికి లక్ష్మీదేవి స్వభావం అది కానేకాదు.
ధర్మబద్ధమైన పవిత్రమైన జీవన విధానాన్ని చూసి, సంప్రదాయబద్ధమైన పద్ధతులను చూసి లక్ష్మీదేవి రావడం జరుగుతుంది. ఏవైతే మంచి లక్షణాలను చూసి అమ్మవారు అక్కడ ఉందామని అడుగుపెడుతుందో, ఆ తరువాత ఆ ఇంట్లోని వ్యక్తులు అమ్మవారికి ఇబ్బంది కలిగించేలా ఆ లక్షణాలను మార్చుకున్నప్పుడు సహజంగానే ఆమె ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్లిపోతుంది.
లక్ష్మీదేవి రావడం, తిరిగి వెళ్లిపోవడనేది పూర్తిగా ఆ ఇంట్లోవాళ్లు నడచుకునే విధానంపై మాత్రమే ఆధారపడి వుంటుంది. లక్ష్మీదేవి స్థిరనివాసం చేయాలంటే పవిత్రమైన జీవనవిధానానికి భంగం కలగకుండా చూసుకోవాలి. లక్ష్మీదేవిని అనునిత్యం పూజిస్తూ, సేవిస్తూ, ఆమె నామాన్ని స్మరిస్తూ ఉంటే సంపదలకు ఎలాంటి లోటు ఉండదని పండితులు సెలివిస్తున్నారు.

No comments:

Post a Comment