Wednesday, 3 February 2016

సాయంత్రం దీపం స్నానం చేసి వెలిగించాలా ????

గృహిణికి ఉదయంపూట స్నానం మాత్రమే ధర్మం చెప్తోంది. సూర్యాస్తమయానికి 48 నిమిషాల కంటే ప్రారంభ సమయంలో అంటే పూర్తిగా చీకటి పడదు ఇంకా. వెలుతురుగా ఉంటుంది. ఆ సమయంలో కాళ్ళూ చేతులు శుభ్రంగా కడుక్కొని ముఖం కడుక్కొని మళ్ళీ బొట్టుపెట్టుకొని ఉదయం నుంచి ధరించిన వస్త్రములు విడిచి ఉతికిన వస్త్రములు ధరించి దేవతా గృహంలోకి వెళ్ళి తైలంతో దీపారాధన చేయాలి. ఆ పిమ్మట శ్లోకములు ఏమైనా తెలిసి ఉంటే చెప్పుకోవాలి. ఇంటిల్లిపాది ఒక చోట కూర్చొని పిల్లలను కూర్చోబెట్టుకొని శ్లోకములు, పద్యములు, దండకములు చెప్పించాలి. ఇలా ఈ సమయాన్ని మనం గడిపితే అది దీపారాధన చేసినట్లు. దీపాన్ని వెలిగించడం ఒకటి. దీపాన్ని ఆరాధన చేయడం రెండు.
“దేవీం షోడశవర్షీయాం శశత్సుస్థిర యౌవనాం!
బింబోష్ఠీం సుదతీమ్ శుద్ధామ్ శరత్ పద్మ నిభాననామ్!!
శ్వేతచంపక వర్ణాభాం సునీలోత్పల లోచనామ్!
జగద్ధాత్రిమ్ చ ధాత్రిమ్ చ సర్వేభ్య సర్వ సంపదామ్!!
సంసార సాగరే ఘోరే జ్యోతీరూపాం సదా భజే!
ఇది జ్యోతి కాంతులను మనం ఆరాధన చేసేసమయంలో మనం చెప్పవలసిన శ్లోకము, స్తోత్రము. కాబట్టి సాయంత్రం వేళల వెలిగించేటటువంటి దీపారాధనకు పూర్వం మళ్ళీ స్నానం చేసే అవసరం లేదు.

No comments:

Post a Comment