Tuesday 2 February 2016

జుట్టు ఊడిపోయిందా ? తిరిగి పొందడం ఎలా ?మ్యాజిక్..!!

జుట్టు ఊడిపోయిందా ? తిరిగి పొందడం ఎలా ?మ్యాజిక్..!! ఊడిపోయిన జుట్టు పొందడానికి టెస్టెడ్ టెక్నిక్స్
స్కూలింగ్ లో ఉన్నప్పుడు నా జుట్టు చాలా పొడవుగా ఉండేదని, చిన్నప్పుడు నా జుట్టు చాలా మందంగా, బలంగా, పొడుగ్గా ఉండేది అని, కాలేజీకి వెళ్లేప్పుడు కూడా పొడవాటి కురులు చూసి.. అందరూ మురిసిపోయే వాళ్లు.. కానీ ఇప్పుడు పొట్టిగా మారిపోయింది నా జుట్టు అని ఫీలవుతున్నారా ? పోయిన జుట్టుని తిరిగి పొందాలని ఆశిస్తున్నారా ? వాలు జుట్టు కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారా ? అయితే మీ కోరిక నెరవేరినట్టే.
ఎందుకంటే.. కొన్ని టెస్ట్ చేసిన సొల్యూషన్స్ ఇప్పుడు మీ ముందుకు వచ్చాయి. పోయిన జుట్టుని మళ్లీ తిరిగి పొందడానికి, బట్టతలపై జుట్టు మొలిపించడానికి సింపుల్ అండ్ న్యాచురల్ రెమిడీస్ ఉన్నాయి. ఇవి చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తాయని ప్రూవ్ అయింది. కాబట్టి.. ఈ టిప్స్ ఫాలో అవండి. ఒత్తైన, పొడవైన, బలమైన, ఆరోగ్యకరమైన జుట్టుని పొందండి.
ఒక ఉల్లిపాయ తీసుకుని కట్ చేసి.. రసం తీయండి. రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని తల మాడుకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టు రీగ్రోత్ అవడానికి సహాయపడుతుంది.
జుట్టు మొలిపించడానికి ఆముదం, ఆమ్లా ఆయిల్ చాలా అమేజింగ్ గా పనిచేస్తాయి. ఆముదం, ఉసిరి ఆయిల్ ని సమానంగా తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రిపూట తలపై బాగా మసాజ్ చేయాలి. ఉదయాన్నే షాంపూ, కండిషనర్ ఉపయోగించే తలస్నానం చేయాలి. ఈ ట్రీట్మెంట్ ని వారానికి రెండుసార్లు ఫాలో అయితే.. బలమైన, హెల్తీ హెయిర్ మీ సొంతమవుతుంది. అలాగే డాండ్రఫ్ నుంచి కూడా రిలీఫ్ ఉంటుంది.
6 లేదా 7 ఎండిన ఉసిరికాయలను 2 కప్పుల వేడినీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటి లోంచి ఉసిరికాయలను తీసి గుజ్జు తీయాలి. ఈ గుజ్జులో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె కలిపి తలకు పట్టించాలి. ఇది అప్లై చేశాక షవర్ క్యాప్ తో తలను కవర్ చేసుకుని 30 నిమిషాలు వదిలేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే.. మీ తలలో జుట్టు రీగ్రోత్ అవడం ఖాయం.
జుట్టు సంరక్షణలో మందారం పువ్వు చాలా మ్యాజికల్ గా పనిచేస్తుంది. ఈ టిప్ ఫాలో అవడం కూడా చాలా సింపుల్. గుప్పెడు మందారం పువ్వులు తీసుకుని పేస్ట్ చేయాలి. దీనికి ఆముదం లేదా బ్రింగరాజ్ ఆయిల్ ఏది అందుబాటులో ఉంటే దాన్ని కలిపి తల మాడుకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే.. మీ పొట్టి జుట్టు వాలు జడగా మారిపోతుంది.

No comments:

Post a Comment