Wednesday 24 February 2016

పురాణాలు ఎందుకు వినాలి ?

సందేహానికి సమాధానంగా వ్యాస భగవానుడు పురాణాల గురించి ఈ విధంగా తెలియజేసాడు. సంసార బంధాలతో కొట్టుమిట్టాడుతున్న వారికి సులువైన మార్గంలో ముక్తిని ప్రసాదించ గలిగేవే ఈ పురాణములు. వేదాధ్యయనం చేయలేని వారికి సులువైన సాధన మార్గాన్ని ఉపదేశించేవి ఈ పురాణాలు. అజ్ఞానమనే అంధకారంలో అలమటిస్తున్న వారికి జ్ఞాన దీపాలు. భవరోగులకు మంచి ఔషధాలు , సకల సంపదలను కలుగాజేసేవి ఈ పురాణాలు. నిత్య పురాణ శ్రవణం చేసేవారు సాక్షాత్తూ దేవతా స్వరుపులే. పురాణాలలోని కధలను ఎవరైతే భక్తీ శ్రద్ధలతో వింటారో అలంటి వారు "కర్మ" అనుబడే సముద్రం నుండి బయటపడి భగవంతుని సన్నిధిని పొందగలరు. నిత్యం పురాణ శ్రవణం చేయలేని బలహీనులు కనీసం ఆయా పుణ్య తిధులలో నైనా ఆ ప్రయత్నం చేయాలి. సర్వ యజ్ఞ ఫలము , సర్వ దానఫలము పురాణ శ్రవణం ద్వారా కలుగుతుంది. ఈ కలియుగంలో పురాణ శ్రవణం కంటే పవిత్రమైన ధర్మం మరొకటి లేదు. ఈ పురాణాలు సకల పాపాలను నివారిస్తాయి. పురాణాలను చెప్పగలిగిన వారెవరైనా సరే వారు తప్పనిసరిగా పూజనీయులు.
పురాణ పాఠకులు పవిత్రాత్ములై ఉండాలి. దానము, శాంతము, దయ, అసూయా లేకుండుట మొదలైన గుణాలు వారిలో పుష్కలంగా ఉండాలి. మంచి మనుషులున్న చోట, నదీ తీరం, దేవాలయం మొదలైన పవిత్ర ప్రదేశాలలో మాత్రమే పురాణ పఠనం చేయాలి. పురాణ శ్రవణం సమయంలో మధ్యలో వెళ్ళిపోవటం, తలపాగా ధరించడం, తాంబూలం సేవిస్తూ ఉండటం మొదలైనవి చేయరాదు. పాపాలను హరించ గలిగిన కధలను అపహాస్యంగా చూసేవారు నీచమైన జన్మలను పొందగలరు. ఎంతో వినయంతో పూజ్య భావంతో శ్రవణం చేయాలని , ఈ విధంగా పురాణ శ్రవణ మహిమ స్కాంద పురాణంలో తెలియజేసారు.

No comments:

Post a Comment