Tuesday, 2 February 2016

స్వప్నవృత్తాంతము

భీష్ముడు ధర్మరాజుకి చెప్పిన స్వప్నవృత్తాంతములలో ఆకాశ రూపంలో వచ్చు స్వప్నఫలితములు ఈవారం తెలుసుకుందాం.
కలలో ఆకాశం నిర్మలంగా కనిపించిన కీర్తి,కర్యజయం,శత్రు నాశనం,నష్ట ధన ప్రాప్తి.
ఆకాశం నల్లగా మబ్బులతో నిండియున్న కష్టములు,రోగాలు,కలహాలు కల్గును.ఆకాశం నల్లగా యుండి మధ్య మధ్యలో తెల్ల తెల్ల మబ్బులు రోగభయం,ధననష్టం,పెళ్లి కాని వారికి పెళ్లి అగును.
మెరుపులు,పిడుగులు,ఉరుములు,వర్షం వచ్చినట్లు త్వరలో ఆపదలు కల్గును.తను చీకటిలో యుండగా మెరుపులు వచ్చుచు తనఫై పడవలసిన పిడుగులు తప్పిపోవుటయు మెరుపులచే చీకటిలో ఉన్న తనకి మార్గం కనిపించినట్లు వచ్చిన ఆపదలు తోలుగును.పిడుగు తనకు సమీపంలో కనపడినట్లు దురదేశ ప్రయాణంకల్గును.
మబ్బులు కలిగి వర్షం పడగా ఉరుములు ఉరిమిన ధనలాభం,వ్యవసాయదారునకు మంచి పంటలు పండును.పెళ్లికానివారికి పెండ్లి అగును.ఉద్యోగం లభించును.తలచిన కార్యములునెరవేరును.
సూర్యుడు ఉదయించినట్లు కనిపించిన కార్య జయం.బంధు మిత్రులకు శుభంకల్గును.ఆకాశ మధ్యమమున తీక్షణముగా కనిపించిన ధనలాభం,అభివృధి,ఆరోగ్యం,ఆపదలు తోలుగును.స్త్రీలకు సూర్యోదయం కనిపించిన సంతాన ప్రాప్తి.అస్తమయం కష్టాలు.వర్తకులకు ధననష్టం.సూర్యుడు మబ్బుచే కప్పబదినట్లు కష్టములు,సూర్యుడు ఇంటిఫై కప్పు మీద దిగినట్లు వచ్చిన ఇల్లు తగలబడును.సూర్య కిరణములు తన పక్క మీద పడినట్లు వచ్చిన రోగభయం.తన గదిలో ఎండ కచినట్లు వచ్చిన ధనలాభం,సంతాన గౌరవం కల్గును.సూర్యగ్రహనం కనిపించిన వర్షం పడును.బంధు మరణం కల్గును. గర్భిణి స్త్రీకి ఇట్టి కల వచ్చిన పుత్రప్రాప్తి ఆపుత్రుడు విశేష ప్రజ్ఞావంతుడగును.చేరసాల యన్డున్నవారికి సూర్యకిరణములు కనిపించిన బంధు,మిత్రదులలో గౌరవం,మర్యాద కల్గును.సూర్యుని చుట్టూ కనిపించిన ఎర్రని నేత్రదృష్టి తగ్గును.ప్రయత్నకార్యములు చెడును.పరారి యందు ఉన్న నేరస్తునికి ఈస్వప్నం మంచిది.
చంద్రుడు ప్రకసవంతముగా కనిపిమ్చిన స్త్రీ సౌఖ్యం,ధనలాభం కల్గును.చంద్రుడు మబ్బు పట్టినట్లు గ్రహనం పట్టినట్లు భార్యకు రోగం వచ్చును.చొరభయం కల్గిన ప్రయాణికులకు ఇట్టి స్వప్నం వచ్చిన ఆపదకల్గును.మనుష్యుని ముఖం కలిగి చంద్రుడు ప్రకాశవంతముగా కనిపించిన సంతానప్రాప్తి.తలచుట్టూ చంద్ర కిరణములు వ్యాపించినట్లు గౌరవం కల్గును.చెర యన్డున్నవారికి వచ్చిన విడుదల అగుదురు.
నక్షత్రములు ప్రకాశవంతముగా అభివృద్ది,మబ్బు పట్టినట్టును మిణుకు మిణుకుమనియు ఒక్కొక్కటి ఊడినట్లు ఆపద కల్గును.ఆకాశం నందు నక్షత్రం కనబడలేదేమని తలచినట్లు ధననష్టం,దరిద్రులకు రోగం గలవారు నేరస్తులనబడుడురు.నక్షత్రం ఇంటి మీద పడినట్లు కల వచ్చిన రోగం కల్గును లేదా ఇల్లు విడుచుటయు కాని ఇల్లు కాలుట గాని జరుగును.ఇంటిలో యుండి నక్షత్రములు ప్రకాశించిన అశుభములు.తోక చుక్కలు ఆకాశమున కనిపించిన దేశమునకు వుపద్రవములు జననాసనం కల్గును.
తూర్పున ఇంద్రధనుస్సు ఏర్పడినట్లు వచ్చిన దరిద్రులకు ధనలాభం,ధనవంతులకు కీడు కల్గును.పడమర ధనవంతులకు మేలు.దరిద్రులకు కీడు.తన తలకు సమీపంగా కొంచెం ఎత్తుగా వచ్చిన దరిద్రులకు ధనలాభం,ధనవంతులకు దరిద్రం కల్గును.
వీటి దోషములు పోవుటకు శ్రీరామరక్షా స్తోత్ర పారాయణ చేసినమంచిది.

No comments:

Post a Comment