అందుకు బ్రహ్మపురాణం లో వ్యాసుడిలా చెప్పాడు - పాతకాలలో ఐదింటిని "మహాపాతకాలు" అంటారు. ఆ పాపాలకు నిష్కృతి లేదు. వాటి ఫలితాలను అనుభవించే తీరాలి. ఆ మహాపాతకాలు -
స్త్రీ హత్య
శిశు హత్య
గో హత్య
బ్రహ్మ హత్య
స్వర్ణస్తేయము
ఇక బుద్ధి పూర్వకంగా చేసిన పుణ్యపాపముల ఫలితాన్ని అనుభవించి తీరాలి. అలా కాకుండా తెలియక, ప్రమాద వశాత్తూ చేసిన పాపములకు ప్రాయశ్చిత్తంగా విముక్తి సాధనాలున్నాయి. శాస్త్ర ప్రకారంగా, భక్తిపూర్వకంగా ప్రాయశ్చిత్తం చేసుకొంటే ఆ పాలు క్రమంగా హరిస్తాయి. ఇందుకు ఉదాహరణగా కోసల దేశపురాజు గోహత్యాపాతకంలో ఇరుక్కొన్న వైనం చెప్పాడు వ్యాసుడు.

ఒకప్పుడు కోసలదేశంలో క్షామం సంభవించినపుడు రాజు భీమసేనుడు నగరం వెలుపల ఒక బావి త్రవ్వించాడు. కాని ఆ నూతి చుట్టూ గోడ కట్టించలేదు. దాహం గొని ఉన్న ఒక ఆవు దూడ ఆ నూతిలోపడి మరణించింది. బావిచుట్టూ తిరుగుతూ ఆవు అరుస్తున్నది. ప్రోగైన జనులు దూడ కళేబరాన్ని బయటకు తీశారు. ఈ పాపం ఎవరిదనే చర్చ సాగింది. అజాగ్రత్తగా ఉన్న పశువులకాపరిధి తప్పన్నారు కొందరు. దూడ యజమాని తప్పు అని కొందరన్నారు. బావికి గోడ కట్టించని వారిది తప్పని మరి కొందరన్నారు. ఈ సంగతి తెలిసి రాజు పండితులను సంప్రదించాడు. వారు రాజుకు చెప్పిన విషయం ఏమంటే - రాజా బావి త్రవ్వించి అనేకుల ప్రాణాలను రక్షించిన పుణ్యం నీకు చెందుతుంది. అలాగే గోడ కట్టించాలని తెలియక ఒక ఆవుదూడ మరణానికి కారణమైన పాపం కూడా నీకు చెందుతుంది. కాని ఇది తెలియక చేసిన తప్పు కనుక ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చును. పది దినములు దీక్షతో ఉండి, పుణ్యక్షేత్రాలు దర్శించి, ఉత్తమ దానములు చేయుము - అని చెప్పారు. రాజు అలాగే చేశాడు.